breaking news
	
		
	
  Manamey Movie
- 
      
                   
                                                     
                   
            నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
కోర్టు- నెట్ఫ్లిక్స్హీరో నాని(Nani) నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'కోర్ట్–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ'(Court - State Vs. A Nobodycourt). భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఈరోజు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించగా.. ఇందులో శివాజీ అద్భుతమైన నటనతో మెప్పించారు. సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. బక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన కోర్టు చిత్రం నేడు ఏప్రిల్ 11న 'నెట్‌ఫ్లిక్స్'(Netflix)లోకి వచ్చేసింది.ఛావా- నెట్‌ఫ్లిక్స్ (హిందీ)బాలీవుడ్ హిట్ సినిమా 'ఛావా' ఓటీటీలోకి వచ్చేసింది. విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 750 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన విషయం తెలిసిందే. సుమారు రెండు నెలల తర్వాత నేడు ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, కేవలం హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ చేసి చివర్లో మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. మరో వారంలోపు తెలుగులో కూడా విడుదల కావచ్చని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కాస్త నిరాశ చెందుతున్నారు.షణ్ముఖ- ఆహాటాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం 'షణ్ముఖ' ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 21న విడుదలైన ఈ చిత్రాన్ని షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్గా కనిపించింది. డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. అయతే, రవి బస్రూర్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. నేడు ఏప్రిల్ 11న ఆహా(Aha) తెలుగులో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.మనమే- ఆహాశర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం మనమే (Manamey Movie) మరో ఓటీటీలోకి వచ్చేసింది. రాజ్ కందుకూరి, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా టాక్ బాగున్నప్పటికీ థియేటర్లలో లాంగ్ రన్ సాధించలేకపోయింది. ఈ మూవీ ఈ ఏడాది మార్చి మొదటివారంలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే, నేడు ఏప్రిల్11న 'ఆహా'(Aha)లో కూడా విడుదలైంది. - 
      
                   
                                                     
                   
            10 నెలల తర్వాత మరో ఓటీటీలో తెలుగు సినిమా
శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం మనమే (Manamey Movie). రాజ్ కందుకూరి, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ బాగున్నప్పటికీ థియేటర్లలో లాంగ్ రన్ సాధించలేకపోయింది. ఈ మూవీ ఈ ఏడాది మార్చి మొదటివారంలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది.తాజాగా మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆహాలో రేపటి (ఏప్రిల్ 11) నుంచే స్ట్రీమ్ అవనుంది. ఈ విషయాన్ని ఆహా ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది. మనమే చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందించాడు. What happens when charm meets chaos? Manamey happens! Streaming April 11 on #aha @ImSharwanand @IamKrithiShetty pic.twitter.com/juzYGUYxW5— ahavideoin (@ahavideoIN) April 10, 2025చదవండి: బిగ్ ప్లాన్‌తో రవితేజ కూతురు 'మోక్షద' .. ఎంట్రీకి లైన్ క్లియర్ - 
      
                   
                                                     
