హార్ట్‌ బీట్‌ పెంచే వెబ్ సిరీస్‌.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Latest Web Series Heart Beat Season 2 Streaming date Locked | Sakshi
Sakshi News home page

Heart Beat Season 2: హార్ట్‌ బీట్‌ మళ్లీ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

May 11 2025 8:59 PM | Updated on May 11 2025 8:59 PM

Latest Web Series Heart Beat Season 2 Streaming date Locked

కోలీవుడ్‌ వెబ్‌ ప్రపంచంలో హార్ట్‌బీట్‌ సిరీస్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్‌ సిరీస్‌లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కనిపిస్తుంది. సెంటిమెంట్, పదవి కోసం పోరాటం అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అయినా  హార్ట్‌బీట్‌ వెబ్‌ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ వెబ్‌ సిరీస్‌ సూపర్ హిట్ కావడంతో దీనికి కొనసాగింపుగా సీజన్‌–2 రూపొందించారు మేకర్స్. ఈ సిరీస్‌కు దీపక్‌ సుందర రాజన్‌ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. రెజిమల్‌ సూర్య థామస్‌ ఛాయాగ్రహణం, చరణ్‌ రాఘవన్‌ సంగీతాన్ని అందించారు. ఏ టెలీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజవేలు నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌  స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

ఈనెల 22 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో అందుబాటులో ఉండనుందని ప్రకటించాకరు.  ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పాటను విడుదల చేశారు. కాగా.. ఈ సిరీస్‌లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు అక్షిత, శివం, అబ్దుల్, అమైయ, టీఎం కార్తీక్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement