
ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌ల్లో పంచాయత్ ముందు వరుసలో ఉంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సిరీస్‌కు ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇటీవలే నాలుగో సీజన్ విడుదలై అభిమానులను అలరించింది. దీంతో మేకర్స్ మరో సీజన్‌కు రెడీ అయిపోయారు. త్వరలోనే మీ ముందుకు వస్తామంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాదిలో పంచాయత్ ఐదో సీజన్ రానుందని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ ప్రైమ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. 2026లో మీ ముందుకొస్తామని మేకర్స్ వెల్లడించారు.
జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు దీపిక్ కుమార్ మిశ్రా, అక్షత్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2020లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2022, 2024లో రెండు, మూడు సీజన్లు వచ్చాయి. ఇటీవలే నాలుగో సీజన్ కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇది కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.
Hi 5 👋 Phulera wapas aane ki taiyyaari shuru kar lijiye 😌#PanchayatOnPrime, New Season, Coming Soon@TheViralFever @StephenPoppins #ChandanKumar @Akshatspyro @uncle_sherry @vijaykoshy @Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77 @Sanvikka #DurgeshKumar… pic.twitter.com/59R6Xvj3R1
— prime video IN (@PrimeVideoIN) July 7, 2025