ప్రియమణి థ్రిల్లర్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Priyamani Latest Thriller Web Series Good Wife Streaming Date Fix | Sakshi
Sakshi News home page

Good Wife: ప్రియమణి థ్రిల్లర్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Jun 26 2025 9:16 PM | Updated on Jun 26 2025 9:16 PM

Priyamani Latest Thriller Web Series Good Wife Streaming Date Fix

ప్రియమణి, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్ 'గుడ్ వైఫ్'. అమెరికన్ సిరీస్ 'గుడ్ వైఫ్' అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న భర్తని రక్షించుకునేందుకు ఓ మాజీ మహిళ లాయర్ ఏం చేసింది? అనే కోణంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇందులో ప్రియమణి లాయర్‪‌గా కనిపించనుండగా.. ఆమె భర్త పాత్రలో సంపత్ రాజ్ నటించారు.

తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. జూలై నాలుగో తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ వర్షన్ ట్రైలర్ రిలీజ్‌ చేస్తూ స్ట్రీమింగ్ తేదీని ప్రక
టించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement