పెళ్లికి ముందే చెప్పా.. నాకు లవర్‌ ఉన్నాడని.. | Marriage cance In Devanahalli Bengaluru | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందే వరుడికి చెప్పా.. నాకు లవర్‌ ఉన్నాడని..

May 1 2025 11:32 AM | Updated on May 1 2025 1:50 PM

Marriage cance In Devanahalli Bengaluru

విజయపుర(కర్ణాటక): వధువు మెడలో వరుడు తాళి కట్టే క్షణాల కోసం అందరూ ఎదురు చూస్తుండగా వరుడు మంటపం నుంచి లేచి పూలదండను విసిరేసి పెళ్లిని ఆపేశాడు. ఈ ఘటన చెన్నరాయపట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని దేవనహళ్లి తాలూకా బాలెపురలోని కల్యాణ మంటపంలో జరిగింది. యువతి మీద అనుమానంతో చివరి క్షణంలో వరుడు పెళ్లికి నిరాకరించాడు. వేణు అనే యువకుడు తన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. 

గతంలో సదరు వధువు వేరే యువకుడితో ప్రేమాయాణం నడిపిందని ఆరోపించాడు. అయితే పెళ్లికి  ముందే అన్ని విషయాలు వరుడికి చెప్పానని వధువు తెలిపింది. అప్పుడు అన్నింటికి సరేనని, రాత్రి రిసెప్షన్‌ కూడా చేసుకుని,  సరిగ్గా మంటపానికి వచ్చేసరికి పెళ్లికి వరుడు నిరాకరించాడని వధువు కన్నీటి పర్యంతమయింది. దీంతో వధువరులు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమ వధువుకు న్యాయం చేయాలని ఆమె తరపు కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.    

 

 

Advertisement
 
Advertisement
Advertisement