Politics
ఖైరతాబాద్‌లో వందశాతం మేమే గెలుస్తాం..
హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజవర్గం ఉప ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. వందకు వందశాతం తామే గెలుస్తామన్నారు. ఉప ఎన్నికల్లో ప్రభుత్వ పార్టీకి కొంత అడ్వాన్స్ ఉంటుదనే మాట వాస్తవమే కావొచ్చు కానీ తాము ఇక్కడ గెలిచి చూపెడాతామన్నారు తలసాని. అక్కడ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడిన సందర్బంలో ఓటర్లు కూడా ప్రతిపక్ష పార్టీ పట్టం కడతారన్నారు. ఖైరతాబాద్ నియోజవర్గం అనేది ప్రత్యేకమైన నియోజకవర్గమన్నారు తలసాని. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా తలసాని మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సిరిసిల్ల పర్యటన ద్వారా ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందన్నారు. ‘సీఎం రేవంత్ సిరిసిల్ల పోయాడు.. సిద్దిపేట పోత అంటున్నాడు.. తర్వాత మేము కొడంగల్‌లో సభ పెడతాం. రానున్న రోజుల్లో కరెంట్ కోతలు తీవ్రంగా రానున్నాయి.దేశ రాజకీయాల్లో సెంటిమెంట్ చాలా పని చేస్తోంది. మొన్న మాక్ అసెంబ్లీ పెడితే ఏం జరిగింది చూశాం. మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకు భూ సర్వే కు పంపిస్తారా?, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి ఎంపీలు వెళతారా?’ అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: దానం ఎపిసోడ్.. విజయారెడ్డి కీలక వ్యాఖ్యలు
కరువు వేళ ఈవెంట్లు కాదు.. రైతులను ఆదుకోండి..
సాక్షి, తాడేపల్లి: రాయలసీమ తీవ్ర కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు ఈవెంట్లతో కాలం గడుపుతున్నారని.. ‘రైజింగ్ రాయలసీమ’ ఈవెంట్లు ఎవరి కోసం? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుకు కావాల్సింది ఈవెంట్లు, పబ్లిసిటీ కాదు.. కష్టకాలంలో ప్రభుత్వ భరోసా. రైతులకు తక్షణమే రుణాల రీ షెడ్యూల్, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం అందించాలి’’ అని డిమాండ్ చేశారు.‘‘కేవలం 388 మండలాలకే కరువు పరిమితం చేయడం అన్యాయం. వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హమైన అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. జూన్ నుంచే వర్షాభావ పరిస్థితులు ఉన్నా సెప్టెంబరు చివరి వరకు కరువు ప్రణాళిక ఎందుకు సిద్ధం చేయలేదు?. వేల ఎకరాల్లో చీనీ సహా పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. రైతులు లక్షలు ఖర్చుపెట్టి కొత్త బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టమోటా, అరటి, బత్తాయి, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఈ రెండేళ్లలో ఉద్యాన రంగానికి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే ఇప్పుడు ‘హబ్‌లు ఏర్పాటు చేస్తాం’ అంటూ కొత్త ప్రకటనలు చేయడం వల్ల రైతుకు తక్షణ ప్రయోజనం ఏమిటి?. గతంలో అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని ప్రచారం చేశారు. ప్రకటించిన వాటిలో ఎన్ని ప్రాజెక్టులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయో ప్రభుత్వం చెప్పాలి. చంద్రబాబును ‘వాటర్ మ్యాన్’ అని పొగిడే వారు ఒక్కసారి రాయలసీమలో ఎండిపోయిన పొలాలు, రైతుల కష్టాలను చూడాలి. విశాఖకు తన ప్రార్థనల వల్లే వర్షం వచ్చిందని చంద్రబాబు చెప్పుకున్నారు. అదే నిజమైతే నాలుగు నెలల ముందే ప్రార్థించి కరువును ఎందుకు నివారించలేకపోయారు?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘ఇప్పుడు ‘రోడ్డు డాక్టర్లు’ అంటున్నారు.. ముందు ‘కరువు డాక్టర్లను’ తీసుకొచ్చి రైతులను దుర్భిక్షం నుంచి బయటపడేయండి. ఈవెంట్లతో కరువు పోదు.. పబ్లిసిటీతో రైతు కష్టాలు తీరవు. ‘రైజింగ్ రాయలసీమ’ అని పేరు పెట్టడం కాదు.. కరువుతో కుంగిపోతున్న రాయలసీమ రైతును కాపాడండి’’ అని కన్నబాబు హితవు పలికారు.‘‘మదనపల్లెలో సీఎం చంద్రబాబు మొదలుకాని సినిమాకే విజయోత్సవ సభ నిర్వహించారు. ప్రచారం తప్ప పని చేయకుండా తనకు తానే డబ్బా కొట్టుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం. మదనపల్లెలో ప్రకటించింది లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ కాదు... లక్ష అబద్ధాల ప్రభుత్వం. పంటలు, తోటలు ఎండిపోయి రైతులు అల్లాడుతుంటే హార్టికల్చర్ హబ్ పేరిట సంబరాలు జరుపుతారా?. వ్యవసాయాన్ని గబ్బు పట్టించి, ఇప్పుడు హబ్లంటూ సరికొత్త విన్యాసాలు చేస్తున్నారు...గతంలో అమరావతికి హైపర్‌లూప్, బుల్లెట్ ట్రైన్, మెట్రో, సీ-ప్లేన్ అన్నట్లే ఇదీ ఒక పిట్టల దొర కథ. లాక్‌హీడ్ ప్లాంట్, సౌదీ అరాంకో, ఎయిర్‌బస్, అలీబాబా డేటా సెంటర్ తరహాలోనే ఈ హబ్ ప్రచారం కూడా గాల్లో కలిసిపోతుంది. రోజూ మాటలు, ఈవెంట్లతో ప్రజలను మభ్యపెట్టడమే కూటమి ప్రభుత్వ నైజం. 2026-27 బడ్జెట్లో హార్టికల్చర్ శాఖకు కేటాయించింది కేవలం రూ. 1,123 కోట్లే. లక్ష కోట్ల ప్రాజెక్టు అని ప్రచారం చేసుకుంటున్న హబ్‌కు బడ్జెట్లో పెట్టింది కేవలం రూ. 200 కోట్లా?. హబ్‌లో రూ. 60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు ఎవరు పెడుతున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’’ కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: బాబు కుట్రలను దీటుగా ఎదుర్కొందాం
దానం ఎపిసోడ్.. విజయారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ’’దానం నాగేందర్ ఎన్నికల చెల్లకపోతే నన్నే ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉంది’’ అని కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె సాక్షి మీడియా మాట్లాడుతూ.. దానం నాగేందర్‌పై అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన 45 రోజుల లోపే ఎన్నికల పిటిషన్ వేశానని.. కోర్టుపై నాకు పూర్తి నమ్మకముందన్నారు.’’దానం నాగేందర్ ఎన్నికల చెల్లకపోతే నన్నే ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశముంది. నా వాదనను కోర్టు అంగీకరిస్తుందని భావిస్తున్నాను. ఎన్నికల పిటిషన్‌పై తీర్పు రాకుండా ఉప ఎన్నికలు చేయకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఉంది. నా పిటిషన్ పక్కన పెడితే కారణాలు ఏంటని మళ్ళీ కోర్టుకు వెళ్తాను. ఉప ఎన్నిక వస్తే అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి. మాది జాతీయ పార్టీ... అభ్యర్థి ఎవరనేది అధిష్టానం డిసైడ్ చేస్తుంది’’ అని విజయారెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘దానం వికెట్ పడింది.. రెండో వికెట్ ఎవరంటే..?’ఏం జరుగుతుందో?ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు బ్రేక్ పడనుంది. తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ తేలే వరకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వొద్దని 2023 ఎన్నికల నాటి కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఉప ఎన్నిక ఆపేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆమె కోరారు. ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఈసీ కూడా అంగీకరించడంతో ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడంలేదని నిపుణులు అంటున్నారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో దానం విజయం సాధించారు. అనంతరం ఎన్నికల అఫిడవిట్లో భార్యతోపాటు తనపై ఆధారపడిన వారి ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ విజయారెడ్డి 2024, జనవరి 20న ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. నాగేందర్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ పిటిషన్ 2024, డిసెంబర్ తర్వాత విచారణకు రాలేదు.నాగేందర్‌పై ఇటీవల వచ్చిన అనర్హత తీర్పు, విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ వేర్వేరు న్యాయ ప్రక్రియలు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడని ఓ కేసులో తేలింది. హైకోర్టు సెప్టెంబర్ 18న నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించగా, సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఉపశమనం లభించలేదు. అనంతరం ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ కార్యదర్శి సెప్టెంబర్ 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.దీంతో ఉపఎన్నికకు మార్గం సుగమమైందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో తాజా పిటిషన్‌తో ఉప ఎన్నికపై సందిగ్ధత ఏర్పడింది. మరోవైపు, 2023లో ఆయన సాధించిన ఎన్నిక చట్టబద్ధంగా జరిగిందా? లేదా? అన్నది ఎన్నికల పిటిషన్లో తేలాల్సి ఉంది. ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు గత తీర్పులు ఏమిచ్చాయో పరిశీలించాల్సి ఉంది. ఎన్నికల సంఘం వర్సెస్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కేసులో.. ఎన్నికల పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సందర్భంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించిన అంశాన్ని కోర్టు పరిశీలించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151ఏ ప్రకారం సాధారణంగా ఖాళీ అయిన స్థానానికి ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నా, ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ ఇంకా తుది పరిష్కారం కాకపోతే ఆ ఖాళీని వెంటనే భర్తీ చేయడానికి అందుబాటులో ఉన్న ఖాళీ (క్యాజువల్ వేకెన్సీ)గా పరిగణించలేమని పేర్కొంది.ఎన్నికల పిటిషన్లో గెలిచిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేయాలని మాత్రమే కాకుండా, పిటిషనర్ లేదా మరో అభ్యరి్థని విజేతగా ప్రకటించాలని కూడా కోరితే.. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా.. అదే స్థానానికి ఉపఎన్నిక నిర్వహిస్తే, ఒకే నియోజకవర్గానికి ఇద్దరు వ్యక్తులు ఎన్నికయ్యే పరిస్థితి ఉత్పన్నమవ్వొచ్చని పేర్కొంది. అందువల్ల అటువంటి పిటిషన్ పెండింగ్‌లో ఉన్న స్థానాన్ని సాధారణ ఖాళీగా పరిగణించి ఉపఎన్నిక నిర్వహించలేమనే న్యాయ సూత్రాన్ని స్పష్టం చేసింది. ప్రమోద్ లక్ష్మణ్ గుడాధే వర్సెస్ ఎన్నికల సంఘం కేసులోనూ ఇదే న్యాయ సూత్రాన్ని ప్రస్తావించింది.ఖైరతాబాద్ వ్యవహారంలోనూ ఇది కీలకంగా మారనుంది. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్లో దానం ఎన్నికను రద్దు చేయడంతోపాటు తనను శాసనసభ్యురాలిగా ప్రకటించాలని కోరారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన న్యాయ సూత్రాన్ని ఇక్కడ కూడా వర్తింపజేసే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుల్లో చర్చించిన అంశాలు, ప్రస్తుత ఖైరతాబాద్ స్థానంలో ఖాళీ ఏర్పడిన విధానం, విజయారెడ్డి పాత ఎన్నికల పిటిషన్.. అన్ని అంశాలను హైకోర్టు విడిగా పరిశీలించాల్సి ఉంటుందని అంటున్నారు.ప్రస్తుతం ఖైరతాబాద్ స్థానాన్ని ఖాళీగా ప్రకటించినందున ఉపఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. విజయారెడ్డి తాజా పిటిషన్ నేపథ్యంలో ఎన్నికలు నిలిచినట్లేనని చెబుతున్నారు. కాగా, రిట్ పిటిషన్ విచారణ తర్వాత సీజే ధర్మాసనం ఏ తీర్పునిస్తుందా అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.
బాబు ‘బీసీ’ బిల్డప్.. కోర్టు తీర్పుతో అట్టర్ ఫ్లాప్!
అది మోసమని తెలుసు.. ప్రజలను మభ్య పెట్టడమని తెలుసు.. అయినా ఎందుకు కావాలని ప్రభుత్వంలోని వారు ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తుంటారు? అదే రాజకీయం అన్నమాట. ఇలాంటి విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం డాక్టరేట్ సాధించిందని ఒప్పుకోవచ్చు.దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసు. దాని ప్రకారం ఏభై శాతం మించితే అవి చెల్లవు. అయినా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం స్థానిక ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చెల్లని జీఓ ఒకటి ఇచ్చేసింది. ఆ తర్వాత టీడీపీ క్యాడర్ చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం వంటివి చేసేశారు. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినట్లు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని గొప్పలు పోయారు. జయహో బీసీ అంటూ ఊదరగొట్టారు. కాస్త బుద్ది జీవులు కాని, బీసీ సంఘాలవారు కాని ఇదేమి మోసం అని విస్తుపోయారు.ఏభై ఏళ్ల రాజకీయ సీనియర్ని అని చెప్పుకునే చంద్రబాబు మరీ ఇంత ఓపెన్‌గా ప్రజలను తప్పుదారి పట్టించవచ్చా అని వారు బాధపడ్డారు. కాని చంద్రబాబు స్టైలే అది కదా అని అనుకున్నారు. ఈ జీఓలపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ రిజర్వేషన్ల జీఓలు చెల్లవని హైకోర్టు కొట్టివేసింది. ఏభై శాతం మించిన రిజర్వేషన్లను ఎలా సమర్ధించుకుంటారని హైకోర్టు ప్రశ్నిస్తే సరైన సమాధానం ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. రాజివ్ రంజన్ కమిషన్ నివేదిక పరిశీలనలో ఉందని చెబుతున్నారని, అలాంటప్పుడు ఆ నివేదిక ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేష్లు ఎలా ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. పంచాయతీరాజ్ చట్టంలోనే వెసులుబాటు ఉందంటూ కొత్త వాదన తెచ్చి బీసీ వర్గాలను మాయచేయాలని కూడా అనుకున్నారు. ఎల్లో మీడియాలో బీసీలకు రిజర్వేషన్లు పెంచేసినట్లుగా హోరెత్తించారు. ఇవన్ని ఉట్టిదేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైంది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం బీసీలను మాయ చేయడానికి డ్రామా ఆడిందన్న విషయం బట్టబయలైంది.నిజానికి చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే బీసీలకు కచ్చితంగా 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిజాయితీ ఉంటే, పార్లమెంటులో సంబంధిత చట్టం తీసుకురావడానికి కృషి చేసి ఉండాల్సింది. కేంద్రంలో టీడీపీ ఎంపీల బలంతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నం ఎందుకు చేయలేదన్న ప్రశ్న వస్తుంది. ఇది బీసీలను వంచించడం కాదా అని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి గత జగన్ ప్రభుత్వం కూడా జీఓ ద్వారా యత్నించింది. దానిపై బిర్రు ప్రతాపరెడ్డి అనే టీడీపీ నాయకుడు హైకోర్టుకు వెళ్లారు. దాంతో జీఓలను అప్పట్లో న్యాయ స్థానం కొట్టేసింది. ఆ మీదట ఏభై శాతం మించకుండా చట్టప్రకారం సుమారు 24 శాతం రిజర్వేషన్లు ఇస్తూ, పార్టీ పరంగా సుమారు ఏభై శాతం వరకు బీసీలకు టిక్కెట్లు ఇచ్చి జగన్ న్యాయం చేశారు.ఉదాహరణకు 69 శాతం మేయర్ పదవులను బీసీలకు ఇచ్చారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆ రకంగా కొన్ని జనరల్ స్థానాలలో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. 13 జిల్లా పరిషత్‌లకు గాను ఆరింటిని బీసీలకు వచ్చేలా చేశారు. 46 శాతం పదవులను బీసీవర్గాలకు కట్టబెట్టారన్నమాట. మండల పరిషత్, మున్సిపల్ చైర్ పర్సన్ల పదవులకు కూడా ఇలాగే ఏభై శాతం పైగా జగన్ బీసీలకు ఇచ్చారు. చంద్రబాబు ఆ ప్రకారం ఇస్తామని చెప్పలేకపోతున్నారు.ఇదీ చదవండి: రేవంత్ మాటలు.. బీజేపీకి వరంగా మారుతున్నాయా?గత కొన్ని నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి గెలుపుకోసం ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రచారం ఆరంభించారు. మున్సిపాల్టీలలో 11 వేల కోట్ల రూపాయల పనులు, పల్లెలలో 11 వేల కోట్ల రూపాయల పనులు చేపడుతున్నట్లు హంగామా చేసి సభలు పెట్టారు. పల్లెకు పట్టాభషేకం, పేదలకు పట్టాభిషేకం అంటూ డైలాగులు చెబుతూ హోరెత్తించారు. స్థానిక ఎన్నికలలో కూటమికి తిరుగులేదని చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారు. బీసీలకు తాము న్యాయం చేయబోయామని కాని వైఎస్సార్సీపీ అడ్డుకుందని కూడా టీడీపీ ప్రచార వ్యూహం అమలు చేయవచ్చు. ఎందుకంటే అలవోకగా అబద్దాలు ఆడడంలో ఈ పార్టీ మంచి నైపుణ్యం సాధించిందన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు అసలు సమస్య కూటమికి ఎదురు అవుతుంది. ఆరు వారాలలో ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించింది. అది సాధ్యం కాదని చెప్పి వాయిదా కోరితే తప్ప ఎన్నికలు ఆగకపోవచ్చు. అయితే టీడీపీ, జనసేనల మధ్య పోటీచేసే స్థానాలపై పంచాయతీ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని నాదెండ్ల మనోహర్ కాని ఒకసారి ఆత్మాభిమానం అంటూ, మరోసారి గెలుపు ప్రాతిపదిక అంటూ టీడీపీ లైన్లో మాట్లాడారు. తద్వారా కార్యకర్తలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. కనీసం 30 శాతం సీట్లు అయినా జనసేనకు ఆయా పదవులకు పోటీచేసే అవకాశం కల్పించాలన్నది క్యాడర్ డిమాండ్. కాని పవన్ కళ్యాణ్ ఎంతవరకు న్యాయం చేస్తారో అన్న సంశయం వారికి లేకపోలేదు. అయినా ఏదో ఆశ వారిలో ఉంది.టీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు నారా లోకేష్ ఇప్పటికే 15 శాతం సీట్లు జనసేనకు ఇస్తామని ప్రకటించారు. దానిని నేరుగా ఖండించే ధైర్యం జనసేనకు లేకపోయింది. కాకపోతే కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో వారి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసి సరిపెట్టుకున్నారు. 30 శాతం సీట్లు సాధించగలిగితే పవన్ కళ్యాణ్‌పై పార్టీలో నమ్మకం పెరుగుతుంది. లేదంటే పార్టీలో నిరాశ అలముకుంటుంది. అది వేరే సంగతి. ఒకవేళ 30 శాతం సీట్లు జనసేనకు, మరో ఐదు శాతం సీట్లు బీజేపీకి ఇవ్వాల్సి వస్తే టీడీపీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. బలం లేని జనసేన, బీజేపీలకు అన్ని సీట్లు ఇవ్వడం ఏమిటని టీడీపీ స్థానిక నేతలు తిరుగబడే అవకాశం ఉంటుంది. 