                   
            ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. కింగస్టన్, ఛావాతో పాటు పలు సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పటికీ దేనిపైన కూడా పెద్దగా అంచనాల్లేవు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఈ రోజు (మార్చి 07) ఒక్కరోజే ఏకంగా 30కి పైగా కొత్త సినిమాలు వచ్చేశాయి.(ఇదీ చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన)ఓటీటీల్లో ఈ శుక్రవారం రిలీజైన సినిమాల్లో తండేల్, రేఖాచిత్రం, మనమే, కుడుంబస్థాన్, బాపు, స్కై ఫోర్స్, ఫతే, లైలా, రివైండ్ తదితర తెలుగు, హిందీ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. గతకొన్నివారాల్లో ఎన్నడూ లేనిది ఈసారి చాలా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. అవేంటో ఓ లుక్కేసేయండి.ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (మార్చి 07)నెట్ ఫ్లిక్స్తండేల్ - తెలుగు సినిమానదానియాన్ - హిందీ మూవీసోనీ లివ్రేఖాచిత్రం - తెలుగు డబ్బింగ్ మూవీఅమెజాన్ ప్రైమ్మనమే - తెలుగు సినిమాధుపాహియా - హిందీ సిరీస్జానీ మేరా నామ్ - హిందీ మూవీనో వేర్ టూ హైడ్ - డచ్ సిరీస్లవ్ లేస్ - ఇంగ్లీష్ సినిమానారాయణీంటే మూన్మమనక్కల్ - మలయాల సినిమాస్కై ఫోర్స్ - హిందీ మూవీరాయల్ - కన్నడ సినిమా NCIS - ఇంగ్లీష్ సిరీస్హాట్ స్టార్బాపు - తెలుగు మూవీబ్లోకో 181 - ఇటాలియన్ సిరీస్ఎల్స్ బెత్ - ఇంగ్లీష్ సిరీస్ఫతే - హిందీ సినిమాథగేస్ vs ద వరల్డ్ - హిందీ సిరీస్ద ఏజెన్సీ - ఇంగ్లీష్ సిరీస్ఆహాలైలా - తెలుగు మూవీఫైండర్ - తమిళ సినిమాకుళంతైగల్ మున్నేత్ర కళగం - తమిళ మూవీజీ5కుడుంబస్థాన్ - తెలుగు డబ్బింగ్ సినిమాగేమ్ ఛేంజర్ - తెలుగు మూవీసన్ నెక్ట్గణ - కన్నడ సినిమాఉత్సవం - తెలుగు మూవీద సీక్రెట్ ఆఫ్ ఉమెన్ - మలయాళ సినిమాబుక్ మై షోబారా బై బారా - హిందీ మూవీడొమినిక్ - తెలుగు డబ్బింగ్ సినిమాగ్రాఫ్టెడ్ - తెలుగు డబ్బింగ్ మూవీతారా: ద లాస్ట్ స్టార్ - నేపాలీ సినిమాలయన్స్ గేట్ ప్లేరివైండ్ - తెలుగు మూవీఆల్ ఐ సీ ఈజ్ యూ - ఇంగ్లీష్ సినిమాలోస్ మన్ మెలాటీ - తెలుగు డబ్బింగ్ మూవీద డామినేటర్ 3 - కొరియన్ మూవీ(ఇదీ చదవండి: 'వైరల్ ప్రపంచం' మూవీ రివ్యూ) - 
      
                   
                                                     
                   
            ఓటీటీలో శర్వానంద్ 'మనమే'.. అఫీషియల్ ప్రకటన
శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. సుమారు ఏడాది తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా ప్రకటన కూడా వచ్చేసింది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టింది.శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా 'మనమే' సినిమా ఓటీటీ వివరాలను మేకర్స్ ప్రకటించారు. మార్చి 7న 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. మనమే చిత్రం విడుదల సమయంలో బాక్సాఫీస్ బరిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో శర్వానంద్‌కు ప్లస్ అయింది. మనమే కథా నేపథ్యం చాలా బాగుంటుంది. ఇందులో వినోదంతో పాటు భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.హీరో శర్వానంద్ బైక్ రేసింగ్‌తో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్‌గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్‌కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్‌గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే. - 
      
                   
                                                     
                   
            శర్వానంద్ 'మనమే' సినిమా విషయంలో మోసపోయాం: నిర్మాత
శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టిందని ప్రచారం అయితే జరిగింది. కానీ ఈ సినిమా విషయంలో భారీగా నష్టపోయామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. కొందరు చేసిన మోసంతో ఇప్పటికీ ఓటీటీలో కూడా సినిమాను విడుదల చేయలేకపోయామని ఆయన పేర్కొన్నారు.బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని శర్వానంద్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల అయ్యి మూడు నెలలు అవుతున్నా ఓటీటీలోకి ఈ చిత్రం అందుబాటులోకి రాలేదు. అందుకు కారణాలను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా ఇలా తెలిపారు. మనమే సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో మోసపోయానని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. ఇండస్ట్రీలో ఒక సంస్థకు సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను అప్పగిస్తే.. ఆ సంస్థ మోసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పలు కారణాలు చెబుతూ మనమే చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను అమ్మలేదని ఆయన అన్నారు. దీంతో మనమే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఆలస్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల తమకు భారీగా నష్టం వచ్చిందని విశ్వప్రసాద్ తెలిపారు.మనమే సినిమాకు సంబంధించి హక్కులను కొనుగోలు చేసిన వారు తమకు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదని నిర్మాత విశ్వప్రసాద్ వెల్లడించారు. దీంతో సుమారు 70 శాతం వరకు నష్టం వచ్చినట్లు ప్రకటించారు. వారు చేసిన మోసంపై తాము కోర్టును కూడా ఆశ్రయించామని ఆయన అన్నారు. మనమే సినిమాను మాత్రమే ఆపేసి ఇతర సినిమాలను మాత్రం వారు ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. దీనిని బట్టి చూస్తే మనమే సినిమా ఓటీటీ విడుదల విషయంలో మరింత జాప్యం తప్పదని తెలుస్తోంది. - 
      
                   
                                                     
                   
            ఓటీటీ బాటలో శర్వానంద్ 'మనమే'
శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. తాజాగా, ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టింది.శర్వానంద్, కృతీ శెట్టి జోడికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వీరిద్దరి నటనే సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. మనమే చిత్రం విడుదల సమయంలో బాక్సాఫీస్ బరిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో శర్వానంద్‌కు ప్లస్ అయింది. మనమే కథా నేపథ్యం చాలా బాగుంటుంది. ఇందులో వినోదంతో పాటు భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే, ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. జూలై 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలపుతున్నాయి. కానీ, అధికారికంగా సమాచారం వెలువడలేదు.శర్వానంద్ ఇప్పుడో మరో సినిమా పనిలో బిజీగా ఉన్నారు. తన తదుపరి ప్రాజెక్ట్ అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 90స్ బ్యాక్ డ్రాప్లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుందని సమాచారం. త్వరలో ఈ సినిమా గురించి మరిన్నీ వివరాలు రానున్నాయి. - 
            
                                     
                                                                                                       
                                   
                శర్వానంద్, కృతిశెట్టి ‘మనమే’ మూవీ స్టిల్స్
 - 
      
                   
                                                     
                   
            'మనమే' సినిమా రివ్యూ
యాక్షన్, థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ చాలామందికి ఇష్టమైనవి ఫీల్ గుడ్ మూవీసే. తెలుగులో అప్పుడప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలు వస్తుంటాయి. అలాంటి ఓ సినిమా 'మనమే'. శర్వానంద్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. తాజాగా జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో? టాక్ ఏంటి అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?విక్రమ్(శర్వానంద్) లండన్‌లో ఉంటాడు. అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఇతడికి అనురాగ్ (అదిత్) అనే ఓ ఫ్రెండ్. ఇండియా వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరగడంతో అనురాగ్, అతడి భార్య చనిపోతారు. వీళ్ల కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) ప్రాణాలతో బయటపడతాడు. ఈ పిల్లాడిని కొన్ని నెలల పాటు చూసుకోవాల్సిన బాధ్యత విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి)పై పడుతుంది. లండన్‌లో అనురాగ్ ఇంట్లోనే ఉంటూ పిల్లాడిని చూసుకుంటారు. మరి ఖుషిని చూసుకునే క్రమంలో విక్రమ్ ఏం తెలుసుకున్నాడు? ఇంతకీ సుభద్ర ఎవరు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?తల్లిదండ్రులు-పిల్లల మధ్య ఎలాంటి ప్రేమ-బాండింగ్ ఉండాలి? అనేదే 'మనమే' కాన్సెప్ట్. ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ స్టోరీ అని చెప్పుకొచ్చారు కానీ సినిమాలో ఎమోషన్ అక్కడక్కడే వర్కౌట్ అయింది. అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ జాలీగా ఉండే హీరో.. ఫ్రెండ్ చనిపోవడంతో అతడి కొడుకు బాధ్యత చూసుకోవాల్సి రావడం, ఇతడు ఒక్కడే కాకుండా అప్పటికే ఎంగేజ్మెంట్ అయిన ఓ అమ్మాయి కూడా పిల్లాడ్ని చూసుకోవాల్సి రావడం.. ఇలా సీన్స్ సరదాగా వెళ్తుంటాయి. హీరో ఫ్రెండ్ చనిపోవడానికి అతడి బిజినెస్ పార్ట్నర్ కారణం అని హీరోహీరోయిన్ తెలుసుకోవడం, ఫ్రెండ్ మరణంతో మూతపడిన రెస్టారెంట్‌ని హీరోహీరోయిన్ కలిసి మళ్లీ సక్సెస్ చేయడం లాంటి వాటితో ఫస్టాప్ ఓ మాదిరిగా ఉంటుంది.సెకండాఫ్ వచ్చేసరికి సినిమా పూర్తిగా సైడ్ ట్రాక్ అయిపోయింది. ఎటేటో పోయింది. తెరపై సన్నివేశాలు వస్తుంటాయి పోతుంటాయి. ఏం జరుగుతుందిరా అని చూస్తున్న ప్రేక్షకుడు కాస్త కన్ఫూజ్ అవుతాడు. కానీ చివరకొచ్చేసరికి హీరో-అతడి తల్లిదండ్రుల మధ్య మంచి ఎమోషనల్ సీన్స్, పెద్దగా ట్విస్టులేం లేకుండా క్లైమాక్స్‌లో ఎండ్ కార్డ్ పడుతుంది. ఏం జరుగుతుందో మనం ఊహించేయొచ్చు. సినిమాలో ఖుషి అనే పిల్లాడిది కీలక పాత్ర. కానీ అతడి క్యారెక్టర్ ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. ఎందుకంటే ఒకటి రెండు కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి తప్పితే చాలావరకు మనం పూర్తిగా ఆ పిల్లాడికి కనెక్ట్ కాలేకపోతాం. సినిమా అంతా రిచ్‌గా చూడటానికి కలర్ ఫుల్‌గా ఉంటుంది. కానీ ఎమోషన్ కాస్త మిస్ అయింది. నిడివి రెండున్నర గంటలు.. కాకపోతే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్, స్పెషల్ సాంగ్ ట్రిమ్ చేసినా పర్లేదు! ఇదే స్టోరీని లండన్‌లో కాకుండా ఇండియాలో ఉన్నట్లు రాసుకున్నా సరే పెద్దగా మార్పులుండవేమో? విలన్ ట్రాక్ అయితే అసలు ఎందుకు పెట్టారో, మధ్యలో ఎందుకు వదిలేశారో అర్థం కాదు.ఎవరెలా చేశారు?విక్రమ్‌గా చేసిన శర్వానంద్.. తన పాత్రకు న్యాయం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే గ్లామరస్‌గా కనిపించాడు. సుభద్రగా చేసిన కృతిశెట్టికి ఫెర్ఫార్మెన్స్‌తో పర్వాలేదనిపించింది. ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కొడుకే.. ఇందులో ఖుషి అనే పిల్లాడిగా చేశాడు. డైలాగ్స్ లాంటివి లేకుండా హావభావాలతోనే దాదాపు సీన్స్ అన్నీ ఉంటాయి. పిల్లాడితో ఇంకాస్త ప్రాక్టీస్ చేయించుంటే బాగుండేది. ఎందుకంటే చాలాచోట్ల మేనేజ్ చేసినట్లు తెలిసిపోతుంది. మిగిలిన యాక్టర్స్ తమకు ఇచ్చిన పనికి న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. లండన్ లొకేషన్స్‌ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే తడబడ్డాడు. సినిమాని చాలా సాగదీశాడు.రేటింగ్: 2.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ - 
      
