భారత్‌లో చాట్‌జీపీటీ ఇమేజ్‌ల సునామీ | India Emerges as Global Hotspot for ChatGPT AI Images says Sam Altman | Sakshi
Sakshi News home page

భారత్‌లో చాట్‌జీపీటీ ఇమేజ్‌ల సునామీ

May 19 2026 4:04 AM | Updated on May 19 2026 4:04 AM

India Emerges as Global Hotspot for ChatGPT AI Images says Sam Altman

నెల రోజుల్లోనే 100 కోట్ల చిత్రాల సృష్టి 

న్యూఢిల్లీ: భారతదేశంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రముఖ ఏఐ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’ ప్రవేశపెట్టిన ‘చాట్‌జీపీటీ ఇమేజెస్‌ 2.0’ భారత్‌లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. విడుదలైన నెల రోజుల్లోనే భారతీయులు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఏకంగా 100 కోట్లకు (1 బిలియన్‌) పైగా చిత్రాలను సృష్టించి సరికొత్త రికార్డు సృష్టించారు. 

 ‘‘చాట్‌జీపీటీ ఇమేజెస్‌ 2.0 భారత్‌లో ఇప్పటికే 100 కోట్ల మార్కును దాటేసింది. ఇది నిజంగా అద్భుతం’’ అంటూ సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌ ద్వారా ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 21న భారత్‌లో విడుదలైన ఈ వెర్షన్, మే 18 నాటికే ఈ ఘనతను సాధించింది. 

ఓపెన్‌ఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘సినిమాటిక్‌ పోర్ర్‌టెట్‌ కొలాజ్‌’, ‘మినీ మీ వరల్డ్‌’, ‘అండర్‌వాటర్‌ పోర్ర్‌టెట్‌’, ‘అనిమే’, ‘చిబి స్టికర్‌ ప్యాక్‌’, ‘మంగా కామిక్‌ స్ట్రిప్‌’, ‘ఫ్యాషన్‌ స్టూడియో పోర్ర్‌టెట్‌’ వంటి ప్రాంప్ట్ లతో భారతీయులు భారీగా చిత్రాలను రూపొందిస్తున్నారు. భారత్‌లో ఏఐ ఇమేజ్‌ జనరేషన్‌ కేవలం ఉత్పాదకతకే పరిమితం కాకుండా.. క్రియేటర్‌ కల్చర్, ఫ్యాషన్, ఫ్యాన్‌డమ్స్, డిజిటల్‌ ఐడెంటిటీతో మమేకమవుతోందని ఓపెన్‌ఏఐ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement