
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చాలారోజుల ముందే అనౌన్స్ మెంట్స్ ఇస్తారు. మరికొన్నిసార్లు మాత్రం సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు ఎలాంటి ప్రకటనలు లేకుండానే స్ట్రీమింగ్ చేసేస్తారు. ఇప్పుడు కూడా ఓ చిత్రాన్ని అలానే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు.
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల 2. గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కి ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దేశమంతా సినిమాకు ప్రచారం చేశారు. కానీ విడుదల తర్వాత టాక్ తేడా కొట్టేసింది. రెండు మూడు రోజులకే సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మూడు వారాలకే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు.
(ఇదీ చదవండి: 'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత)
మరికొన్ని గంటల్లో అంటే రేపటి(మే 08) నుంచి ఓదెల 2 చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఓదెల 2 విషయానికొస్తే.. ఓదెల అనే ఊరిలో తిరుపతి(వశిష్ఠ) అనే కామాంధుడు కొత్తగా పెళ్లయిన అమ్మాయిల్ని రేప్ చేసి చంపేస్తుంటాడు. ఓ రోజు అతడి భార్య అతడి నరికి చంపేసి జైలుకి వెళ్తుంది. కానీ తిరుపతి ఆత్మకు శాంతి కలగకుండా ఉండాలని సమాధి చేస్తారు. కానీ తిరుపతి ప్రేతాత్మ తిరిగి సమాధిలో నుంచి బయటకొచ్చి ఊరిపై పడుతుంది. దాన్ని నిలువరించడానికి శివశక్తి (తమన్నా) ఓదెలకు వస్తుంది. తర్వాత ఏమైంనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: 'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?)
