నో టాయిలెట్, నో లీవ్స్ : రూ. 19 లక్షల జాబ్ వదిలేశా!
బాగా చదువుకోవడం, మంచి ఉద్యోగం సంపాదించడం ప్రతీ భారతీయ యువకుడి కల. అది ఏ ఐటీ ఉద్యోగమో, ప్రభుత్వ రంగ సంస్థ (PSU)లో ఉద్యోగమో అయితే జీవితం సెట్ అన్నంత సంబరం. మంచి జీతం, ఉద్యోగ భద్రత, సమాజంలో లభించే గౌరవం వల్ల ఈ ఉద్యోగాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో యువ ఉద్యోగుల్లో ట్రెండ్ మారింది. జాబ్‌లో పని ఒత్తిడి (Workplace Stress) కంటే, జీవితంలో మానసిక ప్రశాంతత, ఉద్యోగంలో సంతృప్తి అనేది ప్రధానంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, ఎన్ఐటీ కురుక్షేత్ర (NIT Kurukshetra) పూర్వ విద్యార్థి, 25 ఏళ్ల ఇంజనీర్ సౌరభ్ మిట్టల్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.భారత్ పెట్రోలియం (BPCL) సంస్థలో ఏడాదికి రూ. 19 లక్షల ప్యాకేజీతో లభించిన ప్రతిష్టాత్మక ఉద్యోగాన్ని, ఆయన వదులుకున్నాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు.కలల ఉద్యోగం... కానీ ఏం లాభంసౌరభ్ మిట్టల్ తన 22వ ఏటనే BPCLలో చేరాడు. ఎన్నో ఆశలతో, ఆశయలతో ఉద్యోగంలో చేరినప్పటికీ, అక్కడి పని వాతావరణం, పరిస్థితులు ఆయన ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. కనీస వసతులు కూడా లేని జీవితం. తనకు పని చేయడానికి కేటాయించిన ఆఫీసు వాస్తవానికి ఒక గిడ్డంగి లాంటిదని సౌరభ్ వివరించారు. అక్కడ తాగడానికి నీళ్లు గానీ, టాయిలెట్ గానీ లేవు. ఏసీ కూడా పాడైందని, దాన్ని తానే స్వయంగా బాగు చేసుకోవాల్సి వచ్చిందని అతను చెప్పాడు. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, అతను ఈ విషయాన్ని తన మేనేజర్, హెచ్ఆర్, ఉన్నతాధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకువచ్చినా, ఎలాంటి పరిష్కారం లభించలేదు. దీంతో తన ఇల్లు సుమారు 10 నిమిషాల నడక దూరంలో ఉండటంతో రోజుకు చాలాసార్లు ఇంటికి వెళ్ళేవాడు. తాను ఉద్యోగం మానేసే వరకు పరిస్థితి అలాగే ఉందని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు అక్కడి పని చాలా ఒత్తిడితో కూడుకున్నదని, పాతకాలపు పద్ధతుల్లో సాగేదని విమర్శించారు.అంతేకాకుండా సీనియర్ అధికారుల కోసం ఎయిర్పోర్ట్ పికప్‌లు, హోటల్ బుకింగ్‌లు వంటి వారి వ్యక్తిగత పనులను కూడా తనతో చేయించేవారట. అమ్మకాలు తగ్గినప్పుడు, ఉన్నతాధికారులు నేరుగా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చేవారు. వీడియో కాన్ఫరెన్సులు, ఫోన్ కాల్స్ సమయంలో తిట్టడం సర్వసాధారణమైపోయింది.ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వరకు, వీకెండ్స్ (శని, ఆదివారాలు) లోనూ ఫోన్ కాల్స్ వస్తూనే ఉండేవని చెప్పారు. దీంతో లీవ్‌లు దొరకడం కష్టంగా ఉండేదని, ఇక ప్రమోషన్లు, జీతాల పెంపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని పెదవి విరిచారు.. వీటన్నింటికీ మించి, తన చుట్టూ ఉన్న ఉద్యోగులంతా చాలా పెద్ద వయసు వారు కావడంతో, అక్కడ కొత్తగా నేర్చుకోవడానికి గానీ, కెరీర్ ఎదుగుదలకు గానీ పెద్దగా అవకాశం లేదనిపించిందని, "నా జీవితాంతం ఇలాగే గడపడాన్ని నేను ఊహించుకోలేక పోయాను" అని సౌరభ్ తన నిర్ణయాన్ని వివరించాడు.ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశసౌరభ్ నిర్ణయంపై కుటుంబంలో వ్యతిరేకత అయితే ఈ ఉద్యోగాన్ని వదలేయాన్ని సౌరభ్ నిర్ణయాన్ని అమలు చేయడం అంత సులువు కాలేదు. ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే భద్రత, గౌరవం కారణంగా ఆయన తండ్రి ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, కొడుకు పడుతున్న మానసిక ఒత్తిడిని గమనించిన తల్లి మాత్రం ఆయన నిర్ణయానికి మద్దతుగా నిలిచారు.ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్?నెటిజన్ల స్పందన సౌరభ్ మిట్టల్ కథనం ఆన్లైన్లో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. చాలా మంచి, ఆలోచనాత్మకమైన నిర్ణయం. ఆల్ ది బెస్ట్ చాలామంది సౌరభ్ నిర్ణయాన్ని సమర్ధించారు. "నేను కూడా 16 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను, మీ నిర్ణయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలను. భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని మరొకరు, మంచి పని చేశావు, సోదరా”, “మీకు అంతా మంచే జరగాలి” అంటూ పలువురు సౌరభ్‌కు మద్దతుగా నిలిచారు.
మమతకు సీఎం సువేందు ఝలక్
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. గత టీఎంసీ పాలనలో జరిగిన అవినీతి, మహిళలపై నేరాలపై దర్యాప్తు కోసం ఆయన రెండు కమిషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్లలో ఒక దాని కీలక బాధ్యతలు సీనియర్ ఐపీఎస్ అధికారిణి దమయంతి సేన్‌కు ఆయన అప్పగించారు. దమయంతి సేన్ 1996 బ్యాచ్ అధికారిణి. కోల్‌కతాకు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ కూడా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్క్ స్ట్రీట్ గ్యాంగ్‌రేప్ కేసు(2012) కేసును స్వయంగా చేధించి.. నిందితులను తక్కువ టైంలోనే పట్టుకున్నారామె. ఆ సమయంలో దేశం మొత్తం ఆమెపై ప్రశంసలు గుప్పించింది. అయితే.. (పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేసు కేసు గురించి.. 2012 ఫిబ్రవరి 6వ తేదీన ఒక మహిళపై కారులో గ్యాంగ్‌రేప్ జరిగింది)ఈ కేసు విషయంలోనే ఆమె అప్పటి దీదీ సర్కార్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఆ సమయంలో మమతా బెనర్జీ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ కేసు ఒక కల్పితం అని, టీఎంసీ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్రగా అభివర్ణించారామె. అంతటితో ఆగకుండా దమయంతిని క్రైమ్ బ్రాంచ్ నుంచి ట్రైనింగ్ కాలేజీకి బదిలీ చేశారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. నిజాయితీకి మమత ప్రభుత్వం ఇచ్చిన కానుక అంటూ బీజేపీ, వామపక్షాలు తిట్టిపోశాయి.అటు ఆ టైంలో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు లభించింది. అయితే మమతా సర్కార్ తీసుకున్న నిర్ణయంపై దమయంతి సేన్ ఇన్నేళ్లు మౌనంగా పాటించారు. రోటీన్ ట్రాన్స్ఫర్ను అంగీకరించి తన విధుల్ని చేసుకుంటూ పోయారు. ఆపై ప్రమోషన్ల విషయంలోనూ ఆమెకు అన్యాయమే జరిగిందని.. పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టింగ్‌లు ఇస్తూ వచ్చారని విమర్శలు ఉన్నాయి. అయితే ఆమె సిన్సియారిటీని గుర్తించిన కలకత్తా హైకోర్టు.. 2022లో నాలుగు అత్యాచార కేసులు, రసికా జైన్ మరణం కేసును అప్పగించి మమతా సర్కార్‌కు ఝలక్ ఇచ్చింది.తాజాగా.. రిటైర్డ్ జస్టిస్ సంపతి చటర్జీ అధ్యక్షతన నేతృత్వంలో సువేందు సర్కార్ కమిషన్ వేయగా.. దమయంతి సేన్‌ను అందులో మెంబర్ సెక్రటరీగా నియమించారు. ఈ కమిషన్ మహిళలు, పిల్లలపై దాడులను పరిశీలించనుంది. ఇందులో సందేశ్‌ఖాలి, కస్బా, బోగ్టుయి వంటి కేసులు కూడా ఉన్నాయి. దమయంతి సేన్ తిరిగి కీలక బాధ్యతల్లోకి రావడం.. బెంగాల్ రాజకీయాల్లో ఒక ముఖ్య పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
నన్ను చంపాలని చూస్తున్నారు: పాస్టర్ అభినయ్
విశాఖపట్నం: పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగే తనను చంపాలని చూస్తున్నారని భరోసా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ధార అభినయ్ దర్శన్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని అన్నారు. తనపై దాడి చేసిన వారిని వదిలేసి, తన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారని వాపోయారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నందునే తనపై దాడి జరిగిందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.''నాపై నేనే దాడి చేసుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. నాపై దాడి విషయంలో పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పాస్టర్లందరూ దొంగలే అనే తరహాలో చిత్రీకరిస్తున్నారు. నాపై దాడి వెనుక కుట్ర దాగి ఉంది. నాపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకి సంబంధం ఉందని అనుకోను. కొంతమందిపై నాకు అనుమానం ఉంది. వారి పేర్లు త్వరలోనే బయట పెడతాను. ప్రవీణ్ పగడాల నాలుగు బ్రాండ్లు తాగి యాక్సిడెంట్ చేసినట్లు దొంగ సాక్ష్యాలు సృష్టించారు. ప్రవీణ్ పగడాల విషయంలో జరిగింది పూర్తిగా అన్యాయమే. ప్రవీణ్ పగడాలపై వేసినట్టుగానే నాపై నిందలు వేస్తున్నారు. దాడులకు నేను భయపడను. ప్రజల సమస్యలపై ప్రభుత్వాధికారులను ప్రశ్నిస్తూనే ఉంటాన''ని అభినయ్ అన్నారు.దాడిని ఖండించిన పాడేరు ఎమ్మెల్యే పాస్టర్ అభినయ్‌పై దాడి చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. అభినయ్‌పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభినయ్‌పై దాడి చేసిన వారిని ప్రజల ముందు పోలీసులు నిలబెట్టాలని కోరారు.''జరిగిన దాడిపై నేనే పోలీసులకు ఫోన్ చేసి పూర్తిస్థాయి విచారణ జరపాలని సూచించాను. ఈ దాడి తన అనుచరులు చేశారని కూటమి నాయకులు ప్రచారం చేయడం దురదృష్టకరం. ఒక గిరిజన బిడ్డపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నేతలు నాకు క్షమాపణ చెప్పాలి. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నార''ని విశ్వేశ్వరరాజు మండిపడ్డారు.అసలేం జరిగింది?అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో మొండిగెడ్డ పంచాయతీ నీరుతోటపాలెం కాఫీ తోటల సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు అభినయ్‌పై దాడి చేశారు. కడపకు చెందిన అభినయ్ కొన్ని రోజులుగా జిల్లాలో ఉంటున్నారు. నీరుతోటపాలెంలో సమస్యలపై పాదయాత్ర చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసి కారులో తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అభినయ్, ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరిని వాహనం నుంచి దింపి, కాఫీ తోటల సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ అభినయ్‌పై బ్లేడుతో దాడి చేశారు. తల, కాళ్లపై కోసేశారు.అభినయ్‌తో పాటు ఉన్న ఇద్దరిపై కూడా దాడి చేశారు. వారికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అభినయ్ స్పృహ తప్పి పడిపోవడంతో మృతి చెంది ఉంటాడని భావించి, దుండ గులు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అభినయ్‌ను జెర్రెల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారు ఎవరో, ఎందుకు దాడి చేశారో తెలియడం లేదు. కడప నుంచి వచ్చిన అభినయ్‌కి ఇక్కడ ఎవరు శత్రువులున్నారో తెలియడం లేదని స్థానికులు తెలిపారు. అభినయ్ కారుపై కూడా దాడి చేయడంతో కారు అద్దం పగిలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన ‘కరుప్పు’ టీమ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కరుప్పు(తెలుగులో వీరభద్రుడు) చిత్ర బృందం క్షమాపణలు చెప్పింది. ఆయనను అగౌరపరచడం తమ ఉద్దేశం కాదని.. సినిమాలో ఉన్న డైలాగలను వెంటనే తొలగిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.అసలేం జరిగింది?సూర్య, త్రిష జంటగా నటించిన తాజా చిత్రం కరుప్పు. ఆర్.జే. బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమాలో ఇళయారాజాపై ప్రత్యేక్షంగా, పరోక్షంగా కొన్ని డైలాగులు ఉన్నాయి. కొన్ని చోట్ల అసందర్భంగానూ ఇళయరాజాపై డైలాగులు పెట్టారు. అవి ఆయన గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇళయరాజా కూడా ఆ డైలాగులపై అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కొంతమంది ఇళయరాజా అభిమానులు సినిమాను ట్రోల్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ వివాదం పెద్దది కాకముందే ముగింపు పలికారు చిత్రబృందం. ఇళయరాజాను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది.ఈ రోజు నుంచే మార్పు..ఇళయరాజా అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. సినీ రంగం కోసం ఆయన చేస్తున్న సేవలు ఎన్నోతరాల్లో స్ఫూర్తి నింపుతున్నాయి. కరుప్పులో ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగు వల్ల ఆయన బాధ పడ్డారని మా దృష్టికి వచ్చింది. ఇళయరాజాను మేము క్షమాపణలు కోరుతున్నాం. ఆయన మనోభావాలను దెబ్బతీయడం, అగౌరవపర్చడం మా ఉద్దేశం కాదు. ఈ చిత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగులను తొలగిస్తున్నాం. ఈరోజు నుంచి ఈ మార్పు చేస్తున్నాం. ఆయన గౌరవమే మాకు ప్రధానం’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.
భారీగా పెరిగిన వెండి ఆభరణ ఎగుమతులు!
మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే
పంటల దిగుబడులపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం : ఐసీఏఆర్ వార్నింగ్
బిడ్డకు పాలు పట్టాల్సిన తల్లి యాసిడ్ తాగించి..
రఘురామ కృష్ణంరాజుకు చెంపపెట్టు
నో టాయిలెట్, నో లీవ్స్ : రూ. 19 లక్షల జాబ్ వదిలేశా!
ఫోన్‌పే, గూగుల్‌పే తరహాలో 'వియోనా పే'
బెంగళూరు కంటే హైదరాబాదే బెస్ట్!
చరిత్ర సృష్టించిన కమిన్స్.. హార్దిక్ రికార్డు బ్రేక్
నన్ను చంపాలని చూస్తున్నారు: పాస్టర్ అభినయ్
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
మాను సంపంగి... మా అబ్బాయి
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
భారీగా పెరిగిన వెండి ఆభరణ ఎగుమతులు!
మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే
పంటల దిగుబడులపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం : ఐసీఏఆర్ వార్నింగ్
బిడ్డకు పాలు పట్టాల్సిన తల్లి యాసిడ్ తాగించి..
రఘురామ కృష్ణంరాజుకు చెంపపెట్టు
నో టాయిలెట్, నో లీవ్స్ : రూ. 19 లక్షల జాబ్ వదిలేశా!
ఫోన్‌పే, గూగుల్‌పే తరహాలో 'వియోనా పే'
బెంగళూరు కంటే హైదరాబాదే బెస్ట్!
చరిత్ర సృష్టించిన కమిన్స్.. హార్దిక్ రికార్డు బ్రేక్
నన్ను చంపాలని చూస్తున్నారు: పాస్టర్ అభినయ్
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
మాను సంపంగి... మా అబ్బాయి
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఫొటోలు
రాశీ ఖన్నా గ్లామర్ ఫోటోషూట్
'పురుష:' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
మంచు మనోజ్ కొత్త ట్రస్ట్ ప్రారంభం (ఫొటోలు)
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
పెట్రో బాదుడు: వైఎస్సార్సీపీ పోరుబాటకు విశేష స్పందన
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
ఫ్యామిలీ ట్రిప్‌లో హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరో ఆది పినిశెట్టి దంపతులు.. (ఫొటోలు)
అనంతపురం : భారమైన వేళ.. బాధతో విక్రయం! (ఫొటోలు)
హైదరాబాద్ : మురిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
సినిమా
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ
90స్ కిడ్స్ అందరూ తమ చిన్నప్పుడు చూసి హాలీవుడ్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా 'మమ్మీ' ఫ్రాంచైజీ ఉంటుంది. ఇప్పటివరకు మూడు మూవీస్ రాగా అవన్నీ ఆకట్టుకున్నాయి. ఇదే ఫ్రాంచైజలో వచ్చిన లేటెస్ట్ చిత్రం 'ద మమ్మీ' గత నెలలో థియేటర్లలోకి రాగా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)గతంలో వచ్చిన 'మమ్మీ' సినిమాలన్నీ అడ్వెంచర్, కామెడీ తరహాలో వచ్చాయి. వాటికి భిన్నంగా పూర్తిగా డార్క్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో లేటెస్ట్ మూవీ తీశారు. 'ద మమ్మీ' పేరుతో తీసిన ఈ చిత్రానికి లీ క్రోనిన్ దర్శకత్వం వహించారు. గత నెల 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని మెప్పించింది. ఇప్పుడీ చిత్రం విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి రావొచ్చు. అప్పుడు తెలుగు డబ్బింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.'ద మమ్మీ' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం ఆనందిస్తుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్ భయపెట్టేలా ఉన్నాయని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందనే కామెంట్స్ వినిపించాయి.(ఇదీ చదవండి: 'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ అదేనా?)
పవర్ఫుల్ సావిత్రి
కబీర్‌సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్ ప్రధాన తారాగణంగా నటించిన సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. రవికుమార్ సీరపు దర్శకత్వంలో హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.కాగా ఈ సినిమాలో పవర్ఫుల్ సావిత్రి పాత్రలో రాశి నటించినట్లు వెల్లడించి, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. ఓ బ్యాగ్ చుట్టూ ఈ సినిమా కథనం తిరుగుతుంది. కథను మలుపు తిప్పే సావిత్రి పాత్రలో రాశి నటించారు’’ అని యూనిట్ పేర్కొంది.
సెయాన్ ఆరంభం
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న రూరల్–కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా ‘సెయాన్’. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా పతాకాలపై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఎమోషన్స్, మాస్ అప్పీల్, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎంటర్టైనర్గా ‘సెయాన్’ చిత్రం రూపొందుతోంది.’’ అని యూనిట్ పేర్కొంది.వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సహ–నిర్మాత: ఎస్. డిస్నీ. ఎకానమీ క్లాస్‌లో కమల్ హాసన్ ప్రయాణం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కల్కి 2’. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు కమల్æహాసన్.ఈ మూవీ షూటింగ్లో పాల్గొనేందుకు చెన్నై నుంచి హైదరాబాద్‌కి ఫ్లైట్‌లో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారాయన. ‘‘సినిమా పరిశ్రమ క్లిష్ట పరిస్థితులకు ఎదుర్కొంటున్న తరుణం ఇది. ప్రైవేటు చార్టెడ్ ఫ్లైట్స్, విలాసవంతమైన ప్రయాణాలను కాదని, ఫ్లైట్‌లో సాధారణ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి షూటింగ్‌కు వెళ్లాలని కమల్‌హాసన్‌గారు నిర్ణయించుకోవడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. సినిమా రంగంలో జరగబోయే మార్పులకు ఇది తొలి అడుగు’’ అంటూ వైజయంతీ మూవీస్ సంస్థ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. ‘కల్కి 2’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలిసింది. మరోవైపు సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇటీవల కమల్‌హాసన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ గురించి అప్పుడే
'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది. కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తోంది. అదే టైంలో కంటెంట్ పరంగా మాత్రం స్టోరీపై రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ 'పెద్ది' స్టోరీ ఏమై ఉండొచ్చు? ఊహించని ట్విస్ట్ ఏంటి?(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)ఇప్పటివరకు వచ్చిన 'పెద్ది' ప్రమోషనల్ కంటెంట్‌లో హీరో పాత్ర క్రికెట్, కుస్తీ ఆడతాడు అన్నట్లు మాత్రమే చూపించారు. కానీ ట్రైలర్లో రన్నర్ అని కూడా రివీల్ చేశారు. అయితే క్రికెట్, రెజ్లింగ్‌కి సంబంధించిన సీన్స్ చూపించారు గానీ రన్నింగ్‌కి సంబంధించిన ఒక్క షాట్ కూడా పెట్టలేదు. చివరలో రన్నింగ్ ట్రాక్‌పైకి పెద్ది వెళ్తున్న సీన్ చూపించారు. 'పెద్ది బ్యాక్ ఆన్ హిజ్ ఫీట్' అనే డైలాగ్ వినిపించారు. దీంతోనే డిస్కషన్స్ మొదలయ్యాయి.బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఎక్స్పర్ట్. కానీ అనుకోని సంఘటనల వల్ల 'పెద్ది'.. ఒంటి కాలి వ్యక్తి అవుతాడు. అయినా సరే తనకున్న ప్రతిభతో పారా ఒలింపిక్స్ వరకు వెళ్తాడు. ఇదే ట్విస్ట్ అనిపిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి ఇందులో రామ్ చరణ్ పాత్రకు కాలు ఉండదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే దర్శకుడు బుచ్చిబాబు కూడా మూవీ చివరి 50 నిమిషాల ఎమోషనల్‌గా ఉంటుందని, చూస్తున్న ప్రతి ఒక్కరూ డిస్ట్రబ్ అవుతారని ఇంటర్వ్యూలో చెప్పాడు.డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన మాటలు.. ట్రైలర్ చివరలో పెద్ది పాత్ర కుంటుతూ నడుస్తున్నట్లు అనిపించడం లాంటివి చూస్తుంటే.. ఈ దర్శకుడి గత చిత్రం 'ఉప్పెన'లానే ఇందులో 'కటింగ్' గ్యారంటీనా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటి? అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!)
క్రీడలు
సంజూ సరికొత్త చరిత్ర
స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ సీఎస్కే తరఫున తొలి సీజన్లోనే అదిరిపోయే రికార్డు సాధించాడు. ఈ సీజన్లో 13 మ్యాచ్‌ల్లో 477 పరుగులు చేసిన అతడు.. సీఎస్కే తరఫున ఓ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోని పేరిట ఉండేది.అతడు 2013 సీజన్లో 16 ఇన్నింగ్స్‌ల్లో 461 పరుగులు చేశాడు. తాజాగా సంజూ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. లీగ్ దశలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో సంజూ 500 పరుగుల అరుదైన మైలురాయిని కూడా తాకే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే సీఎస్కే తరఫున ఒక సీజన్లో 500 పరుగులు చేసిన తొలి వికెట్‌కీపర్‌గా నిలుస్తాడు.రికార్డు సాధించినా, మ్యాచ్ చేజారింది..!నిన్న ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో సంజూ పై రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో సంజూ మెరుపు ఇన్నింగ్స్‌తో (13 బంతుల్లో 27; 5 ఫోర్లు, సిక్స్) అలరించాడు. సిక్స్‌తో ఖాతా తెరిచిన అతడు.. వరుస బౌండరీలతో ఎస్ఆర్హెచ్ బౌలర్లపై దాడి చేశాడు. అయితే పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఔటై ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్‌గా మలచ లేకలేకపోయాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 180/7 స్కోర్ చేసింది. బ్రెవిస్ (44), కార్తీక్ శర్మ (32), సంజూ శాంసన్ (27), శివమ్ దూబే (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్ సైతం తడబడినా చివరికి గెలిచింది. ఇషాన్ కిషన్ (70), క్లాసెన్ (47) రాణించడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. సీఎస్కే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
సీఎస్కే అభిమానులను రెచ్చగొట్టిన ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 18) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ సైతం ఖరారు చేసుకుంది. వెళ్తూ వెళ్తూ గుజరాత్‌ను కూడా ఫైనల్-4లోకి తీసుకెళ్లింది. అంతకుముందు ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ప్రస్తుతానికి మూడు జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. మిగిలిన బెర్త్ కోసం పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, కేకేఆర్, సీఎస్కే జట్లు పోటీలో మిగిలాయి.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ చేసిన ఓ పని సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. ఓటమి బాధలో ఉన్న సీఎస్కే అభిమానులను ఇషాన్ విజిల్ వేసి రెచ్చగొట్టాడు. అంతటితో ఆగకుండా 'మీ పని అయిపోంది, ఇక ఇంటికి వెళ్లండి' అని అర్దం వచ్చేలా సైగలు చేశాడు. ఈ చర్య నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. Good team win that's it well played Ishan Kishan👏👏👏 pic.twitter.com/sfEtoeorOk— jaguar (@rrd4859) May 18, 2026ఇషాన్ చర్యను చాలామంది తప్పుడబడుతున్నారు. అంత ఓవరాక్షన్ అవసరమా అంటున్నారు. సీఎస్కే అభిమానులైతే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొంతమైదానంలో (చెపాక్ స్టేడియం) ఇషాన్ తమను గేలి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. సీఎస్కే అభిమానులను విజిల్ వేసి రెచ్చగొట్టడం ఈ సీజన్లో ఇది రెండోసారి. కొద్ది రోజుల కిందట గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఇలాగే ప్రవర్తించాడు. సీఎస్కేపై విజయానంతరం పసుపు రంగు విజిల్‌తో ఫోటో పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీశాడు. సీఎస్కే అభిమానులను ఇలా ట్రోల్ చేయడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. ఓడిన జట్టు అభిమానుల పట్ల హుందాగా ప్రవర్తించాలి కానీ, ఇలాంటి రెచ్చిగొట్టే ప్రయత్నాలు చేయకూడదని హితవు పలుకుతున్నారు. విజిల్ పోడు అనేది సీఎస్కే నినాదం అన్న విషయం తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే.. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 180 పరుగులు చేసింది. ఛేదనలో హైదరాబాద్ జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. ఇషాన్ కిషన్, క్లాసెన్ మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ముఖ్యంగా ఇషాన్ 47 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టును విజయపు అంచుల వరకు తీసుకెళ్లాడు. సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్ మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. ఈ గెలుపులో కీలకపాత్ర పోషించిన ఇషాన్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ ఓటమితో సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. రుతురాజ్ సారథ్యంలోని ఈ జట్టు ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నేపాల్ బౌలర్ వరల్డ్ రికార్డు
నేపాల్ బౌలర్ సందీప్ లామిచ్చేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 150 వికెట్లు (73 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. స్టార్క్ 77 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. సందీప్ నాలుగు మ్యాచ్‌లు ముందుగానే ఈ మైలురాయిని తాకాడు.ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో సందీప్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి 3 వికెట్లు (జార్జ్ మున్సే, బ్రెండన్ మెక్‌ముల్లెన్, మాథ్యూ క్రాస్) తీశాడు. సందీప్‌తో పాటు లలిత్ రాజ్‌వంశీ (8-0-32-4) కూడా రాణించడంతో తొలుత బౌలింగ్ చేసిన నేపాల్ స్కాట్లాండ్ను 194 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం రోహిత్ పౌడెల్ (74 నాటౌట్), ఇషాన్ పాండే (55) రాణించడంతో 38.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా సందీప్‌దే..!అంతర్జాతీయ వన్డేల్లో ఫాస్టెస్ట్ 100 వికెట్స్ రికార్డు కూడా సందీప్ ఖాతాలోనే ఉంది. ఈ ఘనతను అతడు కేవలం 42 మ్యాచ్‌ల్లోనే సాధించాడు. తాజాగా 150 వికెట్ల మార్క్‌ను కూడా అత్యంత వేగంగా చేరుకొని వన్డే క్రికెట్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు.
ఒక్క బెర్త్.. ఐదు జట్లు
ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. నిన్న (మే 18) సీఎస్కేను ఓడించడంతో ఎస్ఆర్హెచ్ ఓ బెర్త్ ఖరారు చేసుకుంది. వెళ్తూ వెళ్తూ ఆ జట్టు గుజరాత్‌ను కూడా ఫైనల్-4లోకి తీసుకెళ్లింది. అంతకుముందే ఆర్సీబీ ఓ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ప్రస్తుతానికి మూడు జట్లు బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. మిగిలిన ఏకైక బెర్త్ కోసం ఏకంగా ఐదు జట్లు పోటీపడుతున్నాయి.ఆ జట్లు ఏవి.. ఏ జట్టుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఏ జట్టుకు స్వల్పంగా ఉన్నాయి.. ఈ అంశాలపై ఓ లుక్కేద్దాం. మిగిలిన ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్కే, ఢిల్లీ, కేకేఆర్ జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో రాజస్థాన్‌కు అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఢిల్లీ తక్కువగా ఉన్నాయి. మిగతా మూడు జట్లలో చూసుకుంటే పంజాబ్, కేకేఆర్‌కు సమాన అవకశాలు ఉండగా.. సీఎస్కేకు కాస్త తక్కువ అవకాశాలు ఉన్నాయి.ముందుగా రాజస్థాన్‌ను తీసుకుంటే.. ఈ జట్టు లీగ్ దశలో ఇంకా 2 మ్యాచ్‌లు (లక్నో, ముంబై) ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈ జట్టు మిగతా జట్ల జయాపజయాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. మిగతా జట్లు వారు ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లు గెలిచినా రాయల్స్ (16) ఉండే పాయింట్లు ఉండవు. కాబట్టి పోటీలో ఉన్న ఐదు జట్లలో రాయల్స్‌కే అవకాశాలు ఎక్కువ.రేసులో రెండో అతి పెద్ద అవకాశాలు ఉన్న జట్లు పంజాబ్, కేకేఆర్. ఈ రెండు జట్లు సమాన అవకాశాలు కలిగి ఉన్నాయి. పంజాబ్ వారు ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో (లక్నో) గెలిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది (రాజస్థాన్ ఏదైనా మ్యాచ్ ఓడిన పక్షంలో, మిగతా జట్లతో పనిలేదు). ఈ జట్టుకు మంచి రన్‌రేట్ ఉండటం అదనపు బెనిఫిట్ (కేకేఆర్‌తో పోలిస్తే) అవుతుంది.ఇక కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు ఆడాల్సిన 2 మ్యాచ్‌ల్లో (ముంబై, ఢిల్లీ) భారీ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది (రాజస్థాన్ కనీసం ఒక మ్యాచ్ అయినా ఓడి, పంజాబ్ ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో ఓడితే). ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది.సీఎస్కే విషయానికొస్తే.. ఈ జట్టు ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో (గుజరాత్) భారీ తేడాతో గెలిస్తే బెర్త్ దక్కే అవకాశం ఉంది (రాజస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో ఓడాలి, పంజాబ్ ఓడాలి, కేకేఆర్ కనీసం ఒక మ్యాచ్ అయినా ఓడాలి, డీసీ ఓడాలి).చివరిగా ఢిల్లీ విషయానికొస్తే.. ఈ జట్టు ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో (కేకేఆర్) భారీ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కే అవకాశం ఉంది (కేకేఆర్ కనీసం ఒక మ్యాచ్ అయినా ఓడాలి, రాజస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో ఓడాలి, పంజాబ్ ఓడాలి, సీఎస్కే ఓడాలి).
న్యూస్ పాడ్‌కాస్ట్
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
బిజినెస్
ఓఎంసీలకు తగ్గుతున్న చమురు నష్టం
పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు రూ. 3 చొప్పున పెంచడంతో ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) రోజువారీ నష్టాలు పావు శాతం మేర తగ్గాయి. రోజుకు రూ. 1,000 కోట్ల నుంచి రూ. 750 కోట్లకు దిగి వచ్చాయని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అధిక స్థాయిలోనే ఉండటం, బలహీన రూపాయి కారణంగా రిటైల్ స్థాయిలో ఆదాయ నష్టం కొనసాగుతోందని పేర్కొన్నారు. అయితే, అసలు కన్నా తక్కువ రేటుకే ఇంధనాలను విక్రయిచండం వల్ల ఆయిల్ కంపెనీలకి వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేసేందుకు ప్రత్యేక సబ్సిడీ ప్యాకేజీ ప్రతిపాదనేదీ ఇంకా పరిశీలనలో లేదని శర్మ వివరించారు.లీటరుకు రూ.3 పెంపు వల్ల ఓఎంసీలకు పరిమిత ఊరటే లభిస్తుందే తప్ప నష్టాలు పూర్తి స్థాయిలో భర్తీ కావని, దీనివల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా కొంత పెరుగుతాయని విశ్లేషకులు తెలిపారు. రేట్లు పెరగడం వల్ల డిమాండ్ స్వల్పంగా నెమ్మదించి, దిగుమతుల భారం కొంత తగ్గుతుందని డీబీఎస్ బ్యాంక్ సీనియర్ ఎకానమిస్ట్ రాధికా రావు తెలిపారు. ద్రవ్యోల్బణం 15–25 బేసిస్ పాయింట్ల మేర పెరగొచ్చన్నారు. క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలోనే ఉంటే ఓఎంసీలను తిరిగి లాభాల వైపు మళ్లించేందుకు ఈ పెంపు సరిపోదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అనలిస్ట్ ప్రశాంత్ వశిష్ట తెలిపారు. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, రేట్లు కొంత పెరగడంతో ఓఎంసీల ఆదాయ నష్టాలు పెట్రోల్‌పై లీటరుకు రూ. 10, డీజిల్‌పై రూ. 13కి నెమ్మదిస్తాయని పేర్కొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి మే ఆఖరు వరకు వ్యవధిలో నష్టాలు రూ. 1 లక్ష కోట్ల పైగా ఉండొచ్చని వివరించారు.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
పెట్టుబడులకు ‘ఆతిథ్యం’!
భారత హోటల్ రంగం పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారింది. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో ఈ రంగంలోకి 185 మిలియన్ డాలర్ల (రూ.1,776 కోట్లు సుమారు) పెట్టుబడులు వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 117 మిలియన్ డాలర్ల కంటే 58 శాతం అధికం కావడం విశేషం. భారత హోటల్ రంగం వృద్ధి అవకాశాల పట్ల ఇన్వెస్టర్లలో ఎంతో విశ్వాసం నెలకొన్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ‘భారత్‌లో హోటల్ రంగంలో పెట్టుబడుల ధోరణులు: 2025’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది.2025లో భారత హోటల్ రంగంలోకి 567 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు తెలిపింది. మొత్తం 28 లావాదేవీలు నమోదైనట్టు వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడుల కంటే 67 శాతం పెరిగినట్టు పేర్కొంది. టైర్–1 నగరాల్లో 60 శాతం లావాదేవీలు చోటుచేసుకుంటే, మిగిలిన 40 శాతం టైర్–2, 3 నగరాల్లో జరిగాయి. గతేడాది కొత్తగా 103 బ్రాండెడ్ హోటళ్లు ప్రారంభమయ్యాయి. ఇదే ధోరణి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనూ కొనసాగినట్టు తెలిపింది. నిర్వహణలోని హోటళ్లు, భూముల విక్రయం, ప్లాట్‌ఫామ్‌లను సొంతం చేసుకోవడం వంటి లావాదేవీలు ఇందులో ఉన్నాయి. ఇక ముందూ జోరుగానే..మార్చి త్రైమాసికంలో ఫ్లెర్ హోటల్స్ (లెమన్‌ట్రీ హోటల్స్ సబ్సిడరీ)లో 41 శాతం వాటాను వార్బర్గ్ పింకస్ సొంతం చేసుకుంది. తన పోర్ట్‌ఫోలియోలోని హోటళ్ల వృద్ధి కోసం 107 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ పెట్టుబడుల లావాదేవీలు జోరుగా ఉండొచ్చన్నది ఈ నివేదిక అంచనా. హోటల్ కంపెనీల వద్ద తగినన్ని నిల్వలు ఉండడం, హోటల్ ఆపరేటర్లు కొందరు క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చే అవకాశాలున్నట్టు తెలిపింది. ఇనిస్టిట్యూషన్స్, ప్రైవేటు ఈక్విటీ (పీఈ) సంస్థలు సైతం హోటల్ పోర్ట్‌ఫోలియోల కొనుగోలు పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు పేర్కొంది. అలాగే, హెచ్ఎన్ఐలు, ఫ్యామిలీ ఆఫీస్‌లు, ప్రైవేటు హోటల్ యజమానులు, లిస్టెడ్ హోటల్ కంపెనీలు, డెవలపర్లు పెట్టుబడులకు ముందుకొస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 104 పాయింట్లు పెరిగి 23,751 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 371 పాయింట్లు పుంజుకుని 75,684 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.09బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 109.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.6 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.07 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.51 శాతం నష్టపోయింది.Today Nifty position 19-05-2026(time: 09:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
జారిపోతున్న రూపాయి..
ముంబై: అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాల ప్రభావాలతో రూపాయి మారకం విలువ గణనీయంగా పతనమవుతోంది. డాలరుతో పోలిస్తే మరో 39 పైసలు క్షీణించి 96.20కి పడిపోయింది. సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 95.81తో పోలిస్తే మరింత తక్కువగా 96.19 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 96.39కి కూడా క్షీణించి చివరికి 96.20 వద్ద క్లోజయ్యింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడాయిల్ రేట్లు పెరుగుతుండటం, డాలరు బలోపేతం కావడం తదితర అంశాలతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. రాబోయే రోజుల్లోను ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, అయితే, బంగారం, వెండి దిగుమతులపై ఆంక్షలతో పాటు ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ గానీ జోక్యం చేసుకోవడంలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే కనిష్ట స్థాయిల్లో రూపాయికి మద్దతుగా నిలవొచ్చని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. స్పాట్ మార్కెట్లో రూపాయి 96–96.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వివరించారు.
ఫ్యామిలీ
స్కూలు బస్సుకి పసుపు రంగే ఎందుకు?
ఫ్రెండ్స్.. మనం రోజూ స్కూలుకి వెళ్లే బస్సు పసుపు రంగులోనే ఉంటుంది. ఎందుకలా ఉంటుందో మీరెపుడైనా ఆలోచించారా? ఎందుకంటారు? ఎందుకంటే పసుపు రంగు ఎంత దూరం నుంచైనా ఆకర్షిస్తుంది. దానివల్ల ప్రమాదాలు జరుగకుండా ఉంటాయి.టాక్సీలు, స్కులు బస్సులకు, రసాయనాలను సూచించే ఫలకాలకు ఈ రంగును వాడుతుంటారు. ప్రమాదాన్ని సూచించే సందర్భాలకి ఎరుపు రంగుని వాడితే, జాగ్రత్త పాటించాల్సిన సూచనల కోసం పసుపుని వాడుతారన్నమాట. అలాగే ట్రాఫిక్ సిగ్నల్‌లో ఈ రంగు లైట్ వెలిగితే.. నెమ్మదిగా వెళ్లాలని అర్థం. ఔనా?హార్న్‌బిల్ అనే పక్షి తన పిల్లల్ని ఎవరూ చూడకుండా, తాకకుండా వుండాలని వాటి నివాసం కోసం చాలా సురక్షితమైన ప్రదేశం ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఒక చెట్టుతొర్రలో వుంచి, ఆ తొర్రను వుట్టి లేదా బెరడుతో కప్పేస్తుంది. అయితే గాలి, వెలుతురు కోసం చిన్న రంధ్రం ఒకటి వుంచుతుంది. పిల్లలకు ఆ రంధ్రంలోంచి వుుక్కుతో ఆహారాన్ని అందిస్తుంది. అలా పిల్లలు పెద్దవయ్యేదాకా ఆ తల్లికి ఈ కష్టం తప్పదు వురి.
