
ఓటీటీలో మలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరీ ముఖ్యంగా బాసిల్ జోసెఫ్ నుంచి వస్తున్న ప్రతి సినిమా ఆకట్టుకుంటోంది. రీసెంట్ టైంలో పలు చిత్రాల డబ్బింగ్ లతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు మరో మూవీతో ఓటీటీలో రచ్చ చేసేందుకు సిద్ధమైపోయాడు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్?
(ఇదీ చదవండి: ఓటీటీలో 'జాక్' సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..)
స్వతహాగా డైరెక్టర్ అయిన బాసిల్ జోసెఫ్ గత కొన్నాళ్ల నుంచి హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది కాలంలో నూనక్కుళి, సూక్ష‍్మదర్శిని, ప్రావింకుడు షప్పు, పొన్ మన్ తదితర చిత్రాలతో వచ్చాడు. ఇప్పుడు 'మరణమాస్' మూవీతో రాబోతున్నాడు.
మలయాళ పండగ విషు సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మే 15 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాని ప్రముఖ హీరో టొవినో థామస్ నిర్మించడం విశేషం.
(ఇదీ చదవండి: ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్’ మూవీ రివ్యూ)
'మరణమాస్' విషయానికొస్తే.. ఓ రాత్రి అనుకోకుండా సీరియల్ కిల్లర్ తోపాటు ఓ శవం ఉన్న బస్సులో కొందరు వ్యక్తులు చిక్కుకుంటారు. ఆ శవాన్ని వాళ్లు ఏం చేశారు? ఆ సీరియల్ కిల్లర్ నుంచి ఎలా తప్పించుకున్నారనేదే స్టోరీ. ఈ సినిమాలో లూక్ పీపీ అనే ఇన్ ఫ్లూయెన్సర్ గా బాసిల్ జోసెఫ్ నటించాడు.
ఓ అమ్మాయి తన ప్రేమని అంగీకరించకపోవడంతో లూక్.. ఆమెను వేధిస్తూ ఉంటాడు. అదే ఊరిలోని వృద్ధులను చంపి నోటిలో అరటిపండు పెడుతుంటాడు సీరియల్ కిల్లర్. డార్క్ కామెడీగా తీసిన ఈ సినిమా వచ్చే వారాంతంలో రిలీజ్ అవుతుంది.
(ఇదీ చదవండి: 'కిర్రాక్ ఆర్పీ మోసాన్ని నా జీవితంలో మర్చిపోను'.. జబర్దస్త్ తన్మయ్)
Welcome to a world where nothing makes sense, but everything will crack you up!
Watch #Maranamass on SonyLIV From 15 May #MaranamassOnSonyLIV pic.twitter.com/s3GTEM5YEz— Sony LIV (@SonyLIV) May 5, 2025