'హిట్‌3' కలెక్షన్స్‌ ప్రకటన.. రూ. 100 కోట్లకు చేరువలో నాని | Hit 3 Movie 3rd Day Collection Out Now | Sakshi
Sakshi News home page

'హిట్‌3' కలెక్షన్స్‌ ప్రకటన.. రూ. 100 కోట్లకు చేరువలో నాని

May 4 2025 10:45 AM | Updated on May 4 2025 11:21 AM

Hit 3 Movie 3rd Day Collection Out Now

'హిట్‌3: ది థర్డ్‌ కేస్‌' సినిమా మూడురోజుల్లోనే భారీ కలెక్షన్స్‌ సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. వీకెండ్‌లో బాక్సాఫీస్‌ వద్ద  హీరో నాని దుమ్మురేపుతున్నాడు. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్‌ రాబట్టిన ఈ మూవీ రెండోరోజు కూడా సత్తా చాటింది. అయితే, తాజాగా మూడోరోజు కలెక్షన్స్‌ వివరాలను మేకర్స్‌ ప్రకటించారు. ఈమేరకు తాజాగా ఒక పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రోడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌గా నటించారు.

హిట్‌3 సినిమా మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 82 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు.  ఫస్ట్‌ డే రూ. 43 కోట్లు, సెకండ్‌ డే రూ. 19 కోట్లు రాబడితే.. మూడోరోజు రూ. 20 కోట్లు రాబట్టింది. నేడు ఆదివారం సెలవు కాబట్టి  సులువుగా రూ. 100 కోట్లు సాధించే ఛాన్స్‌ ఉంటుందని అంటున్నారు. గత రెండు రోజులుగా థియేటర్స్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌ వస్తున్నారు. నానీని అర్జున్‌ సర్కార్‌లాంటి వైవిధ్యమైన పాత్రలో చూడటానికి వారు ఆసక్తి చూపుతున్నారు. చిత్ర యూనిట్‌ అంచనాలకు మించి కుటుంబ ప్రేక్షకులు రావడం, వారి స్పందనను చూసి దర్శకుడు, నిర్మాతలు సర్‌ప్రైజింగ్‌గా ఫీల్‌ అవుతున్నారు.

చాగంటి కోటేశ్వరరావుగారికి నచ్చి వాయిస్‌ ఇచ్చారు:  శైలేష్‌ కొలను
‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’లో అర్జున్‌ సర్కార్‌గా నాని పాత్ర ఎలా ఉంటుందో ‘హిట్‌ 2’ చివర్లో గ్లింప్స్‌లా చూపించా. అప్పుడే ఆడియన్స్‌కి ఓ అవగాహన వచ్చింది. అర్జున్‌ సర్కార్‌ పాత్రపై నాకు, నానీగారికి మొదటినుంచీ నమ్మకం ఉంది. ఇక మా మూవీ ఐడియాని చాగంటి కోటేశ్వరరావుగారికి చెబితే నచ్చి, వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. డార్క్‌ వెబ్‌ అనేది ప్రస్తుతం ఇండియాలో పెద్ద సమస్య. ఎన్నో చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సైబర్‌ డిపార్ట్‌మెంట్‌ దీని మీద వర్క్‌ చేస్తోంది. తెలంగాణ, ఏపీ పోలీసులు డార్క్‌ వెబ్‌ గురించి మాకు చాలా సమాచారం ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement