సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా | 14 Days GirlFriend Intlo Movie Released In OTT, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

GirlFriend Intlo Movie In OTT: తెలుగు రొమాంటిక్ మూవీ.. ఓటీటీలోకి ఆగయా

Apr 4 2025 12:30 PM | Updated on Apr 4 2025 1:49 PM

14 days GirlFriend Intlo Movie OTT streaming Now

తెలుగులో ప్రతివారం ఏదో ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతూనే ఉంటుంది. కాకపోతే కాస్త పేరున్న నటీనటులు ఉంటే మోస్తరు కలెక్షన్స్ సాధిస్తుంది. లేదంటే వచ్చివెళ్లిన సంగతి తెలియనంత వేగంగా మాయమైపోతుంది. అలాంటి ఓ తెలుగు మూవీ ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ హిట్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌)

అంకిత్, శ్రియ, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా '14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో'. టైటిల్ చూస్తేనే కథేంటో అర్థమైపోతుంది కదా. ఒంటరిగా ఉన్న ప్రియురాలిని కలవడానికి ఓ కుర్రాడు.. ఆమె ఇంటికి వెళ్తాడు. అదే టైంకి అమ్మాయి తల్లిదండ్రులు రావడంతో అక్కడే ఉండిపోతాడు. తర్వాత ఏమైందనేదే స్టోరీ.

మార్చి 7న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. కానీ ఈ విషయం కూడా చాలామందకి తెలియదు. ‍అలాంటిది ఈ రొమాంటిక్ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఉంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు. దీనితో పాటు ఈ వారం పలు తెలుగు, డబ్బింగ్ మూవీస్ కూడా పలు ఓటీటీల్లోకి వచ్చేశాయి.

(ఇదీ చదవండి: హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక)

Advertisement
 
Advertisement
Advertisement