10 నెలల తర్వాత మరో ఓటీటీలో తెలుగు సినిమా | Sharwanand's Manamey Movie Releasing In One More OTT Platform | Sakshi
Sakshi News home page

Manamey Movie: 10 నెలల తర్వాత మరో ఓటీటీలోకి శర్వానంద్‌ మూవీ

Apr 10 2025 12:38 PM | Updated on Apr 10 2025 12:47 PM

Sharwanand's Manamey Movie Releasing In One More OTT Platform

శర్వానంద్‌, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం మనమే (Manamey Movie). రాజ్‌ కందుకూరి, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్‌ బాగున్నప్పటికీ థియేటర్లలో లాంగ్‌ రన్‌ సాధించలేకపోయింది. ఈ మూవీ ఈ ఏడాది మార్చి మొదటివారంలో అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది.

తాజాగా మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆహాలో రేపటి (ఏప్రిల్‌ 11)  నుంచే స్ట్రీమ్‌ అవనుంది. ఈ విషయాన్ని ఆహా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వెల్లడించింది. మనమే చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. హేషమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందించాడు.

 

చదవండి: బిగ్‌ ప్లాన్‌తో రవితేజ కూతురు 'మోక్షద' .. ఎంట్రీకి లైన్‌ క్లియర్‌

Advertisement
 
Advertisement
Advertisement