                   
                                                     
                   
            Manamey X Review: ‘మనమే’ టాక్ ఎలా ఉందంటే..
శర్వానంద్, కృతీశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మనమే’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 7) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. సినిమా ఎలా ఉంది? శర్వా ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్)లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండిఎక్స్లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బాగుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎమోషన్స్‌తో పాటు ఫన్ కూడా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. #Manamey #SharwanandLead pair is the main positive for the film 🎥 Colourful good first half 😍Ekkuva fun ekkuva emotion 🥰Cinematography is top notch 🔥🔥@SriramAdittya gaaru mii taking super sir 💥💥On to the second half 👍 pic.twitter.com/kO7WODCvjN — Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) June 7, 2024 కృతీ-శర్వాల జంట ఈ సినిమాకు పాజిటివ్ పాయింట్. ఫస్టాఫ్ కలర్ఫుల్గా ఉంది.ఫన్‌తో పాటు ఎమోషన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీరామ్ ఆదిత్య టేకింగ్ సూపర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.Just watched the film #Manamey and I have to say lengthy emotional film.Rating: 2.8/5Positives: SharwanandKid ActorComedy Music Emotion Negatives:Krithi Shetty To Many SongsLaggedSlow Narration CGIDirection Overall decent entertainer to watch with family this… pic.twitter.com/edwQFwsOta— Movie Buff (@itsurmoviebuff) June 7, 2024 ఇప్పుడే సినిమా చూశాను. ఎమోషనల్ లెన్తీ ఫిల్మ్. శర్వా,కృతీ, కిడ్స్ కామెడీతో పాటు మ్యూజిక్, ఎమోషన్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఎక్కువ పాటలు, స్లో నెరేషన్ సినిమాకు మైనస్ అంటూ 2.8/5 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్#Manamey1st half: Intro, Comedy scenes👍, Some emotional scenes 👍, Interval Is Good, cinematography Excellent🔥Good 1st half2nd half: Slow paced screenplay, emotional scenes are okay, Dragged In Many scenes, Climax is OkayGood 2nd halfOverall: HIT / 3/5— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) June 7, 2024ఫస్టాఫ్‌లో ఎమోషనల్ సీన్స్, కామెడీ బాగుంది. ఇంటెర్వల్ సీన్ గుడ్, సినిమాటోగ్రఫీ బాగుంది. సెకండాఫ్ కాస్త సాగదీతగా అనిపించింది అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#Manamey is an inferior movie that tries to fall into the feel good family/love drama template. The 1st half is watchable with some light hearted comedy that somewhat works. However, the 2nd half goes on endlessly without any impactful scenes. The emotional connect needed for…— Venky Reviews (@venkyreviews) June 7, 2024#Manamey is an inferior movie that tries to fall into the feel good family/love drama template. The 1st half is watchable with some light hearted comedy that somewhat works. However, the 2nd half goes on endlessly without any impactful scenes. The emotional connect needed for…— Venky Reviews (@venkyreviews) June 7, 2024#Manamey Movie Review Rating: ⭐️⭐️⭐️#Sharwanand looks #Charming in the film. With decent acting #KrithiShetty impressed with her performance. #Kid acting thopOverall a good feel good family drama🎥#SriramAdittya cinematography is top notch📷💥#Pitapuram lo success meet fix pic.twitter.com/54KspGvkjy— Daily info -999 (@karthik34156235) June 7, 2024Average first half…. Quality is good seems costly making, few comedy scenes here and there but missing emotional connection.. @ImSharwanand is perfect scenes with little boy are good #Manamey— Rakita (@Perthist_) June 6, 2024 - 
      
                   
                                                     
                   
            ప్రేమ ఉన్నప్పుడు గొడవలూ ఉంటాయి: శర్వానంద్
‘‘ఫొటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులు ఇంకా గుర్తున్నాయి. ఇరవయ్యేళ్లు ... ముప్పైఐదు సినిమాలు ఎలా అయ్యాయో తెలియదు. స్టార్ స్టేటస్ రావడానికి ఇరవై ఏళ్లు పట్టింది. నాకు ‘చార్మింగ్ స్టార్’ అనే టైటిల్ ఇచ్చినందుకు విశ్వగారికి థ్యాంక్స్. నేను చేసిన సినిమాల పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నాను’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్సే స్టూడియోస్ప్రోడక్షన్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మనమే’.ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘మనమే’ ప్రీ రిలీజ్ వేడుకలో శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘మనమే’ సినిమాలో నేను కొత్తగా కనిపించినా, కొత్తగా పెర్ఫార్మ్ చేసినా ఆ క్రెడిట్ శ్రీరామ్‌కే వెళ్తుంది. ప్రతి ఒక్కరం చాలా కష్టపడి గొడవలు పడుతూ ఈ సినిమాను పూర్తి చేశాం. ప్రేమ ఉన్నప్పుడు గొడవలూ ఉంటాయి. ఒక మనిషికి మరో మనిషి ఇవ్వగలిగే గొప్ప బహుమతి టైమ్. ఈ పాయింట్‌నే శ్రీరామ్ ఈ సినిమాలో చెప్పారు’’ అని అన్నారు.‘‘శర్వానంద్ తన ఎనర్జీతో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకు వెళ్లారు’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ‘‘శర్వానంద్ నటన అద్భుతంగా ఉంటుంది. తన చార్మింగ్ లుక్స్, పెర్ఫార్మెన్స్ చూసి తనకి ‘చార్మింగ్ స్టార్’ అనే టైటిల్ ఇస్తున్నాను’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ఇంకా డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి కూడా మాట్లాడారు. - 
            
                                     
                                                                                                       
                                   
                ‘మనమే’.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                Manamey : శర్వానంద్ ‘మనమే’.. ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
 - 
      
                   
                                                     
                   
            మనీ కాదు...మానసిక తృప్తి ముఖ్యం: హేషమ్ అబ్దుల్ వహాబ్
‘ఖుషి, హాయ్ నాన్న’ వంటి చిత్రాల్లోని బీట్స్ ప్రేక్షకుల హార్ట్ బీట్‌ని టచ్ చేశాయి. అందుకే జస్ట్ రెండు మూడు చిత్రాలతో సంగీతదర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాగలిగారు హేషమ్ అబ్దుల్ వహాబ్. ఇప్పుడు ‘మనమే’కి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు హేషమ్. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్సే స్టూడియోస్ ప్రోడక్షన్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘మనమే’ గురించి, ఇతర విశేషాలను సంగీతదర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ విధంగా పంచుకున్నారు. ⇒ సంగీతానికి ప్రాధాన్యం ఉన్న సినిమా చేయడం ఏ సంగీతదర్శకుడికైనా ఆనందంగా ఉంటుంది. ‘మనమే’లో 16 పాటలు ఉన్నాయి. నా గత చిత్రాలకన్నా ఈ చిత్రానికి ఎక్కువ హార్డ్‌వర్క్ చేశాను. ముందు 16 పాటలు ఉంటాయని ఊహించలేదు. కానీ శ్రీరామ్ ఆదిత్య కథని మలిచిన తీరు ఎక్కువ పాటలకు స్కోప్ ఇచ్చింది. ఫస్టాఫ్‌లో పది, సెకండాఫ్‌లో ఆరు పాటలు అవసరం అవుతాయని కంపోజ్ చేసేటప్పుడు అర్థం అయింది. పదకొండు ఫుల్ సాంగ్స్, మిగతావి బిట్ సాంగ్స్‌లా వస్తాయి ∙నా గత చిత్రం ‘హాయ్ నాన్న’లో తండ్రీ కూతురు ఎమోషన్ ఉంటుంది. ‘మనమే’లో కూడా పేరెంటింగ్ ప్రాధాన్యమైన అంశం. అయితే రెండు కథలు పూర్తిగా వేరు. ‘మనమే’లో పేరెంటింగ్ అనే ఎమోషన్‌తో పాటు ఇంకా చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయి ⇒ ‘మనమే’లో 16 పాటలు ఉన్నాయి కాబట్టి మిగతా సినిమాలకన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్నారా? అని అడిగితే... ఓ క్రియేటర్‌గా మనీ గురించి కాకుండా మానసిక తృప్తి ముఖ్యం అనుకుంటాను. ఆ విధంగా చూస్తే ‘మనమే’ నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది. సంగీతం పట్ల నాకు ఉన్న అవగాహనను పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశం దక్కింది. అలాగే నా పనికి తగ్గ పారితోషికం కూడా దక్కింది (నవ్వుతూ). నా గత చిత్రాలు, ఇప్పుడు ‘మనమే’ వంటి మంచి ప్రాజెక్ట్‌కి చాన్స్ దక్కడం ఆశీర్వాదంలా భావిస్తున్నాను ⇒ ఫలానా సినిమాలో ఉన్న అలాంటి బీట్ ఇవ్వండి అంటూ ఇప్పటివరకూ ఏ దర్శకుడూ అడగకపోవడం నా లక్. మంచి ట్యూన్‌ని ఆదర్శంగా తీసుకోవడం తప్పేం కాదు. కానీ నా వరకూ ఒరిజినల్ ట్యూన్ ఇవ్వాలనుకుంటాను. ఒకవేళ డైరెక్టర్ అడిగితే... ఆయన చెప్పిన ట్యూన్ కథలోని సందర్భానికి తగ్గట్టుగా ఉందనిపిస్తే అప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుని చేయడానికి ట్రై చేస్తాను ∙ప్రస్తుతం రష్మికా మందన్నా నటిస్తున్న ‘గర్ల్ ఫ్రెండ్’కి వర్క్ చేస్తున్నాను. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లో సాగే సినిమా చేయడం నాకు ఇదే ఫస్ట్ టైమ్. ఇదో కొత్త అనుభవం. ఇక తెలుగు పరిశ్రమ చాలా గొప్పది. ఎంతమంది వచ్చినా ఇక్కడ అవకాశం ఉంటుంది... ్రపోత్సాహం ఉంటుంది. అందుకే కేరళ నా ఫస్ట్ హోమ్ అయితే హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అంటాను. - 
      
                   
                                                     
