సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగార్థుల వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ వయోపరిమితి పెంపు ఏడాదిపాటు అమల్లో ఉండనుంది. అయితే యూనిఫామ్ సర్వీసులకు మినహాయింపు ఉంటుందని తెలుస్తోంది.


