
క్రికెట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఇప్పటికే పలు సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చాయి. ఇప్పుడు అలాంటి కంటెంట్ తో వస్తున్న లేటెస్ట్ సిరీస్ 'టెస్ట్'. మాధవన్, నయనతార, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా)
చెన్నైలో జరిగిన ఇండియా vs పాకిస్థాన్ టెస్టు మ్యాచ్.. ముగ్గురు వ్యక్తుల జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందనే కథతో ఈ సిరీస్ తీశారు. ఏప్రిల్ 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య)