'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది. కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తోంది. అదే టైంలో కంటెంట్ పరంగా మాత్రం స్టోరీపై రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ 'పెద్ది' స్టోరీ ఏమై ఉండొచ్చు? ఊహించని ట్విస్ట్ ఏంటి?
(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)
ఇప్పటివరకు వచ్చిన 'పెద్ది' ప్రమోషనల్ కంటెంట్‌లో హీరో పాత్ర క్రికెట్, కుస్తీ ఆడతాడు అన్నట్లు మాత్రమే చూపించారు. కానీ ట్రైలర్‌లో రన్నర్ అని కూడా రివీల్ చేశారు. అయితే క్రికెట్, రెజ్లింగ్‌కి సంబంధించిన సీన్స్ చూపించారు గానీ రన్నింగ్‌కి సంబంధించిన ఒక్క షాట్ కూడా పెట్టలేదు. చివరలో రన్నింగ్ ట్రాక్‌పైకి పెద్ది వెళ్తున్న సీన్ చూపించారు. 'పెద్ది బ్యాక్ ఆన్ హిజ్ ఫీట్' అనే డైలాగ్ వినిపించారు. దీంతోనే డిస్కషన్స్ మొదలయ్యాయి.
బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఎక్స్‌పర్ట్. కానీ అనుకోని సంఘటనల వల్ల 'పెద్ది'.. ఒంటి కాలి వ్యక్తి అవుతాడు. అయినా సరే తనకున్న ప్రతిభతో పారా ఒలింపిక్స్ వరకు వెళ్తాడు. ఇదే ట్విస్ట్ అనిపిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి ఇందులో రామ్ చరణ్ పాత్రకు కాలు ఉండదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే దర్శకుడు బుచ్చిబాబు కూడా మూవీ చివరి 50 నిమిషాల ఎమోషనల్‌గా ఉంటుందని, చూస్తున్న ప్రతి ఒక్కరూ డిస్ట్రబ్ అవుతారని ఇంటర్వ్యూలో చెప్పాడు.
డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన మాటలు.. ట్రైలర్ చివరలో పెద్ది పాత్ర కుంటుతూ నడుస్తున్నట్లు అనిపించడం లాంటివి చూస్తుంటే.. ఈ దర్శకుడి గత చిత్రం 'ఉప్పెన'లానే ఇందులో 'కటింగ్' గ్యారంటీనా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటి? అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.
(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!)


