‘పెట్రో’ ధరల మంట.. భగ్గుమన్న జనం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పెట్రో బాదుడుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆందోళనల్లో పార్టీ శ్రేణులతో అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ సార్వత్రిక ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలతో కలిసి ఆ నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, పార్టీ నేతలు... కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు డిమాండ్ పత్రాలను అందజేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే మన వద్దే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొంటే కేసులు పెడతామంటూ పోలీసుల ద్వారా కూటమి నేతలు బెదిరించినా.. వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా అన్ని వర్గాల ప్రజలు పెట్రో బాదుడుపై కదంతొక్కడంతో వైఎస్సార్సీపీ ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇంత భారీగా స్పందన రావడం చంద్రబాబు సర్కార్‌లో వణుకు పుట్టించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ సీఎం చంద్రబాబు అనేక సార్లు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ పాదయాత్రతోపాటు ఎన్నికల ప్రచారంలోనూ తాము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ వాగ్దానం చేశారు. కానీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేశారు. దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు వల్ల నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చాయి. ఇది జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. కదంతొక్కిన జనం పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరల పెంపుపై ఎన్టీఆర్,కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన నిరసన హోరెత్తించింది. మండే ఎండలోనూ వేలాదిగా ప్రజానీకం కదంతొక్కుతూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు. బైక్‌లను ఎండ్ల బండ్లపై ఉంచి తాళ్లతో లాగుతూ, సైకిల్ తొక్కుతూ, ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉమ్మడి వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల వ్యాప్తంగా ఆందోళన కొనసాగింది. పులివెందులలో బొలెరో వాహనానికి తాళ్లు కట్టి నిరసన తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు అట్టుడికాయి. తణుకులో ఎడ్ల బండ్లు, గుర్రపు స్వారీలతో, ఏలూరులో గ్యాస్ బండలతో నిరసన తెలిపారు. రాజమండ్రి, అమలాపురం, కాకినాడలో ఆటోలను తాళ్లతో లాగుతూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో తోపుడు రిక్షాలపై మోటార్ సైకిళ్లను ఉంచి వినూత్న రీతిలో ప్రదర్శన చేశారు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఎడ్ల బండిపై ప్రయాణిస్తూ, రిక్షా తొక్కుతూ, ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ ర్యాలీ నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గాడిదను మోటర్ బైకులా అలంకరించి వినూత్నంగా ఆందోళన చేపట్టారు.
బలవంతపు భూసేకరణ చేస్తే.. కలెక్టరేట్లో ఉరి వేసుకుంటాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు వెస్ట్: బలవంతంగా తమ భూములు లాక్కుంటే కలెక్టరేట్లోని చెట్టుకు ఉరి వేసుకుంటామని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి రైతులు హెచ్చరించారు. రాజధాని భూసేకరణ నుంచి ఉండవల్లి గ్రామాన్ని తొలగించాలని కోరుతూ పెద్దఎత్తున రైతులు సోమవారం గుంటూరు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ సాయికాంత్ వర్మ వారికి హామీ ఇచ్చారు. అనంతరం రాయపూడిలోని సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజుకూ రైతులు వినతిపత్రం ఇచ్చారు.తాము రాజధానికి వ్యతిరేకం కాదని, మా తాత ముత్తాతల నుంచి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూములను కాపాడుకోవడం కోసం భూ సమీకరణ, భూసేకరణలకు వ్యతిరేకంగా 12 ఏళ్లుగా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. ప్రజా ప్రయోజనార్థం సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి, కొండవీటి వాగు అభివృద్ధి పనులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామన్నారు. అమరావతి రాజధానికి కావాల్సినంత భూమి సీఆర్డీఏ వద్ద ఉందని, అందులో నిర్మాణాలు పూర్తిచేసుకోవాలని రైతులు సూచించారు.మాకున్న కొద్దిపాటి భూమిని కుటుంబ సభ్యులు పంచుకుంటే వచ్చే వాటా చాలా తక్కువగా ఉంటుందని, ఈ భూమిని సీఆర్డీఏకి ఇస్తే వారు తిరిగి ఇచ్చే ప్లాట్ల పరిమాణం ఏమాత్రం సరిపోదని.. అందుకే భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టంచేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమని తేల్చిచెప్పారు. తాము 12 ఏళ్లుగా భూ సమీకరణకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం కక్షగట్టి భూసేకరణకు సిద్ధమైందన్నారు. ఇప్పటికే 280 మందికి నోటీసులు ఇచ్చారని, ఊరు పేరులేని పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చి రైతులకు సమాచారం తెలీకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తంచేశారు.మార్టీపై ఎందుకీ కక్ష?మేం చిన్న సన్నకారు రైతులం. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం ఇప్పటికే భూములిచ్చాం. ఇప్పుడు మళ్లీ భూసేకరణ అంటూ బెదిరిస్తున్నారు. ఉన్న ఎకరాన్ని కూడా ఇవ్వాలంటున్నారు. మాకు వ్యవసాయం తప్పితే మరో పని తెలీదు. ప్రభుత్వం మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తుందనుకోలేదు. ఏం జరిగినా మేం భూములిచ్చే ప్రసక్తే లేదు. – టి. సంజీవరెడ్డి, ఉండవల్లిరైతులకు ప్రభుత్వం ఏమేలు చేసిందో చెప్పండి మా భూమిని అన్నం పెట్టే తల్లిలా భావిస్తున్నాం. దీనిని లాక్కుంటామంటే ఎలా? ఈ రెండేళ్లలో రైతులకు కూటమి ప్రభుత్వం ఏం మేలు చేసిందో చెప్పండి? పైగా ఇప్పుడొచ్చి భూములపై పడుతున్నారు. నాకు కేవలం అర ఎకరా పొలమే ఉంది. దీనిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేదిలేదు. – జి. బుసిరెడ్డి, ఉండవల్లిరిజిస్ట్రేషన్లు చేయడంలేదు.. మా భూములకు రిజిస్ట్రేషన్లు కూడా చేయడంలేదు. ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఒక విధంగా ప్రభుత్వం రైతులను బెదిరిస్తోంది. పిల్లల చదువుల కోసం భూమి పత్రాలు పెట్టి అప్పు తీసుకుందామన్నా అవకాశంలేకుండా చేస్తున్నారు. ప్లాట్ ఇచ్చేదెప్పుడు? అది అమ్ముడుపోయేదెప్పుడు? అప్పటి వరకూ మేం పిల్లల చదువును ఏం చేయాలి. – ప్రభాకర్, ఉండవల్లిఅధికారంలోని వారు ఏం త్యాగం చేస్తున్నారు? అభివృద్ధిని అడ్డుకోవడం రైతుల అభిమతం కాదు. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం ఇప్పటికే అర ఎకరం భూమిచ్చా. మిగిలి ఉన్న కొద్దిపాటి భూమినీ ఇప్పుడు ఇచ్చేయమంటున్నారు. అధికారంలో ఉన్న వారు అమరావతి రాజధాని కోసం ఏమాత్రం త్యాగం చేస్తున్నారో చెప్పాలి. – పి. పోతిరెడ్డి, ఉండవల్లిప్రభుత్వం విధానం మార్చుకోవాలి.. కులమతాలకు, పార్టీలకతీతంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం అర్ధంచేసుకోవాలి. ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజేషన్ ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలి. ఇప్పటికే కొండవీటి వాగు కోసం భూమి ఇచ్చాం. రైతులను బెదిరించే ధోరణికి స్వస్తి పలకాలి. – ఎం. శ్రీనివాసరెడ్డి, ఉండవల్లి
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలను తుంగలో తొక్కడంలో చంద్రబాబు మరోసారి తన మార్కు చూపిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఉద్దేశించిన స్త్రీ శక్తి పథకాన్ని దొంగ దెబ్బ తీస్తున్నారు. ఈ–బస్సుల ముసుగులో ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేసేందుకు ఎత్తుగడ వేశారు. ఓ వైపు ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తూ విలువైన ఆస్తులను తమ అస్మదీయులకు కట్టబెడుతున్న బాబు మరోవైపు స్త్రీశక్తి పథకాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్ర మహిళలను మోసం చేసేందుకు పావులు చకచకా కదుపుతున్నారు. ఈ–బస్సులకు వర్తించని ఉచిత బస్సు చంద్రబాబు ఎన్నికల హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. ఆయన 2024 జూన్ 12న అధికారంలోకి వచ్చినా 15 నెలల వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయనే లేదు. తద్వారా రాష్ట్ర మహిళలు నెలకు రూ.250 కోట్ల చొప్పున 15 నెలల్లో ఏకంగా రూ.3,750 కోట్ల మేర ప్రయోజనాన్ని కోల్పోయారు. 2025 ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని తూతూమంత్రంగా ప్రారంభించారు. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించలేదు.ఆర్టీసీలో 16 కేటగిరీల బస్ సర్వీసులు ఉండగా... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు రకాల సర్వీసుల్లోనే అమలు చేస్తున్నారు. ఈ–బస్సులతోపాటు వెన్నెల, డాల్పిన్ క్రూయిజర్, అమరావతి, నైట్ రైడర్, ఇంద్ర, మెట్రోలగ్జరీ, స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, నాన్‌స్టాప్, ఎస్ఏపీ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో వర్తింపజేయడం లేదు. ప్రస్తుతం ఆర్టీసీ నిర్వహిస్తున్న 100 ఈ–బస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు కాకపోవడం గమనార్హం. వందశాతం ఈ–బస్సులతో ఉచితం హుళక్కే ఈ నేపథ్యంలోనే ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. వందశాతం ఈ–బస్సులను ప్రవేశపెట్టే విధానానికి ఆమోదం తెలిపింది. అది కూడా పూర్తిగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ద్వారానే ప్రవేశపెడతామని తేల్చి చెప్పింది. ప్రైవేటుపరం చేసేందుకు పక్కా కుతంత్రంతో ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోంది. ‘ప్రధానమంత్రి ఈ–బస్ సేవా’ పథకం ద్వారా ప్రవేశపెట్టే ఈ–బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను చంద్రబాబు ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కొత్త డీజిల్ బస్సులను కొనడం లేదు.ఇటీవల ఆరు నెలల్లోనే 264 డీజిల్ బస్సులను సర్వీసుల నుంచి పూర్తిగా తొలగించారు. వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టనే లేదు. సగటున రోజుకు ఒక బస్సును సర్వీసు నుంచి తొలగిస్తోంది. తద్వారా ఆర్టీసీలో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి, ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–బస్సులను ప్రవేశపెట్టాలన్నదే తమ ఉద్దేశమని సర్కారు స్పష్టం చేస్తోంది. మొదటగా ఆర్టీసీలో 50శాతం ఈ–బస్సులు ఉండేట్టు చూడటం ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం 2029 నాటికి 100శాతం ఈ–బస్సులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ–బస్సుల్లో ఇప్పటికే ఉచిత ప్రయాణం అమలు కావడం లేదు కాబట్టి.. కొత్తగా ప్రవేశపెట్టబోయే బస్సుల్లోనూ అదే నిబంధన వర్తించనుందనేది సుస్పష్టం. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులూ ధ్రువీకరిస్తున్నారు.
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.తదియ సా.6.45 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: మృగశిర ప.12.50 వరకు, తదుపరి ఆరుద్ర,వర్జ్యం: రా.8.40 నుండి 10.09 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.48 నుండి 11.33 వరకు, అమృత ఘడియలు: రా.1.55 నుండి 3.24 వరకు.సూర్యోదయం : 5.31సూర్యాస్తమయం : 6.21రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం.. ఊహించని ధనలబ్ధి. ప్రముఖుల నుంచి ముఖ్య సందర్శనం. బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.వృషభం... చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. ఒప్పందాలలో అవాంతరాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.మిథునం.... బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.కర్కాటకం... అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. అనారోగ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.సింహం.... పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకున్న విధంగా కొనసాగుతాయి.కన్య..... చిత్రమైనంఘటనలు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ధనలబ్ధి. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు.తుల.... పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఆటుపోట్లు.వృశ్చికం... ఆర్థికంగా ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. లేనిపోని వివాదాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.ధనుస్సు... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు నూతన పరిచయాలు. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. గృహయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.మకరం... దూరపు బంధువుల కలయిక. వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు.కుంభం... పనుల్లో ఆటంకాలు. మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. బంధువుల నుండి ఒత్తిడులు. ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.మీనం.. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
ఆర్జీ కర్ కేసు: సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి
చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త
Petrol Prices: దేశంలోనే ఏపీలో అత్యధికం
ఒక్క బెర్త్.. ఐదు జట్లు
మండుటెండను జయించే ‘ఆయుష్’ అస్త్రాలివే!
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ
ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఐదో ప్రపంచకప్ ఆడనున్న మోడ్రిచ్
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మాను సంపంగి... మా అబ్బాయి
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
మాట మార్చిన ట్రంప్
‘సెలక్టర్లు చెప్పినా వినలేదు.. లేదంటే నాడే ద్రవిడ్ కెరీర్ ఖతం’
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఆర్జీ కర్ కేసు: సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి
చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త
Petrol Prices: దేశంలోనే ఏపీలో అత్యధికం
ఒక్క బెర్త్.. ఐదు జట్లు
మండుటెండను జయించే ‘ఆయుష్’ అస్త్రాలివే!
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ
ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఐదో ప్రపంచకప్ ఆడనున్న మోడ్రిచ్
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మాను సంపంగి... మా అబ్బాయి
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
మాట మార్చిన ట్రంప్
‘సెలక్టర్లు చెప్పినా వినలేదు.. లేదంటే నాడే ద్రవిడ్ కెరీర్ ఖతం’
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఫొటోలు
మంచు మనోజ్ కొత్త ట్రస్ట్ ప్రారంభం (ఫొటోలు)
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
పెట్రో బాదుడు: వైఎస్సార్సీపీ పోరుబాటకు విశేష స్పందన
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
ఫ్యామిలీ ట్రిప్‌లో హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరో ఆది పినిశెట్టి దంపతులు.. (ఫొటోలు)
అనంతపురం : భారమైన వేళ.. బాధతో విక్రయం! (ఫొటోలు)
హైదరాబాద్ : మురిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
నాలుగు పదుల వయసులో మరింత బొద్దుగా ఛార్మి.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
హల్దీ పిక్స్ షేర్ చేసిన హీరోయిన్ (ఫొటోలు)
సినిమా
సుడిగాలి సుధీర్ కొత్త సినిమా.. హీరోయిన్గా తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ
తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొన్న వాళ్లలో పలువురికి గుర్తింపు అయితే వచ్చింది గానీ ఆ సీజన్ తర్వాత వాళ్లని జనాలు పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ దగ్గర నుంచి లేటెస్ట్ సీజన్ విజేత కల్యాణ పడాల వరకు ఇదే తంతు. అలాంటిది గత సీజన్లో కొన్నిరోజులు మాత్రమే ఉన్న ఓ బ్యూటికీ సుడిగాలి సుధీర్ కొత్త మూవీలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది.(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)'జబర్దస్త్' కమెడియన్‌గా క్రేజ్ తెచ్చుకున్న తర్వాత సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ లాంటి మూవీస్ చేశాడు. వీటిని ఒక్కడు కూడా పట్టించుకోలేదు. కొన్నేళ్ల క్రితం చేసిన 'గాలోడు' మాత్రం ఊహించని హిట్ అయింది. ప్రస్తుతం 'గోట్' అనే మూవీ చేశాడు. ఈ మార్చిలోనే రిలీజ్ చేస్తామని అన్నారు గానీ దాని సంగతి ఏంటో తెలియట్లేదు. అదలా ఉండగానే 'సుధీర్ జోకర్' పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.ఇందులోనే సుధీర్ సరసన ఆయేషా జీనత్ హీరోయిన్గా చేయనుంది. ఈమె తమిళ నటి. గతంలో తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొంది. గతేడాది తెలుగులో ప్రసారమైన బిగ్‌బాస్‌లోనూ పార్టిసిపేట్ చేసింది. కానీ ఆరోగ్య సమస్యలతో మధ్యలోనే వెళ్లిపోయింది. ఇప్పుడు సుధీర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. (ఇదీ చదవండి: భరణం? విడాకుల్లో మూడో వ్యక్తి ప్రమేయం? నటి భర్త క్లారిటీ)
భరణం? విడాకుల్లో మూడో వ్యక్తి ప్రమేయం? నటి భర్త క్లారిటీ
బాలీవుడ్ నటి మౌనీరాయ్ కొన్నిరోజుల క్రితమే విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో కలిసి అధికారికంగానే వెల్లడించింది. అయితే వీళ్లిద్దరూ విడిపోవడానికి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీనే కారణమని తెగ రూమర్స్ వస్తున్నాయి. అలానే భరణం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టిన సూరజ్.. ఇన్‌స్టా స్టోరీలో మొత్తం క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)'మా విడాకుల విషయంలో వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నా. ఎలాంటి భరణం లేదు. మా మధ్య వివాదాలు ఏం లేవు. మూడ వ్యక్తి ప్రమేయం అసలు లేదు. మేం చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. ఇది మాత్రమే నిజం. మిగతావన్నీ అవాస్తవాలు. రూమర్స్ గురించి స్పందించకపోవడం తప్పే అవుతుంది. అందుకే క్లారిటీ ఇస్తున్నా' అని సూరజ్ చెప్పుకొచ్చాడు.ప్రేమించుకుని 2022లో సూరజ్-మౌనీ రాయ్ పెళ్లి చేసుకున్నారు. సూరజ్ దుబాయికి చెందిన బిజినెస్‌మ్యాన్. మలయాళీ, బెంగాలీ సంప్రదాయల్లో వీళ్ల వివాహం జరిగింది. కానీ నాలుగేళ్లకే విడిపోయారు.(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)
స్టైల్ మార్చిన శోభిత.. చీరలో మానస
కొత్త హెయిర్ స్టైల్‌తో అక్కినేని కోడలు శోభితచీరలో కనువిందు చేస్తున్న మానస వారణాసిఒంపు సొంపులతో దివ్యభారతి అందాల విందుఫన్నీ మూమెంట్స్ షేర్ చేసిన శ్రీనిధిశెట్టిపాత హీరోయిన్ లుక్‌లో దుషారా విజయన్ View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi)
రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్
మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. లెక్క ప్రకారం మార్చిలోనే రావాలి కానీ రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెల 4న థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే పనోడు.. క్రికెట్, కుస్తీలో ఎలాంటి ప్రతిభ చూపించాడు. జీవితంలో ఇతడికి ఎదురైన సవాళ్లు ఏంటనేది కాన్సెప్ట్. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆ జోష్ని కొనసాగించేలానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)
క్రీడలు
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
ఐపీఎల్-2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. సోమవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఎస్ఆర్హెచ్.. ఎనిమిదో సారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ విజయంలో ఇషాన్ కిషన్‌ది కీలక పాత్ర.కిషన్ కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ కూడా 47 పరుగులతో రాణించాడు. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ స్పందించాడు. జట్టును గెలిపించిన క్లాసెన్, కిషన్‌పై కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన చాలా సంతృప్తిని ఇచ్చింది. మేము సాధారణంగా ఆడే శైలికి ఇది భిన్నమైన మ్యాచ్. ఇక్కడి వికెట్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇషాన్, క్లాసెన్ బ్యాటింగ్ చేసిన తీరు నిజంగా ఒక అద్భుతం. వారిద్దరూ బౌలర్లను టార్గెట్ చేస్తూ ధైర్యంగా షాట్లు ఆడుతూ మ్యాచ్‌ను గెలిపించారు. ఈ లక్ష్యాన్ని చేధించేందుకు మాకు 1-2 భాగస్వామ్యాలు అవసరమని మేం భావించాం. ఎందుకంటే క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్‌కు పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. క్రీజులో కుదురుకున్నాక బ్యాటింగ్ కాస్త సులభమవుతుంది. క్లాసెన్, కిషన్ ప్రణాళికలు తగ్గట్టు ఆడారు. వారిద్దరూ సరైన బౌలర్లను టార్గెట్ చేసుకుని కొన్ని అద్భుతమైన షాట్లు ఆడారు. గత మ్యాచ్‌లో 86 పరుగులకే ఆలౌటైన తర్వాత మేము మా బ్యాటింగ్ గురుంచి చర్చించాము. నిజం చెప్పాలంటే మా జట్టు బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌కు అంతగా ఫేమస్ కాదు. కానీ పరిస్థితులకు తగ్గట్టు ఆడగలమని ఈ మ్యాచ్‌లో నిరూపించాం. అయితే మా బౌలింగ్ సమయంలోనే పిచ్ కాస్త స్లోగా ఉంది. బంతి కొద్దిగా లోపలికి వస్తూ, గ్రిప్ అవ్వడం గమనించాము. అలాంటి పరిస్థితుల్లో భారీ షాట్లు ఆడడం కుదరదు. కానీ మా బ్యాటర్లు పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని ఆడారు. ఈ పిచ్‌పై 180 పరుగులు మంచి స్కోరే. కానీ చేధించగలమన్న నమ్మకం మాకు ఉండేది. టాస్ గురుంచి కూడా పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే ఇక్కడ సెకెండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కూడా గెలిచాయి. మాకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్-2లో నిలిచేందుకు ప్రయత్నిస్తాం. అయితే ప్లే ఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉంది. కానీ అసలైన కథ ఇప్పుడే మొదలువుతోంది. ఇప్పటికంటే ఎక్కువగా కష్టపడాలి. ఈ విజయాల్లో కిషన్‌ది కూడా కీలక పాత్ర. సగం సీజన్ వరకు అతడే కెప్టెన్‌గా ఉన్నాడు. కాబట్టి అతడికి చాలా ఎక్కువ క్రెడిట్ దక్కాలి. మా టీమ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇదే రిథమ్‌ను కొనసాగిస్తామని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరన్స్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది!
సీఎస్కేపై గెలుపు.. ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్
ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. ఎస్ఆర్హెచ్తో పాటు గుజరాత్ టైటాన్స్ కూడా 16 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ (44), కార్తిక్ శర్మ (32), శివమ్ దూబే (26) రాణించారు. స్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు తీయగా, సాకిబ్ హుసేన్ 2, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ చెరొక వికెట్ తీశారు.దుమ్ములేపిన ఇషాన్అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి బ్యాట్ ఝూలిపించాడు. కేవలం 47 బంతుల్లోనే 70 పరుగులు చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు హెన్రిచ్ క్లాసెన్(26 బంతుల్లో 47) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి రెండు, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, అకిల్ హోస్సేన్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ ఓటమితో సీఎస్కే తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చెన్నై జట్టు 12 పాయింట్లతో ప్రస్తుతం ఆరో స్ధానంలో ఉంది. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే అద్భుతం జరగాలి.చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది!
ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది!
ఎంఎస్ ధోని.. ఈ పేరు సీఎస్కే ఫ్రాంచైజీలో చిరస్థాయిగా మిగిలిపోనుంది. సీఎస్కేకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ధోని ఈ సీజన్లో సొంత ఇలాఖాలో ఒక్క మ్యాచ్ ఆడకుండానే అభిమానులకు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన ధోని (మధ్యలో సీఎస్కేపై నిషేధంతో రెండు సీజన్లు మినహాయింపు) సోమవారం సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడేశాడు. అదేంటి ధోని తుది జట్టులో లేడు కదా అన్న అనుమానం మీకు కలగొచ్చు. అయితే సీఎస్కేకు చెపాక్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ చివరిది. ఆ తర్వాత మే 21న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.ఈ నేపథ్యంలో హోంగ్రౌండ్లో చివరి మ్యాచ్ కావడంతో ధోనికి సీఎస్కే జట్టు ఫేర్వెల్ ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడనప్పటికీ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం జట్టుతో ధోని గ్రూప్ ఫొటో దిగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన జెర్సీ నెంబర్ 7తో స్టేడియంలోకి ధోని ఎంట్రీ ఇవ్వగానే మైదానం హోరెత్తిపోయింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అణచివేసుకున్న ధోని జట్టుతో గ్రూప్ ఫొటో దిగాడు. ఆ తర్వాత ఆటగాళ్లతో కాసేపు సంభాషించాడు. అనంతరం అభిమానుల వైపు ఒక లుక్ ఇచ్చిన ధోని చేతులూపుతూ డ్రెస్సింగ్ రూమ్ వైపు భారంగా అడుగులు వేయడం కనిపించింది. ధోని పెవిలియన్ వెళుతున్న క్రమంలో సీఎస్కే ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ఈ సమయంలో చెపాక్ స్టేడియంలో కాసేపు నిశబ్దం అలుముకుంది. అభిమాన ఆటగాడైన ధోని సీఎస్కే సొంత స్టేడియంలో తన చివరి మ్యాచ్ ఆడకుండానే ఇలా సైలెంట్‌గా వీడ్కోలు పలకడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓవరాల్‌గా ధోని ఐపీఎ ల్లో 278 మ్యాచ్‌లాడి 5,439 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్థసెంచరీలు ఉన్నాయి.Thank You for all memories- Thala MS dhoni 🥲- भाऊक कर देने वाला पल है लेकिन एक ना एक दिन सबको जाना होता है !- बहुत सी अच्छी यादे , क्रिकेट में भारत का नाम आपके नाम से याद रखा जाएगा - Number 7 जो सिर्फ आपके नाम से जाना जाएगा !Updates: - धोनी को देखके ऐसा लग रहा है शायद वो… pic.twitter.com/aLbnQ8jHw4— Mahi (@M17vibes) May 18, 2026FINALLY, END OF A LEGENDARY ERA 🥺🫶❤️MS Dhoni is set to receive a farewell at M. A. Chidambaram Stadium as fans prepare to witness an emotional goodbye to one of cricket’s greatest icons. The atmosphere at Chepauk is expected to be filled with tears, chants, and unforgettable… pic.twitter.com/NS4xEsOq1F— Muffatball vikrant (@Vikrant_1589) May 18, 2026చదవండి: టెన్నిస్ దిగ్గజం పేస్ ఇంట్లో విషాదం
టెన్నిస్ దిగ్గజం పేస్ ఇంట్లో విషాదం
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పేస్ తల్లి, మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి జెన్నిఫర్ పేస్ (72) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. జెన్నిఫర్ 1972 మ్యూనిచ్ ఒలింపి క్స్‌లో భారతదేశానికి బాస్కెట్‌బాల్‌లో ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 1982లో బాస్కెట్ బాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహ రించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు.జెన్నిఫర్ పేస్ ప్రముఖ బెంగాలీ కవి మైఖేల్ మధుసూదన్ దత్‌కు స్వయానా ముని మనుమరాలు. 2025 ఆగస్టులో పేస్ తండ్రి వేస్ పేస్ మృతి చెందిన విషయం తెలిసిందే. వేస్ పేస్ భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1971 హాకీ ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులో వేస్ పేస్ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాతి ఏడాది 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టులోనూ మిడ్‌ఫీల్డర్‌గా సేవలందించాడు. ఇద్దరు దిగ్గజాల కడుపున పుట్టిన లియాండర్ పేస్ టెన్నిస్‌లో ఉన్నత శిఖరానికి చేరుకున్నాడు. 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో భారత టెన్నిస్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేస్ రికార్డులకెక్కాడు. ఇక 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో 10 మిక్స్డ్ టైటిల్స్, 8 డబుల్స్ టైటిల్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ కాంస్యం సాధించి తండ్రి తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఆటగాడిగా పేస్ ఖ్యాతిని గడించాడు.చదవండి: ధోనీ రిటైర్మెంట్పై రుతురాజ్ క్లారిటీ!
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
తమిళనాట ప్రతిష్టంభనలో విజయ్ ప్రమాణ స్వీకారం... మద్దతు ప్రకటించినా అధికారికంగా లేఖ ఇవ్వని వీసీకే
బిజినెస్
వర్క్ ఫ్రమ్ హోమ్ విస్తరణపై జోహో కామెంట్స్
భారతీయ ఐటీ దిగ్గజం జోహో తమ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని విస్తరించబోమని నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్వేర్ రంగంలో పరిశోధన, అభివృద్ధి బృందాల మధ్య ముఖాముఖి చర్చలు, ప్రత్యక్ష సహకారం ఉన్నప్పుడే ఆశించిన ఉత్పాదకత, వేగవంతమైన పరిష్కారాలు లభిస్తాయని అంతర్గత సమీక్షలో తేలడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని జోహో వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు సోమవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా వెల్లడించారు.ప్రత్యక్ష సహకారంతోనే మెరుగైన పరిష్కారాలుకంపెనీ అంతర్గత చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా సొంత డెవలప్మెంట్ టీమ్‌లో నేనే స్వయంగా ఈ వ్యత్యాసాన్ని గమనించాను. సమస్య పరిష్కారంలో భాగస్వాములైన వ్యక్తులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోనప్పుడు వాటి పరిష్కారానికి చాలా ఎక్కువ సమయం పడుతోంది. అదే ముఖాముఖిగా కూర్చున్నప్పుడు ఆలోచనల మార్పిడి మరింత సులువుగా సాగుతుంది. దీనివల్ల అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన సాఫ్ట్వేర్ పరిష్కారాలు లభిస్తున్నాయి. అందుకే ఆర్ అండ్ డీ విభాగంలో ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోమ్‌ను విస్తరించకూడదని నిర్ణయించాం’ అని చెప్పారు.జోహో పునసమీక్షపశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని, అనవసర ప్రయాణాలను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సమయంలో అలవాటైన వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి పద్ధతులను మళ్లీ ప్రోత్సహించాలని ప్రధాని కోరారు.ప్రధాని పిలుపునకు స్పందించిన శ్రీధర్ వెంబు.. మే 11న ఒక పోస్ట్‌లో ‘గత కొన్ని నెలలుగా మా సంస్థలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని పూర్తిగా అమలు చేస్తున్నప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని పిలుపును గౌరవిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ పునసమీక్షిస్తాం’ అని పేర్కొన్నారు. అయితే, సంస్థ ప్రయోజనాలు, సాంకేతిక ఉత్పాదకతను బేరీజు వేసుకున్న తర్వాత ఈ విస్తరణ సాధ్యం కాదని జోహో తేల్చిచెప్పింది.ఇంధన పొదుపునకు ప్రత్యామ్నాయ వ్యూహాలువర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనంత మాత్రాన పర్యావరణ స్పృహను విస్మరించబోమని వెంబు స్పష్టం చేశారు. ఇంధన వినియోగాన్ని, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి జోహో ఇతర మార్గాలను అన్వేషిస్తోందని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచడం, కంపెనీ క్యాంటీన్లలో డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వంట సామగ్రిని ప్రవేశపెట్టడం వంటివి అమలు చేయబోతున్నట్లు చెప్పింది. ఇప్పటికే జోహో సంస్థ సోలార్ (సౌరశక్తి) రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. క్యాంపస్‌ల్లో ఇప్పటికే ప్రాకృతిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
శ్రమకే అగ్రతాంబూలం!
నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో లక్షల రూపాయల ప్యాకేజీలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజినీర్ల జీతాలే అందరికీ హాట్ టాపిక్. కానీ, రోజువారీ శ్రమను నమ్ముకున్న ఒక సాధారణ ఇంటి పనిమనిషి నెలవారీ సంపాదన వివరాలు ఇప్పుడు సాఫ్ట్వేర్ నిపుణులను, విద్యావంతులను ఆలోచనలో పడేసాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన ఇంటి పనిమనిషితో జరిపిన చిన్న సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.బెంగళూరుకు చెందిన ఆదిత్య అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇటీవల తన ఇంటి పనిమనిషి పదేపదే ఆలస్యంగా రావడంపై ఆమెను ప్రశ్నించాడు. సాధారణంగా మొదలైన ఈ ప్రశ్న ఆమె ఇచ్చిన సమాధానంతో ఆదిత్య అవాకయ్యేలా చేసింది. ఆమె కేవలం ఒకరి ఇంట్లోనే కాకుండా ఒక పక్కా ప్రణాళికతో బహుళ ఆదాయ వనరులను సృష్టించుకుందని తెలిసి అతను షాక్‌కు గురయ్యాడు. ఆదిత్య తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న వివరాల ప్రకారం.. ఆమె తన దినచర్యలో భాగంగా..వేర్వేరు అపార్ట్మెంట్ల్లో నివసించే నలుగురు బ్యాచిలర్స్‌కు రోజువారీ భోజనం వండి పెడుతోంది. ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.6,000 చొప్పున తీసుకుంటోంది. దాంతో ఆమెకు రూ.24,000 లభిస్తోంది. దీనికి అదనంగా, మరో రెండు కుటుంబాలకు పూర్తిస్థాయి ఇంటి పనిమనిషిగా ఉంటూ నెలకు రూ.20,000 సంపాదిస్తోంది. మొత్తంగా ఆమె నెలవారీ ఆదాయం అక్షరాలా రూ.44,000. అంటే సంవత్సరానికి ఆమె సంపాదన రూ.5.28 లక్షలు. దేశంలో సగటు కార్పొరేట్ ఎంట్రీ-లెవల్ ఉద్యోగి జీతం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం.ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆదిత్య ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ‘ఇక్కడ వేలాది మంది చదువుకున్న యువత ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. కానీ సరైన నైపుణ్యం ఉంటే ఆదాయానికి కొరత లేదు’ అని పేర్కొన్నాడు. ఈ వ్యవహారం ద్వారా తాను ఒక గొప్ప విషయాన్ని గ్రహించానని ఆదిత్య రాసుకొచ్చాడు. ‘ఈ రోజు ఒక విషయం స్పష్టమైంది. ఏ పనీ చిన్నది కాదు. నైపుణ్యం, స్థిరత్వం, కష్టపడే తత్వం ఎప్పుడూ సరైన ఫలితాన్ని ఇస్తాయి’ అని అతను స్పష్టం చేశాడు.కెరీర్ వృద్ధి వర్సెస్ శారీరక శ్రమఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిపై నెటిజన్లు భిన్నమైన విశ్లేషణలు చేస్తున్నారు. ‘డిగ్రీలు లేకపోయినా ప్రాక్టికల్ నైపుణ్యాలతో స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చని నిరూపితమైంది’ అని కొందరంటున్నారు. ‘దేశంలో పట్టభద్రులైన యువత ఉద్యోగాల కోసం అల్లాడుతున్న వేళ ఇదొక ప్రత్యామ్నాయం’ అని కొందరు చెబుతున్నారు. డిగ్రీలు పూర్తి చేసినా అర్థవంతమైన ఉపాధి దొరకని దేశీయ ఉద్యోగ సంక్షోభాన్ని ఈ ఉదంతం ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.విజయానికి కొలమానం ఏది?ఈ వైరల్ కథనం మారుతున్న భారతదేశ శ్రామిక శక్తి వాస్తవ రూపానికి అద్దం పడుతోంది. విజయాన్ని కేవలం నెలవారీ జీతం అంకెలతోనే కొలవాలా? లేక భవిష్యత్తు వృద్ధి, ఉద్యోగ భద్రత, జీవన నాణ్యత ఆధారంగా అంచనా వేయాలా? అనే పెద్ద ప్రశ్నను ఇది సమాజం ముందుంచింది. ఏదేమైనా, విద్యావంతుల్లో పెరుగుతున్న నిరుద్యోగానికి, నైపుణ్య ఆధారిత పనులకు ఉన్న డిమాండ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
వైట్-కాలర్ ఉద్యోగాలకు ఏఐ ఎసరు
సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు కేవలం శారీరక శ్రమతో కూడిన పనులకే పరిమితమవుతుందని భావించిన ఆటోమేషన్ ఇప్పుడు ఏకంగా మేధోసంపత్తితో కూడిన వైట్-కాలర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. రాబోయే 12 నుంచి 18 నెలల్లోనే కార్పొరేట్ ప్రపంచంలో అకౌంటెంట్లు, న్యాయవాదులు, మార్కెటింగ్ నిపుణుల ఉద్యోగాలు కనుమరుగయ్యే లేదా పూర్తిగా ఆటోమేట్ అయ్యే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ డివిజన్ హెడ్ ముస్తఫా సులేమాన్ హెచ్చరిక చేశారు.మానవ మేధస్సుకు సవాల్గతంలో ఆంత్రోపిక్ అధినేత డారియో అమోడీ వంటి టెక్ దిగ్గజాలు ఊహించిన పరిణామాలనే సులేమాన్ తాజా వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. ప్రస్తుతం మానవులు మాత్రమే చేయగలరని భావిస్తున్న అత్యంత సంక్లిష్టమైన వైట్-కాలర్ విధులను 2027 సంవత్సరానికి ముందే ఏఐ చేజిక్కించుకోనుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ప్రభావితమయ్యే రంగాలు..అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగంలో లెక్కల విశ్లేషణ, ఆడిటింగ్ ప్రక్రియలు పూర్తిగా ఆటోమేట్ అవుతాయి.లీగల్ వర్క్ (న్యాయ విభాగం)లో కేసుల డాక్యుమెంటేషన్, లీగల్ రీసెర్చ్‌లను ఏఐ నిమిషాల్లో పూర్తి చేస్తుంది.మార్కెటింగ్, కంటెంట్‌పరంగా వినియోగదారుల ట్రెండ్స్ గుర్తించడం ఏఐ చేతుల్లోకి వెళ్తుంది.ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో వర్క్‌ఫ్లోల సమన్వయం, ప్రణాళికల అమలు మానవ ప్రమేయం లేకుండానే సాగుతుంది.ఇప్పటికే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తమ రోజువారీ కోడింగ్ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఏఐ అసిస్టెంట్లను విస్తృతంగా వాడుతున్నారని, త్వరలోనే కంప్యూటింగ్ సామర్థ్యం పెరిగి మెజారిటీ మానవ ప్రోగ్రామర్ల కంటే ఏఐ మోడల్స్ అత్యుత్తమ కోడింగ్ చేయగలవని ఆయన విశ్లేషించారు.సహాయకారి నుంచి ప్రత్యామ్నాయంగా!ప్రస్తుత తరుణంలో ఏఐ కేవలం మనుషుల పనిభారాన్ని తగ్గించే ఒక ఉత్పాదకత సాధనంలాగా మాత్రమే కనిపిస్తోంది. కానీ, ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. కేవలం సహాయం చేసే స్థాయి నుంచి మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేసే దిశగా సాంకేతికత పరిణామం చెందుతోందని సులేమాన్ ఆందోళన వ్యక్తం చేశారు.పరిష్కారం ఏంటి?మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ఇచ్చిన ఈ హెచ్చరిక కేవలం ఊహాజనితం కాదు, ఇది పరిశ్రమ వర్గాలకు ఒక మేల్కొలుపు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మన నైపుణ్యాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేసుకోకపోతే వైట్-కాలర్ ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
ఆరంభంలో నష్టాలు.. ముగింపులో లాభాలు!
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (మే 18) ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో కుప్పకూలిన సూచీలు ద్వితీయార్థంలో దేశీయ కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,043 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పతనమైనప్పటికీ ముగింపు సమయానికి నష్టాలన్నింటినీ పూడ్చుకుని స్వల్ప లాభాల్లోకి చేరుకున్నాయి. చివరకు నిఫ్టీ 50 సూచీ 6 పాయింట్లు పుంజుకొని 23,649 వద్ద, సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 75,315 వద్ద స్థిరపడ్డాయి.ఆరంభ పతనానికి కారణాలుఅమెరికా-ఇరాన్ మధ్య సరికొత్తగా రేగిన ఉద్రిక్తతలు, గల్ఫ్ రీజియన్‌లో డ్రోన్ దాడుల వార్తలు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించాయి. ఇది గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా బ్యారెల్‌కు 111 డాలర్ల మార్కును దాటింది. భారతదేశం తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున క్రూడాయిల్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాలను, కరెంట్ అకౌంట్ లోటు ఆందోళనలను పెంచింది.అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 4.60% దాటడంతో భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 96.2 మార్కుకు బలహీనపడింది. ఇది విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.గత శుక్రవారం అమెరికా మార్కెట్లు 1 శాతానికి పైగా నష్టపోగా నేడు ఆసియా మార్కెట్లయిన జపాన్ నిక్కీ, హ్యాంగ్ సెంగ్ సైతం నష్టాల్లో ట్రేడ్ అవ్వడం దేశీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.ముగింపులో రికవరీకి కారణాలురూపాయి బలహీనపడటం ఐటీ, ఎగుమతి ఆధారిత రంగానికి లాభసాటిగా మారడంతో ఇన్వెస్టర్లు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ షేర్ల వైపు మొగ్గు చూపారు.టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ షేరు నేడు సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను దాటేసి రూ.11.80 లక్షల కోట్లతో దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ క్యాప్ గల కంపెనీగా నిలిచింది. ఈ స్టాక్ ర్యాలీలో కీలక పాత్ర పోషించింది.దేశీయంగా మార్చి త్రైమాసికం (2026 క్యూ4) ఆర్థిక ఫలితాల సీజన్ నడుస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో 10% వృద్ధి నమోదు చేయడం, టాటా స్టీల్ నికర లాభం రెండింతలు పెరగడం వంటి అంశాలు మార్కెట్‌కు స్థిరత్వాన్ని ఇచ్చాయి.నిఫ్టీ 23,300 స్థాయికి పడిపోయిన తరుణంలో విలువ ఆధారిత కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దిగువ స్థాయిల వద్ద దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేయడంతోపాటు ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్లో షార్ట్ కవరింగ్ జరగడం వల్ల సూచీలు రికవరీ అయ్యాయి.ప్రస్తుతానికి దేశీయ ఆర్థిక మూలాధారాలు బలంగా ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల గమనం రాబోయే రోజుల్లో మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి. ఇన్వెస్టర్లు గ్లోబల్ పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
ఫ్యామిలీ
ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!
పర్యాటకం కమ్ ఉపాధిని కల్పించేలా అద్బుతమైన కేఫ్ ఇది. అయితే ఇక్కడ మొత్తం ఆడవాళ్లే ఉంటారు. నిర్వహించేది..వంట చేయడం నుంచి క్లీనింగ్ వరకు మొత్తం ఆడవాళ్ల సామ్రాజ్యమే దర్శనమిస్తుంది. అలాంటి విచిత్రమైన కేఫ్ తూర్పు సిక్కింలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాబా హర్భజన్ సింగ్ పుణ్యక్షేత్రానికి సమీపంలో, 13,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది పూర్తిగా స్థానిక మహిళలతో కూడిన బృందంతో నడిచే కేఫ్. మారుమూల ఎత్తైన ప్రాంతంలో ఉండే ఈ కేఫ్ స్థితిస్థాపకత, వ్యవస్థాపకత, స్వావలంబనను ప్రతిబింబిస్తుంది. అంతేగాదు సందర్శకులకు ఓ గొప్ప అనుభవాన్ని అందిస్తోంది. ఈ కేఫ్ భారత ఆర్మీ చొరవతో ఏర్పాటైంది. స్థానికి భాగస్వాముల సమన్వయంతో త్రిశక్తి కార్ప్స్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించి, సులభతరం చేసింది. యుద్ధ భూమిని వీక్షించే కార్యక్రమంలో భాగంగా, ఈ ప్రాంత వారసత్వాన్ని, వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రదర్శిస్తూ సరిహద్దు ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కేఫ్ రూపుదిద్దుకుంది. ఇది ఒకరకరంగా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ..మారుమూల ప్రాంతా ఆర్థిక సాధికారతనకు దోహదపడుతోంది. అంతేగాదు జీవనోపాధిని ఇలా పర్యాటకంతో అనుసంధానించటంతో ఈ కార్యక్రమం సుస్థిర అభివృద్ధికి, పుణ్యక్షేత్రానికి పర్యాటకుల రాక పెరగడానికి తోడ్పడుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ ప్రయత్నం నిజంగా సమర్థవంతమైన సైనిక-పౌర సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతేగాదు ఇది సరిహద్దు ప్రాంతాలలో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి పట్ల భారత సైన్యం నిబద్ధతను బలోపేతం చేయడంతో పాటు, భారత పౌరులతో బలమైన సంబంధాలను పెంపొందిస్తుంది.(చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)
సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..
అందరు చేసే వంటకమే కానీ దాన్ని సర్వ్ చేసే విధానం లేదా వండే విధానంలో ప్రత్యేకత ఉంటేనే కథ ఏ ఫుడ్ స్టాల్ అయినా క్లిక్ అయ్యేది. ప్రజాదరణ పెరిగేది. బహుశా దాన్నే క్యాచ్ చేశాడు ఈ టీనేజ్ యువకుడు. అలా ఇలా ఆలోచించలేదు ఈ యువకుడు. వంట చేసే విధానంలో సరికొత్తగా ఫ్యాషన్ జోడించడంతో అతడ ఫుడ్ స్టాల్ మూడు పువ్వులు ఆరు కాయల్లా దినదినాభివృద్ధితో దూసుకుపోతోంది. ఇంతకీ స్టైలిష్‌గా వంట చేయడం ఎలాగంటే..చైనాకు చెందిన ఒక యువకుడు ఒక సాధారణ ఫ్రైడ్ రైస్ దుకాణాన్ని తన క్రియేటివిటీతో కొత్త లుక్‌ని అందించడమే కాదు లాభాల బాట పట్టేలా చేశాడు. అందరిలా వండటం కంటే.. ప్రత్యేకంగా విభిన్నంగా వంట చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా అతడి వద్దకు వచ్చేవాళ్లు తినడాని కంటే..అతడు చేసే విధానం అతడి ఆహార్యం చూసి నివ్వెరపోతూ ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తిగా వస్తూ..ఇక అక్కడే తింటుండటం విశేషం. 19 ఏళ్ల లూ షాన్డాంగ్ ఈనే యువకుడు కుటుంబ దుకాణాన్ని చాలా విభన్నంగా నడిపిస్తున్నాడు. ఎవరైన వంట చేయాడానికి వచ్చే వాళ్లు కుక్ డ్రెస్ లాంటది వేసుకుంటారు. కానీ ఇక్కడ లూ ఫ్యాషన్‌గా ఉంటాడు. ఆయన ఆఫీస్‌కి వెళ్లే వ్యక్తిలా సూటు బూటు వేసుకుని కనిపించడం విశేషం. చైనాలోని ఓ సాదారణ ఫ్రైడ్ రైస్ స్టాల్ రెస్టారెంట్‌కు మించి క్రేజ్ సంపాదించుకుంది. అందుకు ప్రధాన కారణం అతడు వండే విధానమే. లీ చాలా స్టైలిష్‌గా వండుతున్న విధానం అందర్నీ ఆకర్షించి ఆ స్టాల్‌కి జనాలు క్యూకట్టేలా ప్రజాదరణ పొందింది. అంతేకాదండోయ్ ఎంతో రుచిగా క్షణాల్లో వేడివేడిగా వడ్డిస్తాడు. అతడు ఎంత బిజీలో అయినా ఫ్రైడ్ రైస్‌ని జస్ట్ మూడు నిమిషాల్లో తయారు చేస్తాడు. ఇక ఫైడ్‌రైస్ ఒక ప్లేటు రూ. 1401లు అట. అతడి ఖర్చులు పోగా నెలకు సుమారుగా రూ. 7లక్షలుపైనే ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. క్రియేటివిటీకి నైపుణ్యం తోడైతే అద్భుతాలు జరగుతాయి అంటే ఇదేగదా..!. లూ నవ్వు మామలు గ్రేట్ కాదు..సూపరో సూపర్..!. కాగా, ఈ స్టాల్ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈమేరకు లూ మాట్లాడుతూ..ఏదో సరదాగా కస్టమర్ల ముఖంలో నువ్వులు విరబూయించేందుకు ఇలా సూటు వేసుకుని వంట చేశాను. కానీ వాళ్ల నుంచి ఈ స్ధాయిలో స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదని సంతోషంగా చెబుతున్నాడు లూ. View this post on Instagram A post shared by Mothership (@mothershipsg) (చదవండి: కోడిగుడ్డంత పుచ్చకాయలు)
వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా?
గత కొన్ని రోజులుగా భారత్‌లో ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయో తెలిసిందే. ఎండలు భగభగలాడిస్తున్నాయి. ఉదయం పది దాటితేనే సూర్ర్యు సుర్రు మంటున్నాడు. కనీసం బయటకు వెళ్లాలంటేనే వణుకుపుట్టుకొస్తుంది. అంతలా ఎండలు గజగజలాడిస్తున్నాయి. ప్రతి చోట నలభై డిగ్రీలు దాటేస్తున్నాయి. మెట్రో ప్రాంతాల్లో ఇక ఆ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అంతేగాదు ఎండల ధాటికి వడదెబ్బల బారినపడుతున్న వారు ఎక్కువే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు కొందరు వడదెబ్బ బారిన పడగానే..పారాసెటమాల్ వేసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకూడదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వడదెబ్బ రెండు విధాలుగా ఉంటుందని, అందుకోసం ఎలాంటి ఆరోగ్య సంరక్షక చర్యలు తీసుకోవాలో సవివరంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా!.దేశంలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45°C దాటుతుండగా, తీర ప్రాంతాలు తీవ్రమైన తేమ, భరించలేని వేడితో సతమతమవుతున్నాయి. పైగా ఆస్పత్రులలో వడదెబ్బ, వడతాపం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే..క్షణాల్లో ప్రాణాంతకంగా మారుతుందని అంటున్నారు డాక్టర్ విశాల్. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో వడదెబ్బకు, వడఘాతానికి మధ్య ఉన్న తేడాను కూడా వివరించారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో పారాసెటమాల్ వేసుకోవడం ఎంత ప్రమాదకరం, ఎలాంటి అత్యవసర చర్యలు తీసుకుంటే మంచిది, వంటి వాటి గురించి సవివరంగా వెల్లడించారు. ప్రస్తుతం భారతదేశంలో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు దగ్గరగా ఉందని, తీరప్రాంతలైతే అంతకమించి ఉంటున్నాయి. సాధరణంగా వడదెబ్బ తగిలినప్పుడు..రోగి అలసిపోయినట్లు కనిపిస్తాడు, కానీ అతనికి చెమట పడుతూనే ఉంటుంది. ఈ సందర్భంలో, చాలా సమయం ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది అని డాక్టర్ విశాల్ చెబుతున్నారు. అదే వడఘాతం అనేది ప్రాణాంతకమైన వైద్య పరిస్థితి అని పేర్కొన్నారు. శరీరం అంతర్గత ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా విఫలమైనప్పుడు ఇది సంభవిస్తుందట. రోగి పూర్తిగా స్పృహ కోల్పోతాడు, ఆ వ్యక్తి శీతలీకరణ వ్యవస్థ పనిచేయడం ఆగిపోతుంది. పైగా చెమట కూడ పట్టదు కాబట్టి చర్మం పొడిగా, వేడిగా ఉంటుందట. దానివల్ల, మెదడు అక్షరాలా మైక్రోవేవ్‌లో పెట్టినట్లుగా ఉడికిపోతుంది. దాని కారణంగా, రోగి స్పృహ కోల్పోవచ్చు, అతనికి మూర్ఛలు రావచ్చు, కోమాలోకి వెళ్ళవచ్చు, లేదా చనిపోవచ్చు కూడా అని అన్నారు.పారాసెటమాల్ వేసుకోవచ్చా..వడదెబ్బలో పారాసెటమాల్ పనిచేయదని అంటున్నారు వైద్యులు. అనారోగ్యం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పారాసెటమాల్ మెదడు థర్మోస్టాట్‌ను రీసెట్ చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కానీ వడదెబ్బ తగిలినప్పుడు, బయటి నుండి వచ్చే అధిక వేడి శరీర వ్యవస్థను అధిగమించినప్పుడు, శరీరాన్ని చల్లబరిచే యంత్రాంగం విఫలమవుతుంది. పైగా రోగిని చల్లటి నీటితో చల్లబర్చాలి, చంకల ప్రాంతంలో చల్లటి నీటినిపోయాలి. దాంతో వారిలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే రోగికి తగినంత నీఉ, ఓఆర్ఎస్ ఇవ్వడం వంటివి చేయాలి. ఇలాంటి వాళ్లు సాధ్యమైనంతవరకు చల్లటి నీటిని తాగుతూ..ఇంటిలోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్ విశాల్.గమనిక: ఇది కేవలం అవగాహాన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యులు లేదా నిపుణులకు సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Vishal Gabale (@health.with.vg) (చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?)
పుదీనాతో చెమటకు చెక్!
పుదీనాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని డ్యామేజ్ కాకుండా రక్షించడమే కాకుండా, హైడ్రేట్ చేసి తాజాగా ఉండేలా చేస్తాయి. పుదీనాలోని విటమిన్ ‘ఏ’ చర్మంలోని జిడ్డును తగ్గించి, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పుదీనా ఆకుల పేస్ట్, గుడ్డు తెల్లసొన మిశ్రమంతో మాస్క్ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది. పుదీనాలోని శాలిసిలిక్ యాసిడ్ మొటిమలను తగ్గిస్తుంది. పుదీనా రసం, పచ్చి బొప్పాయి రసాన్ని కలిపి మచ్చలు, కీటకాలు కుట్టిన చోట లేదా చర్మ ఇన్ఫెక్షన్లపై రాస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. వేసవిలో చన్నీటిలో పుదీనా ఆకులను వేసి ముఖం కడుక్కోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో పుదీనా ఆకులు లేదా పుదీనా నూనె వేసుకుంటే అలసట తగ్గి, అధిక చెమట సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖంపై మొటిమల వల్ల ఏర్పడే మచ్చల నివారణకు కూడా పుదీనా తోడ్పడుతుంది. సమాన పరిమాణంలో ఎండిన తులసి, వేప, పుదీనా ఆకులను పొడి చేసి పెట్టుకోవాలి. ఒక చెంచా ఈ పొడికి కొంచెం పసుపు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి మచ్చలపై రాస్తే అవి క్రమంగా తగ్గుతాయి. చర్మ సంరక్షణ కోసం కానోపిఎంత ఖరీదైన ఫేస్ వాష్‌లు వాడినా, ముఖం కడుక్కోవడానికి ఉపయోగించే నీరు బాగుండకపోతే ఆ ప్రయత్నాలన్నీ వృథానే. కొళాయి నీటిలో ఉండే క్లోరిన్, ఇతర మలినాలు, హార్డ్ వాటర్ చర్మాన్ని పొడిగా మార్చడమే కాకుండా, మొటిమలు, అలర్జీలకు దారితీస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ వెల్నెస్ బ్రాండ్ కానోపీ తన సరికొత్త ఫాసెట్ ఫిల్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫిల్టర్ సాధారణ వాటర్ ఫిల్టర్ల లాగా కాకుండా, ప్రత్యేకంగా చర్మ సంరక్షణ కోసం రూపొందించినది. ఇది నీటిలోని క్లోరిన్, ఇతర మలినాలను తొలగించి, నీటిని సున్నితంగా మారుస్తుంది. దీనివల్ల చర్మంపై కలిగే మంట, అలర్జీలు తగ్గుతాయి. మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మం సహజసిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.ఈ ఫిల్టర్ కేవలం పనితీరులోనే కాకుండా, చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బాత్రూమ్ ఇంటీరియర్‌కు తగినట్లుగా ఇది లావెండర్, ఇత్తడి, మ్యాట్ బ్లాక్, బ్రష్డ్ నికెల్ వంటి అద్భుతమైన రంగులలో లభిస్తుంది. కానోపీ సంస్థ కేవలం ఫిల్టర్లకే పరిమితం కాకుండా, షవర్ హెడ్లు హ్యూమిడిఫైయర్లను కూడా సరికొత్త రీతిలో డిజైన్ చేస్తోంది. గృహోపకరణాలను బ్యూటీ టూల్స్‌గా మార్చడం ద్వారా మన ఇంట్లోనే చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?)
అంతర్జాతీయం
క్రూజ్ షిప్లో ప్రాణాంతక వైరస్.. కెనడాలో తొలి కేసు!
ఒట్టావా: అట్లాంటిక్ మహాసముద్రంలో ‘ఎంవీ హోండియస్’ క్రూజ్ షిప్లో ప్రయాణించిన వారిలో ప్రాణాంతక ‘ఆండీస్ హంటా వైరస్’ వెలుగుచూడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా ఈ నౌకలో ప్రయాణించిన ఓ కెనడా దేశస్థునికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా నిర్ధారించడంతో విమానయాన, పర్యాటక వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.కెనడాలో తొలి కేసు నమోదుఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవీ హోండియస్ క్రూజ్ షిప్లో మొత్తం నలుగురు కెనడా పౌరులు ప్రయాణించారు. వీరిలో ఒకరి నమూనాలను పరీక్షించగా, మే 16న హంటా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. విన్నిపెగ్‌లోని నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో చేసిన పరీక్షల్లో, అతడితో పాటు ప్రయాణించిన మరో కెనడియన్‌కు మాత్రం నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.మనిషి నుంచి మనిషికి వ్యాప్తిసాధారణంగా ఎలుకలు, వాటి వ్యర్థాల ద్వారా మాత్రమే ఈ హంటా వైరస్ వ్యాపిస్తుంది. కానీ, ప్రస్తుతం ఈ క్రూజ్ షిప్లో వెలుగుచూసిన ‘ఆండీస్’ రకం మాత్రం మనిషి నుంచి మనిషికి నేరుగా సోకే అత్యంత ప్రమాదకరమైన వైరస్ కావడం ఆందోళన కలిగిస్తోంది. నౌకలో ప్రయాణికుల మధ్య వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించిన ఆరోగ్య సంస్థలు తక్షణమే అప్రమత్తమై, ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ చేపట్టాయి.కోవిడ్‌లా కాదు.. ప్రజలకు ముప్పు లేదుక్రూజ్ షిప్లో కేసులు నమోదైనప్పటికీ, కెనడాలోని సామాన్య ప్రజలకు ఈ వైరస్ వల్ల ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని, కాంటాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని కోవిడ్-19 మహమ్మారితో పోల్చవద్దని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావొద్దని వైద్యాధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట!
ఇరాన్ సంచలన నిర్ణయం
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కీలకమైన వాణిజ్య మార్గం హర్ముజ్ మూసివేతతో పలు దేశాలు సంక్షోభాలతో అల్లలాడిపోతున్నాయి. ఇరాన్‌కు మరో ఆప్షన్ లేదని.. చర్చలకు దిగి రావాల్సిందేనని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్ మరో కీలక బలహీనతపై దృష్టి సారించింది.. హర్ముజ్ జలసంధి కిందుగా సాగుతున్న అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ మార్గాలు.. ఈ యుద్ధంలో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. టెహ్రాన్ వర్గాలు తాజాగా ప్రకటించిన ప్రణాళికనే ఇందుకు కారణం. దీని ప్రకారం.. హర్ముజ్ కింద నుంచి వెళ్తున్న అండర్ మైన్ సీ కేబుల్స్కుగానూ ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ బలంగా భావిస్తోందట!. ‘‘జలసంధి గూండా పలు నెట్వర్క్ కేబుల్స్ వెళ్తున్నాయి. అయితే.. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఈ మార్గాల వినియోగానికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సహకరించకపోతే డేటా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడవచ్చు’’ అని ఇరాన్ హెచ్చరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు.. కేబుళ్ల మరమ్మత్తులు, నిర్వహణ హక్కులు కూడా ఇరాన్ కంపెనీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మీడియా ఒకటి కథనం ప్రచురించింది. దీంతో ఇరాన్ మూమాలు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడం లేదన్న చర్చ జోరందుకుంది.అదే గనుక జరిగితే..ప్రపంచ ఇంటర్నెట్, డేటా ట్రాఫిక్‌లో 95% పైగా ఈ సముద్రపు మార్గాల ద్వారానే జరుగుతుంది. హర్ముజ్ జలసంధి గుండా అనేక అంతర్జాతీయ కనెక్టివిటీ మార్గాలు వెళ్తాయి. భద్రతా కారణాల వల్ల ఎక్కువ భాగం ఒమన్ వైపు ఉన్నప్పటికీ.. ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జి ఇంటర్నేషనల్ అనే రెండు ప్రధాన మార్గాలు మాత్రం ఇరాన్ జలప్రాంతాల గుండా సాగుతున్నాయి. వీటికి నష్టం కలిగితే బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు, సైనిక కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధస్సు, అంతర్జాతీయ లావాదేవీలు అన్నీ ప్రభావితమవుతాయి. ఇరాన్ అండర్ సీ మైన్ కేబుల్స్‌పై దృష్టి పెడితే.. ఇరాన్ పొరుగు దేశాలు, భారత్, తూర్పు ఆఫ్రికా, యూరప్–ఆసియా మధ్య ఆర్థిక లావాదేవీలు అన్నీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్‌ల నుంచి యూరప్ వరకు కనెక్టివిటీ దెబ్బతింటే, ఫైనాన్షియల్ ట్రేడింగ్, బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్లు, క్రాస్-బోర్డర్ పేమెంట్లు అన్నీ ఆలస్యమవుతాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్నా, పెద్ద స్థాయి అంతరాయం అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగినా మరమ్మత్తులు కూడా సవాలే. ఎందుకంటే రిపేర్ షిప్‌లు ఒకేచోట నిలిచి పని చేయాలి. ఆ సమయంలో ఇరాన్ అడ్డుకుంటే అది అసాధ్యం కాదు..నిజానికి.. యుద్ధ ప్రారంభ సమయంలోనే అండర్ సీ కేబుల్స్ అంశం తెర మీదకు వచ్చింది. వీటిని కత్తిరించడం ద్వారా ఇరాన్ ‘డిజిటల్ వార్’ జరపొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు జలసంధిలో నౌకల నుంచి మాత్రమే కాదు.. ఈ కేబుల్స్‌పైనా ఫీజులు వసూలు చేసే యోచన చేస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ చట్టంఇరాన్ మీడియా ప్రకారం, 1982లోని ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) ప్రకారం తీరరాష్ట్రాలకు తమ జలప్రాంతాల్లో కనెక్టివిటీ మార్గాలపై షరతులు విధించే హక్కు ఉంది. ఇరాన్ ఆ ఒప్పందంపై సంతకం చేసినా.. ఇంకా ఆమోదించలేదు. సుయాజ్ కాలువలో ఈజిప్ట్ వసూలు చేసే ఫీజులను ఉదాహరణగా చూపుతున్నా.. హోర్ముజ్ సహజ జలసంధి కావడం వల్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయితే.. చమురు తర్వాత ఇప్పుడు డేటా కూడా ఇరాన్ చేతిలో బందీ అవుతుందా? అనే ఆందోళన అంతర్జాతీయంగా పెరుగుతోంది. హర్ముజ్ జలసంధి కింద ఉన్న ఈ మార్గాలు కత్తిరించబడినా? లేదంటే పన్నులు విధించబడినా.. ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీకి ఇది మరో పెద్ద దెబ్బ కానుంది.
ఎనిమిదేళ్ల తర్వాత ఎయిర్‌షో.. ఢీ కొట్టి ముక్కలైన విమానాలు
అమెరికాలో ఘోరం సంభవించింది. ఎయిర్‌షోలో రెండు యుద్ధ విమానాలు ఒకదాన్నొకటి ఢీ కొట్టి పేలిపోయాయి. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఐడాహో స్టేట్ మౌంటెన్ హోమ్ ఎయిర్‌ఫోర్స్ వద్ద ఈ ఘటన జరింది. అయితే అదృష్టవశాత్తూ పైలట్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో రెండు అమెరికా EA-18G గ్రౌలర్ యుద్ధ విమానాలు మధ్య ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఢీకొన్న వెంటనే విమానాలు పేలిపోయి ముక్కలైపోయాయి. ప్రమాద స్థలంలో దట్టమైన నల్ల పొగలు ఎగసిపడగా, అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. బేస్‌ను తక్షణమే లాక్డౌన్ చేశారు. ఆదివారం మిగిలిన అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు.విమానాల్లో ఉన్న నాలుగు మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఢీకొన్న క్షణాల్లోనే వారు పారా షూట్ల సహాయంతో కిందికి దిగారు. ఈ విషయాన్ని షో నిర్వాహకులు, అమెరికా నేవీ ధృవీకరించారు.Footage of the mid air collision between a pair of Navy Super Hornets/Growlers during the Gunfighter Skies Air Show at Mountain Home Air Force Base moments ago. pic.twitter.com/yQqPavmSWk— OSINTtechnical (@Osinttechnical) May 17, 2026మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రతినిధి ప్రకారం, ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. "అత్యవసర సిబ్బంది అక్కడే ఉన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ ఎయిర్ షోకు వేలాది మంది హాజరయ్యారు. అయితే ఈ ప్రమాదం గత ఘటనలను గుర్తు చేసింది. 2018లో ఒక హ్యాంగ్ గ్లైడర్ పైలట్ రన్‌వేపై కూలి మరణించాడు. 2003లో థండర్బర్డ్స్ జెట్ కూలిపోయింది. కానీ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. తాజా ప్రమాదం మళ్లీ ఎయిర్ షో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.
అమ్మను దూరం చేసి.. పసివాడిని బలి తీసుకున్న ట్రంప్ యంత్రాంగం
ఫ్లోరిడా: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కఠినమైన వలసవిధానాలు పరోక్షంగా ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాయి. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు హోండురాస్ మూలాలున్న ఓ తల్లి, ఆమె రెండేళ్ల కుమారుడిని వేరు చేశారు. గతిలేక ఆ తల్లి తన కుమారుడిని బంధువుల ఇంట్లో వదిలేసి వెళ్లగా ఇప్పుడా అబ్బాయి విగతజీవిగా కన్పించాడు. ఈ ఉదంతంలో తల్లిదే తప్పు అంటూ అధికారుల వింతవాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోండురాస్ దేశానికి చెందిన వెండీ హెర్నాండెజ్ రెయెస్ తన రెండేళ్ల కుమారుడు ఆర్లిన్ జోసీతో కలిసి ఫ్లోరిడాలోని ఎస్కాంబియా కౌంటీలో నివసిస్తోంది. జనవరిలో లూసియానాలో ఓ రోజు నిర్మాణ పనులకు వెళ్లగా అక్కడి సిబ్బంది ఆమెను, మరికొందరిని అక్రమ వలసదారులంటూ ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. అధికారులు వెండీని నిర్బంధ కేంద్రంలో బంధించారు. రెండేళ్ల ఆర్లిన్ నిర్బంధ కేంద్రంలో ఉండటం కుదరదని అధికారులు తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఆమె తన కుమారుడిని ఫ్లోరిడాలోని ఎస్కాంబియా కౌంటీలో ఉండే బంధువుæ మల్డోనాడోకి అప్పగించింది. అధికారులు నెల రోజుల్లోనే ఆమెను హొండురస్కు బలవంతంగా పంపేశారు. బంధువుల ఇంట్లో ఉన్న తన కుమారుడు తీసుకురావాలని అధికారులను ఎంతగా వేడుకున్నా వాళ్లు కనికరం చూపలేదు. ఆర్లిన్ సంరక్షణా బాధ్యతలు తీసుకున్న మల్డోనాడో సైతం అక్రమ వలసదారుడే. గతంలో నేరాలకు పాల్పడ్డాడు. అతడి చిత్రహింసల తాళలేక ఆర్లిన్ మార్చి నెలలో ప్రాణాలు కోల్పోయాడు. శరీరమంతటా గాయాలతో నిండిపోయింది. పిల్లాడి మృతి వార్త తెలిసి స్థానిక పోలీసుఅధికారులు మల్డోనాడోను అరెస్ట్ చేశారు. అయితే చిన్నారి మరణానికి ఆమె తల్లే పరోక్షంగా కారణమని, తాము చెప్పినా వినకుండా ఆర్లిన్ను వదిలేసి వెళ్లిందని ఇమిగ్రేషన్ అధికారులు వాదిస్తున్నారు. ఈ వాదనలను తల్లి తీవ్రంగా ఖండించారు. తన వెంట కుమారుడిని తీసుకెళ్తానని ఎంత మొత్తుకున్నా అధికారులు వినిపించుకోలేదని, ఇప్పుడు తిరిగి నింద తనపై మోపుతున్నారని ఆమె ఏడుస్తూ చెప్పారు. ప్రాణంగా చూసుకుంటున్న కన్న కొడుకును రాక్షసుడి చేతుల్లో పెట్టి వదిలేసి వెళ్లిపోయేంతటి కర్కశురాలిని కాదంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
జాతీయం
చేతులే కాదు.. మెదడూ వాడలేదు.. యముడు పిలుస్తున్నాడా?
లక్నో: స్కూటర్‌పై పద్మాసనం వేశాడు ఓ వ్యక్తి. హ్యాండిల్ వదిలేశాడు. రోడ్డుపై రైడింగ్ కాదు.. రిలాక్సింగ్ ఎక్సర్సైజ్ చేశాడు. స్కూటర్‌పై సన్యాసి పోజ్‌లో అతడు జనాలకు టెన్షన్ డోస్ పెంచేశాడు. అతడికి హెల్మెట్ లేదు.. భయం లేదు.. కామన్ సెన్స్ లేదు..లక్నోలోని గోమతి నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి స్కూటర్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కనిపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఫన్ మాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బిజీ రోడ్డుపై స్కూటర్ నడుస్తుండగానే ఆ వ్యక్తి బండిపై కాళ్లు మడిచి కూర్చున్నాడు. అలాగే హ్యాండిల్‌పై నుంచి రెండు చేతులూ తీసేసి, చుట్టూ వాహనాలు వెళ్తుండగానే ప్రయాణం కొనసాగించాడు. ఎలక్ట్రిక్ స్కూటర్లో క్రూయిజ్ కంట్రోల్ ఆన్ చేసినట్టు కనిపించింది. దీంతో స్కూటర్ ఒకే వేగంతో ముందుకు సాగింది. స్కూటర్‌కు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కనిపించలేదని సమాచారం.ట్రాఫిక్ మధ్య అతడు ఈ విన్యాసం చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రాణాలకే కాకుండా రోడ్డుపై ప్రయాణించే వారి భద్రతకూ ప్రమాదం తెచ్చాడని మండిపడ్డారు. చాలామంది నెటిజన్లు లక్నో పోలీస్, యూపీ ట్రాఫిక్ పోలీస్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలను ట్యాగ్ చేస్తూ, ఆ వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నా, నిర్లక్ష్య డ్రైవింగ్, విన్యాసాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నా ఇలాంటి ప్రమాదకర తీరుకు ఎందుకు ఫుల్స్టాప్ పడడం లేదని చాలామంది ప్రశ్నించారు.“నంబర్ లేని స్కూటర్, భద్రతా పరికరాలు లేవు, అసలు బాధ్యత అన్నదే లేదు. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం తన ప్రాణాలనే కాదు, అమాయక ప్రయాణికుల ప్రాణాలనూ ప్రమాదంలోకి నెడుతున్నాడు. లక్నో పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కఠిన గుణపాఠం చెప్పాలి” అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.మరో వ్యక్తి స్పందిస్తూ.. “ఇది చక్రాలపై యోగా లాంటిదే.. కానీ, రోడ్డు జాగ్రత్త మాత్రం లేదు. ఒక్క గుంతనో, ఒక్కసారిగా బ్రేక్ వేయడమో, లేదా ఇతర వాహనం ఎదురైతే అంతే సంగతి. అతడికే కాదు, ఇతరులకూ ప్రమాదం. ఇలాంటి విన్యాసాలు చూసి ఇంకొందరు నేర్చుకోకుండా ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.क्या ऐसे स्टंट पर सख्त कार्रवाई जरूरी है?लखनऊ के गोमतीनगर इलाके में ट्रैफिक नियमों की खुलेआम धज्जियां उड़ाने का मामला सामने आया है. फन मॉल के सामने सड़क पर दौड़ रही एक बाइक पर बैठा युवक बेहद लापरवाही भरे अंदाज़ में नजर आया. युवक बाइक पर सामान्य तरीके से बैठने के बजाय पलथी मारकर… pic.twitter.com/khv81zXoox— zingabad (@zingabad) May 18, 2026
పెట్రో, డీజిల్ ధరలు పెంచినా నష్టం తగ్గట్లేదు.. రోజు వందల కోట్లు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచినప్పటికీ ఇంధన కంపెనీలు రోజూ వందల కోట్ల నష్టాలను ఎదుర్కొంటున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ పేర్కొన్నారు. ధరల పెంపుకు ముందు ఆ నష్టం రోజుకు సూమారు రూ. 1,600 కోట్ల వరకు ఉండేదని తెలిపారు.హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమరు విషయమై తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో క్రూడాయిల్ బ్యారెళ్ ధర పెరగడంతో కేంద్రప్రభుత్వం సైతం పెట్రో, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా దీనిపై పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మీడియా సమావేశం నిర్వహించారు.సుజాత శర్మ మాట్లాడుతూ.. ఇటీవల పెంచిన ఇంధన ధరలు చమురు కంపెనీల నష్టాలను కొంతవరకు తగ్గించగలిగాయి కానీ పూర్తి స్థాయిలో కాదు. లీటరుకు దాదాపు రూ.3 పెంచిన తర్వాత ఇప్పుడు రోజుకు రూ. 750 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. కంపెనీల అండర్- రికవరీలు (ఆదాయ లోటు) ,ఆర్థిక నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి... అయినప్పటికీ ఈ దశలో చమురు కంపెనీలకు ఎటువంటి బెయిలవుట్ ప్యాకేజీని (ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని) అందించే విషయం పరిశీలించడం లేదు అని ఆమె అన్నారు.అమెరికా- ఇరాన్ యుద్ధం ప్రారంభం కాక ముందు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) నివేదిక ప్రకారం భారత్ కొనుగోలు చేసే ముడిచమురు ధర బ్యారెల్‌కు 69.01 డాలర్లుగా ఉండగా... మే 15 నాటికి ఈ ధర బ్యారెల్‌కు 110.73 డాలర్లకు చేరుకుందన్నారు. అంటే యుద్ధ కాలంలో ఏకంగా 60.45 శాతం పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రస్తుతం చమురు ధరలు విపరీతంగా పెరిగి ఆయిల్ కంపెనీలు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని తెలిపారు.
"నాకంటే చెడ్డవాడు ఎవరూ లేరు"
కోల్‌కతా : బెంగాల్ సీఎం సువేందు అధికారి అల్లరిమూకలపై రెచ్చిపోయారు.ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసు సిబ్బందిపై దాడుల పట్ల జీరో టాలరెన్స్ ప్రకటించారు. ఒకవేళ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే "నాకంటే చెడ్డవాడు ఎవడూ ఉండరు" అంటూ అల్లరిమూకలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం కోల్‌కతాలోని పార్క్ సర్కస్-తిల్జాలా ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై జరిగిన బుల్డోజర్ డ్రైవ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ హింసాకాండలో ఆరుగురు పోలీసు సిబ్బంది, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఇప్పటివరకు 40 మందిని అరెస్టు చేశామని విచారణ సాగుతుందని పోలీసులు తెలిపారు.కాగా ఈ ఘటనపై సీఎం సువేందు అధికారి స్పందించారు. "ఇలాంటి అ శాంతి, గూండాయిజం, దేశ వ్యతిరేక మరియు సామాజిక వ్యతిరేక కార్యకలాపాల పట్ల జీరో టాలరెన్స్ ఉంటుందని నేను స్పష్టమైన సందేశం ఇస్తున్నాను. ఇలాంటి వాటిని మేము కొనసాగనివ్వం. నేను గాయపడిన పోలీసు సిబ్బందిని, సీఆర్పీఎఫ్ జవాన్లను చూడటానికి, వారి గాయాల తీవ్రతను అర్థం చేసుకోవడానికి వచ్చాను. నిన్న మన దళం మొత్తం శాంతిభద్రతలను కాపాడింది, పెద్ద ప్రమాదాన్ని నివారించి ప్రజలను రక్షించింది. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను." అని అన్నారు.సువేందు మాస్ వార్నింగ్మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని రౌడీయిజం చేస్తే అస్సలు సహించేది లేదని తనకంటే చెడ్డవారు ఎవరూ లేరని హెచ్చరించారు. గతంలో మాదిరిగా పోలీసుల కాళ్లు, చేతులు కట్టవేసి పని చేయించే రోజులు లేవన్నారు. గతంలో పోలీసు బలగాలు పరిమితుల మధ్య పనిచేశాయని పాత నిబంధనలే ఇంకా కొనసాగుతాయని అనుకోవద్దు. " అని అన్నారు.కశ్మీర్‌తో పోలికబెంగాల్ హింసపూర్వక ఘటనలను సువేందు కశ్మీర్ నిరసనలతో పోల్చారు. శ్రీనగర్, కాశ్మీర్లో పోలీసులపై రాళ్లు రువ్వడం ఆగిపోయింది. పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలో కూడా ఇది ఆగుతుందని నేను నమ్ముతున్నాను. అని సువేందు స్పష్టం చేశారు.
‘అమ్మ క్యాంటీన్ల’పై సీఎం విజయ్ ఫోకస్
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ‘అమ్మ క్యాంటీన్లు’పై తన దృష్టి సారించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను(ఉనవగామ్లు) ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం విజయ్ అమ్మ క్యాంటీన్లను పునరుద్దరించడంతో పాటు ఆధునీకరించాలని అధికారులకు ఆదేశించారు. అమ్మ క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించి, మెరుగుపరచాలని, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని విజయ్ అధికారులకు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అమ్మ క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యత, రుచి సంతృప్తికరంగా లేవన్న అభిప్రాయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన తర్వాత, ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.2011-16 ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలచే ఆప్యాయంగా "అమ్మ" అని పిలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలిత పుట్టినరోజున, 2013 ఫిబ్రవరి 24న ఈ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మొదట ఇవి చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత, వీటిని వివిధ పట్టణాలు, నగరాలకు విస్తరించారు. రాష్ట్రంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో 237 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి.
ఎన్ఆర్ఐ
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్‌కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్‌ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు
న్యూయార్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న 2026న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నైతికతపై దార్శనికత మరియు బహుపాక్షికవాదానికి దాని ప్రాసంగికత’ అనే థీమ్‌తో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి,అంబాసిడర్ హరీష్ పార్వతనేని స్వాగతోపన్యాసం చేశారు. భారత పౌరులలో రాజ్యాంగ నైతికత స్ఫూర్తిని నింపడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి చాలా ముఖ్యమైందన్నారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు మధ్య ఉన్న ఉమ్మడి అంశాలను వివరించారు. రాజకీయ విభజన, నిరంతర సంఘర్షణలతో కూడిన ఈ క్లిష్ట సమయాల్లో రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాలన్న డాక్టర్ అంబేద్కర్ పిలుపు ఎంతో సందర్భోచితమైనదని, ఇది బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడానికి, ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతమైన సంస్కరణలు తీసుకురావడానికి, దాని ప్రధాన విభాగాలకు పునరుజ్జీవం పోయడానికి, ఐక్యరాజ్యసమితిని దాని ఉద్దేశ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుందని రాయబారి హరీష్ చెప్పారు.ప్రముఖ సివిల్ సర్వెంట్, ప్రముఖ అంబేద్కర్ పండితుడు అయిన డాక్టర్ రాజా శేఖర్ వుండ్రు కీలకోపన్యాసం చేశారు. రెండు ప్రపంచ యుద్ధాలను, ఐక్యరాజ్యసమితి ఏర్పాటును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, డాక్టర్ అంబేద్కర్ బహుపాక్షికవాదం ప్రాముఖ్యతను గుర్తించారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం యొక్క కేంద్ర సూత్రాలను రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్లో పొందుపరిచిన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అనే ప్రాథమిక స్ఫూర్తి భారత రాజ్యాంగంలో కూడా ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ అంబేద్కర్ నొక్కిచెప్పారని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో, బహుపాక్షికవాదం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ రాజ్యాంగ నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని రాజా శేఖర్ వుండ్రు అన్నారు.డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక నైతిక నిదర్శనమని, అందులో ఆయన కేవలం బాధ నుండి తప్పించుకోవడమే కాకుండా, దానిని రూపాంతరం చెందించి, ఆ గాయాన్ని జ్ఞానంగా మార్చారని హార్వర్డ్ డివినిటీ స్కూల్ విజిటింగ్ ప్రొఫెసర్, అతిథి వక్త డాక్టర్ సంతోష్ రౌత్, అభిప్రాయపడ్డారు. నేటి ప్రపంచంలో, ముఖ్యంగా బహుపాక్షికత (multilateralism) విషయంలో, డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆదర్శాల గాఢమైన ఔచిత్యాన్ని డాక్టర్ రౌత్ విశదీకరించారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్ వంటి లిఖితపూర్వక గ్రంథాల స్ఫూర్తిని ఆచరణలో పెట్టడానికి దోహదపడే శక్తిగా ఆయన నైతికతను అభివర్ణించారు.వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యారు.
క్రైమ్
ప్రేమోన్మాది మణితేజ మృతి
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వైష్ణవిని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన ప్రేమోన్మాది మణితేజ (29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం వైష్ణవి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులు ముగించుకుని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా నిందితుడు కత్తితో దారుణంగా మెడ, గొంతుపై విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. రక్తం మరకలతో పారిపోతున్న మణితేజను స్థానికులు పట్టుకుని కాళ్లు చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతని తలపై రాళ్లు ఎత్తివేయడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మణితేజను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. హైదరాబాద్‌లో పరిచయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మణితేజ ల్యాండ్రీ షాప్ నిర్వహించేవాడు. గతంలో వైష్ణవి ఓ హాస్టల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విద్యార్థుల దుస్తులు ఉతికి, ఇస్త్రీచేసి అప్పగించే సందర్భంగా ఆమెతో పరిచయం ఏర్పడింది. తర్వాత వైష్ణవి అక్కడ ఉద్యోగం మానేసినా ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే తాను ప్రేమిస్తున్నట్లు వైష్ణవిని వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల వైష్ణవికి వెళ్లి కుదిరిందన్న సమాచారం తెలియడంతో మణితేజ తన ప్రేమను కాదన్న వైష్ణవిని హతమార్చాలని నిర్ణయించుకుని.. జడ్చర్లకు వచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.కాగా, మణితేజ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి, తమ్ముడు ఉన్నారు. హత్య అనంతరం వైష్ణవి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మణితేజ మృతి చెందాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చారు. ఈ క్రమంలో వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు వారిపై దాడిచేస్తారన్న అనుమానంతో పోలీసులు వారిని జడ్చర్ల సమీపంలోని డీటీసీలో ఉంచి రక్షణ కల్పించారు. అప్పటి దాకా మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. జడ్చర్లలో వైష్ణవి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనరల్ ఆస్పత్రిలో మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
ఆస్తి కోసం తల్లీకూతుళ్ల దారుణ హత్య
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్‌గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.
భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య
కిర్లంపూడి: నవ వధువు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు..కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన సత్యంశెట్టి వెంకటేశులు దంపతుల మూడవ కుమార్తె వెంకటలక్ష్మి (25)కి ఏప్రిల్ 25న పిఠాపురం మండలం మర్లావకు చెందిన గాది దుర్గాకోటేశ్వరరావుతో వివాహమైంది. దుర్గాకోటేశ్వరరావు పెళ్లి జరిగిన మూడో రోజే తనకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ వీడియోలు, ఫొటోలు ఆమెకు చూపించాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి అప్పటినుంచి అన్యమనస్కంగా ఉంటోంది. ఆచారాల్లో భాగంగా మూడు సార్లు అత్తారింటికి వెళ్లి వచ్చిన ఆమె గోనేడలోని తన తల్లిదండ్రుల ఇంటివద్దే ఉంటోంది. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాల విషయాన్ని తట్టుకోలేక శనివారం రాత్రి తన గదిలోని ఫ్యానుకు చీరకట్టి ఉరి వేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు.కాగా, వెంకటలక్ష్మి తల్లిదండ్రులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు పిల్లలకు వివాహాలు కాగా, చిన్న కుమార్తె వెంకటలక్ష్మిని డిగ్రీ వరకు చదివించి గత నెలలోనే పెళ్లి చేశాడు. తమ బాధ్యతలు తీరాయని సంతోషపడేలోపే ఈ దారుణం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి సత్యంశెట్టి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త దుర్గాకోటేశ్వరరావు, అత్త నూకామణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రేమించకుంటే చంపేస్తారా?
సాక్షి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్లో తనను ప్రేమించడం లేదని ప్రేమోన్మాది తేజ.. చేతితో గాయపడి వైష్ణవి (23) మృతి చెందింది. ఈ ఘటనలో స్థానికులు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన తేజను ఆసుపత్రికి తరలించారు. ఆ యవకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ కీలక వ్యాఖ్యలు చేసింది. తన అక్క(వైష్ణవి) గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డింది.వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ స్పందించింది. ఈ సందర్బంగా అక్షయ..‘మా సోదరి మృతిపై రకరకాల కథనాలు రావడం బాధాకరం. ఏ అమ్మాయి అయినా డబ్బులు తీసుకొని మోసం చేస్తారా?. చనిపోయే సందర్భంలో నిందితుడు చేసిన ఆరోపణను ఎలా నిర్ధారిస్తారు?. అమ్మాయిలను సమాజంలో పురుగుల్లా చూస్తున్నారు. మా అక్క గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆమె గురించి మీకేం తెలుసు?. మాకు న్యాయం చేయకపోయినా సరే కానీ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. న్యాయం కోసం ముఖ్యమంత్రి వద్దకైనా వెళ్తాం.మా అక్కపై దాడి జరిగే సమయంలో అందరూ చూస్తూనే ఉన్నారు తప్ప ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్‌ను అలవరచుకోవాలి. ఎవరో చనిపోయారని తెలిస్తే అక్కడికి వెళ్ళాక మా అక్క అని గుర్తించాం. సామాజిక బాధ్యతగా వివరించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ప్రేమించకుంటే చంపేస్తారా?’ అని ప్రశ్నించింది.ఇదిలా ఉండగా.. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో యువకుడు తేజ.. యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచ్చిన 108 అంబులెన్స్‌లో యువతిని వైద్య చికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
వీడియోలు
పెద్ది సినిమా ట్రైలర్ వచ్చేసింది..
బుర్ర ఉండి మాట్లాడుతున్నావా..!
పెట్రో బాదుడుపై పోరుబాట
RCBతో ఓటమి కన్నీళ్లు పెట్టుకున్న పాంటింగ్
పెద్ది ట్రైలర్ ఈవెంట్ లో రామ్ చరణ్ అనుభవం
ఈ తల్లి ధైర్యానికి చేతులెత్తి మొక్కాల్సిందే
అప్పుడు మా అమ్మ, చిరు సార్.. ఇప్పుడు నేను & చరణ్
అమరావతిలో తేడా జరుగుతుంది అని పవన్ కి తెలుసు
లోకేష్ ని రఫ్ఫాడించిన పేర్ని కిట్టు
బయటపడ్డ బుద్ధా వెంకన్న.. అల్లుడి అరాచకాలు కన్నీళ్లు పెట్టుకున్న బాధితుడు


