‘బుల్లెట్‌ ట్రైన్‌ ఎక్స్‌ప్లోజన్‌’ మూవీ రివ్యూ | Bullet Train Explosion Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Bullet Train Explosion Review: ఇది బ్లాక్‌ బస్టర్‌ పేలుడు

May 5 2025 12:08 PM | Updated on May 5 2025 12:14 PM

Bullet Train Explosion Movie Review In Telugu

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో జపనీస్‌ చిత్రం బుల్లెట్‌ ట్రైన్‌ ఎక్స్‌ప్లోజన్‌ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. 

భాష ఏదైనా సరైన భావం పలికించి చూపించేది సినిమా. అందులో డబ్బింగ్‌ వల్ల ప్రపంచంలోని ఏ మూల సినిమా అయినా మన భాషలో చూస్తుంటే మన చుట్టూ జరిగిన కథే అన్న భావన కలుగుతుంది. మరీ ముఖ్యంగా థ్రిల్లర్‌ జోనర్‌ చిత్రాలు ఇట్టే ఆకట్టుకుం టాయి. ఆ కోవకి చెందినదే ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన జపనీస్‌ సినిమా ‘బుల్లెట్‌ ట్రైన్‌ ఎక్స్‌ప్లోజన్‌’(Bullet Train Explosion). ఈ సినిమా ఓ బ్లాక్‌ బస్టర్‌ పేలుడు అనొచ్చు. ఈ మూవీ  వల్ల మనకు రెండు అనుభూతులు కలుగుతాయి. 

(చదవండి: ఇండియా ఫస్ట్‌ ఐటమ్‌ గర్ల్‌ ఓ పాకిస్తానీ.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?)

ఇండియాలో త్వరలో బుల్లెట్‌ ట్రైన్‌ పరిగెత్తబోతోంది. ఆ బుల్లెట్‌ ట్రైన్‌ అనుభూతిని ఈ చిత్రం ద్వారా అనుభవించవచ్చు. అలాగే జపాన్‌ దేశంలోని ట్రైన్‌ స్టేషన్, ట్రైన్‌ నంబర్లు కూడా మనం ఈ సినిమా ద్వారా గుర్తు పెట్టుకోవచ్చు. బుల్లెట్‌ ట్రైన్‌ ఎంత స్పీడ్‌ ఉంటుందో అంతకు రెండింతలు ప్రేక్షకులు ఈ సినిమాని చూసి థ్రిల్‌ ఫీలవుతారు. 

అంతలా ఈ సినిమాలో ఏముందంటే... కథ ప్రకారం ట్రైన్‌ నెంబర్‌ 5060బి షిన్‌ అమోరి నగరం నుండి జపాన్‌ రాజధాని టోక్యోకి బయలుదేరుతుంది. ఈ ట్రైన్‌లో కజుయాతకైచి ఫస్ట్‌ లైన్‌ మేనేజర్‌గా ఉంటాడు. ట్రైన్‌ బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఓ అగంతకుడు స్టేషన్‌కు ఫోన్‌ చేసి, ట్రైన్‌లో బాంబు పెట్టామని, ట్రైన్‌ 120 కిలోమీటర్ల స్పీడ్‌ తగ్గకుండా వెళితేనే బాంబు పేలకుండా ఉంటుందని బెదిరిస్తాడు. ఆ బాంబు తీయాలంటే తనకు 100 బిలియన్ల డబ్బు అప్పజెప్పాలని కండిషన్‌ పెడతాడు. 2 గంటల 14 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా దాదాపు ట్రైన్‌లోనే నడుస్తుంది. 

మరి... ఆగకుండా వెళుతున్న ట్రైన్‌ పేలిపోతుందా లేదా మేనేజర్‌ ఆపగలుగుతాడా అన్నది తెలియాలంటే ‘బుల్లెట్‌ ట్రైన్‌ ఎక్స్‌ప్లోజన్‌’ సినిమా చూడాలి. 1994వ దశకంలో వచ్చిన హాలీవుడ్‌ సినిమా ‘స్పీడ్‌’ని పోలి ఉంటుందీ సినిమా. కానీ ఈ చిత్రం క్లైమాక్స్‌ సూపర్‌ హైలైట్‌. ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది.          
– హరికృష్ణ ఇంటూరు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement