
కోలీవుడ్ వెబ్ ప్రపంచంలో హార్ట్‌బీట్ సిరీస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కనిపిస్తుంది. సెంటిమెంట్, పదవి కోసం పోరాటం అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయినా హార్ట్‌బీట్ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది.
ఈ నేపథ్యంలోనే వెబ్ సిరీస్‌లో పలు ఆసక్తికరమైన విషయాలకు పరిష్కారం చూపే విధంగా దీనికి సీజన్–2 రూపొందించారు మేకర్స్. ఈ సిరీస్‌కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. రెజిమల్ సూర్య థామస్ ఛాయాగ్రహణం, చరణ్ రాఘవన్ సంగీతాన్ని అందించారు. ఏ టెలీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ పతాకంపై రాజవేలు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ప్రోమో ఇప్పుడు హాట్ స్టార్ ఓటీటీలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
హార్ట్ బీట్ సీజన్–2ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో నటి దీపా బాలు, అనుమోన్, యోగలక్షి్మ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు అక్షిత, శివం, అబ్దుల్, అమైయ, టీఎం కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Get ready for a double blast of fun and excitement 🥳❤️❤️#HotstarSpecials Heart Beat Season 2 Coming Soon on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar #HeartBeatS2onJioHotstar #HB2onJioHotstar… pic.twitter.com/akIbMEzuJf
— JioHotstar Tamil (@JioHotstartam) May 4, 2025
Adhey Heart'u dhan, ana Beat'u vera.. ❤️❤️ Rina 2.0 coming soon 😉😎😍#HotstarSpecials HeartBeat Season 2 Coming Soon on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HeartBeat2Promo #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar… pic.twitter.com/WzxzFblVwj
— JioHotstar Tamil (@JioHotstartam) May 1, 2025