ఓటీటీలో తమిళ హిట్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌ | Hollywood Perusu Movie Telugu Version OTT Release Date Confirmed, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Perusu Telugu Version OTT: ఓటీటీలో తమిళ హిట్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

Apr 4 2025 11:11 AM | Updated on Apr 4 2025 12:50 PM

Hollywood Perusu Telugu Version OTT Streaming Details

కోలీవుడ్‌లో తెరకెక్కిన 'పెరుసు' (Perusu) సినిమా ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించింది. ఇప్పుడు ఈచిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  ఇందులో నటుడు వైభవ్‌తో(Vaibhav) పాటు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ నిహారిక(Niharika NM) కీలక పాత్రలలో మెప్పించారు. ఆపై సునీల్ రెడ్డి, బాల శరవణన్, రెడిన్ కింగ్స్‌లీ, చాందిని తమిళరసన్ నటించారు. 'టాంటిగో' (శ్రీలంక చిత్రం) ఆధారంగా ‘పెరుసు’ మూవీని దర్శకుడు ఇళంగో రామ్ తెరకెక్కించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, బవేజా స్టూడియోస్, ఎంబర్ లైట్ స్టూడియో సంయుక్తంగా నిర్మించాయి.

మార్చి 14న కోలీవుడ్‌లో మాత్రమే విడుదలైన పెరుసు చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. కథ తెగనచ్చేసిందంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెట్టారు. థియేటర్‌ రన్‌ పూర్తి చేసుకున్న పెరుసు ఏప్రిల్‌ 11న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. తమిళ్‌, తెలుగు, కన్నడ,మలయాళంలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement