ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Vidyapati Movie Telugu OTT Streaming Now | Sakshi
Sakshi News home page

Vidyapati OTT: 3 వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ మూవీ

May 4 2025 2:25 PM | Updated on May 4 2025 2:59 PM

Vidyapati Movie Telugu OTT Streaming Now

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. మొన్నీమధ్యే వీకెండ్ సందర్భంగా మే 01-02 తేదీల్లో ఏకంగా 30 చిత్రాలకు పైగా స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. ఇప్పుడు మరో కన్నడ కామెడీ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ దీని సంగతేంటి?

'పుష్ప' జాలిరెడ్డి డాలీ ధనంజయ అతిథి పాత్రలో నటించిన కన్నడ సినిమా 'విద్యాపతి'. నాగ‌భూష‌ణ‌, మ‌లైకా వాసుపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్ కామెడీగా తీసిన ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లలోకి రాగా డీసెంట్ టాక్ అందుకుంది. ఇప్పుడు మూడు వారాలు తిరిగేసరికల్లా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. కన్నడతో పాటు తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

(ఇదీ చదవండి: నవ్వులతో కాసులు కురిపించే బ్రహ్మానందం రెమ్యునరేషన్‌ తెలుసా?)

'విద్యాపతి' విషయానికొస్తే.. సిద్ధు అనే కుర్రాడు సులభంగా డబ్బు సంపాదించి జీవితంలో సెటిలైపోవాలని అనుకుంటాడు. దీంతో అబద్ధాలాడి సినిమా హీరోయిన్ విద్యకు దగ్గరవుతాడు. కొన్నాళ్లకు ఇతడి గుణగణాలు నచ్చి విద్య పెళ్లి చేసుకుంటుంది. దీని తర్వాత సిద్ధుకు మేనేజర్ గా సిద్ధు సెటిలైపోతాడు.

ఓ సందర్భంలో జగ్గు అనే వ్యక్తితో విద్య గొడవపడుతుంది. అదే సమయంలో సిద్ధు గురించి విద్యకు నిజం తెలిసిపోతుంది. దీంతో ఇంట్లో నుంచి గెంటేస్తుంది. తర్వాత ఏమైంది? సిద్ధు-విద్య ఒక్కటయ్యారా అనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: 'హిట్‌3' కలెక్షన్స్‌ ప్రకటన.. రూ. 100 కోట్లకు చేరువలో నాని)

Advertisement
 
Advertisement
Advertisement