ఓటీటీ బాటలో శర్వానంద్‌ 'మనమే' | Sharwanand Manamey Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Manamey OTT Release Date: ఓటీటీ బాటలో శర్వానంద్‌ 'మనమే'

Jul 4 2024 8:25 AM | Updated on Jul 4 2024 9:36 AM

Manamey Movie OTT Release Date Locked

శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్‌ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన చిత్రం ఇది. జూన్‌ 7న ఈ చిత్రం విడుదలైంది. తాజాగా, ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. పర్ఫెక్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టింది.

శ‌ర్వానంద్, కృతీ శెట్టి జోడికి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. వీరిద్దరి నటనే సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. మనమే చిత్రం విడుదల సమయంలో బాక్సాఫీస్‌ బరిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో శ‌ర్వానంద్‌కు ప్లస్‌ అయింది. మనమే కథా నేపథ్యం చాలా బాగుంటుంది. ఇందులో వినోదంతో పాటు భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతాయి. అయితే, ఈ సినిమాను ఇ‍ప్పుడు ఓటీటీలో చూడొచ్చు. జూలై 12 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలపుతున్నాయి. కానీ, అధికారికంగా సమాచారం వెలువడలేదు.

శర్వానంద్‌ ఇప్పుడో మరో సినిమా పనిలో బిజీగా ఉన్నారు. తన తదుపరి ప్రాజెక్ట్‌ అభిలాష్‌ రెడ్డి  అనే కొత్త దర్శకుడితో చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 90స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుందని సమాచారం. త్వరలో ఈ సినిమా గురించి మరిన్నీ వివరాలు రానున్నాయి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement