ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది! | MS Dhoni Receive Farewell Chennai Stadium Fans Witness Emotional Goodbye | Sakshi
Sakshi News home page

ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది!

May 18 2026 10:22 PM | Updated on May 18 2026 10:37 PM

MS Dhoni Receive Farewell Chennai Stadium Fans Witness Emotional Goodbye

Photo Courtesy: IPL 2026

ఎంఎస్ ధోని.. ఈ పేరు సీఎస్‌కే ఫ్రాంచైజీలో చిరస్థాయిగా మిగిలిపోనుంది. సీఎస్‌కేకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ధోని ఈ సీజ‌న్‌లో సొంత ఇలాఖాలో ఒక్క మ్యాచ్ ఆడ‌కుండానే అభిమానుల‌కు వీడ్కోలు ప‌లికాడు. 

ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహించిన ధోని (మధ్యలో సీఎస్‌కేపై నిషేధంతో రెండు సీజన్లు మినహాయింపు) సోమవారం సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడేశాడు. అదేంటి ధోని తుది జట్టులో లేడు కదా అన్న అనుమానం మీకు కలగొచ్చు. అయితే సీఎస్‌కేకు చెపాక్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ చివరిది. ఆ తర్వాత మే 21న అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడనుంది.

ఈ నేపథ్యంలో హోంగ్రౌండ్‌లో చివరి మ్యాచ్‌ కావడంతో ధోనికి సీఎస్‌కే జట్టు ఫేర్‌వెల్‌ ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడనప్పటికీ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం జట్టుతో ధోని గ్రూప్ ఫొటో దిగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన జెర్సీ నెంబర్ 7తో స్టేడియంలోకి ధోని ఎంట్రీ ఇవ్వగానే మైదానం హోరెత్తిపోయింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అణచివేసుకున్న ధోని జట్టుతో గ్రూప్ ఫొటో దిగాడు. 

ఆ తర్వాత ఆటగాళ్లతో కాసేపు సంభాషించాడు. అనంతరం అభిమానుల వైపు ఒక లుక్ ఇచ్చిన ధోని చేతులూపుతూ డ్రెస్సింగ్ రూమ్ వైపు భారంగా అడుగులు వేయడం కనిపించింది. ధోని పెవిలియన్ వెళుతున్న క్రమంలో సీఎస్‌కే ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ఈ సమయంలో చెపాక్ స్టేడియంలో కాసేపు నిశబ్దం అలుముకుంది.  

అభిమాన ఆటగాడైన ధోని సీఎస్‌కే సొంత స్టేడియంలో తన చివరి మ్యాచ్ ఆడకుండానే ఇలా సైలెంట్‌గా వీడ్కోలు పలకడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓవ‌రాల్‌గా ధోని ఐపీఎ ల్‌లో 278 మ్యాచ్‌లాడి 5,439 ప‌రుగులు చేశాడు. ఇందులో 24 అర్థ‌సెంచ‌రీలు ఉన్నాయి.

చదవండి: టెన్నిస్ దిగ్గ‌జం పేస్ ఇంట్లో విషాదం

Advertisement
 
Advertisement
Advertisement