ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. కొత్త సీజన్ పై ప్రకటన | Panchayat Series S4 OTT Streaming Date | Sakshi
Sakshi News home page

Panchayat S4 OTT: ఓటీటీలో హిట్.. ఇప్పుడు నాలుగో సీజన్

May 3 2025 4:07 PM | Updated on May 3 2025 4:56 PM

Panchayat Series S4 OTT Streaming Date

ఓటీటీలో ఎప్పటికప్పుడు రిలీజయ్యే సినిమాలు చూసే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. కానీ వీటిలోనే ఉంటే వెబ్ సిరీసులు మాత్రం కొందరే చూస్తుంటారు. అయితే లాక్ డౌన్ టైంలో రిలీజై సూపర్ హిట్ అయిన సిరీస్ ల్లో 'పంచాయత్'. ఇదివరకే మూడు సీజన్లు రాగా ఇప్పుడు నాలుగో సీజన్ డేట్ ఫిక్స్ ‍అయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ 

పంచాయత్ సిరీస్ గురించి చెప్పుకుంటే చాలా సింపుల్ స్టోరీ. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు.. ఓ మారుమూల పల్లెలోకి పంచాయతీ సెక్రటరీగా అడుగుపెడతాడు. జాబ్ అయితే చేస్తుంటాడు గానీ అస్సలు ఇష్టముండదు. విదేశాలకు వెళ్లిపోవాలనేదే ఇతడి డ్రీమ్. అలాంటిది ఇతడిని పల్లెలోని ఉంటే కొందరు మనుషులు మార్చేస్తారు. తర్వాత ఏమైందనేదే స్టోరీ.

ఇదివరకు మూడు సీజన్లు స్ట్రీమింగ్ కాగా అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో సీజన్ ని ఈ జూలై 02 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ సీజన్ అంతా కూడా పంచాయతీ ఎన్నికల బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. కామెడీ ప్లస్ ఎమోషనల్ గా ఉండే ఈ సిరీస్ ని తెలుగులోనూ 'సివరపల్లి' పేరుతో రీమేక్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)   

Advertisement
 
Advertisement
Advertisement