
కోలీవుడ్ స్టార్ హీరో డైరెక్ట్ చేసిన ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో తమిళ్ వర్షన్ అందుబాటులో ఉంది. అయితే, తెలుగు స్ట్రీమింగ్ గురించి మేకర్స్ ప్రకటించలేదు. ఈ క్రమలో తాజాగా సింప్లీ సౌత్ ఓటీటీ సంస్థ ఈ మూవీ తెలుగు రైట్స్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది తెలుపలేదు.
‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చేసింది. అయితే, రీసెంట్‌గా తమిళ్ వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి త్వరలో తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందని అందరూ ఆశించారు. కానీ, తెలుగు స్ట్రీమింగ్ మాత్రం సింప్లీ సౌత్ ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇండియాలో ఈ ఓటీటీ సంస్థకు అనుమతి లేదు. కానీ, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు అందరూ ఈ చిత్రాన్ని సింప్లీ సౌత్ ఓటీటీలో చూడొచ్చు. కొద్దిరోజుల తర్వాత అమెజాన్, ఆహాలో ఈ సినిమా అందుబాటులోకి రావచ్చని సమాచారం ఉంది.