మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-2026 ‘ప్లే ఆఫ్స్’లో అడుగుపెట్టింది. చెపాక్ వేదికగా సోమవారం జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి.. టాప్-4 బెర్తును ఖరారు చేసుకుంది. అంతేకాదు తమతో పాటు గుజరాత్ టైటాన్స్‌ను కూడా ‘ప్లే ఆఫ్స్’కు చేర్చింది.
ఇక ఈ సీజన్‌లో ముందుగా డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ముందుగా బెర్తు ఖాయం చేసుకోగా.. ఇప్పుడు మిగిలిన మరో స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ జట్లు రేసులో ఉన్నాయి.
సహనం కోల్పోయిన క్లాసెన్
ఇదిలా ఉంటే.. చెన్నైతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ సహనం కోల్పోయాడు. మెరుపు వేగంతో తనను స్టంపౌట్ చేసిన చెన్నై వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను అసభ్యంగా దూషించాడు.
Sanju Samson ಕಡೆಯಿಂದ Dhoni-level stumping! 🔥🤯
ವೀಕ್ಷಿಸಿ | Race to Playoffs 👉 #CSKvsSRH | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ. #TATAIPL pic.twitter.com/v9uADWD2YG— Star Sports Kannada (@StarSportsKan) May 18, 2026
180 పరుగులు
సొంతమైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (27 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కార్తీక్ శర్మ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు.
మెరుపు వేగంతో
అయితే, జోరు మీదున్న క్లాసెన్‌ను చెన్నై బౌలర్ నూర్ అహ్మద్.. తన స్పిన్ మాయాజాలంతో ట్రాప్ చేశాడు. పదిహేనో ఓవర్లో అతడు సంధించిన మూడో బంతిని ఆడటంలో క్లాసెన్ విఫలమయ్యాడు. ఇంతలో బంతిని అందుకున్న వికెట్ కీపర్ సంజూ.. ధోనిని గుర్తుచేస్తూ మెరుపు వేగంతో స్టంప్స్ గిరాటేశాడు.
Heated argument between sanju and klaseen #cskvssrh#sanjusamson#HeinrichKlaasen pic.twitter.com/A2noDYjGk9
— NOTHING (@Nothing_il9zO) May 18, 2026
సంజూను దూషించిన క్లాసెన్!
ఈ క్రమంలో రీప్లేలో క్లాసెన్ కాలు గాల్లో ఉన్నట్లుగా తేలడంతో అతడు అవుటయ్యాడు. దీంతో సంజూ, నూర్ సంబరాలు చేసుకోగా.. క్లాసెన్ కోపంగా సంజూను దూషించినట్లు కనపడింది. సంజూ కూడా బదులిచ్చేందుకు రాగా.. నూర్ సైతం క్లాసెన్ పైకి వెళ్లాడు. ఇంతలో శివం దూబే, ఫీల్డ్ అంపైర్లు వచ్చి ఇరు వర్గాలను విడదీయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. క్లాసెన్ ప్రవర్తన పట్ల విమర్శలు వస్తున్నాయి. సీనియర్ ప్లేయర్ నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. కాగా ఈ ఘటన నేపథ్యంలో క్లాసెన్‌ను బీసీసీఐ మందలించే అవకాశం ఉంది.


