బస్తర్: భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత(నక్సల్స్ లేని) దేశమని గర్వంగా చెబుతున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ స్పష్టం చేశారు. నక్సలిజాన్ని నిర్మూలించడానికి నిర్దేశించిన మార్చి 31 గడువు తర్వాత చత్తీస్‌గడ్‌లోని బస్తర్‌లో అమిత్ షా తొలిసారి పర్యటించారు. దీనిలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత దేశంగా నేను గర్వంగా ప్రకటిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాన్ని దేశంలోని మిగతా ప్రాంతాలతో సమాన స్థాయికి తీసుకురావడానికి, రాబోయే కాలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
బస్తర్ జిల్లాలోని జద్గల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్న వివిధ భద్రతా దళాల సిబ్బందిని, అలాగే మావోయిస్టు దాడిలో మరణించిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులను, పౌరులను ఉద్దేశించి షా ప్రసంగించారు. @ ఇది బస్తర్‌కు చాలా పెద్ద రోజు. ఈ రోజు ఇక్కడ నిలబడి, భారతదేశం నక్సలిజం నుండి విముక్తి పొందిందని నేను గర్వంగా తల ఎత్తుకొని చెప్పగలను’ అని తెలిపారు.
‘ఈ విజయంలో మొత్తం క్రెడిట్ అంతా మన భద్రతా దళాలకు చెందుతుంది. నేను మీ ముందర తల వంచుతున్నాను. ఇది ఒక కల. ఆ కలను నిజం చేయడానికి వేలాది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారు’ అని ఉద్వేగ భరితంగా మాట్లాడారు.


