ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సిరీస్ | Evaru Eppudu Ekkada Telugu Web Series Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movie: అషూరెడ్డి నటించిన సిరీస్.. ఇప్పుడు ఓటీటీలో

Apr 23 2025 2:25 PM | Updated on Apr 25 2025 11:06 AM

ఓటీటీల జమానా పెరిగిన తర్వాత సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని భాషల్లోనూ ఎక్కువగా తీస్తున్నారు. అయితే అవి టైమ్ చూసుకుని రిలీజ్ చేస్తున్నారు. అలా అషూరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఓ సిరీస్ ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండా రిలీజ్ చేసేశారు. ఇంతకీ ఇది ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? దీని కథేంటి?

సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న అషూరెడ్డి.. గత కొన్నాళ్లుగా సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేస్తోంది. ఈమె నటించిన లేటెస్ట్ సిరీస్ 'ఎవరు ఎ‍ప్పుడు ఎక్కడ'. పీఎస్ రావు అనే దర్శకుడి దీన్ని తెరకెక్కించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సిరీస్ లో అషూతో పాటు ధన్య బాలకృష్ణ, కౌశల్, ఆటో రాంప్రసాద్ ఇతర పాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్)

'ఎవరు ఎప్పుడు ఎక్కడ' సిరీస్ తెలుగు వెర్షన్ తో పాటు హిందీలోనూ హంగామా ఓటీటీ యాప్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్ విషయానికొస్తే.. ఎమ్మెల్యే దగ్గర పనిచేసే పీఏ ఒకరు చనిపోతారు. దీని గురించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో సాక్షులు కూడా చనిపోతుంటారు. ఇదంతా ఓ అమ్మాయి చేస్తుందని పోలీసులు తేలుస్తారు. ఇంతకీ మర్డర్స్ చేస్తుంది ఆ అమ్మాయేనా? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.

ఇకపోతే ఈ వారం థియేటర్లలో ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాణి జాతకం, చౌర్యపాఠం అనే తెలుగు సినిమాలతో పాటు జింఖానా అనే డబ్బింగ్ చిత్రం రాబోతుంది. ఓటీటీలో ఎల్ 2 ఎంపురాన్, వీరధీరశూర, జ్యూయెల్ థీప్ మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు వీకెండ్ ఓటీటీలో సడన్ సర్ ప్రైజులు ఏమైనా ఉండే అవకాశముంది.

(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement