
హారర్ సినిమాలకు సెపరేట్ ప్రేక్షకులు ఉంటారు. సరిగ్గా తీయాలే గానీ భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ చేసేస్తారు. అలా నాలుగేళ్ల క్రితం ఓటీటీలో రిలీజై అందరినీ భయపెట్టిన ఓ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.
(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ గురువు కన్నుమూత)
హిందీ నటి నుష్రత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఛోరీ'. ఓ మారుమూల గ్రామంలోని పొలంలో జరిగే కథతో తీశారు. ఓ గర్భవతికి ఆమెకు ఆశ్రయం కల్పించి, చంపాలని చూసే ఓ మహిళ చుట్టూ తిరిగే స్టోరీతో తొలి భాగం తీయగా.. సదరు గర్భవతికి పుట్టిన కూతురి పడే కష్టాలతో సీక్వెల్ తీసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
తొలి భాగంలో భయపెడుతూనే థ్రిల్ కి గురిచేసినట్లు.. ఈసారి కూడా థ్రిల్ పంచే సీన్స్ బోలెడు ఉన్నాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)