ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Good Bad Ugly Movie OTT Telugu Streaming Latest | Sakshi
Sakshi News home page

Good Bad Ugly OTT: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ మూవీ

May 3 2025 2:13 PM | Updated on May 3 2025 3:03 PM

Good Bad Ugly Movie OTT Telugu Streaming Latest

రీసెంట్ గా పద్మ భూషణ్ అవార్డ్ అందుకున్న తమిళ హీరో అజిత్. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie). యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. గత నెలలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీ(OTT) స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అధికారిక తేదీ కూడా ప్రకటించారు.

తమిళ హీరోల్లో అజిత్(Ajith Kumar) కాస్త డిఫరెంట్. సినిమాలు, కారు రేసింగ్ అని తన పనేదో తాను చూసుకుంటూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో అజిత్ సినిమాలు చేస్తున్నాడు హిట్ అవుతున్నాయి గానీ ఫ్యాన్స్ ఎందుకో పూర్తిగా సంతృప్తి చెందడం లేదు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు పూర్తిగా ఫ్యాన్ మూమెంట్స్ తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తీశారు.

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)  

ఈ మూవీలో అజిత్ పాత సినిమా పాటలు, వింటేజ్ స్టైల్ తదితర అంశాలు అజిత్ అభిమానులకు తెగ నచ్చేశాయి. దీంతో హిట్ చేసేశారు. నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్ కావడంతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. కానీ ఏమంత గొప్పగా ఆడలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్‌ లో మే 08 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

'గుడ్ బ్యాడ్ అగ్లీ' విషయానికొస్తే.. ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ (అజిత్) తన గ్యాంగ్ స్టర్ జీవితాన్ని వదిలేసి కుటుంబంతో హ్యాపీగా ఉండాలనుకుంటాడు. అందుకోసం జైలుకి కూడా వెళ్తాడు. కొడుకు కోసం ఏడాది ముందే జైలు నుంచి బయటకొస్తాడు. అంతలోనే కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారనే సంగతి తెలుస్తుంది. అలానే డ్రగ్స్ కేసులోనూ ఇరుక్కున్నాడనే సంగతి తెలుస్తుంది. దీంతో ఏకే మళ్లీ గ్యాంగ్ స్టర్ అవుతాడు? తర‍్వాత కొడుకుని ఎలా కాపాడుకున్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలో రాబిన్‍హుడ్.. ప్రకటనతో క్లారిటీ)

Advertisement
 
Advertisement
Advertisement