సుడిగాలి సుధీర్ కొత్త సినిమా.. హీరోయిన్‌గా తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ | Sudigali Sudheer New Movie Joker Details | Sakshi
Sakshi News home page

Sudigali Sudheer: ఆ మూవీ రిలీజ్ ఎప్పుడు? ఇంతలోనే మరొకటి

May 18 2026 7:54 PM | Updated on May 18 2026 8:15 PM

Sudigali Sudheer New Movie Joker Details

తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొన్న వాళ్లలో పలువురికి గుర్తింపు అయితే వచ్చింది గానీ ఆ సీజన్ తర్వాత వాళ్లని జనాలు పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ దగ్గర నుంచి లేటెస్ట్ సీజన్ విజేత కల్యాణ పడాల వరకు ఇదే తంతు. అలాంటిది గత సీజన్‌లో కొన్నిరోజులు మాత్రమే ఉన్న ఓ బ్యూటికీ సుడిగాలి సుధీర్ కొత్త మూవీలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది.

(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)

'జబర్దస్త్' కమెడియన్‌గా క్రేజ్ తెచ్చుకున్న తర్వాత సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీ మంకీస్ లాంటి మూవీస్ చేశాడు. వీటిని ఒక్కడు కూడా పట్టించుకోలేదు. కొన్నేళ్ల క్రితం చేసిన 'గాలోడు' మాత్రం ఊహించని హిట్ అయింది. ప్రస్తుతం 'గోట్' అనే మూవీ చేశాడు. ఈ మార్చిలోనే రిలీజ్ చేస్తామని అన్నారు గానీ దాని సంగతి ఏంటో తెలియట్లేదు. అదలా ఉండగానే 'సుధీర్ జోకర్' పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.

ఇందులోనే సుధీర్ సరసన ఆయేషా జీనత్ హీరోయిన్‌గా చేయనుంది. ఈమె తమిళ నటి. గతంలో తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొంది. గతేడాది తెలుగులో ప్రసారమైన బిగ్‌బాస్‌లోనూ పార్టిసిపేట్ చేసింది. కానీ ఆరోగ్య సమస్యలతో మధ్యలోనే వెళ్లిపోయింది. ఇప్పుడు సుధీర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. 

(ఇదీ చదవండి: భరణం? విడాకుల్లో మూడో వ్యక్తి ప్రమేయం? నటి భర్త క్లారిటీ)

Advertisement
 
Advertisement
Advertisement