భారీ ట్విస్ట్‌లతో థ్రిల్లర్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌ | The Akaali Thrilling Movie Telugu Version OTT Release Date Confirmed, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

OTT: భారీ ట్విస్ట్‌లతో థ్రిల్లర్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

Apr 24 2025 8:01 AM | Updated on Apr 24 2025 10:51 AM

The Akaali Thrilling Movie Telugu Version OTT Streaming Details

కోలీవుడ్‌ నటుడు నాజ‌ర్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'ది అకాలీ'(The Akaali).. ఏడాది క్రితం తమిళ్‌లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్‌ ఓటీటీలో రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీలో క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు భారీ  ట్విస్ట్‌లు ఉంటాయి. ముఖ్యంగా నాజ‌ర్ ప‌ర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో నాజర్‌తో పాటు వినోద్‌ కిషన్‌, తలైవాసల్‌ విజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు మహ్మద్‌ అసిఫ్‌ హమీద్‌  హారర్‌ థ్రిల్‌ మూవీగా దీనిని తెరకెక్కించారు.

స‌రైన ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డంతో ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా రీచ్‌ కాలేదు. అయితే, ఇప్పటికే తమిళ వర్షన్‌ ఆహా(AHA) ఓటీటీలో రావడంతో చాలామంది చూసిన తర్వాత మూవీ బాగుందంటూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అదే ఓటీటీలో ఈ నెల 26 నుంచి తెలుగు ఆడియో అందుబాటులో ఉండనుంది. డార్క్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ ఉండటంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

జానిస్ అనే అమ్మాయి తనకున్న అతీంద్రియ శ‌క్తుల స‌హాయంతో వ‌రుస‌గా హ‌త్య‌లు చేస్తుంటుంది. అందులో దాగి  ఉన్న మిస్ట‌రీని ఛేదించేందుకు హ‌మ్జా అనే పోలీస్ ఆఫీస‌ర్ ఎంట్రీ ఇస్తాడు. సంబంధిత కేసును ఛేదించే క్రమంలో పోలీసు అధికారికి విస్తుపోయే విషయాలు తెలుస్తాయి.  ఈ కేసు విషయంలో అతను తెలుసుకున్న షాకింగ్ నిజాలేమిటి..? మరి, జానిస్‌ ఎందుకు మర్డర్స్‌ చేయాల్సి వచ్చింది..? జానిస్ పూజ‌ల‌ను హ‌మ్జా ఎలా అడ్డుకున్నాడు? వంటి అంశాలు ఆసక్తిని పెంచుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement