Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Massive Earthquake Strikes Argentina1
అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

బ్యూనోస్ ఎయిర్స్: అర్జెంటీనాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనాలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4గా నమోదైంది. దాంతో చిలీ, అర్జెంటీనా, దక్షిణ అమెరికా తీరాలను భూకంపం కుదిపేసింది. మరో రెండు భూప్రకంపనలు కూడా నమోదయ్యాయి. ఫలితంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.దక్షిణ అర్జెంటీనాలోని ఉషుయాకు దక్షిణంగా 219 కి.మీ దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్ వద్ద ఉదయం 9 సమయంలో ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. చిలీ తీరంలోని కొన్ని ప్రాంతాలను సాధారణ అలల స్థాయి కంటే 3 నుండి 10 అడుగుల ఎత్తులో అలలు తాకవచ్చని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఒక మీటర్ ఎత్తు వరకు చిన్న అలలు కూడా అంటార్కిటికా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపే అవకాశం ఉందని పేర్కొంది.

CM Chandrababu Ready To Debt 7 thousand Crore Next Week2
వచ్చే మంగళవారం.. మరో భారీ అప్పుకు బాబు సిద్ధం!

విజయవాడ: ఇప్పటివరకూ రికార్డ్ స్థాయిలో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరో భారీ అప్పుకు రెడీ అయ్యింది. రాష్ట్రాన్ని అప్పులు చేసి నడిపించడంలో భాగంగా వచ్చే మంగళవారం రూ. 7వేల కోట్ల అప్పుకి ఇండెంట్ పెట్టింది. రిజర్వ్ బ్యాంకుకి ఇండెంట్ పెట్టింది చంద్రబాబు సర్కార్. ఇప్పటివరకూ లక్షా 52 వేల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మళ్లీ రూ. 7వేల కోట్ల అప్పుకి సిద్ధం కావడం గమనార్హం.ఎన్నికల సమయంలో సంపద సృష్టి తనతోనే సాధ్యమని చెప్పిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల సృష్టి కోసమే వేట కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు.

Sai Sudarsan Creates Histtoy, Second Batter Fewest innings taken for 2000 runs in T20s3
చ‌రిత్ర సృష్టించిన సాయి సుదర్శన్‌.. సచిన్ రికార్డు బ‌ద్ద‌లు

ఐపీఎల్‌-2025లో గుజ‌రాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయిసుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగం‍గా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సుదర్శన్ విధ్వం‍సం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ఊతికారేశాడు. ముఖ్యంగా గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన స్టార్ పేసర్ మహ్మద్ షమీకి సుదర్శన్‌ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్‌లో ఐదు ఫోర్ల సాయంతో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న 9 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యంతవేగంగా 2000 పరుగుల మైలు రాయిని అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా సాయి సుదర్శన్ రి​కార్డు సృష్టించాడు. సుదర్శన్ కేవలం 54 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉండేది. సచిన్ ఈ ఘ‌న‌త‌ను 59 ఇన్నింగ్స్‌ల‌లో అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో స‌చిన్ రికార్డును ఈ త‌మిళ‌నాడు బ్యాట‌ర్ బ్రేక్ చేశాడు. ఓవ‌రాల్‌గా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ షాన్ మార్ష్‌(53) అగ్రస్దానంలో ఉండ‌గా.. రెండో స్దానంలో సుద‌ర్శ‌న్ కొన‌సాగుతున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రాడ్ హాడ్జ్ , మార్కస్ ట్రెస్కోథిక్, ముహమ్మద్ వసీం పేరిట సంయుక్తంగా ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిని సుదర్శన్ అధిగమించాడు. చ‌ద‌వండి: బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌లకు షాక్‌.. అకౌంట్లు బ్లాక్‌

PM Narendra Modi AP Tour Updates4
పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు

PM Narendra Modi AP Tour Updatesవెలగపూడి:02-05, 5.10 PMప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీమీ అందరిని కలవడం నాకు ఆనందంగా ఉందిఏపీకి కేంద్రం సంపూర్ణం సహకారం అందిస్తుందిమౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాంఏపీలో కనెక్టవిటీ వేగంగా అభివృద్ధి చెందుతుందికనెక్టివిటీ అభివృద్ధి చెందితే అన్ని రంగాలకు లబ్ధిదీంతో రవాణా రంగం అభివృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుందిరైల్వే బడ్జెట్‌ లో ఏపీ వాటా 10 రెట్లు పెరిగిందికేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందిరూ. 9 వేల కోట్లకు పైగా ఏపీకి కేటాయిస్తున్నాంఏపీలో వందశాతం రైల్వేల విద్యుదీకరణ జరిగిందిమౌలిక సదుపాయాల కల్పనతో ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేస్తున్నాంనిర్మాణ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయిగత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జిలు నిర్మించాంఏపీకి వందే భారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్లు కేటాయించాంహైవేల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందిపంట బీమా యోజన కింద రైతులకు ఇప్పటివరకూ రూ. 5,500 కోట్లు ఇచ్చాంఅంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహిస్తాంజూన్‌ 21 యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఏపీకి వస్తానాగాయలంక క్షిపణి కేంద్రంతో దేశ రక్షణకు కొత్త శక్తి వస్తుందియూనిటీ మాల్‌ తో స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయియూనిటీ మాల్‌ లో హస్త కళాకారుల ఉత్పత్తులు ఒకేచోట అందుబాటులో ఉంటాయిరైతుల వికాసానికి కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోందిపథకాలు, పరిహారం కింద రైతులకు రూ. 17 వేల కోట్లు ఇచ్చాంపీఎం సమ్మాన్‌ నిధి ద్వారా రైతులకు సాయం చేస్తున్నాం02-05, 4.55 PMపలు ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ శంకుస్థాపనలువేదికపై నుంచి ప్రాజెక్టుల శంకుస్థాపనలు చేసిన మోదీమొత్తం 18 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలుఅమరావతిలో రూ. 49 వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారంరూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు సైతం మోదీ శంకుస్థాపనలురాజధాని సహా రూ. 58 వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు02-05, 2:50PMప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం మధ్యా­హ్నం 2.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు మోదీ,. ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ప్రధానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో వెలగపూడి సభా ప్రాంగణానికి బయల్దేరి వెళ్లారు. పలు కేంద్ర ప్రాజెక్ట్‌ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా 18 ప్రాజెక్ట్‌ లకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారీ భద్రత ఏర్పాట్లు..ప్రధాని పర్యటనకు పోలీ­సు­లు భారీ భద్రతా ఏర్పా­ట్లు చేస్తున్నారు. 6 వేల మందికి పైగా పోలీస్‌ బలగా­లను మోహ­రించారు. భద్రతను పర్యవేక్షించేందుకు 19 మంది ఐపీఎస్‌ అధికారులను నియమించారు. అమరావతి­లోని సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గా­ల­ను ఖరారు చేశారు. వాటిలో రెండు మార్గాలను ప్రముఖులకు కేటాయించారు. సభా ప్రాంగణం పరిసరాలను ఎన్‌ఎస్‌జీ కమెండోలు ఆ«దీనంలోకి తీసుకున్నారు. సభ కోసం 5 లక్షల మందిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యత రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులకు అప్పగించింది. జన సమీకరణ కోసం 4,500 ఆర్టీసీ బస్సులను కేటాయించింది.

Folk Dancer Janulyri Burst Into Tears, Shared Videos5
గలీజ్‌ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి

జాను లిరి (Janu Lyri).. జానపద పాటలతో చాలా ఫేమస్‌ అయింది. యూట్యూబ్‌లో ఫోక్‌ సాంగ్స్‌కు హుషారుగా స్టెప్పులేసే జాను.. తర్వాత ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2 షో విన్నర్‌గానూ నిలిచింది. పదో తరగతిలోనే పెళ్లి చేసుకున్న ఈ డ్యాన్సర్‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు. అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఓసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లికి కూడా సిద్ధమే అంది. దాన్ని కూడా తప్పుపడుతూ తనను ట్రోల్‌ చేస్తున్నారు.గుక్కపెట్టి ఏడ్చిన జానుఈ విమర్శలను జాను లిరి భరించలేకపోయింది. నన్ను టార్గెట్‌ చేయడం ఆపండి అంటూ బోరుమని ఏడుస్తోంది. ఈ మేరకు పలు వీడియోలు షేర్‌ చేసింది. నా జీవితంతో ఆడుకుంటున్నారు. నేను నవ్వితే ఓవరాక్షన్‌.. నాకు పద్ధతి తెలీదు..కదా? ఫోక్‌ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకుని డ్యాన్స్‌ చేస్తుంది నేనే. కెమెరా ముందు ఒకలా, వెనక ఒకలా ఉండను. అందరితో నవ్వుతూ ఉంటాను. నేనేం చేసినా తప్పే అంటున్నారు.బతకాలని లేదుఇన్‌స్టాగ్రామ్‌లో నా వాయిస్‌కు గలీజ్‌ మాటలు యాడ్‌ చేస్తున్నారు. అవి నా కొడుకు చూడడా? ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం. ఇంత నరకమా? మీ వ్యూస్‌ కోసం ఒకమ్మాయి జీవితాన్ని రోడ్డుమీద పడేస్తున్నారు. మా అమ్మానాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట అనకుండా పెంచారు. కానీ ఈరోజు అడ్డమైన వెధవలతో మాటలు పడుతున్నాను. సూసైడ్‌ తప్పు అని నలుగురికీ చెప్పేదాన్ని.. కానీ ఇప్పుడర్థమవుతోంది.నా వల్ల కావట్లేదువాళ్లు పడే బాధల వల్ల చనిపోవట్లేదు. మీరు చేసే రచ్చ తట్టుకోలేక చనిపోతున్నారని! నా వల్ల కావట్లేదు. నా ఓపిక నశించింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, నవ్వినా, కూర్చున్నా.. ఎందుకు నిందలేస్తున్నారు? నా గురించి మంచి పెట్టొచ్చు కదా.. బాధ తట్టుకోలేకపోతున్నా.. నా జీవితంతో ఆడుకోవడం ఎందుకు? నా వల్ల మీకేమైనా హాని జరిగిందా? నా కొడుకును బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనుకున్నాను. అప్పటివరకు నేను బతకనని నాకర్థమవుతోంది. నేను మధ్యలోనే పోతాను అంటూ జాను వెక్కి వెక్కి ఏడ్చేసింది. View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official) ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: హీరోయిన్‌ రెచ్చగొట్టింది.. అందుకే సిక్స్‌ ప్యాక్‌ చేశా: అల్లు అర్జున్‌

India plans twin financial strikes on Pakistan6
భారత్‌ భారీ వ్యూహం.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ!

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను క్రియేట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేలా భారత్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక, తాజాగా పాక్‌పై రెండు ఆర్థిక దాడులకు భారత్‌ ప్రణాళికలు చేసినట్టు సమాచారం.కాగా, పాకిస్తాన్‌ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్‌ ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(FATF) గ్రేలిస్టులోకి పాకిస్తాన్‌ను తిరిగి చేర్చడానికి భారత్‌ ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టడంలో విఫలమయ్యే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో చేరుస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న పాకిస్తాన్‌ను తిరిగి అందులోకి చేర్చడం ద్వారా ఉగ్రవాదానికి నిధులు అందకుండా అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది. రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇటీవల పాకిస్థాన్‌కు మంజూరు చేసిన 7 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయ ప్యాకేజీ వినియోగంపై భారత్ తన ఆందోళనలను వ్యక్తం చేయనున్నట్టు సమాచారం. ఈ నిధులను పాకిస్తాన్‌ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తాలని భారత్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. భారత్‌ ప్లాన్‌ చేసిన చర్యల కారణంగా పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ ద్వంద్వ వ్యూహం ద్వారా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు ఆర్థిక మార్గాలను మూసివేయాలని, తద్వారా సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈ ఆర్థికపరమైన ఒత్తిడిని ఒక మార్గంగా భారత్ పరిగణిస్తున్నట్టు సమాచారం.2022లో విముక్తి..కాగా, 2022లో అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌కు కాస్త ఊరట లభించింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సరఫరా చేస్తోందన్న కారణంతో పాక్‌ను గ్రే లిస్టులో ఉంచిన ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(FATF) ఆ జాబితా నుంచి తొలగించింది. మనీలాండరింగ్‌ నిరోధక చర్యలను పాకిస్థాన్‌ పటిష్ఠంగా అమలు చేస్తోందని, సాంకేతిక లోపాలను పరిష్కరిస్తూ ఉగ్రసంస్థలకు నిధుల సరఫరా విషయంలోనూ పోరాటం చేసిందని ఎఫ్‌ఏటీఎఫ్‌ వెల్లడించింది. దీంతో పాక్‌ను గ్రే లిస్టు నుంచి తప్పించినట్లు తెలిపింది. గ్రే లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎప్‌), ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ, యూరోపియన్‌ యూనియన్‌ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడుతాయి.ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలోకి చేరుస్తుంది. కాగా, ఇప్పటివరకు ఇరాన్‌, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలో ఉన్నాయి. బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి మూడుదేశాల మద్దతు అవసరం. అయితే, చైనా, టర్కీ, మలేషియా దేశాలు పాక్‌కు మద్దతు ఇవ్వడంతో బ్లాక్‌ లిస్ట్‌లోకి వెళ్లకుండా బయటపడింది. తొలిసారిగా 2018 జూన్‌లో ఎఫ్‌ఏటీఎఫ్‌ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. అనంతరం వీటి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్‌కు రెండు సార్లు సమయమిచ్చింది. వీటిలో భాగంగా ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా పాక్‌ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించిన ఈ లక్ష్యాలను చేరుకోవడంలో పాక్‌ ఇప్పటివరకు విఫలమవుతూనే వచ్చింది. కానీ, జూన్‌ నెలలో ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ సమావేశంలో పాక్‌కు అనుకూలంగా ప్రకటన విడుదల చేసింది. ధరలతో పాక్‌ అతలాకుతలం..మరోవైపు.. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది. పాక్‌తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో పాక్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే అట్టారీ సరిహద్దును భారత్ మూసివేసింది. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే తీవ్రంగా కుదేలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాక్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. భారీగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పాక్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రస్తుతం పాక్‌లో ఆహార ధరలు భారీగా పెరిగాయి.పాకిస్తాన్‌లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరలుకిలో చికెన్: రూ. 798.89 పాకిస్తాన్ రూపాయలుకిలో బియ్యం: రూ. 339.56 పాకిస్తాన్ రూపాయలుడజను గుడ్లు: రూ. 332 పాకిస్తాన్ రూపాయలులీటర్ పాలు: రూ. 224 పాకిస్తాన్ రూపాయలుఅరకిలో బ్రెడ్: రూ. 161.28 పాకిస్తాన్ రూపాయలుకిలో టమాట: రూ. 150 పాకిస్తాన్ రూపాయలుకిలో బంగాళాదుంప: రూ. 105 పాకిస్తాన్ రూపాయలు.

Train passengers Interest in AC coaches in hot weather7
బోగీలు భగభగ.. ఏసీలో చల్లగా..

సికింద్రాబాద్‌–హౌరా మధ్య తిరిగే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ థర్డ్‌ ఏసీ ఎకానమీలో నెల క్రితం వరకు 15 రోజుల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం మే 15న ప్రయాణానికి వెయిటింగ్‌ జాబితా 85గా ఉంది. ఇక 31వ తేదీన వెళ్లాలంటే అసలు బుకింగ్‌కే వీల్లేకుండా ఉంది.ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మే 15న వెళ్లాలంటే వెయిటింగ్‌ లిస్ట్‌లో 47వ నంబర్‌ చూపుతోంది. నెలాఖరుకు ‘రిగ్రెట్‌’ అని చూపుతోంది. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఈనెల మొత్తం వెయిటింగే చూపుతోంది. వీటిల్లో కేవలం థర్డ్‌ ఎకానమీ క్లాస్‌ మాత్రమే కాదు, ఏసీ కేటగిరీలోని ఏ తరగతిలోనూ వచ్చే నెల రోజుల్లో టికెట్లు అందుబాటులో లేవు. కానీ అల్పాదాయ వర్గాలకు అందనంత దూరంలో ఉండే వందేభారత్‌ రైళ్లలో మాత్రం 15 రోజుల ముందు కూడా టికెట్లు లభిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్‌: రైలు ప్రయాణం అంటే ప్రజలు హడలిపోతున్నారు. నడి వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటి వేళ రైలు ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. తీవ్రమైన ఎండలతో కోచ్‌లు కొలిమిలా మారుతున్నాయి. ఫ్యాన్ల నుంచి వచ్చే వేడి గాలి, కిటికీల్లోంచి వీచే వడగాడ్పులు ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చల్లటి వేళ రైలెక్కుతున్నప్పటికీ సుదూర ప్రాంతానికి ప్రయాణం చేసేవారు పగటి వేళ రైలు బోగీల్లో వేడి, ఉక్కపోతతో వడదెబ్బకు సైతం గురవుతున్నారు.పేద, అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలు రైలు ప్రయాణానికి సాధారణంగా చార్జీ తక్కువగా ఉండే జనరల్‌ లేదా స్లీపర్‌ కోచ్‌లనే ఎంచుకోవటం కద్దు. కాని వేసవి భగ భగలతో బోగీలు ఉడికిపోతున్న నేపథ్యంలో చార్జీ భారమైనా చాలామంది ఇప్పుడు ఏసీ కోచ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అన్ని రైళ్లలో ఏసీ కోచ్‌లు నెల ముందే నిండిపోతున్నాయి.దాదాపుగా అన్ని రైళ్లలోనూ నెల తర్వాత వెయిటింగ్‌ జాబితా చూపిస్తోంది. ఏసీ కోచ్‌లకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతుండటంతో రైల్వే శాఖ దీనిపై దృష్టి సారించింది. ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంతో పాటు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చనే ఉద్దేశంతో ఏసీ ఎకానమీ క్లాస్‌ కోచ్‌ల సంఖ్య పెంచుతోంది. కొత్తగా మరిన్ని రైళ్లలో ఆ కేటగిరీని ప్రవేశపెడుతోంది. రెండేళ్ల క్రితం నుంచి థర్డ్‌ ఏసీ ఎకానమీ రైళ్లలో గతంలో ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ.. ఇలా మూడు రకాల ఏసీ కోచ్‌లు మాత్రమే ఉండేవి. పేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ రెండేళ్ల క్రితం కొత్తగా థర్డ్‌ ఏసీ ఎకానమీ కోచ్‌లను/ ప్రవేశపెట్టింది. సాధారణ థర్డ్‌ ఏసీ కోచ్‌లోని ఓ కూపేలో 8 బెర్త్‌లుంటే, ఎకానమీ ఏసీ కోచ్‌లో తొమ్మిదుంటాయి. కూపేల వైశాల్యం కూడా తగ్గించడం వల్ల ఇలాంటి ఓ కోచ్‌లో అదనంగా మరో కూపే ఉంటోంది. అంటే ఈ కూపే ద్వారా అదనంగా తొమ్మిది బెర్తులు అందుబాటులో ఉంటాయన్నమాట. సాధారణ కోచ్‌ కంటే తక్కువ చార్జీ సాధారణ థర్డ్‌ ఏసీ కోచ్‌ కంటే ఎకానమీ కోచ్‌ టికెట్‌ ధర తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే అల్పాదాయ వర్గాలు వేసవి వేడిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎకానమీ ఏసీ కోచ్‌లలో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వేలో వీటి సంఖ్యను పెంచుతున్నారు. స్లీపర్‌ కోచ్‌ల సంఖ్యను కుదించటం ద్వారా ఈ తరహా కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గత వేసవిలో జోన్‌ పరిధిలో ఎకానమీ కోచ్‌లు కేవలం 20 రైళ్లలోనే ఉండగా, ప్రస్తుతం 30కి చేరాయి.అయినా రద్దీని తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో త్వరలో మరిన్ని రైళ్లలో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత డిమాండ్‌ నేపథ్యంలో ప్రయాణ తేదీకి 15 రోజులకు చేరువకాగానే కొన్ని ముఖ్యమైన రైళ్లలో ఏసీ కోచ్‌లకు టికెట్ల విక్రయం ఆపేసే పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌లో ‘రిగ్రెట్‌’ (ఐఆర్‌సీటీసీ పరిభాషలో బెర్తులు లేవు అని అర్ధం) అని చూపుతోంది. సరిపడా రేక్స్‌ లేవు వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని నడుస్తున్నాయి. జూన్‌ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి మరో 200 ప్రత్యేక రైళ్లను నడిపినా కూడా రద్దీకి సరిపోయే పరిస్థితి లేదు. కానీ అన్ని రేక్స్‌ అందుబాటులో లేవు. దీంతో అదనపు రైళ్ల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని రైల్వే బోర్డు స్థానిక అధికారులకు సూచించింది. వేరే ప్రాంతాల నుంచి కూడా కోచ్‌లను కేటాయించే పరిస్థితి లేకపోవటంతో ఈ అలర్డ్‌ జారీ చేసింది. రాష్ట్రంలో 230 రైళ్ల రాకపోకలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం 230 వరకు ప్రయాణికుల రైళ్లు తిరుగుతుంటాయి. వేసవి సెలవుల నేపథ్యంలో వీటిల్లో ప్రయాణానికి ప్రతిరోజూ 30 వేల మంది వరకు అదనంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రిజర్వేషన్లు దొరక్క చాలామంది జనరల్‌ కోచ్‌లలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. చాలామంది అనధికారికంగా స్లీపర్‌ కోచ్‌లలో కూడా ఎక్కేస్తున్నారు. ఎండలతో ఉడికిపోతున్న బోగీలు ప్రయాణికుల కిటకిట మరింత వేడెక్కిపోతున్నాయి. థర్డ్‌ ఏసీ దొరక్క పోవడంతో ఏసీ స్లీపర్‌ బస్సులో తీసుకున్నామార్చి ప్రారంభంలో కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లొచ్చాం. కేవలం వారం రోజుల వ్యవధిలోనే థర్డ్‌ ఏసీ టికెట్లు లభించాయి. కానీ ఇప్పుడు బెంగుళూరు వెళ్లాల్సి రావటంతో, ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ కోసం ప్రయతి్నస్తే రిగ్రెట్‌ చూపుతోంది. అసలు టికెట్లే లేవని చూపిస్తోంది. నెలన్నర ముందే ఏసీ టికెట్లు అయిపోతున్నాయి. ఎండాకాలంలో మామూలు బోగీల్లో వెళ్లాలంటే భయం వేస్తోంది. గత్యంతరం లేక ఎక్కువ చార్జీ చెల్లించి ఏసీ స్లీపర్‌ బస్సులో బుక్‌ చేసుకున్నాం. రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్య పెంచటమో, అదనపు రైళ్లను నడపటమో చేస్తే బాగుంటుంది. – జి.రవికుమార్, బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్‌)

Australia to hold general election on May 38
నిర్బంధ ఓటింగ్‌కు వందేళ్లు

ఆ్రస్టేలియా పార్లమెంటుకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోని 1.8 కోట్ల మంది అర్హులైన ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఆ దేశంలో ఓటేయడం కేవలం నచ్చిన అభ్యరి్థని ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు.. తప్పనిసరిగా పాటించి తీరాల్సిన చట్టపరమైన బాధ్యత. ఎందుకంటే ఆ్రస్టేలియాలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని చట్టముంది. దాంతో అనేక దేశాలు ప్రజలను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురావడానికి నానా కష్టాలు పడుతుంటే ఆస్ట్రేలియా మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఓటింగ్‌ నమోదయ్యే దేశాల్లో ఒకటిగా ఉంది. 2022 ఎన్నికల్లో ఏకంగా 90 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు! బ్రిటన్‌లో 2024 ఎన్నికల్లో కేవలం 60 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. అమెరికాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో 64 శాతం నమోదైంది. చట్ట సవరణ ఆ్రస్టేలియాలో 1924లో ఎన్నికల చట్టాన్ని సవరించి ఫెడరల్‌ ఎన్నికల్లో ఓటేయడాన్ని తప్పనిసరి చేశారు. దానిప్రకారం ఫెడరల్‌ ఎన్నికల్లో ఓటు వేయకపోతే 20 డాలర్లు, రాష్ట్ర ఎన్నికల్లో ఓటేయకపోతే 79 డాలర్ల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం బాగానే పనిచేసింది. 1922 ఎన్నికల్లో 60 శాతం కూడా లేని ఓటింగ్‌ చట్టం తర్వాత 1925 ఎన్నికల్లో ఏకంగా 91 శాతం దాటేసింది. నిర్బంధ ఓటింగ్‌ వల్ల గెలిచినవారు మరింత బాధ్యతాయుతంగా ఉంటారనే వాదన కూడా ఉంది.నిర్బంధ ఓటు అట్టడుగు వర్గాలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించడానికి కూడా సహాయపడుతుందని, ఇది మరింత సమసమాజ ప్రజా విధానాలను రూపొందిస్తుందని నిపుణుల విశ్లేషణ. నిర్బంధ ఓటింగ్‌ విధానంలో మధ్యతరగతి పౌరులు, వారి ఆందోళనలు, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారని, ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కనిపించే పోలరైజేషన్‌ రాజకీయాలను నిరోధించి భిన్నమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందనే అభిప్రాయం ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు వేయలేకపోతే ఏంటి పరిస్థితి? సరైన కారణం ఉంటే మినహాయింపు ఉంటుంది.ఆ్రస్టేలియన్లు ఏమంటున్నారు?నిర్బంధ ఓటింగ్‌ గురించి ఆస్ట్రేలియాలో ఎలాంటి వివాదం లేదు. ఈ చట్టానికి ప్రజల గట్టి మద్దతుంది. దీనికి 70 శాతం ఆమోదం ఉందని 1967 నుంచి జరిగిన పలు జాతీయ సర్వేలు తేల్చాయి. అయితే నిర్బంధ ఓటింగ్‌ను రద్దు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్, ఆందోళనలు చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఓటేయాలో వద్దో ఎంచుకునే హక్కు పౌరులకు ఉండాలన్నది వారి వాదన. వాళ్లకు ప్రజాదరణ అంతంతే. నిర్బంధ ఓటింగ్‌ ద్వారా యువకులు మనమందరం ఎలాగైనా ఓటు వేయాలి అనే అవగాహనకు వస్తున్నారు. రాజకీయ ప్రక్రియలో పాల్గొనడంతోపాటు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. నిర్బంధ ఓటు లేకపోయినా స్వచ్ఛందంగా ఓటేసే వాళ్లమేనని 2022లో 77 శాతం మంది ఆ్రస్టేలియన్లు చెప్పడం విశేషం!వేతనంతో కూడిన సెలవుఓటింగ్‌కు అడ్డంకులు తొలగించడానికి, ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనేలా చూడటానికి అధికారులు పలు విధానాలను అమలు చేశారు. ఆస్ట్రేలియాలో శనివారాల్లోనే ఎన్నికలు జరుగుతాయి. వీకెండ్‌ కావడంతో ఎక్కువ మంది స్వేచ్ఛగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తారు. యాజమాన్యాలు ఎన్నికల రోజున కార్మి కులకు వేతనంతో కూడిన సెలవు ఇస్తాయి.పోలింగ్‌ బూత్‌ల దగ్గర బార్బెక్యూలపై కాల్చిన డెమోక్రసీ సాసేజ్‌లు అదనపు ప్రోత్సాహం. ఎన్నికల రోజు పోలింగ్‌ కేంద్రాల దగ్గర నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసే ఈ స్నాక్స్‌ ఆ్రస్టేలియా ఎన్నికలకు చిహ్నాలుగా మారాయి. ఇవి స్థానిక పాఠశాలలు, కమ్యూనిటీలకు అతి పెద్ద నిధుల సేకరణ కార్యక్రమాలుగా మారా యి. మొత్తంగా ఎన్నికల రోజు ఆ్రస్టేలియాలో పండుగ వాతావరణం ఉంటుంది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Pakistan asks Gulf allies to help ease India tensions following Kashmir attack9
వణుకుతున్న దాయాది

ఇస్లామాబాద్‌/వాషింగ్టన్‌/శ్రీనగర్‌/న్యూఢిల్లీ: భార త ‘పహల్గాం ప్రతీకార’ప్రయత్నాలు చూసి పాకిస్తాన్‌ బెదిరిపోతోంది. ఉద్రిక్తతలను ఎలాగైనా తగ్గించేలా భారత్‌ను ఒప్పించాలంటూ అరబ్‌ దేశాలను ఆశ్రయించింది. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్‌ తదితర దేశాలకు పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ శుక్రవారం ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పాక్‌లోని ఆ దేశాల రాయబారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాసియాలో సుస్థిరతనే కోరుతున్నామంటూ శాంతి వచనాలు వల్లెవేశారు. పహల్గాం దాడితో పాక్‌కు ఏ సంబంధమూ లేదంటూ పాతపాటే పాడారు.పాక్‌లో చైనా రాయబారి జియాంగ్‌ జైడాంగ్‌తో కూడా షహబాజ్‌ భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై పోరుతో భారత్‌కు తాము పూర్తిస్థాయిలో దన్నుగా నిలుస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి తమ పూర్తి మద్దతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్‌ స్పష్టం చేశారు. భారత్, పాక్‌ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఈ విషయమై నిర్ణాయక వ్యాఖ్యలు చేశారు. పాక్‌ భూభాగం నుంచి మారణకాండకు దిగుతున్న ఉగ్రవాదులను వెదికి పట్టుకోవడంలో భారత్‌కు సహకరించాలని దాయాదికి హితవు పలికారు.‘‘ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అవి రెండు అణుదేశాల ప్రాంతీయ యుద్ధంగా మారొద్దన్నదే మా ఉద్దేశం. ఏం జరుగుతుందో చూద్దాం’’అని గురువారం ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. పహల్గాం దాడి సమయంలో వాన్స్‌ కుటుంబంతో పాటు భారత్‌లోనే ఉండటం తెలిసిందే. దాయాదుల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని బ్రిటన్‌ ఆకాంక్షించింది. పహల్గాం దాడిని హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ తీవ్రంగా ఖండించినట్టు పేర్కొంది. వాటిని నిరసిస్తూ బ్రిటన్‌లో కొద్ది రోజులుగా శాంతియుత ఆందోళనలు జరుగుతున్న వైనం కూడా సభలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. అదేమీ రహస్యం కాదు: బిలావల్‌ పాక్‌ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం నిజమేనని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ చైర్‌పర్సన్‌ బిలావల్‌ భుట్టో కూడా అంగీకరించారు. మూడు దశాబ్దాలుగా పాక్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఇటీవల అంతర్జాతీయ మీడియా సాక్షిగా అంగీకరించడం తెలిసిందే. దీనిపై స్కై న్యూస్‌ ఇంటర్వ్యూలో బిలావల్‌ ఈ మేరకు స్పందించారు. రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అని ప్రశ్నించగా, ‘అది పెద్ద రహస్యమేమీ కాదు. పాక్‌ది ఉగ్రవాద గతమే’’అంటూ పాక్‌ నిర్వాకాన్ని బాహాటంగా అంగీకరించారు. అయితే దానివల్ల దేశం ఎంతగానో నష్టపోయిందని వాపోయారు.‘‘ఉగ్రవాదం పాక్‌కే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా పెనుబెడదగా పరిణమించింది. పాక్‌ దశలవారీగా ఉగ్రవాదానికి మద్దతిస్తూ వచ్చింది. మా సమాజం ఇస్లామీకరణ, సైనికీకరణ దశల గుండా సాగింది. వీటన్నింటివల్లా మేం నష్టపోతూ వచ్చాం. అయితే వాటినుంచి పాఠాలు నేర్చుకున్నాం. సింధూ పరివాహక నదులకు భారత్‌ నీరు వదలకుంటే రక్తం పారుతుందంటూ బిలావల్‌ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తన ఉద్దేశం అది కాదని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. ‘‘నీటిని ఆపడాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని మా ప్రభుత్వమే చెప్పింది. యుద్ధం జరిగితే పారేది రక్తమేగా. అదే నేనూ చెప్పా’’అన్నారు. మరోవైపు సింధూ జల ఒప్పందం నిలుపుదలను నిరసిస్తూ భారత్‌కు దౌత్య నోటీసులివ్వాలని పాక్‌ యోచిస్తోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల మీదా లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. హాకింగ్‌కు విఫలయత్నాలు పాక్‌ ప్రేరేపిత హాకర్‌ గ్రూపులు భారత వెబ్‌సైట్లపై శుక్రవారం మరోసారి భారీగా సైబర్‌ దాడులకు దిగాయి. జమ్మూలోని ఆర్మీ స్కూల్స్, రిటైర్డ్‌ సైనికుల ఆరోగ్య సేవలు తదితరాలకు సంబంధించిన సైట్లను హాక్‌ చేసేందుకు విఫలయత్నం చేశాయి. సైబర్‌ గ్రూప్‌ హోక్స్‌1337, నేçషనల్‌ సైబర్‌ క్రూ పేరిట దాడులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘పాక్‌తో పాటు పలు పశ్చిమాసియా దేశాలు, ఇండొనేసియా, మొరాకో తదితర చోట్ల నుంచి ఈ సైబర్‌ దాడులు జరిగాయి. వాటికి పాల్పడ్డ పలు సంస్థలు ఇస్లామిక్‌ భావజాలానికి మద్దతు పలుకుతున్నట్టు చెప్పుకున్నాయి. వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం’’అని తెలిపాయి. పహల్గాం దాడి నుంచీ ఈ తరహా దాడులు విపరీతంగా పెరిగిపోయినట్టు వెల్లడించాయి. ఇదంతా పాక్‌ హైబ్రిడ్‌ యుద్ధతంత్రంలో భాగమని అనుమానిస్తున్నారు. ఐదు సెక్ట్టర్లలో కాల్పులుపాక్‌ వరుసగా ఎనిమిదో రోజు కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్‌లో ఐదు జిల్లాల వెంబడి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గురువారం రాత్రి కూడా కాల్పులకు తెగబడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అఖూ్నర్‌ ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపులూ లేకుండానే పాక్‌ దళాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు దిగినట్టు సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘తొలుత ఉత్తర కశ్మీర్‌లో కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో మొదలైన కాల్పులు జమ్మూ ప్రాంతంలోని పూంచ్, అఖ్నూర్‌ సెక్టర్లకు విస్తరించాయి.అనంతరం నౌషేరాలోని సుందర్బనీ, జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా పర్‌గ్వాల్‌ సెక్టర్లోనూ కాల్పులకు తెగబడ్డాయి. వాటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది’’అని తెలిపారు. ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షితంగా తలదాచుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన కమ్యూనిటీ, వ్యక్తిగత బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.కథువా, సాంబా, రాజౌరీ, పూంచ్‌ జిల్లాల్లో ఇంకా పంటకోతలు జరగాల్సి ఉంది. పాక్‌తో భారత్‌ 3,323 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో 2,400 కి.మీ. మేరకు అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్‌ నుంచి జమ్మూ దాకా విస్తరించింది. 740 కి.మీ. నియంత్రణ రేఖ, యాక్చ్యువల్‌ గ్రౌండ్‌ పొజిషన్‌ లైన్‌ (ఏజీపీఎల్‌)తో పాటు మరో 110 కి.మీ. సియాచిన్‌ ప్రాంతంలో విస్తరించి ఉంది.

Vizhinjam port inauguration by PM Modi10
సీపోర్ట్‌తో కేరళలో ఆర్థిక స్థిరత్వం

తిరువనంతపురం: కంటైనర్ల ద్వారా సరుకు రావాణా కోసం ప్రత్యేకంగా నిర్మించిన అతిపెద్ద విఝింజమ్‌ అంతర్జాతీయ సీపోర్ట్‌తో కేరళ రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం సుసాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. భవిష్యత్తులో ఈ సీపోర్ట్‌ సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుందని, దాంతో కంటైనర్‌ కార్గో రవాణా విభాగంలో భారత సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని శుక్రవారం కేరళలోని తిరువనంతపురం జిల్లా కేంద్రంలోని విఝింజమ్‌ వద్ద రూ.8,686 కోట్ల వ్యయంతో నిర్మించిన డీప్‌వాటర్‌ సీపోర్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.అప్పుడలా.. ఇప్పుడిలా‘‘గతంలో భారత కంటైనర్ల రవాణా వ్యవహారంలో 75 శాతం విదేశీ పోర్టుల్లో జరిగేది. దాని వల్ల దేశం భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారుతున్నాయి. ఇప్పుడు దేశ సంపద భారత్‌కే ఉపయోగపడుతోంది. గతంలో భారత్‌ను దాటిపోయిన నిధులు ఇప్పడు స్వదేశంలోనే నూతన ఆర్థిక అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కేరళలోని విఝింజమ్‌ ప్రజలకు అవకాశాలు పెరిగాయి.అంతర్జాతీయ వాణిజ్యంలో తొలినాళ్ల నుంచీ కేరళ నౌకలు భారత్‌కు సరుకు రవాణాలో కీలక భూమిక పోషించాయి. సముద్ర మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యంలో భారత హబ్‌గా కేరళ ఎదుగుతోంది. ఇప్పుడు కేరళను మెరుగైన ఆర్థికశక్తిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’’ అని మోదీ అన్నారు. అదానీని పొగిడిన మోదీఅదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌(ఏపీసెజ్‌) ఈ డీప్‌వాటర్‌ పోర్ట్‌ను నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ అధినేత గౌతమ్‌ అదానీని మోదీ పొగిడారు. ‘‘ అదానీ గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సొంత రాష్ట్రంలోనూ ఓడరేవులున్నాయి. అయినాసరే గుజరాత్‌ను కాదని కేరళలో ఇంత పెద్ద సీపోర్ట్‌ను కట్టాడని తెలిస్తే గుజరాత్‌ ప్రజలు సైతం అసూయపడతారు’’ అని సరదాగా అదానీని మోదీ పొగిడారు.‘‘2014లో సరుకు రవాణా నౌకలు, ప్రజారవాణా, ఇతర పడవల ద్వారా 1.25 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందితే ఇప్పుడు వాళ్ల సంఖ్య 3.25 లక్షలకు పెరిగింది. ఈ కార్మికుల సంఖ్యపరంగా భారత్‌ ప్రపంచ టాప్‌–3 స్థానం పొందింది. సరుకు రవాణా విషయంలో టాప్‌–30లో రెండు భారతీయ నౌకాశ్రయాలు స్థానం దక్కించుకున్నాయి’’ అని మోదీ అన్నారు.స్వప్నం సాకారమైంది‘‘కేరళ స్వప్నం సాకారమైంది. అంతర్జాతీయ జలరవాణా, వాణిజ్యం, సరుకు రవాణా చిత్రపటంలో ఈ సీపోర్ట్‌ భారత్‌కు కొత్త దారులు తెరిచింది’’ అని మోదీ అన్నారు. కార్యక్రమంలో కేరళ గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్, సీఎం విజయన్, గౌతమ్‌ అదానీ, శశిథరూర్‌ పాల్గొన్నారు. ‘‘ మూడో మిలీనియంలో వృద్ధి అవకాశాలకు విఝింజమ్‌ సీపోర్ట్‌ సింహద్వారంగా నిలవనుంది’’ అని సీఎం విజయన్‌ అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, అదానీ సంస్థ సంయుక్తంగా ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ఓడరేవును నిర్మించారు.ఈ ఇద్దరిని నా పక్కన చూశాకకొందరికి అస్సలు నిద్రపట్టదువిపక్షాల ‘ఇండియా’ కూటమిలో కీలక భాగస్వామి అయిన సీపీఎం సీనియర్‌ నేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ మోదీతోపాటు వేదికను పంచుకున్నారు. దీంతో కాంగ్రెస్‌నుద్దేశిస్తూ మోదీ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం విజయన్‌కు నేనో విషయం చెప్పదల్చుకున్నా. విపక్షాల ఇండియా కూటమిలో మీరూ ఒక మూలస్తంభం. ఇక కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సైతం వేదికపైనే ఉన్నారు. మీ ఇద్దరినీ నా పక్కన చూశాక కొందరికి అస్సలు నిద్ర పట్టదు. మలయాళంలోకి నా ప్రసంగాన్ని తర్జుమా చేస్తున్న వ్యక్తి సరిగా చెప్తున్నారో లేదో నాకు తెలీదుగానీ నా ఈ సందేశం చేరాల్సిన వారికి ఇప్పటికే చేరిపోయింది’’ అని వ్యాఖ్యానించారు.దీనిపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ‘‘పహల్గాం తర్వాత కూడా విపక్ష నేతల నిద్రలు పాడుచేయడం మీదే మోదీ దృష్టిపెట్టారు. మేం మాత్రం నిద్రలేని రాత్రులు గడిపైనాసరే మిమ్మల్ని మీ ప్రభుత్వ తప్పులకు బా«ధ్యులను చేస్తాం’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. సొంత కాంగ్రెస్‌ పార్టీ నేతలతో శశిథరూర్‌ ఇటీవల అంటీముట్టనట్లు వ్యవహరించడం తెల్సిందే. ‘‘శుక్రవారం నా సొంత నియోజకవర్గం తిరువనంతపురంలో ప్రధానికి స్వాగతం పలికా. సీపోర్ట్‌ ప్రారంభంకావడం మాకెంతో గర్వకారణం’’ అని శశిథరూర్‌ అంతకుముందు ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement