నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్‌ సినిమా | Irul As Aparadhi Telugu Movie OTT Streaming Details | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్‌ సినిమా

May 6 2025 4:01 PM | Updated on May 6 2025 4:18 PM

Irul As Aparadhi Telugu Movie OTT Streaming Details

పుష్ప సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరైన నటుడు ఫ‌హాద్ ఫాజిల్.. ఆయన విల‌న్‌గా న‌టించిన 'ఇరుల్‌' మ‌ల‌యాళ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది. అపరాధి టైటిల్‌తో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుంది. 2021లో విడుదలైన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ చిత్రానికి నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించారు. ఫహద్ ఫాసిల్‌తో పాటు సౌబిన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ వంటి వారు ఇందులో నటించారు. ఈ చిత్రాన్ని ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, ప్లాన్ జె స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే మలయాళ వర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

అపరాధి పేరుతో డైరెక్ట్‌గా ఆహా తెలుగు ఓటీటీలో ఈ చిత్రం మే 8న విడుదల కానుంది. ఈ విష‌యాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అప‌రాధి  సినిమా మొత్తం ఒకే ఇంట్లో కేవ‌లం మూడు పాత్ర‌ల‌తోనే చాలా సస్పెన్స్‌గా జరుగుతుంది. ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఫ‌హాద్ ఫాజిల్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. 2021లో కొవిడ్‌ కారణంగా ఈ చిత్రం డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళ వర్షన్‌ విడుదలైంది. అప్పట్లో చాలామంది సబ్‌టైటిల్స్‌తో ఈ మూవీని చూశారు. ఈ సినిమా ర‌న్‌టైమ్ కేవలం 91 నిమిషాలే కావ‌డం విశేషం.

ఒక ప్రేమ‌జంట జీవితంలోకి ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ ఎంటర్‌ అయితే ఎలా ఉంటుందో ఈ చిత్రం చెబుతుంది. కేవ‌లం 30 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్‌ను పూర్తిచేసి ఓటీటీలో విడుదల చేశారు. ప్రేక్షకులను ప్రతి క్షణం సస్పెన్స్‌కు గురిచేసే ఈ చిత్రం సుమారు నాలుగేళ్ల తర్వాత తెలుగులో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement