ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. ఎస్ఆర్హెచ్తో పాటు గుజరాత్ టైటాన్స్ కూడా 16 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ (44), కార్తిక్ శర్మ (32), శివమ్ దూబే (26) రాణించారు. స్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు తీయగా, సాకిబ్ హుసేన్ 2, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ చెరొక వికెట్ తీశారు.
దుమ్ములేపిన ఇషాన్
అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి బ్యాట్ ఝూలిపించాడు. కేవలం 47 బంతుల్లోనే 70 పరుగులు చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అతడితో పాటు హెన్రిచ్ క్లాసెన్(26 బంతుల్లో 47) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి రెండు, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, అకిల్ హోస్సేన్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ ఓటమితో సీఎస్కే తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చెన్నై జట్టు 12 పాయింట్లతో ప్రస్తుతం ఆరో స్ధానంలో ఉంది. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే అద్భుతం జరగాలి.
చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది!


