శర్వానంద్‌ జోరు.. ఒకే రోజు మూడు సినిమాల అప్‌డేట్స్‌ | Sharwanand Upcoming Movie Details | Sakshi
Sakshi News home page

శర్వానంద్‌ జోరు.. ఒకే రోజు మూడు సినిమాల అప్‌డేట్స్‌

Mar 7 2024 12:01 PM | Updated on Mar 7 2024 1:18 PM

Sharwanand Upcoming Movie Details - Sakshi

హీరో శర్వానంద్‌ బర్త్‌ డే (మార్చి 6) సందర్భంగా మూడు చిత్రాల అప్‌డేట్స్‌ ఇచ్చారు మేకర్స్‌. శర్వానంద్‌ నటిస్తున్న 35వ చిత్రానికి ‘మనమే’ అనే టైటిల్‌ ఖరారు చేయగా, 36వ సినిమా బుధవారం ప్రారంభమైంది. అలాగే శర్వా నటించనున్న 37వ సినిమా ప్రకటన కూడా వెల్లడైంది.

శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘మనమే’ టైటిల్‌ ఖరారు చేసి, గ్లింప్స్‌ విడుదల చేశారు. అలాగే శర్వానంద్‌ 36వ సినిమా ఆరంభమైంది. అభిలాష్‌ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌. విక్రమ్‌ సమర్పణలో వంశీ–ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.

శర్వా 37వ సినిమాని రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇక శర్వానంద్‌ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే గత ఏడాది రక్షితను వివాహం చేసుకున్నారు. ఇటీవల పాపకు జన్మనిచ్చారు రక్షిత. పాపకు లీలాదేవి అని నామకరణం చేసినట్లు బుధవారం వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement