కబీర్‌సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్ ప్రధాన తారాగణంగా నటించిన సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. రవికుమార్ సీరపు దర్శకత్వంలో హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.
కాగా ఈ సినిమాలో పవర్ఫుల్ సావిత్రి పాత్రలో రాశి నటించినట్లు వెల్లడించి, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. ఓ బ్యాగ్ చుట్టూ ఈ సినిమా కథనం తిరుగుతుంది. కథను మలుపు తిప్పే సావిత్రి పాత్రలో రాశి నటించారు’’ అని యూనిట్ పేర్కొంది.


