ప్రేమ ఉన్నప్పుడు గొడవలూ ఉంటాయి: శర్వానంద్‌ | Sharwanand Maname Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

ప్రేమ ఉన్నప్పుడు గొడవలూ ఉంటాయి: శర్వానంద్‌

Jun 7 2024 1:07 AM | Updated on Jun 7 2024 1:07 AM

Sharwanand Maname Movie Pre Release Event

శ్రీరామ్‌ ఆదిత్య, కృతీ శెట్టి, శర్వానంద్, టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల

‘‘ఫొటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులు ఇంకా గుర్తున్నాయి. ఇరవయ్యేళ్లు ... ముప్పైఐదు సినిమాలు ఎలా అయ్యాయో తెలియదు. స్టార్‌ స్టేటస్‌ రావడానికి ఇరవై ఏళ్లు పట్టింది. నాకు ‘చార్మింగ్‌ స్టార్‌’ అనే టైటిల్‌ ఇచ్చినందుకు విశ్వగారికి థ్యాంక్స్‌. నేను చేసిన సినిమాల పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నాను’’ అని శర్వానంద్‌ అన్నారు. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై రామ్‌సే స్టూడియోస్‌ప్రోడక్షన్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘మనమే’.

ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘మనమే’ ప్రీ రిలీజ్‌ వేడుకలో శర్వానంద్‌ మాట్లాడుతూ– ‘‘మనమే’ సినిమాలో నేను కొత్తగా కనిపించినా, కొత్తగా పెర్ఫార్మ్‌ చేసినా ఆ క్రెడిట్‌ శ్రీరామ్‌కే వెళ్తుంది. ప్రతి ఒక్కరం చాలా కష్టపడి గొడవలు పడుతూ ఈ సినిమాను పూర్తి చేశాం. ప్రేమ ఉన్నప్పుడు గొడవలూ ఉంటాయి. ఒక మనిషికి మరో మనిషి ఇవ్వగలిగే గొప్ప బహుమతి టైమ్‌. ఈ పాయింట్‌నే శ్రీరామ్‌ ఈ సినిమాలో చెప్పారు’’ అని అన్నారు.

‘‘శర్వానంద్‌ తన ఎనర్జీతో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకు వెళ్లారు’’ అన్నారు శ్రీరామ్‌ ఆదిత్య. ‘‘శర్వానంద్‌ నటన అద్భుతంగా ఉంటుంది. తన చార్మింగ్‌ లుక్స్, పెర్ఫార్మెన్స్‌ చూసి తనకి ‘చార్మింగ్‌ స్టార్‌’ అనే టైటిల్‌ ఇస్తున్నాను’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌. ఇంకా డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి కూడా మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement