శివకార్తికేయన్, కమల్ హాసన్
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న రూరల్–కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమా ‘సెయాన్’. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా పతాకాలపై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఎమోషన్స్, మాస్ అప్పీల్, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎంటర్‌టైనర్‌గా ‘సెయాన్’ చిత్రం రూపొందుతోంది.’’ అని యూనిట్ పేర్కొంది.
వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సహ–నిర్మాత: ఎస్. డిస్నీ. ఎకానమీ క్లాస్‌లో కమల్ హాసన్ ప్రయాణం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కల్కి 2’. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు కమల్æహాసన్.
ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు చెన్నై నుంచి హైదరాబాద్‌కి ఫ్లైట్‌లో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారాయన. ‘‘సినిమా పరిశ్రమ క్లిష్ట పరిస్థితులకు ఎదుర్కొంటున్న తరుణం ఇది. ప్రైవేటు చార్టెడ్ ఫ్లైట్స్, విలాసవంతమైన ప్రయాణాలను కాదని, ఫ్లైట్‌లో సాధారణ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి షూటింగ్‌కు వెళ్లాలని కమల్‌హాసన్‌గారు నిర్ణయించుకోవడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. సినిమా రంగంలో జరగబోయే మార్పులకు ఇది తొలి అడుగు’’ అంటూ వైజయంతీ మూవీస్ సంస్థ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. ‘కల్కి 2’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలిసింది. మరోవైపు సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇటీవల కమల్‌హాసన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.


