సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు | Mahanatulu And Premadesapu YuvaRani Movies OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movies: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన కొత్త మూవీస్

Apr 22 2025 3:51 PM | Updated on Apr 22 2025 4:20 PM

Mahanatulu And Premadesapu YuvaRani Movies OTT Streaming Now

తెలుగులో ప్రతి ఏడాది వందలకొద్ది సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. కానీ వీటిలో ప్రేక్షకులని ఆకట్టుకునే హిట్ అయ్యేవి చాలా తక్కువ. మిగతావి ఎప్పుడొచ్చి వెళ్లాయో తెలియనంతలా కనుమరుగైపోతాయి. చాన్నాళ్ల తర్వాత ఏదో ఓ చోట ప్రత్యక్షమవుతుంటాయి. అలా దాదాపు రెండేళ్ల తర్వాత రెండు తెలుగు మూవీస్ ఓటీటీలోకి సడన్ గా వచ్చేశాయి. 

2023లో ఆగస్టు చివరి వారంలో రిలీజైన 'మహానటులు', అదే ఏడాది సెప్టెంబరు తొలివారంలో రిలీజైన 'ప్రేమదేశపు యువరాణి' చిత్రాలు దాదాపు ఏడాదిన్న రెండేళ్ల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేశాయి. కాకపోతే రూ.99 రెంట్ విధానంలో మీరు వీటిని చూడొచ్చు. రీసెంట్ టైంలో ఇలా చాలా తెలుగు చిత్రాల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేస్తోంది.

(ఇదీ చదవండి: ప్రాణ భయం.. వేరే దేశంలో ఇల్లు కొన్న 'దేవర' విలన్)

ప్రతివారం కొన్ని కొన్ని సినిమాలు అన్నట్లు స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈవారం ప్రేమదేశపు యువరాణి, మహానటులు చిత్రాల్ని ఓటీటీలోకి తీసుకొచ్చింది. ఈ సినిమాల విషయానికొస్తే.. రెండింటిలోనూ పెద్దపేరున్న నటీనటులు ఎవరూ లేరు. దీంతో రిలీజైన సంగతి కూడా చాలామందికి తెలియకపోవచ్చు.

ఇకపోతే ఈ వారం థియేటర్లలో ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాణి జాతకం, చౌర్యపాఠం అనే తెలుగు సినిమాలతో పాటు జింఖానా అనే డబ్బింగ్ చిత్రం రాబోతుంది. ఓటీటీలో ఎల్ 2 ఎంపురాన్, వీరధీరశూర, జ్యూయెల్ థీప్ మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు వీకెండ్ ఓటీటీలో సడన్ సర్ ప్రైజులు ఏమైనా ఉండే అవకాశముంది.

(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement