సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు | Samudrudu And Rudraveena Movies Released In OTT, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

OTT Movies: తెలుగు మూవీస్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి

Apr 30 2025 11:19 AM | Updated on Apr 30 2025 12:07 PM

Samudrudu And Rudraveena Movies OTT Streaming Now

ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మిగతా భాషలతో పాటు తెలుగు చిత్రాలు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీంతో టైమ్ కుదిరినప్పుడల్లా ప్రేక్షకులు వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రెండు తెలుగు మూవీస్.. సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. వేటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?

గతేడాది అక్టోబరు చివరి వారంలో 'సముద్రుడు' అనే సినిమా రిలీజైంది. ఇది ఇ‍ప్పుడు అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. రమాకాంత్, అవంతిక, భాను శ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ళ కష్టాలు ఏంటి? దళారులు.. మత్స్యకారులను ఎలా మోసం చేస్తున్నారు లాంటి అంశాలతో ఈ మూవీ తీశారు. 

(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్ 

అలానే 2022లో రిలీజైన 'రుద్రవీణ'.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ ఇందులో హీరోయిన్ గా చేసింది. ఇదో రొటీన్ యాక్షన్ మూవీ. ఊరిని ఇబ్బంది పెట్టే రౌడీ. దీంతో హీరో రంగంలోకి దిగుతాడు. చివరకు విలన్ ని హీరో ఎలా చంపాడనేదే స్టోరీ.

పై రెండు సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఇలా థియేటర్లలోకి వచ్చి అలా వెళ్లిపోయాయి. ఇవి ఇప్పుడు రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చాయి. గత కొన్ని వారాలుగా ఈ ఓటీటీ సంస్థ ఇలానే పలు తెలుగు చిన్న చిత్రాల్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ఆసక్తి ఉంటే వీటిపై ఓ లుక్కేయండి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో

Advertisement
 
Advertisement
Advertisement