ఏకలవ్య శిష్యరికం
ఆధునిక భారతదేశంలో ఏకలవ్యుడు దళిత, గిరిజన హక్కులకు ఆదర్శంగా ప్రత్యేకంగా నిలిచాడు. ఏకలవ్యుని గౌరవార్ధం, కేంద్ర ప్రభుత్వం భారతీయ గిరిజనుల కోసం ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను‘ నిర్వహిస్తోంది. అలాగే కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు క్రీడలలో అసాధారణ విజయాలు సాధించిన 19 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులకు, వ్యక్తులకు ఏకలవ్య పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఇది ఇలా ఉండగా హర్యానాలోని గురగ్రామ్ లో ఏకలవ్యునికి అంకితం చేయబడిన ఆలయం ఒకటి ఉంది. ఆ గ్రామంలోని కాండ్సప్రాంతంలో ఆలయాన్ని అక్కడి గ్రామస్తులు అప్పట్లో నిర్మించారు. ఈ ఆలయం వద్దనే ఏకలవ్యుడు తన బొటనవేలు కోసి గురువైన ద్రోణాచార్యుడికి సమర్పించినట్లు చారిత్రాత్మక ఆధారం. ఏకలవ్యుడంటే తెలియని వాళ్లు...గురు దక్షిణగా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి ఇచ్చిన విషయం గురించి వినని వారు బహుశా ఉండరేమో.... దీక్ష... పట్టుదల...అంకిత భావం... ఎనలేని గురుభక్తితో కాదు పొమ్మన్నా సరే... ఆ గురువునే మట్టిబొమ్మగా మలుచుకొని ఒక గొప్ప విలువిద్య కారుడుగా మహాభారతంలో పేరుగాంచిన మేటి విలుకాడే ఏకలవ్యుడు....నిషాదుల రాజు హిరణ్యధన్వుని కుమారుడే ఏకలవ్యుడు. కౌరవ పాండవులకు ఆస్థాన గురువైన ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలన్నది ఏకలవ్యుని ఆకాంక్ష. అయితే ఏకలవ్యుని సామర్థ్యాన్ని గమనించిన ద్రోణాచార్యుడు అతనికి తగిన శిక్షణ ఇస్తే అతడు విలువిద్యలో కౌరవ, పాండవ రాకుమారులను మించిపోతాడని, దాంతో తాను భీష్మునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమోననే ఉద్దేశ్యంతో ఏకలవ్యుని తన శిష్యునిగా స్వీకరించేందుకు అంగీకరించలేదు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుడు అందుకు ఏమాత్రం నిరాశపడక గురువుపై ఉన్న అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసంతో ద్రోణాచార్యుని మట్టిబొమ్మను తయారు చేసుకొని స్వీయ శిక్షణతో గొప్ప విలుకాడుగా పేరుగాంచాడు.ఒకసారి ఒక వేట కుక్క ఏకలవ్యుడిని చూసి మొరగడంతో ఏకలవ్యుడు ఆ కుక్క నోరు తెరిచి ఉండగానే దానికి ఏమాత్రం హాని కలగకుండా ఏడు బాణాలు వేశాడు. ఎంతో నైపుణ్యంతో వేసిన బాణాలను చూసిన అర్జునుడు నిరాశకు లోనై ద్రోణాచార్యునికి విషయాన్ని తెలిపాడు. అనంతరం ఏకలవ్యుని కలిసిన ద్రోణాచార్యుడు, ఏకలవ్యుని ఏకాగ్రతను గుర్తించి అభినందిస్తాడు. అయితే తన ప్రియ శిష్యుడైన అర్జునుని మేటి విలుకానిగా తీర్చిదిద్దుతానని తాను అర్జునునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమో అనే ఉద్దేశ్యంతోనూ, అతను తనను గురువుగా భావించి నేర్చుకున్న విలువిద్యకు తగిన గురుదక్షిణగా ఏకలవ్యుని కుడిచేతి బొటన వేలు కోరతాడు, ఏమాత్రం సంకోచించకుండా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి గురువైన ద్రోణాచార్యునికి సమర్పిస్తాడు ఏకలవ్యుడు. గురువుతో ప్రత్యక్ష సంబంధం లేకుండానే ఆ గురువును ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడలలో నడుస్తూ స్వయంగా విద్యను నేర్చుకునే వారిని ఏకలవ్య శిష్యులు అనే నానుడి అలా వచ్చింది. అమృత బిందువులు – ఆలోచన లేని స్పందన అవగాహన లేని విమర్శ సంపాదన లేని ఖర్చు ప్రయత్నం లేని ఓటమి వీటివల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది.– ‘మన సంబంధం ఆస్తులతో ముడిపడిన వారంతా బంధువులవుతారు. మన విలువలు సుఖ దుఃఖాలతో ముడిపడిన వారంతా ఆత్మ బంధువులవుతారు.– సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శ్రపాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సాయం చేసే స్థాయికి మనం ఎదగాలి.– మనం గెలిస్తే మనవాళ్ళకి మనమేంటో తెలుస్తుంది. మనం ఓడిపోతే మనవాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది.– చిన్నప్పుడు దేన్నయినా పట్టుకుని నిలబడాలి. పెద్దయ్యాక దేన్నయినా తట్టుకుని నిలబడాలి.→ ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. – సి. ఎన్. మూర్తి సీనియర్ పాత్రికేయులు
నిస్వార్థ సేవే నిజమైన ధర్మం
రాగి పాత్రని ప్రతి రోజూ శుభ్రం చేయకపోతే, చిలుం పట్టినట్లుగా, ప్రతి రోజూ విహిత కర్మాచరణ, సత్కర్మలు చేయకపోతే, మనసు కూడా మలినమై పాపగ్రస్థమవుతుంది. సత్కర్మ అంటే కేవలం పూజలు, పునస్కారాలు చేయడం మాత్రమే కాదు. సమాజానికి, తోటి ప్రాణులకు మేలు చేసే ప్రతి పని సత్కర్మే అవుతుంది. కీడు తలపెట్టకపోవడం, అందరూ బాగుండాలని కోరుకోవడం (మానసిక సత్కర్మ). మృదువుగా మాట్లాడటం, సత్యాన్ని పలకడం, ఎవరినీ మాటలతో గాయపరచకపోవడం(వాచిక సత్కర్మ). శ్రమించి పని చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, సమాజసేవ చేయడం(శారీరక సత్కర్మ). భారతీయ సంస్కృతిలో ‘యద్భావం తద్భవతి‘ అని అంటారు. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటే మన పనులు అలానే ఉంటాయి. భారతీయ జీవన విధానంలో, ధర్మశాస్త్రాలలో సత్కర్మాచరణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మనం చేసే పనులే మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనిషి పుట్టుకతో గొప్పవాడు కాడు, తను చేసే కర్మల (పనుల) ద్వారానే గొప్పవాడవుతాడు. మనం చేసే ప్రతి చిన్న మంచి పని సమాజంలో ఒక సానుకూల మార్పుకు నాంది పలుకుతుంది. కాబట్టి, ప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలి.రోజుకు కొంత సమయం సత్సాంగత్యంలో గడపడం వల్ల పోనుపోను మనసు ప్రక్షాళితమవుతుంది. ఒకరి అనుభవం, జిజ్ఞాస ఇతరులకు చేరతాయి. దీనివల్ల వేరే ఆలోచనలు దూరంగా ఉంటాయి. నిజజీవితంలో ఏదైనా కర్మ నిర్వర్తించేటప్పుడు, అది నాకు, ఇతరులకు మంచి చేస్తుందా అనే ప్రశ్న వేసుకోవడం, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా భగవదర్పితం చేయడం వల్ల మోక్షమార్గం సులువవుతుంది. మనసు పూర్తిగా ఆ పరమాత్మపై లగ్నమైనప్పుడు, లౌకికమైన భయాలు మనిషిని ఏమీ చేయలేవు. మనసుని దైవపరం చేయడం వల్ల మనం చేసే ప్రతి పనీ నిష్కామ కర్మ అవుతుంది. సంసారమనే సాగరంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, భగవంతుడనే నావ మనల్ని మునిగిపోనివ్వదు. క్రోధం, ఈర‡్ష్య, ద్వేషం వంటి అంతర్గత శత్రువులనే మంటలు మనల్ని దహించలేవు. మనసు ప్రశాంతమైన మలయమారుతంలా మారుతుంది. లోకంలో మన చుట్టూ ఉండే ప్రతికూలతలనే విషం వ్యక్తిత్వాన్ని లేదా మనశ్శాంతిని హరించలేదు.‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం లేకుండా, ‘అంతా దైవ నిర్ణయం, నేను కేవలం నిమిత్తమాత్రుడిని’ అనే భావంతో కర్మలు చేయడం వల్ల విజయం వచ్చినా పొంగిపోము, అపజయం ఎదురైనా కుంగిపోము.ఒక వ్యక్తి చేసే ’మంచి పని’ అనేది కేవలం ఎదుటివారికి సహాయం చేయడం మాత్రమే కాదు, అది సమాజంలో ఒక సానుకూల మార్పుకు పునాది వేస్తుంది. మంచి పనిని ఆచరించడానికి పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు, మన దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులే గొప్ప మార్పును తెస్తాయి. మంచి పని చేసేటప్పుడు ఏ గుర్తింపునూ లేదా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తే, అది పైన మనం చెప్పుకున్న ’నిష్కామ కర్మ’ అవుతుంది. ఫలితం ఆశించకుండా చేసే సాయం ఎప్పుడూ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.మానవ జీవితం కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ‘కర్మ’ అంటే పని. మనం చేసే పనులే మన భవిష్యత్తును, మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ‘సత్’ అంటే మంచి, ‘ఆచరణ’ అంటే అనుసరించడం. అంటే, శాస్త్ర సమ్మతంగా, ధర్మబద్ధంగా, పరోపకార భావంతో చేసే పనులనే సత్కర్మాచరణ అంటారు. ఒక వ్యక్తి చేసే మంచి పని సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి చెట్టు నాటితే, అది వందల మందికి నీడనిస్తుంది. డబ్బు, పదవులు శాశ్వతం కావు. మనిషి మరణించిన తర్వాత కూడా అతను చేసిన మంచి పనులు మాత్రమే జీవించి ఉంటాయి. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం ఒక చిన్న మంచి పనినైనా చేస్తూ సత్కర్మ మార్గంలో పయనించాలి.– ఆనంద ‘మైత్రేయ’మ్
ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!
పర్యాటకం కమ్ ఉపాధిని కల్పించేలా అద్బుతమైన కేఫ్ ఇది. అయితే ఇక్కడ మొత్తం ఆడవాళ్లే ఉంటారు. నిర్వహించేది..వంట చేయడం నుంచి క్లీనింగ్ వరకు మొత్తం ఆడవాళ్ల సామ్రాజ్యమే దర్శనమిస్తుంది. అలాంటి విచిత్రమైన కేఫ్ తూర్పు సిక్కింలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాబా హర్భజన్ సింగ్ పుణ్యక్షేత్రానికి సమీపంలో, 13,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది పూర్తిగా స్థానిక మహిళలతో కూడిన బృందంతో నడిచే కేఫ్. మారుమూల ఎత్తైన ప్రాంతంలో ఉండే ఈ కేఫ్ స్థితిస్థాపకత, వ్యవస్థాపకత, స్వావలంబనను ప్రతిబింబిస్తుంది. అంతేగాదు సందర్శకులకు ఓ గొప్ప అనుభవాన్ని అందిస్తోంది. ఈ కేఫ్ భారత ఆర్మీ చొరవతో ఏర్పాటైంది. స్థానికి భాగస్వాముల సమన్వయంతో త్రిశక్తి కార్ప్స్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించి, సులభతరం చేసింది. యుద్ధ భూమిని వీక్షించే కార్యక్రమంలో భాగంగా, ఈ ప్రాంత వారసత్వాన్ని, వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రదర్శిస్తూ సరిహద్దు ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కేఫ్ రూపుదిద్దుకుంది. ఇది ఒకరకరంగా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ..మారుమూల ప్రాంతా ఆర్థిక సాధికారతనకు దోహదపడుతోంది. అంతేగాదు జీవనోపాధిని ఇలా పర్యాటకంతో అనుసంధానించటంతో ఈ కార్యక్రమం సుస్థిర అభివృద్ధికి, పుణ్యక్షేత్రానికి పర్యాటకుల రాక పెరగడానికి తోడ్పడుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ ప్రయత్నం నిజంగా సమర్థవంతమైన సైనిక-పౌర సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతేగాదు ఇది సరిహద్దు ప్రాంతాలలో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి పట్ల భారత సైన్యం నిబద్ధతను బలోపేతం చేయడంతో పాటు, భారత పౌరులతో బలమైన సంబంధాలను పెంపొందిస్తుంది.(చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)
అంతర్జాతీయం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీకి తోడుగా పాక్ సైన్యం భారీ మోహరింపు
ఇస్లామాబాద్:పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ ఏ క్షణమైనా మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనిక బలగాలను పంపింది. సైనికులతో పాటు ఫైటర్ జెట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా పంపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. అయితే, ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఇరాన్‌తో సాంస్కృతిక, భౌగోళిక సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్ సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది.ఒప్పందం ప్రకారం, ఇరాన్ దాడులు చేస్తే తిప్పికొట్టేలా సైన్యం, యుద్ధ విమానాలను సౌదీకి పంపినట్లు భద్రతా అధికారులు ధృవీకరించారు. గతేడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. వాటిలో ప్రత్యర్థి దేశాల దాడుల సమయంలో ఒకరికొకరు అండగా నిలబడాలని నిబంధనలు ఉన్నాయి. పాకిస్థాన్-సౌదీ రక్షణ ఒప్పందం పూర్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ, ఒకరిపై దాడి జరిగితే మరొకరు రక్షణకు రావాల్సి ఉంటుందని ప్రకటించారు. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఈ ఒప్పందం సౌదీ అరేబియాను పాకిస్థాన్ అణు కవచం కింద ఉంచుతుందని సూచించారు.సమాచారం ప్రకారం, పాకిస్థాన్ ఏప్రిల్ ప్రారంభంలో 16 జేఎఫ్-17 యుద్ధ విమానాలు, రెండు డ్రోన్ స్క్వాడ్రన్లు, హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను సౌదీకి పంపింది. ఈ మోహరింపులో 8,000 సైనికులు ఉన్నారు. అవసరమైతే మరిన్ని సైనికులను పంపుతామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది.ఘర్షణ సమయంలో పంపిన సైనికులు, వైమానిక దళ సిబ్బంది ప్రధానంగా సలహా, శిక్షణ పాత్ర పోషిస్తారని అధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం గరిష్టంగా 80,000 పాకిస్థాన్ సైనికులను సౌదీకి పంపే అవకాశం ఉంది. అదనంగా యుద్ధ నౌకలు పంపే అంశం కూడా ఒప్పందంలో ఉంది.ఈ మోహరింపు ప్రతీకాత్మకంగా కాకుండా, యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, వేలాది సైనికులతో కూడిన పెద్ద స్థాయి చర్య అని వర్గాలు పేర్కొన్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, సౌదీ ఇరాన్‌పై గోప్య దాడులు జరిపింది. పాకిస్థాన్ గతంలో కూడా సౌదీకి సైనిక శిక్షణ, సలహా అందించింది. మరోవైపు, సౌదీ పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థిక సహాయం అందించింది.
పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్‌కు రహస్యంగా..
పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ ఏం చేసినా భారత్‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తుంది. భారత్ త్రివిధ దళాల వద్ద ఉన్న విధ్వంసకర ఆయుధాలను చూసి పాక్ భయపడుతుంది. భారత్‌లో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో, ఎలాంటి అణ్వాయుధ వ్యవస్థలు ఉన్నాయో అటువంటివి అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుంది. కానీ, అగ్ర దేశాల వద్ద అప్పులు అడుక్కునే పాక్ ఎన్నో రకాల ఆయుధాలను తన అమ్ములపొదిలో చేర్చుకోలేకపోయింది. ప్రపంచంలో 6 దేశాలకు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉంది. అవే.. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, భారత్. ఇక ఇజ్రాయెల్ వద్ద క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద అణు బాలిస్టిక్ క్షిపణిని మోసే ఒక సంప్రదాయ జలాంతర్గామి ఉంది. భారత్‌కు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉండడంతో తమకూ కావాలని పాక్ ప్రయత్నాలు జరిపింది.చైనా నౌకాదళం తమ గ్వాదర్ పోర్ట్‌ను శాశ్వతంగా వినియోగించుకునే అవకాశం ఇస్తామని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి ప్రతిఫలంగా అణుదాడి చేయగల సామర్థ్యం ఉన్న జలాంతర్గాములు లేదా అణు ఆయుధ వ్యవస్థను ఇవ్వాలని చైనాను పాక్ కోరిందని అమెరికాకు చెందిన ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ పేర్కొంది. శత్రుదేశం ముందుగా అణుదాడి చేసినా.. జలాంతర్గాముల నుంచి తిరిగి అణుదాడి చేసే శక్తిని పొందాలని పాక్ భావిస్తోంది. దీన్ని అణు నిరోధక వ్యవస్థలో అత్యంత కీలక భాగంగా భావిస్తారు.పాక్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించి.. పాకిస్థాన్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించామని, దాని ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నామని ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ తెలిపింది. 2024లో పాకిస్థాన్ సైన్యం-చైనా ద్వైపాక్షిక చర్చల్లో ఈ డిమాండ్ వచ్చిందని పేర్కొంది. ఆ సమయంలో పాకిస్థాన్ సైన్యానికి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నాయకత్వం వహించాడు. 2024 ఆరంభంలో గ్వాదర్‌ను చైనా సైన్యానికి శాశ్వత స్థావరంగా మార్చేందుకు అనుమతి ఇస్తామని చైనాకు పాకిస్థాన్ రహస్యంగా హామీ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు ఇవ్వాలని చైనాను కోరింది. దీంతో ఇప్పటికే పాక్ వద్ద ఉన్న గగనతల, భూతల అణ్వాయుధాల ద్వంద్వ వ్యవస్థను సముద్ర వ్యూహాత్మక ఆయుధాలతో కూడిన త్రివిధ వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిమాండ్ అసంబద్ధమని చైనా భావించడంతో చర్చలు నిలిచిపోయాయి.ఇమ్రాన్ ఖాన్‌ను అధికారంలో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేటివ్‌లోని కీలక అధికారి రహస్య కేబుల్ వివరాలు కూడా ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ వెల్లడించింది. దీంతో, అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్.. అటు చైనా, ఇటు అమెరికాతో చర్చోపచర్చలు జరిపినట్టు స్పష్టమైంది. గత ఐదేళ్లలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలను మలిచిన పరిణామాలను ఈ కథనం వివరించింది. అమెరికాతో సన్నిహితంగా ఉంటూనే.. వ్యూహాత్మక ఆయుధాలు ఇవ్వాలని చైనాతోనూ పాకిస్థాన్ బేరసారాలు జరిపింది.అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు 3 రకాలుగా ఉంటాయి.. అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు, బాలిస్టిక్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు.ఈ మూడింట్లో పాకిస్థాన్ దేన్ని కోరిందో పాకిస్థాన్ కథనంలో స్పష్టత లేదు. 1970 చివర, 1980 ఆరంభంలో చైనా సహకారంతో పాకిస్థాన్ అణుబాంబు తయారుచేసింది. రహస్య అణు సాంకేతిక బదిలీల్లో ఇదే తొలి ఉదాహరణగా భావిస్తున్నారు. అధిక సాంద్రత యురేనియం సరఫరాతో పాటు, 1960లలో పరీక్షించిన 12 కిలోటన్నుల సామర్థ్యమున్న సీహెచ్ఐసీ-4 అణు విస్ఫోటక రూపకల్పనను కూడా పాకిస్థాన్‌కు చైనా ఇచ్చింది. 1990లలో అణ్వాయుధాలను ప్రయోగించే ఎం-11 మధ్యదూర బాలిస్టిక్ క్షిపణులను కూడా పాకిస్థాన్‌కు చైనా విక్రయించింది.ఈ ఆయుధాలతో గగనతలం, భూమి నుంచి ప్రయోగించే ద్వంద్వ అణు వ్యవస్థను పాకిస్థాన్ తయారుచేసుకుంది. కానీ త్రివిధ వ్యవస్థలో మూడో భాగమైన సముద్ర ఆధారిత అణ్వాయుధ సామర్థ్యం మాత్రం సాంకేతిక, ఆర్థిక పరిమితుల వల్ల సాధ్యం కాలేదు.సముద్రం అడుగునుంచి ప్రయోగించే అణ్వాయుధాను అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా భావిస్తారు. శత్రువు తొలి అణుదాడి చేసినా, తీవ్ర నష్టం జరిగిన తర్వాత కూడా ప్రతిదాడి చేయొచ్చు. 2017లో 450 కిలోమీటర్ల పరిధితో జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి త్రివిధ అణు వ్యవస్థ పూర్తి చేశామని పాకిస్థాన్ ప్రకటించింది. కానీ పాకిస్థాన్ వద్ద కేవలం 5 క్రియాశీల సంప్రదాయ జలాంతర్గాములు మాత్రమే ఉండటం, క్షిపణి పరిధి తక్కువగా ఉండటం వల్ల ఇది ప్రాథమిక స్థాయి సముద్ర అణు నిరోధక వ్యవస్థగానే మిగిలింది.
ఇజ్రాయెల్‌కు పదులకొద్దీ విమానాల్లో మందుగుండు సామగ్రి
టెల్ అవీవ్: జర్మనీలోని స్థావరాల నుంచి అమెరికాకు చెందిన పదుల కొద్దీ కార్గో విమానాలు మందుగుండు సామగ్రితో సోమవారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో దిగినట్లు అల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్ 13 సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.ఇరాన్‌పై మరోసారి దాడులు ప్రారంభించే ఉద్దేశంతోనే వాషింగ్టన్ చర్యలు కొనసాగుతున్నాయన్న అనుమానాలు పెరిగాయి. దీంతో పశ్చిమాసియా ఘర్షణ మరింత ఉద్ధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా చర్యలు ఇరాన్‌పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో భాగమని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.యురేనియం నిల్వలు, ఆంక్షల సడలింపు, యుద్ధ నష్టపరిహారం అంశాలపై చర్చలు నిలిచిపోయిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్ ముందున్న సమయం వేగంగా ముగుస్తోంది. వారు వెంటనే కదలాలి. లేకపోతే వారి దగ్గర ఏమీ మిగలదు. సమయం అత్యంత కీలకం” అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు.చర్చలు పునఃప్రారంభించేందుకు అమెరికా విధించిన ప్రధాన షరతులను ఇరాన్ మీడియా బయటపెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. 400 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించాలని, ఒక అణు కేంద్రాన్ని మాత్రమే కొనసాగించాలని, యుద్ధ నష్టపరిహారం డిమాండ్‌ను వదులుకోవాలని అమెరికా కోరింది.దీనికి ప్రతిగా టెహ్రాన్ కూడా చర్చలపై 5 షరతులు పెట్టింది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా లెబనాన్‌లో సైనిక చర్యలు ముగియాలని, ఇరాన్‌పై ఆంక్షలు తొలగించాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.అదనంగా యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలని, హార్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ వ్యూహాత్మక మార్గంలో నౌకల రాకపోకలపై ఇరాన్ నియంత్రణ కఠినతరం చేసింది. మరోవైపు ఇరాన్ పోర్టులు, సముద్ర వాణిజ్యంపై అమెరికా విస్తృత నౌకాదళ దిగ్బంధంతో ఒత్తిడి పెంచింది.
చైనాలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు
గ్వాంగ్సీ : చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతాన్ని భయంకరమైన ప్రకృతి విపత్తు వణికించింది. సోమవారం తెల్లవారుజామున సంభవించిన 5.2 తీవ్రత గల భారీ భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ప్రాణభయంతో ఒక్కసారిగా ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు. కళ్ల ముందే క్షణాల వ్యవధిలోనే పలు బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇద్దరు మృత్యువాత గ్వాంగ్సీ పరిధిలోని లియోజౌ నగరం, అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాలను ఈ భూకంపం అత్యంత తీవ్రంగా కుదిపేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరు గల్లంతైనట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా, సీసీటీవీ తమ కథనాల్లో వెల్లడించాయి. ఈ విపత్తులో గాయపడిన మరో నలుగురు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని ఉన్నతాధికారులు తెలిపారు.నేలమట్టమైన 13 భవనాలుభారీ ప్రకంపనల ధాటికి ఆ ప్రాంతంలో ఏకంగా 13 భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయని అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా ప్రాణనష్టాన్ని నివారించే ఉద్దేశ్యంతో ప్రభావిత ప్రాంతాల నుంచి ఏకంగా 7,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక, పునరావాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రైల్వే వ్యవస్థపై ప్రభావంభూకంపం దెబ్బకు రైల్వే వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. రైల్వే మౌలిక సదుపాయాలకు వాటిల్లిన నష్టాన్ని, భద్రతా పరిస్థితులను అంచనా వేసేందుకు నిపుణుల బృందాలు విస్తృత తనిఖీలు ప్రారంభించాయి. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలకు, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఆఫ్టర్ షాక్స్ (మరిన్ని ప్రకంపనలు) వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో, అదనపు నష్టం జరగకుండా నివారించేందుకు అత్యవసర సహాయక సిబ్బందిని భారీ సంఖ్యలో మోహరించారు.
జాతీయం
మమతకు సీఎం సువేందు ఝలక్
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. గత టీఎంసీ పాలనలో జరిగిన అవినీతి, మహిళలపై నేరాలపై దర్యాప్తు కోసం ఆయన రెండు కమిషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్లలో ఒక దాని కీలక బాధ్యతలు సీనియర్ ఐపీఎస్ అధికారిణి దమయంతి సేన్‌కు ఆయన అప్పగించారు. దమయంతి సేన్ 1996 బ్యాచ్ అధికారిణి. కోల్‌కతాకు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ కూడా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్క్ స్ట్రీట్ గ్యాంగ్‌రేప్ కేసు(2012) కేసును స్వయంగా చేధించి.. నిందితులను తక్కువ టైంలోనే పట్టుకున్నారామె. ఆ సమయంలో దేశం మొత్తం ఆమెపై ప్రశంసలు గుప్పించింది. అయితే.. (పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేసు కేసు గురించి.. 2012 ఫిబ్రవరి 6వ తేదీన ఒక మహిళపై కారులో గ్యాంగ్‌రేప్ జరిగింది)ఈ కేసు విషయంలోనే ఆమె అప్పటి దీదీ సర్కార్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఆ సమయంలో మమతా బెనర్జీ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ కేసు ఒక కల్పితం అని, టీఎంసీ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్రగా అభివర్ణించారామె. అంతటితో ఆగకుండా దమయంతిని క్రైమ్ బ్రాంచ్ నుంచి ట్రైనింగ్ కాలేజీకి బదిలీ చేశారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. నిజాయితీకి మమత ప్రభుత్వం ఇచ్చిన కానుక అంటూ బీజేపీ, వామపక్షాలు తిట్టిపోశాయి.అటు ఆ టైంలో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు లభించింది. అయితే మమతా సర్కార్ తీసుకున్న నిర్ణయంపై దమయంతి సేన్ ఇన్నేళ్లు మౌనంగా పాటించారు. రోటీన్ ట్రాన్స్ఫర్ను అంగీకరించి తన విధుల్ని చేసుకుంటూ పోయారు. ఆపై ప్రమోషన్ల విషయంలోనూ ఆమెకు అన్యాయమే జరిగిందని.. పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టింగ్‌లు ఇస్తూ వచ్చారని విమర్శలు ఉన్నాయి. అయితే ఆమె సిన్సియారిటీని గుర్తించిన కలకత్తా హైకోర్టు.. 2022లో నాలుగు అత్యాచార కేసులు, రసికా జైన్ మరణం కేసును అప్పగించి మమతా సర్కార్‌కు ఝలక్ ఇచ్చింది.తాజాగా.. రిటైర్డ్ జస్టిస్ సంపతి చటర్జీ అధ్యక్షతన నేతృత్వంలో సువేందు సర్కార్ కమిషన్ వేయగా.. దమయంతి సేన్‌ను అందులో మెంబర్ సెక్రటరీగా నియమించారు. ఈ కమిషన్ మహిళలు, పిల్లలపై దాడులను పరిశీలించనుంది. ఇందులో సందేశ్‌ఖాలి, కస్బా, బోగ్టుయి వంటి కేసులు కూడా ఉన్నాయి. దమయంతి సేన్ తిరిగి కీలక బాధ్యతల్లోకి రావడం.. బెంగాల్ రాజకీయాల్లో ఒక ముఖ్య పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
భర్త.. రెండో భర్త.. ఇద్దరు ప్రియులు!
వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఏదో ఒక మూల రోజుకో దారుణం జరుగుతోంది. ప్రేమ, మోసం, హత్య, మృతదేహాన్ని దాచిపెట్టడం.. ఇలా ఒక్కో తీరు నేరాలు బయటపడుతున్నాయి. తాజాగా గుజరాత్లో బయటపడ్డ ‘శాంతిగిరి కేసు’ ట్విస్టుల మీద ట్విస్టులను ఇచ్చింది. ఈ తరహా కేసుల్లోనే ఓ కొత్తదనం చూపించింది. సురేంద్రనగర్ జిల్లాలో శాంతిగిరి గోస్వామి అనే వ్యక్తి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలోనే అతను దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ కేసును చేధించిన పోలీసులు.. నిందితుల నుంచి విస్తుపోయే వివరాలను సేకరించారు. అసలేం జరిగిందంటే.. జాగృతి గోస్వామి అనే మహిళ సుఖ్దేవ్గిరి గోస్వామిని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కొంతకాలానికి ఆమె తన భర్త పెద్ద అన్న శాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. భర్తను, పిల్లలను వదిలి.. అతనితో పారిపోయి మరో గ్రామంలో కొత్త జీవితం మొదలుపెట్టింది. అయితే అక్కడా ఆమె బుద్ధి వక్రదారి పట్టింది. శాంతిగిరి ట్రక్ డ్రైవర్ పని కోసం తరచూ బయట ఉండేవాడు. ఈ సమయంలో కాంతిలాల్ అలియాస్ భారత్ సబారియా అనే వ్యక్తితో జాగృతి సంబంధం పెట్టుకుంది. కాంతిలాల్ ఏకంగా జాగృతి ఇంటి పక్కనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. శాంతిగిరి లేని సమయంలో ఇద్దరూ కలుసుకునేవారు. అయితే ఏదో ఒకరోజు తమ విషయం తెలుస్తుందని.. శాంతిగిరిని అడ్డు తొలగించుకోవాలని ఆ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యూనిస్ అనే వ్యక్తికి 25,000 సుపారీ ఇచ్చారు. అయితే యూనిస్ ‘భలే’ మోసం చేశాడు. నిద్రపోతున్న శాంతిగిరిని ఫోటో తీసి హత్య చేశానంటూ జాగృతికి పంపాడు. అయితే మరుసటి రోజు ఉదయం భర్త బతికే ఉండడంతో జాగృతి షాక్‌కు గురైంది. తీరా చూస్తే యూనిస్ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో జాగృతి, కాంతిలాల్ స్వయంగా హత్యకు ప్లాన్ చేశారు. నిద్రిస్తున్న శాంతిగిరి గొంతును కాంతిలాల్ నులిమి చంపగా.. జాగృతి దుప్పటి తోసి శబ్దం రాకుండా చేసింది. ఆపై శవాన్ని గదిలో దాచారు. ఆ తర్వాత దీపక్ అలియాస్ మున్నా అనే వ్యక్తి సహాయంతో కారులో తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు కథ అల్లే ప్రయత్నం చేశారు. శాంతిగిరి కొత్త ఉద్యోగం కోసం బయటి ఊరికి వెళ్లాడని.. ఫోన్ నెంబర్ మార్చాడని అందరినీ నమ్మించారు. అలా ఎనిమిది నెలలు గడిచాయి. ఈ గ్యాప్‌లో కాంతిలాల్‌కు తెలియకుండా దీపక్‌తో ఆమె వ్యవహారం నడిపించింది. అయితే.. శాంతిగిరి బంధవుల ఎంట్రీతో సీన్ మారింది. జాగృతి ప్రవర్తనపై అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు వాళ్లు. అలా ఈ మిస్సింగ్ మిస్టరీ కేసు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు చేరింది. రెండు నెలల దర్యాప్తులో పక్కా ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందం.. జాగృతి, కాంతిలాల్‌ను అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న దీపక్ కోసం గాలింపు చేపట్టింది.
ఆ ఇంటి దీపం ఆరిపోలేదు
అనుకోని రీతిలో మృత్యువు ఆమెను కబళించింది. అయితే అంత విషాదంలోనూ ఆమె భర్త శెభాష్ అనిపించే నిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల దాడిలో చనిపోయిన తన భార్య కళ్లను దానం చేశారు. కర్ణాటకలో పర్యాటక ప్రాంతం కొడగు జిల్లా దుబారే వద్ద ఏనుగుల పొట్లాటలో ఓ మహిళ నలిగి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వైద్యుల సలహా మేరకు మృతురాలు తులసి కళ్లను దానం చేశాడు భర్త జోయెల్. తద్వారా ఆమె చూపు మరొకరి జీవితంలో వెలుగుని నింపుతుందని.. ఇలాగైనా తాను జీవించి ఉంటుందని చెబుతూ ఆ భర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు. Heartbreaking Yet Inspiring Story of Love & Humanity ❤️Tulsi, lost her life in a tragic elephant attack at Dubare. Even in the deepest pain, her husband Joel showed extraordinary strength and compassion.Following doctors’ advice (as the body was severely injured), Joel… pic.twitter.com/gO3VuwF8Q0— Aparajite (@amshilparaghu) May 18, 2026ఏనుగులను చూసేందుకు దుబారే శిబిరం, దాని సమీప కావేరి నది వద్దకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సోమవారం కూడా తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) కుటుంబం అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలోనే కావేరి నది వద్దకు ఏనుగులను మావటీలు స్నానానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో రెండు ఏనుగులు పోట్లాడుకోగా.. అందులో ఒకటి అక్కడే ఉన్న ఝాన్సీపై పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేె లోపు మృతి చెందింది. ఆమె భర్త, కుమార్తె ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో భార్యను రక్షించుకునేందుకు జోయెల్ చేసిన ప్రయత్నం.. వీడియోగా నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఆమె శరీరం ఏనుగు కింద పడి నలిగిపోగా.. కళ్లు మాత్రం దెబ్బతినలేదు.Today, a tragic incident at Dubare Elephant Camp in Kodagu district, Karnataka, India.A 33-year-old tourist died after a temporary structure collapsed during an elephant bathing session following a clash between two elephants. pic.twitter.com/lfKJ5tpM6i— Weather Monitor (@WeatherMonitors) May 18, 2026
ఫ్రీ బస్సుతో కేరళ ఖజానాకు చిల్లు?
తిరువనంతపురం: కేరళలో కొత్తగా కొలువుదీరిన యూడీఎఫ్ (యూడీఎప్) ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రకటించిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకం ఒకవైపు ఆడపడుచుల్లో ఆనందం నింపుతున్నా.. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జూన్ 15 నుంచి కేఎస్ఆర్టీసీ బస్సుల్లో అమలు కానున్న ఈ పథకంతో అటు రవాణా వ్యవస్థకు, ఇటు రాష్ట్ర ఖజానాకు మోయలేనంత ఆర్థిక భారం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రైవేట్ రవాణా వ్యవస్థకు ఉరితాడు!కేరళలో దాదాపు 80 శాతానికి పైగా ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల పైనే ఆధారపడి ఉన్నారు. మహిళలకు కేఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తే, తమ బస్సుల్లో కేవలం విద్యార్థులు మాత్రమే మిగులుతారని, ఇది ప్రైవేట్ బస్ సెక్టార్‌ను నాశనం చేస్తుందని ఆపరేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కనీసం డీజిల్ కొట్టించడానికి, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. గోపీనాథన్ వాపోతున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని, రవాణా శాఖ మంత్రిని కలిసి తమ సమస్యను వివరించనున్నట్లు వారు తెలిపారు.అప్పుల కుప్పగా మారనున్న కేరళ?ఈ ఉచిత హామీతో రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కేరళ తీవ్ర ఆర్థిక లోటుతో సతమతమవుతోంది. రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పులు చేయాల్సిన ఈ తరుణంలో.. అదనపు సంక్షేమ పథకాలతో సబ్సిడీ భారం లక్ష కోట్ల రూపాయలు దాటే ప్రమాదం ఉందని, తద్వారా అభివృద్ధి పనులు కుంటుపడతాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన కేఎస్ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పొరుగు రాష్ట్రాల పాఠాలు ఏవి?కర్ణాటకలో అమలు చేస్తున్న ‘శక్తి’ పథకానికి ఏటా రూ. 5,300 కోట్లు ఖర్చవుతుండటంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడింది. తెలంగాణలో కూడా ఉచిత ప్రయాణ హామీతో ఆర్థిక ఒత్తిడి పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, మహిళలందరికీ కాకుండా, మత్స్యకార్మికులు, కార్మికుల వంటి అట్టడుగు వర్గాలకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేస్తే ఆర్థికంగా అంతగా ఇబ్బందులు ఎదురుకావని సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆర్జీ కర్ కేసు: సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి
ఎన్ఆర్ఐ
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్‌కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్‌ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
క్రైమ్
మొయినాబాద్ జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి,హైదరాబాద్: మొయినాబాద్ జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన మొత్తం ఎనిమిది మంది చంపేందుకు నిందితురాలు కరీమాబేగం, ఆమె భర్త రెహమాన్ ప్లాన్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.తాండూరు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే కరీమాబేగం, రెహమాన్ దంపతులు ఆబేదాబేగం, మహబూబాబీ అనే ఇద్దరు మహిళల వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. అప్పు తీసుకున్న తర్వాత నెలలు గడుస్తున్నా కరీమాబేగం దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో వారిపై మహిళలిద్దరూ ఒత్తిడి చేశారు. దీంతో వారిని చంపేయాలని కరీమాబేగం, రెహమాన్ కుట్ర చేశారు. కుట్రలో భాగంగా అప్పు ఇస్తానంటూ మొయినాబాద్ సమీపంలోని తోల్కట్ట ఫాంహౌస్ వద్దకు రావాలని సమాచారం అందించారు. అలా వచ్చిన బాధితుల్ని వేర్వేరు సమయాల్లో గొంతు నులిమి హత్య చేశారు. అక్కడే గొయ్యి తీసి మృత దేహాల్ని పూడ్చిపెట్టారు.మిస్సింగ్ కంప్లయింట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జంట హత్యకేసును ఛేదించారు. తాజాగా పోలీసుల దర్యాప్తులో నిందితులు అప్పు తీసుకున్న ఆరుగురిని హతమార్చేందుకు ఫామ్ హౌస్‌కు పిలిపించుకున్నారని, అప్పు ఇస్తానని చెప్పి ప్రాణం తీసేందుకు ప్రయత్నించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మాజీ మిస్ పూణే అనుమానాస్పద మృతి : దిగ్భ్రాంతి పర్చే లాస్ట్ మెసేజెస్
భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు నెలల గర్భిణి అయిన ట్విషా (31) భోపాల్‌లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి ముందు తన స్నేహితులకు పంపిన చివరి సందేశాలు వాట్సాప్ చాట్ కలకలం రేపుతోంది. తొందరపడి పెళ్లి చేసుకోవద్దు అంటూ ఆమె తన స్నేహితులకు పంపిన సందేశాలు ఆమె తీవ్రమైన మానసిక ఆందోళన, ఒంటరితనం, పెళ్లి తర్వాత వేదనలో ఉన్నట్లు ఆ మెసేజ్‌ల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఆమె ఉరి వేసుకోవడానికి ఉపయోగించినట్టు చెబుతున్న బెల్టును పోస్ట్‌మార్టంకు ఎయిమ్స్ భోపాల్‌కు పంపకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ కేసును పక్క దారి పట్టిస్తున్నారంటూ భోపాల్ పోలీసులపై ఆరోపణలు కుదిపేస్తున్నాయి. దర్యాప్తు సమగ్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అసలు ఏం జరిగింది?నోయిడాకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన ట్విషా శర్మ, ఢిల్లీలో ఉద్యోగం చేసేది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన లాయర్ సమర్థ్ సింగ్‌ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన అయిదు నెలలకే, మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన భర్త ఇంట్లో ట్విషా శవం వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆమె మరణం ఉరి వేసుకోవడం వల్లే జరిగిందని తేలినప్పటికీ, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాల గుర్తులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్‌మీడియా చాట్స్ కీలకంగా మారాయి.మే 7న ఒక స్నేహితురాలితో వాట్సాప్ చాట్‌లో.. "నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. నా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను. పెళ్లి కుటుంబాన్ని ఇస్తుంది, కానీ ఎక్కడున్నా మన కోసం మనం పని చేయడం ఆపకూడదు" అని పేర్కొంది. పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. బాగా ఆలోచించి ముందడుగు వేయండి" అని స్నేహితురాలిని హెచ్చరించింది. అలాగే తనకు ఇల్లు, స్నేహితులు బాగా గుర్తొస్తున్నారని వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో స్నేహితుడితో మాట్లాడుతూ.. "నేను చిక్కుకుపోయాను బ్రో (I am trapped bro). నువ్వు మాత్రం ఇలాంటి వాటిలో ఇరుక్కోవద్దు. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, సమయం వచ్చినప్పుడు కాల్ చేస్తాను" అని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.న్యాయం కోసం రోడ్డెక్కిన కుటుంబంట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ (రిటైర్డ్ జడ్జి)లపై కుటుంబ సభ్యులు హత్య, కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. భర్త, అత్తమామలు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపించారు. నిందితులు ప్రభావవంతమైన వ్యక్తులు కావడం వల్ల వారికి ముందస్తు బెయిల్ లభించిందని, దీనివల్ల స్థానిక పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగకపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంపై న్యాయం చేయాలని, ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi)లో మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ట్విషా కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసం వెలుపల నిరసన చేపట్టారు. భోపాల్ వచ్చినప్పటి నుండి తాము ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడం కోసం మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ట్విషా తండ్రి నవనిధి శర్మ, సోదరుడు ఆశిష్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు .స్థానిక పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.నిందితుల కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉండటంతో పాటు, వారికి సమీప బంధువైన వ్యక్తి లోకాయుక్తగా ఉండటంతో కేసును ప్రభావితం చేస్తున్నారని తండ్రి నవనిధి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కుటుంబ సభ్యుల ప్రకారం పెళ్లయిన దగ్గర్నుంచీ ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో తిరిగి వచ్చేయాలని ఆమె భావించింది. ఇంతలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ లభించిందని చెప్పారు. బెయిల్‌ను సవాలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం
ప్రేమోన్మాది మణితేజ మృతి
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వైష్ణవిని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన ప్రేమోన్మాది మణితేజ (29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం వైష్ణవి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులు ముగించుకుని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా నిందితుడు కత్తితో దారుణంగా మెడ, గొంతుపై విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. రక్తం మరకలతో పారిపోతున్న మణితేజను స్థానికులు పట్టుకుని కాళ్లు చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతని తలపై రాళ్లు ఎత్తివేయడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మణితేజను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. హైదరాబాద్‌లో పరిచయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మణితేజ ల్యాండ్రీ షాప్ నిర్వహించేవాడు. గతంలో వైష్ణవి ఓ హాస్టల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విద్యార్థుల దుస్తులు ఉతికి, ఇస్త్రీచేసి అప్పగించే సందర్భంగా ఆమెతో పరిచయం ఏర్పడింది. తర్వాత వైష్ణవి అక్కడ ఉద్యోగం మానేసినా ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే తాను ప్రేమిస్తున్నట్లు వైష్ణవిని వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల వైష్ణవికి వెళ్లి కుదిరిందన్న సమాచారం తెలియడంతో మణితేజ తన ప్రేమను కాదన్న వైష్ణవిని హతమార్చాలని నిర్ణయించుకుని.. జడ్చర్లకు వచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.కాగా, మణితేజ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి, తమ్ముడు ఉన్నారు. హత్య అనంతరం వైష్ణవి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మణితేజ మృతి చెందాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చారు. ఈ క్రమంలో వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు వారిపై దాడిచేస్తారన్న అనుమానంతో పోలీసులు వారిని జడ్చర్ల సమీపంలోని డీటీసీలో ఉంచి రక్షణ కల్పించారు. అప్పటి దాకా మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. జడ్చర్లలో వైష్ణవి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనరల్ ఆస్పత్రిలో మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
ఆస్తి కోసం తల్లీకూతుళ్ల దారుణ హత్య
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్‌గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.
వీడియోలు
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సనాతన ధర్మంపై టీవీకే ఎమ్మెల్యే యూటర్న్
పాస్టర్ అభినయ్ పై దాడి.! అసలేం జరిగింది.!!
తిరుపతి జిల్లా బాలుపల్లి చెక్ పోస్ట్ వద్ద కారు ప్రమాదం
అషు రెడ్డి కేసులో విచారణ వేగం బ్రేకప్ అంశంపై కీలక కామెంట్స్
బండి భగీరథ్ కేసు వెలుగులోకి సంచలన విషయాలు?
నీకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదని... అసలు బుర్ర ఉండి మాట్లాడుతున్నావా?
ఖాకీల కర్కశత్వం.. లాఠీ దెబ్బలకు యువకుడు ఆత్మహత్య
సముద్రంలో కొత్త యుద్ధం..! అమెరికా నౌకలపై 'సూసైడ్ డాల్ఫిన్లు'
మీరేమో ఒకర్ని కనాలి.. పేదలను ముగ్గురిని కనమని చెప్తారా..?


