
విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. భారీ యాక్షన్ కాన్సెప్ట్‌తో నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్ సన్నాఫ్ వైజయంతిని ఈ వీకెండ్‌లో ఇంట్లోనే చూసేయండి.
ఏప్రిల్ 18న విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు భారత్‌లో ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతుంది. కొద్దిరోజుల క్రితం యూకేలో ఉన్నవాళ్లు అద్దె విధానంలో మాత్రమే చూసే అవకాశం కల్పిస్తూ ఓటీటీలో విడుదల చేశారు. అయితే, ఇప్పుడు సడెన్‌గా భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి కథ విషయానికొస్తే.. సీన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి). ఈమెకు ఓ కొడుకు అర్జున్ (కల్యాణ్ రామ్). ఐపీఎస్ అవ్వడానికి రెడీగా ఉన్న ఇతడు.. తండ్రిని ఓ క్రిమినల్ చంపేశాడని పగతో రగిలిపోతుంటాడు. తల్లికి ఇదంతా ఇష్టముండదు. అనుకోని పరిస్థితిలో అర్జున్ ఆ హంతకుడిని అందరూ చూస్తుండగా చంపుతాడు. అప్పటి నుంచీ తల్లీకొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. చివరకు వారిద్దరూ ఎలా కలుసుకున్నారు..? తల్లి కోసం కొడుకు చేసిన త్యాగం ఏంటి? అనేదే మిగతా స్టోరీ.