
ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తుంటాయి. కొన్నిసార్లు థియేటర్లలో రిలీజైన కొన్ని వారాలకే స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ అలానే ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది?
గత నెల 24న థియేటర్లలో రిలీజైన తెలుగు మూవీ 'చౌర్యపాఠం'. బ్యాంక్ దొంగతనం నేపథ్య కథతో తీశారు. బాగానే ప్రమోట్ చేశారు కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూడు వారాలకే ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం ఓవర్సీస్ (విదేశాల్లో) తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
(ఇదీ చదవండి: ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. అనసూయ పోస్ట్ వైరల్)
బహుశా వచ్చే వారం మన దేశంలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి రావొచ్చు అనిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నిఖిల్ దర్శకత్వం వహించాడు. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లు కాగా మస్త్ అలీ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు.
చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)