                   
            మనమే నా గ్రాఫ్ పెంచుతుంది: దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య
‘‘ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే మన కెరీర్ గ్రాఫ్ పెరుగుతుంటుంది. నా గత చిత్రం ‘హీరో’ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ కాలేదు. కొంత కరోనా ప్రభావం కూడా ఉంది. ఇప్పుడు ‘మనమే’ సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నాను. నా కెరీర్ గ్రాఫ్ మళ్లీ పెరుగుతుంది’’ అన్నారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ – ‘‘పేరెంటింగ్ ఎమోషన్స్ గురించి కొంచెం వినూత్నంగా చెప్పాలన్న ఉద్దేశం నాకు ఎప్పట్నుంచో ఉంది. కాకపోతే ఈ ఎమోషన్స్‌కు ఫన్ జోడించి, ఫుల్ ఎనర్జీతో చెప్పాలనుకున్నాను. అదే ‘మనమే’ కథ. ఈ సినిమాలో శర్వానంద్–కృతీ శెట్టిల క్యారెక్టర్స్ టామ్ అండ్ జెర్రీలా ప్రేక్షకులను అలరిస్తాయి. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘మనమే’ నా ఫేవరెట్.ఈ సినిమాలో నా కొడుకు చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడని నేను ఇలా చెప్పడం లేదు. అందమైన భావోద్వేగాలు ఉన్న మంచి సినిమా ఇది. ఈ సినిమాలో శివ కందుకూరి పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది. ‘మనమే’లో 16 పాటల వరకూ ఉన్నాయి. ఇవి సినిమా ఫ్లోకు ప్లస్గానే ఉంటాయి కానీ అడ్డుగా అనిపించవు. హేషమ్ మంచి సంగీతం అందించారు’’ అని చెప్పుకొచ్చారు. - 
  
    
                
      మనమే తో బ్లాక్ బస్టర్.. ప్రామిస్ చేస్తున్న శర్వానంద్
 - 
      
                   
                                                     
                   
            బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
‘‘మనమే’ ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా. ఈ చిత్రాన్ని తల్లితండ్రులకు అంకితం ఇస్తున్నాం. ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ’’ అన్నారు హీరో శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది.ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో రామ్‌చరణ్ లాంచ్ చేశారు. అనంతరం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఈ సినిమా ఓ మ్యాజిక్.. ఆ మ్యాజిక్‌ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘మనమే’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూఛిబొట్ల. ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ కృతీ ప్రసాద్, అసోసియేట్ప్రోడ్యూసర్ ఏడిద రాజా మాట్లాడారు. - 
      
                   
                                                     
                   
            సుభద్రలా ఉండలేను!: కృతీ శెట్టి
‘‘మనమే’ మూవీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి సన్నివేశంలో వినోదం ఉంటుంది. అలాగే వండర్ఫుల్ కిడ్, పేరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. అది గ్లోబల్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మొత్తం మా ముగ్గురి పాత్రల (శర్వా, కృతి, విక్రమాదిత్య) చుట్టూ తిరుగుతుంది.. అందుకే ‘మనమే’ అనే టైటిల్ పెట్టాం’’ అని హీరోయిన్ కృతీ శెట్టి అన్నారు. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమాదిత్య కీలక పాత్ర చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై రామ్సే స్టూడియోస్ ప్రోడక్షన్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి పంచుకున్న విశేషాలు... ∙‘మనమే’లో నా పాత్ర పేరు సుభద్ర. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌కి ఇది వైవిధ్యంగా ఉంటుంది. నేను క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ, తొలిసారి ‘మనమే’లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండే పాత్ర చేశాను. నిజ జీవితంలో నాకు పెద్దగా కోపం రాదు.. గట్టిగా అరవను. చాలా కామ్‌గా ఉంటాను. చెప్పాలంటే సుభ్రద్రలా స్ట్రిక్ట్‌గా ఉండలేను. అందుకే ఈ పాత్ర చేయడం నాకు పూర్తిగా కొత్తగా అనిపించింది. ఈ పాత్ర కోసం డైరెక్టర్ శ్రీరామ్‌గారి విజన్‌ని ఫాలో అయ్యాను. నా తొలి మూవీ ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్రకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఆ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు. ‘ఉప్పెన’ రస్టిక్ లవ్ స్టోరీ. ‘మనమే’ రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను చేసిన సుభద్ర పాత్రలో చాలా భావోద్వేగాలున్నాయి. అది ప్రేక్షకులకి నచ్చుతుందనే ఆశిస్తున్నాను. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ మన చేతుల్లో ఉండదు. నా వరకూ పాత్రకి న్యాయం చేస్తాను. మన చేతిలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి, ఆందోళన చెందకూడదని ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను. ఆ కమిట్మెంట్స్ వల్లే తెలుగులో గ్యాప్ వస్తోంది. పైగా రొటీన్ పాత్రలు కాకుండా వైవిధ్యంగా ఉన్నవి మాత్రమే చేయాలనుకుంటున్నాను. ‘బాహుబలి’ చిత్రంలో అనుష్కగారిలా నాకు మహారాణి పాత్ర చేయడం ఇష్టం. అలాగే యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్ రోల్స్ కూడా చేయాలని ఉంది. నాకు వీలు కుదిరినప్పుడు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటాను. - 
      
                   
                                                     
                   
            టప్పా టప్పా.. పెళ్లి పాటప్పా
టప్పా టప్పా.. అంటూ పాట అందుకున్నారు శర్వానంద్, కృతీ శెట్టి. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మనమే’ చిత్రంలో పెళ్లి సమయంలో వచ్చే ‘టప్పా టప్పా..’ అంటూ సాగే పాట విడుదల అయింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. కాగా చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసిన యూనిట్ గురువారం ‘టప్పా టప్పా..’ అంటూ సాగే మూడవ పాటని విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల, హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు. ‘‘అందరూ ఎంజాయ్ చేసే వెడ్డింగ్ సాంగ్‌ని అందించారు హేషమ్. ఈ పాటలో శర్వానంద్, కృతీ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. - 
      
                   
                                                     
                   
            జూన్‌లో మనమే
జూన్‌లో థియేటర్స్‌కు వస్తోంది ‘మనమే’ అని శర్వానంద్ అంటున్నారు. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది.ఈ సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించి, శర్వానంద్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘ఈ సినిమాలో శర్వానంద్, కృతి డిఫరెంట్ రోల్స్‌లో కనిపిస్తారు. ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రం ఇది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరకర్త. - 
      
                   
                               
                   
            పిచ్చి పట్టిందా నీకు...
‘మంచిగా కనపడేవాళ్లందరూ మంచివాళ్లు కాదురా... ఫర్ ఎగ్జాంపుల్ నేను’ అంటూ మొదలవుతుంది ‘మనమే..’ సినిమా టీజర్. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్లేబాయ్ మనస్తత్వం ఉండే అబ్బాయి, బాధ్యతగా జీవించాలనుకునే ఓ అమ్మాయి జీవితాల్లోకి విక్రమాదిత్య అనే ఓ పిల్లవాడు వచ్చినప్పుడు వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి? అన్నదే ఈ చిత్రం కథాంశమన్నట్లుగా యూనిట్ చెబుతోంది. ‘వాడప్పట్నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలేం చేశావ్... (కృతీ శెట్టి), ‘తాగటానికెళ్లొచ్చా..’ (శర్వానంద్), ‘ఇల్లు చూసుకోవడం రాదు... పిల్లవాడిని చూసుకోవడం రాదు... పిచ్చిపట్టిందా నీకు...’ (కృతీ శెట్టి), ‘ఇద్దరిలో ఒకళ్లు ఏడ్వండి’ (శర్వానంద్) వంటి సంభాషణలు విడుదలైన టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. - 
      
                   
                               
                   
            శర్వానంద్ జోరు.. ఒకే రోజు మూడు సినిమాల అప్డేట్స్
హీరో శర్వానంద్ బర్త్ డే (మార్చి 6) సందర్భంగా మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. శర్వానంద్ నటిస్తున్న 35వ చిత్రానికి ‘మనమే’ అనే టైటిల్ ఖరారు చేయగా, 36వ సినిమా బుధవారం ప్రారంభమైంది. అలాగే శర్వా నటించనున్న 37వ సినిమా ప్రకటన కూడా వెల్లడైంది. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘మనమే’ టైటిల్ ఖరారు చేసి, గ్లింప్స్ విడుదల చేశారు. అలాగే శర్వానంద్ 36వ సినిమా ఆరంభమైంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. విక్రమ్ సమర్పణలో వంశీ–ప్రమోద్ నిర్మిస్తున్నారు. శర్వా 37వ సినిమాని రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇక శర్వానంద్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే గత ఏడాది రక్షితను వివాహం చేసుకున్నారు. ఇటీవల పాపకు జన్మనిచ్చారు రక్షిత. పాపకు లీలాదేవి అని నామకరణం చేసినట్లు బుధవారం వెల్లడించారు. 


