
యాంకర్ కమ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. గురువారం తన పుట్టినరోజుని కాస్త డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ అనాథ శరణాలయానికి భర్తతో కలిసి వెళ్లిన ఈమె.. అక్కడి చిన్నారులతో ఆడుతూపాడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: డేటింగ్‌లో సమంత.. స్పందించిన మేనేజర్)
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ పోస్ట్ పెడుతూ ఫాలోవర్స్ ని అలరించే అనసూయ.. మూడు నాలుగు రోజుల క్రితమే కొత్త ఇంట్లోకి కూడా అడుగుపెట్టింది. లగ్జరీగా కట్టుకున్న ఇంటి ఫొటోల్ని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది జరిగిన రెండు రోజులకే తన పుట్టనరోజు రావడంతో అనాథలకు పుస్తకాలు, ఫుడ్ పెట్టడంతో పాటు వాళ్లతో కలిసి డ్యాన్సులు కూడా వేసింది.
అనసూయ కెరీర్ విషయానికొస్తే.. చివరగా పుష్ప 2 మూవీలో కనిపించింది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త సినిమాలేం లేనట్లు తెలుస్తోంది. టీవీలో ఒకటి రెండు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలతో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.
(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)