30 శాతం కాకపోయినా, 15 శాతంతోనే జనసేనకు సరిపెట్టినా, సీట్ల కేటాయింపులో గడబిడలు కొంతమేర జరగవచ్చు.ఉదాహరణకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల మేయర్ పదవులను జనసేన కోరుతోందట. కాని వాటిని టీడీపీ తమకు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ పరిస్థితిలో సామాజికవర్గాల సమస్య కూడా టీడీపీ ఎదుర్కోవలసి ఉంటుంది. జగన్ మాదిరి బీసీ వర్గాలకు పార్టీపరంగా ఏభై శాతం సీట్లు ధైర్యంగా ఇవ్వడం కూడా అంత తేలికకాకపోవచ్చు. ఈ సమస్యతో పాటు బీసీలకు, బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానం కూడా కూటమికి తలనొప్పిగా మారుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే.. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపైన, యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలు, సోషల్ మీడియాపై అక్రమ కేసులు పెడుతూ భయపెట్టాలని చూస్తోంది. వైఎస్సార్సీపీ వారిని భయపెట్టి పోటీలో లేకుండా చేయడానికి కూడా యత్నించవచ్చు.అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ క్యాడర్‌కు, నేతలకు ధైర్యాన్ని ఇస్తూ అన్ని చోట్ల పోటీచేయాల్సిందేనని చెబుతున్నారు. మరో వైపు ప్రభుత్వపరంగా జనాన్ని పోగుచేస్తే తప్ప చంద్రబాబు మీటింగ్‌లు జరగడం కష్టంగా ఉంటే, జగన్ ఎక్కడకు వెళ్లినా వస్తున్న జన తరంగాలు కూటమిని కలవరపెడుతున్నాయి. వీటన్నిటిని గమనంలోకి తీసుకుంటే శాసనసభ ఎన్నికలలో మాదిరి ఏదైనా మాయ జరిగితే తప్ప స్థానిక ఎన్నికలు కూటమికి ఒక అగ్ని పరీక్షవంటివే అని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Sports
ఎస్ఆర్హెచ్ను వీడనున్న అభిషేక్ శర్మ!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టుకు ఊహించని షాక్ తగిలేలా ఉంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టును ఎస్ఆర్హెచ్ను వీడనున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2027 రిటెన్షన్స్ కంటే ముందే అభిషేక్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలతో అభిషేక్ శర్మ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వార్తల్లో నిజం లేదని ఎస్ఆర్హెచ్ సీఈవో షణ్ముగం ఖండించారు. అభిషేక్ శర్మను తాము వదులుకోవడానికి సిద్ధంగా లేమని, అనవసరంగా పుకార్లు పుట్టించొద్దని, ఇది ఎంతమాత్రం నిజం కాదని షణ్ముగం పేర్కొన్నాడు. 2026 ఐపీఎల్ సీజన్లో ఆరంభ మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరమవ్వడంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం అభిషేక్‌కు నచ్చలేదట. తనకు కెప్టెన్సీ అప్పగిస్తారని భావించినప్పటికీ, ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మాత్రం ఇషాన్‌కు అప్పగించడంపై అభిషేక్ గుర్రుగా ఉన్నాడు. అయితే ఈ వార్తల్లో నిజం లేదనిపిస్తున్నప్పటికీ, ఒకవేళ అభిషేక్ శర్మ వచ్చే సీజన్ నాటికి జట్టును వీడితే మాత్రం అది ఎస్ఆర్హెచ్కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఓపెనింగ్ స్థానంలో వచ్చి ఎన్నో భీకరమైన ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్ శర్మ జట్టు సాధించిన చాలా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక 2022 నుంచి అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్తోనే ప్రయాణం సాగిస్తున్నాడు. 2024లో ఎస్ఆర్హెచ్ ఫైనల్ చేరడంలో అభిషేక్ శర్మ కీలకపాత్ర వహించాడు. ఆ సీజన్లో 16 మ్యాచ్‌లాడిన అభిషేక్ 484 పరుగులు సాధించాడు. 2025 సీజన్లో 40 బంతుల్లోనే సెంచరీ సాధించిన అభిషేక్ ఐపీఎల్లో తన తొలి సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 92 మ్యాచ్‌లాడిన అభిషేక్ శర్మ 2,379 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 13 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున ప్రస్తుతం ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న అభిషేక్ శర్మ రేపు పాకిస్తాన్‌తో జరగనున్న ఫైనల్ పోరు కోసం సిద్ధమవుతున్నాడు. ఇదీ చదవండి: ఓటమి తప్పించిన భారత బ్యాటర్.. ఆసీస్‌పై సిరీస్ కైవసం
ఓటమి తప్పించిన భారత బ్యాటర్.. ఆసీస్‌పై సిరీస్ కైవసం
పాండిచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనధికారిక టెస్టును భారత-ఎ జట్టు డ్రాగా ముగించింది. నాలుగోరోజు ఆటకు చివరి రోజు కావడంతో, రోజు ముగిసే సమయానికి 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా విజయానికి ఒక్క వికెట్ దూరంలో ఆగిపోయింది. తొలి అనధికారిక టెస్టును గెలిచిన భారత్ 1-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారత్‌ను ఓటమి నుంచి తప్పించిన షామ్స్ ములాని రెండు టెస్టులు కలిపి 55 పరుగులతో పాటు 10 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.మ్యాచ్‌లో భారత్ ఓటమి ఖాయమనున్న దశలో షామ్స్ ములానీ (131 బంతుల్లో 29) ఆపద్బాంధవుడి పాత్రను పోషించి జట్టును ఓటమి నుంచి తప్పించగా, నచికేత్ భూతే (20 నాటౌట్) అతడికి సహకరించాడు. చివర్లో ఆస్ట్రేలియా బౌలర్లను మార్చి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. చివరి ఓవర్ వరకు విజయం కోసం ప్రయత్నించిన ఆసీస్‌కు శామ్స్ ములాని, నచికేత్ భూతేలు కొరకరాని కొయ్యలుగా మారి వారి గెలుపును అడ్డుకున్నారు. అంతకముందు యశ్ రాథోడ్ (80), తుషార్ దేశ్‌పాండే (52) అర్థసెంచరీలతో రాణించి భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లియామ్ స్కాట్ 5 వికెట్లతో చెలరేగగా.. లియామ్ హాచర్, టాడ్ ముర్ఫీ, కోరె రొచ్చిసియోలి, నాథన్ మెక్‌స్వీనీ తలా ఒక వికెట్ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 358 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలడంతో ఆసీస్‌కు 191 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 173 పరుగుల వద్ద డిక్లేర్ చేసి భారత్ ఎదుట 365 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఇరుజట్ల మధ్య అనధికారిక వన్డే సిరీస్ అక్టోబర్ 6 నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి అనధికారిక వన్డేకు పాండిచ్చేరి వేదిక కానుంది.ఇదీ చదవండి: రేపు పాక్‌తో ఫైనల్.. అందరి కళ్లు ఆ ముగ్గురిపైనే!
44 ఏళ్ల నిరీక్షణకు తెర.. భారత మహిళల హాకీ జట్టుకు స్వర్ణం
ఆసియా గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మన అమ్మాయిలు హాకీలో స్వర్ణంతో మెరిశారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 1-0 తేడాతో పటిష్టమైన చైనాను ఓడించి పసిడి పతకాన్ని అందుకోగా, డిఫెండింగ్ చాంపియన్ రజతానికే పరిమితమైంది.మ్యాచ్‌లో ఏకైక గోల్ ఆట 10వ నిమిషంలో భారత ప్లేయర్ లాల్రెమ్సియామి లెఫ్ట్ సైడ్ సర్కిల్ నుంచి బంతిని నెట్లోకి పంపించి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత చైనా ప్లేయర్ల అటాకింగ్ గేమ్‌ను సమర్థంగా అడ్డుకుంది. చైనా ఆటగాళ్లు సంధించిన పెనాల్టీ స్ట్రోక్‌లను కూడా భారత ఆటగాళ్లు నిర్వీర్యం చేయడంలో సఫలమయ్యారు.స్వర్ణంతో 2028 ఒలింపిక్స్‌కు అర్హతగతంలో 1982లో ఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో మహిళల హాకీ ఫైనల్లో భారత్ 22-0తో హాంకాంగ్‌పై ఏకపక్ష విజయంతో స్వర్ణం ఎగరేసుకుపోయింది. ప్రస్తుతం మహిళల హాకీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్న భారత్ లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మంచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఇదే జోరును తాజాగా ఫైనల్లో చైనాపై కూడా ప్రదర్శించిన భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయింది. అంతేకాదు ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలవడం ద్వారా భారత మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించడం విశేషం.ఒక్కరోజే ఆరు స్వర్ణాలు..ఈసారి ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది 16వ స్వర్ణం కాగా.. శుక్రవారం ఒక్కరోజే భారత్‌కు ఆరు స్వర్ణాలు రావడం విశేషం. ఆర్చరీలో ఒకటి, బాక్సింగ్‌లో మూడు, రెజ్లింగ్‌లో ఒకటి రాగా.. తాజాగా మహిళల హాకీ జట్టు కూడా స్వర్ణం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 76కు పెరిగింది. ఇందులో 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలు ఉన్నాయి. పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. Indian Women Hockey Team won #GoldMedal in #AsianGames2026 after 44 years. India beat China 1-0, ending the wait since 1982 and earned entry to the #LosAngelesOlympics2028@TheHockeyIndia pic.twitter.com/hIDa35ev4U— Neel Kamal (@NeelkamalPb) October 2, 2026 𝗧𝗛𝗘 𝟰𝟰-𝗬𝗘𝗔𝗥 𝗪𝗔𝗜𝗧 𝗜𝗦 𝗢𝗩𝗘𝗥, 𝗧𝗛𝗘 𝗜𝗡𝗗𝗜𝗔𝗡 𝗪𝗢𝗠𝗘𝗡'𝗦 𝗧𝗘𝗔𝗠 𝗜𝗦 𝗔𝗦𝗜𝗔𝗡 𝗚𝗔𝗠𝗘𝗦 𝟮𝟬𝟮𝟲 𝗚𝗢𝗟𝗗 𝗠𝗘𝗗𝗔𝗟𝗟𝗜𝗦𝗧𝗦! 🇮🇳🥇A 1-0 victory over World No. 4 China in the final seals a historic gold medal for the Indian Women’s Team, securing… pic.twitter.com/ZiQP1PSYaD— Hockey India (@TheHockeyIndia) October 2, 2026ఇదీ చదవండి: బాక్సర్ల పసిడి పంచ్.. భారత్ ఖాతాలో 75వ పతకం
‘గోల్డ్ గెలిచినా పట్టించుకోలేదు.. రెండ్రోజుల తర్వాత సీఎం ఫోన్’
ఆసియా క్రీడలు-2026 టోర్నీలో అథ్లెటిక్స్‌లో భారత్‌కు మంగళవారం స్వర్ణం అందించింది మహిళల రిలే జట్టు. కిరణ్ మహల్, ఎంఆర్ పూవమ్మ, ప్రాచీ ఛౌదరి, విత్య రామ్రాజ్ 4*400 మీటర్ల రిలే పరుగును 3 నిమిషాల 29.9 సెకన్లలో పూర్తి చేసి.. పసిడి పతకాన్ని ముద్దాడారు.మూడో లెగ్ ముగిసే సమయానికి భారత్ మూడో స్థానంలోనే ఉన్నా.. ఆఖరి లెగ్‌లో అద్భుతంగా పరిగెత్తి విత్య జట్టును అగ్రస్థానంలో నిలిపింది. ఏషియాడ్ అథ్లెటిక్స్ చరిత్రలో మహిళల 4*400 మీటర్ల రిలే పరుగులో భారత్‌కు ఇది ఏడో పసిడి పతకం.గోల్డ్ గెలిచినా పట్టించుకోలేదు.. ఈ నేపథ్యంలో కిరణ్, పూవమ్మ, ప్రాచీ, విత్యలపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే, వీరిలో 36 ఏళ్ల పూవమ్మకు గోల్డ్ గెలిచినా సొంత రాష్ట్రం నుంచి కనీసం అభినందించే వారు లేక చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది. సీఎన్ఎన్-న్యూస్18తో మాట్లాడుతూ.. పూవమ్మ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.రెండ్రోజుల తర్వాత సీఎం ఫోన్‘‘బంగారు పతకం గెలిచిన రెండు రోజుల తర్వాత మా ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర నాకు కాల్ చేసి.. మెడల్ సాధించినందుకు అభినందించారు. నన్ను ఎవరూ పట్టించుకోలేదని మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతే వాళ్లు నాకు ఫోన్ చేశారు.అయితే, పతకాలు గెలిచిన అథ్లెట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీని త్వరలోనే పెంచుతామని సీఎం నాతో చెప్పారు. నన్ను సత్కరిస్తామని కూడా అన్నారు’’ అని కర్ణాటకలోని దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన పూవమ్మ తెలిపింది.చదవండి: త్వరలోనే టీమిండియా టీ20 వైస్ కెప్టెన్‌గా అతడు! View this post on Instagram A post shared by Indiantrackandfield (@indiantrackandfield)
National
ఫ్లైదుబాయ్ హీరోకు ప్రధాని మోదీ వీడియోకాల్
ఫ్లైదుబాయ్ విమానంలో పెను ప్రమాదాన్ని తప్పించిన భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం యూఏఈలోని అబుదాబిలో చికిత్స పొందుతున్న ఆయన .. ఘటనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఆ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను కాపాడిన ఆయన ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించగా.. మచ్చార్ భావోద్వేగానికి లోనయ్యారు.కో-పైలట్ తనపై ఎలా దాడి చేశాడో.. ఆ సమయంలో తనకు ధైర్యం ఇచ్చిన విషయాలేంటో కెప్టెన్ స్మిట్ మచ్చర్ ప్రధాని మోదీకి వివరించారు. దాడిలో తీవ్రంగా గాయపడి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ.. విమానం ఒక్కసారిగా కిందకు దిగడాన్ని గమనించానని చెప్పారు. ఆ సమయంలో ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం ఉందన్న భయంతో ఎలాగైనా కాక్‌పిట్ తలుపు తెరవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.“ఏదో విధంగా నిలబడి కాక్‌పిట్ తలుపు తెరిచాను. ప్రయాణికులు లోపలికి రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది” అని స్మిట్ వివరించారు. ప్రమాద సమయంలో తనకు ధైర్యం ఇచ్చింది హనుమాన్ చాలీసా అని, దానిని చదువుకుంటూ ధైర్యం తెచ్చుకున్నానని చెప్పారు. “ఆ భగవంతుడే నన్ను కాపాడాడు. మీతో మాట్లాడతానని నేను అనుకోలేదు. నాకు మీరే నాకు స్ఫూర్తి” అంటూ మచ్చార్ భావోద్వేగానికి లోనయ్యారు. #WATCH | Flydubai Captain Smit Machchhar turns emotional as he recounts his ordeal before PM Modi; he says, "You are my biggest idol. I feel proud of the way you are encouraging me today. I had so many injuries, but I told myself I have to get up and act. At the time, I told… pic.twitter.com/eqGloeCTSl— ANI (@ANI) October 2, 2026అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ స్మిట్ మచ్చర్ చూపిన సమయస్ఫూర్తి, ధైర్యాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ.. త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. నేను ఫోన్లో అందుబాటులో ఉంటాను అంటూ మచ్చార్‌కు మోదీ మాటిచ్చారు.బుధవారం ఉదయం దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానంలో కో-పైలట్ దాడి చేసిన ఘటనలో కెప్టెన్ స్మిట్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన కాక్‌పిట్ తలుపు తెరిచి సహాయం కోరడంతో పాటు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు కీలకంగా వ్యవహరించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కాపాడటంలో స్మిట్ మచ్చర్ పాత్ర కీలకంగా మారింది. గాయాలతో పోరాడుతూనే ఆయన చూపిన ధైర్యంపై అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఘటన అనంతరం తొలుత సౌదీ అరేబియాలోని తబూక్ ఆస్పత్రిలో ఆయనకు వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం స్మిట్ మచ్చర్ యూఏఈలోని అబుదాబిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని.. ఆయన మాట్లాడగలుగుతున్నారని.. త్వరలో కోలుకుంటారని వైద్యులు, ఇటు భారత రాయబార కార్యాలయమూ ఒక ప్రకటన చేసింది.కెప్టెన్ స్మిట్ మచ్చార్ సాహసం చూసి దేశం గర్విస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకు ముందు అభినందించారు. మరో 9/11 తరహా దాడి జరగకుండా మచ్చార్ అడ్డుకోగలిగారంటూ పొగిడారు. అంతేకాదు.. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన అధైర్య పడొద్దని.. భారత ప్రభుత్వం తరఫున అన్నివిధాల సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ ఘటన.. వీడియోలో భయానక దృశ్యాలు
రాహుల్ గాంధీ మెచ్చిన ‘మహ్మద్ దీపక్’ అరెస్ట్
కొద్ది నెలల క్రితం.. మత సామరస్యానికి సంబంధించిన ఘటనతో వైరల్ అయిన దీపక్ కుమార్ గుర్తున్నాడా?. ఓ వివాదంలో హిందూ సంఘాల నుంచి ఓ ముస్లిం వ్యాపారిని రక్షించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడతను. ఆ సమయంలో నా పేరు ‘మహ్మద్ దీపక్’ అంటూ అతను చెప్పిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీపక్‌ను మెచ్చుకుని.. ‘భారత హీరో’గా అభివర్ణించారు. అయితే తాజాగా అతను మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.ఉత్తరాఖండ్వాసి మహ్మద్ దీపక్ (దీపక్ కుమార్).. ఓ వ్యాపారిని బెదిరించి, దాడికి పాల్పడిన కేసులో అరెస్టయ్యాడు. మొన్నీమధ్యే మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఓ మసీదు వ్యవహారం వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనపై దీపక్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దానికి సంజీవ్ టోంక్ అనే యూజర్ కామెంట్ చేశాడు. ఈ విషయంలో కోపంతో రగిలిపోయిన దీపక్.. అతని దుకాణానికి వెళ్లి దూషించి, బెదిరించారు. The man seen in the video is Md Deepak, the “hero” of the Congress ecosystem. Rahul Gandhi and several big and small Congress leaders were desperate to meet him.Now look at what he is doing.He is accused of abusing and threatening a Hindu shopkeeper and even attempting to… pic.twitter.com/nNEWioLlie— Mr Sinha (@Mrsinha) October 1, 2026ఈ మేరకు ఆ పెద్దాయన కోట్ద్వార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. దీపక్ సంజీవ్‌ను బెదిరించింది నిజమేనని సీసీటీటీ ఫుటేజీ ద్వారా నిర్ధారించుకున్నారు. దీపక్‌ను అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.ఈ ఏడాది జనవరిలో దీపక్ కుమార్ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. కోట్‌ద్వార్‌లో ఓ ముస్లిం దుకాణదారుడి విషయంలో వివాదం తలెత్తిన సమయంలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఆ సందర్భంగా “నా పేరు మహ్మద్ దీపక్” అంటూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఆయనను తన వద్దకు పిలిపించుకుని ప్రశంసించారు. ఇప్పుడు ఓ హిందూ వ్యాపారిని బెదిరింపు కేసులో అరెస్ట్ కావడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.करोड़ों भारतीयों के दिलों में सद्भाव और मोहब्बत की विचारधारा है, मगर मन में भय भी है - दीपक ने उन सभी को अपने साहस से राह दिखाई है।जो लोग नफ़रत फैलाकर समाज को डराने की कोशिश करते हैं, वो दरअसल कायर होते हैं - उनसे कभी भी डरो मत।दीपक ने हमारे तिरंगे और संविधान की रक्षा की है।… pic.twitter.com/lk3IMlk8x8— Rahul Gandhi (@RahulGandhi) February 25, 2026
అరుదైన నీలి కళ్ల తెల్ల పులి.. 556 కిలోమీటర్లు దాటి..
తెల్లని ఒంటిపై నల్లటి చారలు.. మెరిసే నీలి కళ్లతో ‘తేజస్’ వచ్చేసింది. గ్వాలియర్ నుంచి ఏకంగా 556 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ అరుదైన తెల్ల పులి డెహ్రాడూన్ జూకు కొత్త ఆకర్షణగా చేకూర్చింది. పులుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా వచ్చిన తేజస్.. ప్రస్తుతం క్వారంటైన్లో ఉంది. దాదాపు నెల రోజుల తర్వాత సందర్శకులను అలరించేందుకు ఎన్‌క్లోజర్‌లోకి రానుంది.తేజస్ రాకతో జూలో వన్యప్రాణుల వైవిధ్యం పెరుగుతుందని.. సందర్శకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని జూ అధికారులు భావిస్తున్నారు. అయితే కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు, ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యే వరకు తేజస్‌ను కొంతకాలం ప్రజలకు దూరంగా ఉంచనున్నారు. డెహ్రాడూన్ జూ, గ్వాలియర్ జూలాజికల్ పార్క్ మధ్య జరిగిన పులుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా తేజస్‌ను డెహ్రాడూన్‌కు తీసుకువచ్చారు. దీనికి ప్రతిగా డెహ్రాడూన్ జూకు చెందిన దాదాపు ఐదేళ్ల వయసున్న ‘భోలా’ అనే రాయల్ బెంగాల్ పులిని గ్వాలియర్‌కు తరలించారు.గ్వాలియర్ నుంచి డెహ్రాడూన్ వరకు తేజస్ సుమారు 556 కిలోమీటర్ల దూరాన్ని రోడ్డు మార్గంలో ప్రయాణించింది ఈ ప్రయాణానికి 12 నుంచి 14 గంటలు పట్టింది. జంతువుతో పాటు పశువైద్యులు, అటవీశాఖ అధికారులు సహా మొత్తం 13 మంది సభ్యుల బృందం ప్రయాణించింది. తేజస్‌ను సుమారు 20 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నారు. ఈ సమయంలో ఎన్‌క్లోజర్ కీపర్, పశువైద్యుడు మాత్రమే దాని వద్దకు వెళ్లారు. తేజస్ ఆరోగ్యం, ఆహారం, ప్రవర్తన, కొత్త వాతావరణానికి అలవాటు పడే విధానాన్ని నిశితంగా పరిశీలిస్తారు.తెల్ల పులి అనేది ప్రత్యేకమైన జాతి కాదు.. దాని తెల్లని రంగుకు కారణం అరుదైన జన్యు లక్షణం. అల్బినో జంతువుల మాదిరిగా కాకుండా, తెల్ల పులులకు సహజమైన చారలు ఉంటాయి. ఇవి బెంగాల్ పులిలో కనిపించే సహజ రంగు వైవిధ్యంగా పరిగణించబడతాయి. వాటి అరుదైన రూపం కారణంగా ప్రపంచంలోని అనేక జూలలో తెల్ల పులులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఇదీ చదవండి: నర్సింగ్ విద్యార్థిని కేసులో సంచలన ట్విస్ట్
గంగాతీరంలో విదేశీ భక్తులు.. పూర్వీకులకు పిండ ప్రదానం!
గయ: పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు సాధారణంగా భారతీయులు పవిత్ర క్షేత్రాలకు వెళ్తుంటారు. అయితే.. పూర్వీకుల జ్ఞాపకార్థం నిర్వహించే ఈ సంప్రదాయానికి విదేశీయులు కూడా ఆకర్షితులవుతున్నారు. జర్మనీ, ఘనా, ఉక్రెయిన్, రష్యాకు చెందిన పలువురు విదేశీ భక్తులు గయకు చేరుకుని పూర్వీకులకు పిండ ప్రదానం చేశారు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలపై తమకున్న ఆసక్తిని చాటుతూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.బీహార్‌లో గయలోని పవిత్ర ప్రాంతాల్లో నిర్వహించిన పిండ ప్రదాన కార్యక్రమాల్లో విదేశీ భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. పూజారుల సూచనల మేరకు తర్పణం, పిండ ప్రదానం తదితర కార్యక్రమాలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. తమ పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పూర్వీకులకు నివాళులు అర్పించేందుకు గయకు వచ్చిన విదేశీయులు.. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.#WATCH | Gaya, Bihar: Foreign devotees from Germany, Ghana, Ukraine and Russia perform Pind Daan rituals for ancestors. pic.twitter.com/i4xcvzMCN6— ANI (@ANI) October 2, 2026 భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలపై విదేశాల్లోనూ ఆసక్తి పెరుగుతోందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి చూపించింది. జర్మనీ, ఘనా, ఉక్రెయిన్, రష్యా వంటి దేశాల నుంచి వచ్చిన భక్తులు పిండ ప్రదానంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్వీకులను స్మరించుకుంటూ వారు నిర్వహించిన ఈ కార్యక్రమాలు గయలోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. VIDEO | Gaya, Bihar: Foreign devotees perform 'pind daan', pray for 'moksha' for their ancestors during the ongoing Pitrupaksh Mela.#GayaNews #PitrupakshMela (Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/jidCF4LbMi— Press Trust of India (@PTI_News) October 2, 2026 ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు చెందిన భక్తురాలు ఒలెక్సాండ్రా మాట్లాడుతూ..‘మాకు ఇక్కడ లభించిన ఆతిథ్యానికి భారతదేశానికి కృతజ్ఞతలు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఎంతో చక్కగా చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని మా పూర్వీకుల కోసం ప్రార్థించే అవకాశం మాకు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి ఈ ఆధ్యాత్మిక అనుభూతిని పొందగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని తెలిపారు.#WATCH | Gaya, Bihar: A devotee from Ukraine, Oleksandra, says, "We are grateful to India for how welcoming you are and how nicely all the circumstances are organised here, so we can also experience this here and pray for our ancestors and have this opportunity to be here..." https://t.co/inUlz2PjDh pic.twitter.com/JOM2PfdOeI— ANI (@ANI) October 2, 2026
International
NRI
బ్రిటన్ గ్లౌసెస్టర్షైర్లో వెంకన్న ఆలయం.. టీటీడీ నిధుల కోసం సంకల్పం
సాక్షి, లండన్: బ్రిటన్‌లోని గ్లౌసెస్టర్షైర్లో శ్రీ బాలాజీ ఆలయం నిర్మించాలన్న చిరకాల స్వప్నం సాకారం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ నాయకులతో కలిసి బీబీసీ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆలయ నిర్మాణ ప్రణాళికపై చర్చించారు.ఈ బీబీసీ ఇంటర్వ్యూలో సతీష్‌రెడ్డి, స్లౌ డిప్యూటీ మేయర్ చంద్ర మువ్వలతో పాటు పలువురు కమ్యూనిటీ నాయకులు పాల్గొన్నారు. గ్లౌసెస్టర్షైర్(Gloucestershire)లో బాలాజీ ఆలయాన్ని ఏర్పాటు చేయాలన్న తమ లక్ష్యం, ఇందుకు విస్తృత కమ్యూనిటీ మద్దతు అవసరం గురించి వివరించారు. ఆలయం ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధానికి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.టీటీడీ నిధుల కోసం సంకల్పంఈ సందర్భంగా సతీష్ రెడ్డి భారతీయ రాజకీయాలు, కమ్యూనిటీ సేవ తదితర అంశాలపై మాట్లాడారు. బాలాజీ ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుంచి సహకారం పొందేందుకు కృషి చేస్తానని సంకల్పం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు ఆయన అందిస్తున్న ప్రోత్సాహం, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.‘కమ్యూనిటీ మద్దతుతో కల సాకారం’బీబీసీ ప్రజెంటర్, కింగ్ చార్లెస్ నియమించిన డిప్యూటీ లెఫ్టినెంట్ మ్యానీ మసీహ్ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించారు. బ్రిటన్‌లోని భారతీయ సమాజాల్లో జరుగుతున్న సేవా కార్యక్రమాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాలాజీ ఆలయ నిర్మాణ ప్రయత్నాలపై కూడా చర్చించారు. విస్తృత కమ్యూనిటీ మద్దతు, దైవ ఆశీస్సులతో గ్లౌసెస్టర్షైర్లో బాలాజీ ఆలయం నిర్మించాలన్న చిరకాల ఆకాంక్షను సాకారం చేసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా ఐసీఎస్ కన్వెన్షన్ వేడుకలు
ఆస్ట్రేలియాలో ఘనంగా ఐసీఎస్ కన్వెన్షన్ వేడుకలు
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఇండియన్ కల్చరల్ సొసైటీ ఆఫ్ క్వీన్స్లాండ్ (ICS) ఆధ్వర్యంలో ఐసీఎస్ కన్వెన్షన్ 2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వామి రాధామనోహర్ దాస్ , తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్‌రావు, చామకూరి మల్లారెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, సాధినేని యామిని శర్మ పాల్గొన్నారు.భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, కుటుంబ విలువలను ఆస్ట్రేలియాలోని తదుపరి తరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల ప్రత్యేక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, ఇతర కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. బ్రిస్బేన్‌లోని భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాను చదువుకున్న పాఠశాలకు వెళ్లిన మిస్ యూనివర్స్ కాజియా
అబుదాబిలో తాను విద్యాభ్యాసం చేసిన సెయింట్ జోసెఫ్స్ పాఠశాలను మిస్ యూనివర్స్ కాజియా సందర్శించారు. ఆమెను చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థిని అంతర్జాతీయ వేదికపై అద్భుత విజయాన్ని సాధించి తిరిగి రావడంతో, పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. పాఠశాల విద్యార్థులందరూ, ఉపాధ్యాయ బృందం కాజియాకు ఘనంగా స్వాగతం పలికి తమ ఆత్మీయతను చాటుకున్నారు.తనను ప్రేమాభిమానాలతో ఆహ్వానించిన విద్యార్థులు, తనకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను చూసిన కాజియా భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యాన్ని, పాఠశాలలో గడిపిన మధురమైన రోజులను గుర్తుచేసుకుంటూ, ఈ స్వాగతం తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని ప్రత్యేకమైన అనుభూతి అని ఆమె పేర్కొన్నారు.కాజియా గౌరవార్థం విద్యార్థులు ప్రత్యేకంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. నృత్యాలు, సంగీతం తదితర కార్యక్రమాలతో విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి ప్రదర్శనను కాజియా ఎంతో ఆనందంగా వీక్షిస్తూ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కాజియాను ఘనంగా సత్కరించి, ఆమె సాధించిన అసాధారణ విజయానికి అభినందనలు తెలిపింది. తమ పాఠశాలలో చదివిన విద్యార్థిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పాఠశాలకే గర్వకారణమని యాజమాన్యం పేర్కొంది.విద్యార్థుల ఆత్మీయత, ఉపాధ్యాయుల ఆశీర్వాదాలు, పాఠశాల యాజమాన్యం అందించిన గౌరవం.. ఇవన్నీ కలిసి కాజియా పాఠశాల పునరాగమనాన్ని ఒక మరపురాని భావోద్వేగ క్షణంగా మార్చాయి. “ఎంత ఎత్తుకు ఎదిగినా, మన విజయానికి తొలి అడుగులు పడిన ప్రదేశం ఎప్పటికీ మన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది” అన్న భావనకు ఈ సందర్భంగా కాజియా పాఠశాల సందర్శన ఒక అందమైన ఉదాహరణగా నిలిచింది.
రష్యా యుద్ధ భూమిలో చిక్కుకున్న తెలంగాణ వాసులు
హైదరాబాద్: ఉపాధి కోసం రష్యా వెళ్లి.. ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా సైన్యంలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడి.. ప్రస్తుతం యుద్ధ భూమిలో చిక్కుకున్నట్లు చెబుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు తెలంగాణ వాసులను సురక్షితంగా భారత్‌కు రప్పించాలని వారి కుటుంబ సభ్యులు ’సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు.మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మికి కుటుంబ సభ్యులు వినతిపత్రం అందజేశారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, భుక్యా రవీందర్, సిర్షు అశోక్, మెగావత్ ప్రకాష్, మహమ్మద్ అఫ్జల్ ఖాన్ ఉపాధి కోసం సుమారు ఏడు నెలల క్రితం రష్యా వెళ్లారు. ఆయిల్ కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెప్పడంతో లక్షల రూపాయలు వెచ్చించి అక్కడికి వెళ్లినట్లు తెలిపారు.ఆయిల్ కంపెనీలో వేతనాలు నిలిచిపోవడంతో ఇతర సాధారణ పనులు మాత్రమే ఉంటాయని చెప్పి కొందరు ఏజెంట్లు వారిని రష్యా సైన్యంలో చేరేలా చేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం వారిని యుద్ధ ప్రాంతంలో విధులకు పంపినట్లు, ప్రస్తుతం వారి ప్రాణ భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందని వివరించారు.కుటుంబ సభ్యుల విన్నపాన్ని విన్న గద్వాల్ విజయలక్ష్మి వారికి భరోసా కల్పించారు. నలుగురు తెలంగాణ వాసులకు అవసరమైన దౌత్య సహాయం అందించి, సురక్షితంగా విడుదల చేయించి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని GAD–NRI అధికారులకు సూచించారు. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు మాస్కోలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. నలుగురి వివరాలతో భారత రాయబార కార్యాలయానికి కూడా లేఖ పంపించి.. వారి భద్రత, స్వదేశానికి రప్పించే ప్రక్రియలో సహకరించాలని కోరారు.విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు ప్రభుత్వం తరఫున సాధ్యమైన సహాయం అందించేందుకు కృషి చేస్తాం. కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తామని గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి కె. విద్యాసాగర్, ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Sakshi Originals
విటమిన్–డి లోపిస్తే గుండెకు ముప్పే
సాధారణంగా ఎముకల బలానికి, గట్టితనానికి విటమిన్–డి కావాలని అందరికీ తెలుసు. అయితే శరీరంలో విటమిన్–డి తక్కువగా ఉంటే, అది నేరుగా గుండె ఆరోగ్యాన్ని కణాల స్థాయిలో దెబ్బతీస్తుందని తేలింది. ఈ విటమిన్ స్థాయిలు తగినంతగా లేకపోవడం వల్ల గుండెను కాపాడే సహజ రక్షణ వ్యవస్థ పూర్తిగా పాడైపోతుందని హైదరాబాద్‌కు చెందిన భారతీయ వైద్య పరిశోధన మండలి–జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా కనుగొన్నారు. విటమిన్–డి తగినంత లేకపోతే గుండె కణాల్లో హానికరమైన ఒత్తిడి పెరిగిపోయి, అవి దెబ్బతినడమే కాకుండా కణాలు అకాలంగా చనిపోయే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వివరాలు స్టెరాయిడ్స్ అనే ప్రముఖ అంతర్జాతీయ పత్రికలో ప్రచురితమయ్యాయి. – సాక్షి, హైదరాబాద్/లాలాపేటపరిశోధన ఇలా..శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం ల్యాబ్‌లో ఎలుకలపై రకరకాల ప్రయోగాలు చేశారు. సాధారణ ఆహారం తీసుకునే, తక్కువ విటమిన్–డి ఉన్న ఆహారం తీసుకునే, అలాగే, విటమిన్–డి పూర్తిగా లేని ఆహారం తీసుకునే ఎలుకల గుండెల్లో జరుగుతున్న మార్పులను చాలారోజుల పాటు గమనించారు. దీనితోపాటు ప్రయోగశాలలో ప్రత్యేకంగా పెంచిన గుండె కణాలపైనా పరిశోధనలు జరిపారు.విటమిన్–డి లోపించిన ఆహారాన్ని తీసుకున్న ఎలుకల గుండెల్లో చెడు ఒత్తిడి, ఆక్సీకరణ నష్టం చాలా ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మన శరీరంలో కణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించే ’గ్లుటాథియోన్’ అనే ముఖ్యమైన రసాయన నిల్వలు వాటిలో పూర్తిగా అడుగంటాయి. గుండెను కాపాడే ఇతర రక్షణ ఎంజైముల పనితీరు కూడా బాగా తగ్గిపోయింది. కణాలను ఒత్తిడి నుండి కాపాడే ప్రధాన అంతర్గత రక్షణ మార్గమైన ’ఎన్ఆర్ఎఫ్–2’ కూడా ఈ విటమిన్–డి లోపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు పరిశోధకులు నిరూపించారు.ఒత్తిడిని తట్టుకుని సురక్షితంగా...శరీరంలో విటమిన్–డి తగినంతగా లేకపోవడం వల్ల సుదీర్ఘకాలం పాటు కొనసాగే ఒత్తిడి కారణంగా గుండె కణాలపై భారం పెరిగిపోతుందని ఈ పరిశోధనా బృందానికి నాయకత్వం వహించిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆయేషా ఇస్మాయిల్ చెప్పారు. దీనివల్ల కణాలు తీవ్రంగా గాయపడతాయని, కణాలు తమను తాము నాశనం చేసుకునే ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అయితే గుండె కణాలకు ముందే విటమిన్–డి అందించినప్పుడు, అవి ఆ ఒత్తిడిని తట్టుకుని చనిపోకుండా సురక్షితంగా ఉన్నట్లు ల్యాబ్‌లో రుజువైందని తెలిపారు. శరీరంలో తగినంత మోతాదులో విటమిన్–డి ఉండటం వల్ల గుండె కణాలు ఒత్తిడి పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోగలవని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి పేర్కొన్నారు.
పార్కిన్సన్స్ బాధితుల కోసం స్మార్ట్ సాక్స్!
పార్కిన్సన్ వ్యాధి ఉన్నవారు ఒక్కోసారి కాళ్లు కదలక నడవలేకపోతారు. ఇలా జరగడాన్ని ‘ఫ్రీజింగ్ ఆఫ్ గెయిట్’ అంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇటలీలోని మిలాన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు ఆర్ఫియస్ అనే స్మార్ట్ సాక్స్‌ను తయారు చేశారు. ఈ సాక్స్‌లో ఉండే చిన్నచిన్న పరికరాలు... బాధితులు కోరిన సంగీతానికి అనుగుణంగా కాళ్లకు స్వల్పమైన కంపనాలు ఇస్తాయి. నడుస్తున్నప్పుడు ఈ కంపనాలు లయబద్ధంగా వెలువడుతూ కాళ్లు కదలడానికి సహాయపడతాయి. ఈ వినూత్న ఆలోచన ‘2026 ఏడాదికి జేమ్స్ డైసన్ అవార్డు’కు ఎంపికైంది.ఇష్టమైన పాటల రిథమ్‌కు అనుగుణంగా కంపనాలిలా... ఆర్ఫియస్ సాక్స్‌లో పాదాలు, కింది కాలి భాగంలో మొత్తం ఎనిమిది చిన్న వైబ్రేషన్స్ ఇచ్చే పరికరాలు ఉంటాయి. అవసరమైన ప్రాంతానికి కంపనాలు అందించడంలో ఇవి సహాయపడతాయి. ఈ సాక్స్‌ను మొబైల్ యాప్‌తో అనుసంధానించడం ద్వారా ‘స్పాటిఫై’లో తమకు ఇష్టమైన పాటలను బాధితులు ఎంపిక చేసుకోవచ్చు. ఆ సంగీతంలోని రిథమ్‌కు తగినట్లుగా సాక్స్‌లోని పరికరాలు కాళ్లకు కంపనాలను అందిస్తాయి. ఇందుకోసం హెడ్‌ఫోన్స్ కూడా అవసరంలేదు. ప్రస్తుతం ఈ ఆర్ఫియస్ ఇంకా ప్రాథమిక నమూనా (ప్రోటోటైప్) దశలోనే ఉంది. దీన్ని మరింత చిన్నదిగా, సౌకర్యవంతంగా తయారు చేయడంతోపాటు నడుస్తున్నప్పుడు కాళ్లు అకస్మాత్తుగా ఆగిపోవడాన్ని గుర్తించే ‘ఫ్రీజ్ డిటెక్షన్ టెక్నాలజీ’ని కూడా ఇందులో చేర్చేందుకు పరిశోధక విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవి వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చేందుకు మరో మూడేళ్లు పట్టవచ్చని వారు చెబుతున్నారు.యువతలో పెరుగుతున్న పక్షవాతం కేసులు!సాధారణంగా వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే పక్షవాతం ఇటీవల యువతలో పెరిగినట్లు ఓ అమెరికన్ అధ్యయనంలో తేలింది. దాదాపు మూడు దశాబ్దాల కాలంలో 20 ఏళ్ల నుంచి 54 ఏళ్ల మధ్య వయసు వారిలో పక్షవాతం కేసులు దాదాపు రెట్టింపయ్యాయని పరిశోధకులు గుర్తించారు. అయితే స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 30 రోజుల్లో మరణించే వారి శాతం మాత్రం కొంత తగ్గింది. ఈ అధ్యయనంలో భాగంగా 20 ఏళ్ల నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్న వారిలో తొలిసారి పక్షవాతం వచ్చిన 2,076 కేసులను పరిశోధకులు గుర్తించారు. 1993–94లో ప్రతి లక్ష మంది యువతలో ఏడాదికి సుమారు 33.9 స్ట్రోక్ కేసులు నమోదవగా 2020 నాటికి ఈ సంఖ్య 62.2కు పెరిగింది. యువతలోని పక్షవాతం కేసుల్లో ప్రధానంగా ఇస్కీమిక్ స్ట్రోక్స్ ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మెదడులోని ఏదైనా భాగానికి రక్తాన్ని తీసుకెళ్లే నాళంలో అడ్డంకి ఏర్పడి రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల వచ్చే స్ట్రోక్‌ను ఇస్కీమిక్ స్ట్రోక్‌గా పిలుస్తారు. 1993–94లో ప్రతి లక్ష మందిలో ఏడాదికి 23.8 ఇస్కీమిక్ స్ట్రోక్ కేసులు నమోదైతే 2020 నాటికి ఈ సంఖ్య 47.3కు పెరిగింది. అయితే మెదడులో రక్తనాళం చిట్లడంతో రక్తస్రావం జరగడం వల్ల వచ్చే ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్, మెదడు చుట్టూ రక్తస్రావం వల్ల వచ్చే సబ్అరాక్నాయిడ్ హెమరేజ్ వంటి ఇతర రకాల స్ట్రోక్స్‌లో మాత్రం ఈ పెరుగుదల కనిపించలేదు. పక్షవాతానికి గురైన యువతను పరిశీలించినప్పుడు... గతంతో పోలిస్తే వారిలో హైబీపీ, డయాబెటిస్ వంటి కొన్ని సమస్యలు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయన వివరాలు న్యూరాలజీ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.జంక్ ఫుడ్‌తో దీర్ఘకాలిక వ్యాధులుఅల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వారిలో గుండె జబ్బులు, కేన్సర్, డయాబెటిస్, ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉండొచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ఈ తరహా ఆహారం ఎక్కువగా తీసుకునే వారిలో ఏ కారణంతోనైనా మరణాల ముప్పు కూడా ఎక్కువగానే ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై పరిశోధకులు ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలను సమగ్రంగా విశ్లేషించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రచురితమైన పరిశోధనలను పరిశీలించారు. ఈ విశ్లేషణలో మొత్తం 51 అధ్యయనాలున్నాయి.ఆయా అధ్యయనాల్లో పాల్గొన్న వాలంటీర్ల ఆహార అలవాట్లను, వారి ఆహార చరిత్రను విశ్లేషించగా అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి.. కొన్ని ప్రధాన ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పునకు మధ్య సంబంధం ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ రోజువారీ వినియోగం పెరిగేకొద్దీ అనారోగ్య సమస్యల ముప్పు కూడా పెరుగుతున్నట్లు డోస్ రెస్పాన్స్ అనాలసిస్‌లో కనిపించింది. రోజుకు అదనంగా 100 గ్రాముల అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హృద్రోగ సమస్యలు, కేన్సర్, ఏ కారణంతోనైనా మరణించే ముప్పు, మెటబాలిక్ సిండ్రోమ్/డయాబెటిస్ ముప్పు పెరగడంతో సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ పరిశోధనలో లభించిన ఆధారాలు తక్కువ స్థాయి నుంచి మధ్యస్థ స్థాయిలోనే ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.సాక్షి, హెల్త్ డెస్క్
Genz కూతురూ జిందాబాద్
మీ కూతురు ఇప్పుడుసినిమాల్లోని కూతురు కాదు. వంటింటి క్యారెక్టర్ కాదు. ఆమె ఇప్పుడు కోడ్ రాస్తుంది, కంటెంట్ రాస్తుంది, కంపెనీని నడుపుతుంది. ఆమెకు ‘పెళ్లి ఎప్పుడు?’ అనే ప్రశ్న కంటే ‘నెక్స్›్ట΄్లాన్ ఏంటి?’ అనే ప్రశ్నే నచ్చుతుంది. ఆమెకు స్వేచ్ఛ కావాలి, కానీ భద్రత కూడా కావాలి. ప్రేమ కావాలి, కానీ సొంత స్పేస్ కూడా కావాలి. కూతురి ఫోన్ చెక్ చేయడం మానేసి, ఆమె ఫాలో అవుతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోండి. ఒకప్పుడు కూతురిని కాపాడటం అంటే ఇంట్లో పెట్టడం. ఇప్పుడు ప్రపంచంలోకి ధైర్యంగా పంపడం. ఈ డాటర్స్ డే రోజున ఆమె పై మీ నమ్మకాన్నే ‘గిఫ్ట్’గా ఇవ్వండి. మిగిలిన గిఫ్టులన్నీ ఆమె కొనుక్కోగలదు. ఎందుకంటే జెన్ జి కూతురు ప్రిన్సెస్ కాదు, సీఈఓ. ఈ కాలం కూతురా...వర్థిల్లు.డాడ్ మామ్‘‘ప్రతి సమస్యకు పరిష్కారం కూర్చుని మాట్లాడుకోవడమే’’ అంటున్నారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. తన తల్లిదండ్రుల గురించి చెబుతూ ఆమె ఇలా అన్నారు. చిన్నప్పుడు ఫరియా పేరెంట్స్ ఆమె అల్లరి చేస్తే.. తిట్టింది లేదు... కొట్టింది లేదు. మరేం చేశారంటే... కూతుర్ని కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడారు... కోపాన్నీ ప్రదర్శించారు. ‘‘ఆ మాటలే నేను పరిణతి ఉన్న అమ్మాయిని కావడానికి ఉపయోగపడ్డాయి’’ అని చెప్పారు ఫరియా అబ్దుల్లా. ‘డాటర్స్ డే’ సందర్భంగా తన తల్లిదండ్రుల గురించి ఫరియా అబ్దుల్లా ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు.ఈరోజు నేనీ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం మై డాడ్ అండ్ మామ్. ఇద్దరూ నా జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్లడానికి రెండు విభిన్నమైన కోణాలను నేర్పించారు. నాన్న నాకు సైన్స్, ప్రపంచం, మతం, సైకాలజీ, ఫిలాసఫీ వంటివన్నీ నేర్పించారు. మా అమ్మ నాకు ఎనర్జీ. ఆమె నాకు లవ్, కైండ్‌నెస్, సానుభూతి వంటివి నేర్పించారు. ఈ రెండూ కలిసి నన్ను ఒక మంచిæ వ్యక్తిగా తీర్చిదిద్దాయి.నాన్నతో నెల రోజులు మాట్లాడలేదుమా అమ్మా నాన్న మీద నా ప్రేమను తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైన రోజు అవసరం లేదు. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నా ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తుంటాను. అయితే నన్ను నేను బ్యాడ్ డాటర్ అనుకుంటాను. ఎందుకంటే నేను పనులేమీ చేయను. కోపంగా ఉన్నప్పుడు రూడ్‌గా మాట్లాడిన సందర్భాలున్నాయి. ఒకసారి నాన్న, నేను గొడవపడి నెల రోజులు మాట్లాడుకోలేదు. ఆ టైమ్‌లో నేను చాలా ఏడ్చాను. నేను అచ్చంగా మా నాన్న ఈగో క్లాష్ అయి, ‘నువ్వు మాట్లాడవా, నేను కూడా మాట్లాడను’ అనే జోన్లోకి వెళ్ళి ఆ నెల రోజులు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత కలిసిపోయాం. అది మినహా మా మధ్య ఎప్పుడూ ఇష్యూస్ లేవు. అయితే ఇంకా మంచి కూతురిగా నేను ఉండొచ్చేమో అనిపిస్తుంటుంది. ట్రై చేస్తాను.నా చిరాకు కూడా వాళ్లకు ప్రేమే!మా అమ్మా నాన్న చూపించే లవ్ ‘అన్ కండిషనల్’. నా చిరాకులు, బ్యాడ్ మూడ్స్, మూడ్ స్వింగ్స్... అన్నింటినీ ఓపికగా భరిస్తారు. ఎలా హ్యాండిల్ చేస్తారు? వాళ్లూ మనుషులే కదా అనిపిస్తుంటుంది. అందుకే నేను బ్యాడ్ మూడ్‌లో ఉన్నప్పుడు అదేం బయటపెట్టకుండా వాళ్లకు దూరంగా ఉండాలనుకుంటాను. కానీ నేను చూపించే చిరాకు కూడా వాళ్లకు ప్రేమ అనిపిస్తుంది. మా పేరెంట్స్ నన్ను ఎప్పుడూ కొట్టలేదు. కనీసం నా మీద ఎప్పుడూ చెయ్యి ఎత్తలేదు. ఏదైనా సరే మాటలతో చెప్పడమే. అందుకే నా మనసుకి బాగా పట్టాయి. చాలా మెచ్యూర్డ్‌గా పెంచారు. ఆ పెంపకానికి కృతజ్ఞురాలిగా ఉండాలనుకుంటున్నాను. ఒకవేళ మా పేరెంట్స్ పెంపకం సరిగ్గా లేకపోయి ఉంటే∙వయలెంట్ పర్సన్ గా మారిపోయేదాన్నేమో (నవ్వుతూ). నీ జర్నీ... నీ ఇష్టం అన్నారుచిన్నప్పటి నుంచే నేను ఒక ఆర్టిస్టిక్, క్రియేటివ్ పర్సనాలిటీ అని మమ్మీ, డాడీకి అర్థమైపోయింది. సో... ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాననే నా నిర్ణయాన్ని ఎప్పుడు చెబుతానా అని వాళ్లు ఎదురు చూశారు. కాలేజ్ అయిపోయాక, ‘ఓకే, ఇప్పుడు నువ్వు కెరీర్ విషయంలో సీరియస్‌గా ఉన్నావా లేదా కెరీర్‌కి సంబంధించిన నిర్ణయాన్ని నువ్వే తీసుకోవాలి’ అని చెప్పారు. అయితే ఆ విషయంలో నన్ను ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు. ఇప్పుడు కూడా నేను ‘ఇది చేయను’ అని చెప్తే, ‘ఓకే’ అంటారు. ‘ఇది నీ జర్నీ... నీ ఇష్టం’ అనేలానే నన్ను పెంచారు. అలా ఇష్టాన్ని నా మీద వదిలేయడానికి కారణం వాళ్ల పెంపకం మీద వాళ్లకి ఉన్న నమ్మకం... వాళ్లు ఇచ్చిన స్వేచ్ఛను నేను దుర్వినియోగం చేయనని నమ్మకం. మనం ఎలాంటి వ్యక్తులుగా ఎదుగుతాం అనేది చాలావరకూ మన పేరెంట్స్ పెంపకాన్ని బట్టే ఉంటుంది. ఆ విషయంలో నా పేరెంట్స్ ‘బెస్ట్’. నా కోసం టైమ్ కేటాయించి, ‘లైఫ్ అంటే ఇలా ఉంటుంది... ఇలా ఉండాలి’ అని వివరంగా చెప్పడంతో పాటు విలువలు కూడా నేర్పించారు. అందుకే నేను కూడా ‘బెస్ట్’ (నవ్వుతూ)...అమ్మని ప్రపంచం మొత్తం తిప్పాలని ఉందిమా అమ్మకి చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఆవిడ వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ వల్ల ఆ అవకాశం సరిగ్గా కుదరలేదు... రాలేదు. లండన్, అమెరికా వెళ్లారు కానీ, నాతో ట్రావెల్ చేసినప్పుడు ఆవిడ హ్యాపీనెస్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువగా ఇవ్వాలనుకుంటున్నాను. వీలైతే అమ్మని ప్రపంచం మొత్తం తిప్పాలని ఉంది. అలాగే నాన్నతో కలిసి ఒక వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నాను. ఇద్దరం కలిసి ఆ వ్యాపారాన్ని పెద్ద సామ్రాజ్యంలా విస్తరింపజేయాలన్నది నా కల.– డేరంగుల జగన్ మోహన్
జెన్‌జీ జేబులో మన్మోహన్.. ఆ అడుగులే ఇప్పుడు!
మన్మోహన్ సింగ్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది.. నిశ్శబ్దంగా మాట్లాడే మాజీ ప్రధాని. కానీ నేటి జెన్‌జీకి ఆయన అంతకంటే ఎక్కువ. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ నుంచి ఇంటర్నెట్ వరకు.. స్టార్టప్‌ల నుంచి విదేశీ కంపెనీల ఉద్యోగాల వరకు.. భారత ఆర్థిక వ్యవస్థలో మూడు దశాబ్దాలుగా కనిపిస్తున్న ఎన్నో మార్పుల వెనుక ఆయన ఆలోచనల ముద్ర కనిపిస్తుంది.ఒక్కసారి 1991కి వెళ్దాం. అప్పట్లో దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. దేశం తన అవసరాలకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి. ఆ సమయంలో పీవీ నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టారు. దిగుమతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రైవేట్ రంగంపై ఉన్న అనేక ఆంక్షలను క్రమంగా సడలించారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో మరింతగా అనుసంధానం చేసే దిశగా అడుగులు వేశారు.ఆ మార్పులు అంటే అప్పట్లో సామాన్యుడికి వెంటనే అర్థమయ్యే విషయం కాదు. కానీ వాటి ప్రభావం క్రమంగా కనిపించింది. విదేశీ కంపెనీలకు భారత మార్కెట్ తెరుచుకుంది. ప్రైవేట్ రంగానికి అవకాశాలు పెరిగాయి. పోటీ పెరిగింది. కొత్త పరిశ్రమలు, కొత్త సేవలు వచ్చాయి. తర్వాతి సంవత్సరాల్లో ఐటీ రంగం వేగంగా విస్తరించడానికి కూడా ఈ మారిన ఆర్థిక వాతావరణం ఒక నేపథ్యంగా నిలిచింది.ఇప్పుడు 2026. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే జీడీపీ వృద్ధి బలంగానే కనిపిస్తోంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2025–26లో భారత ఆర్థిక వృద్ధి 7.6 శాతంగా నమోదైంది. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ పరిస్థితులు, ముఖ్యంగా ఇంధన ధరలు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో వృద్ధి 6.6 శాతానికి తగ్గొచ్చని అంచనా వేసింది. అయితే జెన్‌జీ ప్రశ్న మాత్రం జీడీపీ దగ్గర ఆగిపోదు.మరి నాకు మంచి ఉద్యోగం ఎప్పుడు?ఇదే అసలు ప్రశ్న. ఇటీవలి ఆర్థిక విశ్లేషణల్లోనూ ఇదే అంశం ప్రధానంగా కనిపిస్తోంది. ఐఎంఎఫ్ తాజా విశ్లేషణ ప్రకారం భారత వృద్ధికి ఉద్యోగాలు, ఉత్పాదకత, నైపుణ్యాల మధ్య ఉన్న అంతరం పెద్ద సవాలుగా మారింది. కోట్లాది మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్న సమయంలో.. జీడీపీ పెరగడం కంటే వారికి స్థిరమైన, మంచి ఆదాయం ఇచ్చే ఉద్యోగాలు ఎంత వస్తున్నాయన్నదే కీలకం.ఇక్కడే మన్మోహన్ మళ్లీ జెన్‌జీ జేబులోకిఎందుకంటే ఆయన కాలంలో మొదలైన ఆర్థిక మార్పులు “ప్రపంచంతో పోటీ పడే భారత్” అనే దిశను బలపరిచాయి. నేడు ఒక చిన్న పట్టణంలో ఉన్న యువకుడు విదేశీ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేయగలగడం, ఇంటి నుంచే ఆన్లైన్ సేవలు అందించడం, యాప్ ద్వారా వ్యాపారం మొదలుపెట్టడం, ప్రపంచ మార్కెట్ గురించి తెలుసుకోవడం.. ఇవన్నీ ఒక్కరోజులో వచ్చిన మార్పులు కావు. మూడు దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన మార్పుల ఫలితంగా ఏర్పడిన అవకాశాల గొలుసులో ఇవి భాగం. అయితే కథ ఇక్కడితో పూర్తికాదు. అప్పట్లో భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కలపడం పెద్ద సవాలు అయితే.. ఇప్పుడు ఆ వృద్ధి ఫలాలను ఎక్కువ మందికి చేరేలా చేయడం మరో పెద్ద సవాలు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలకు అవకాశాలు, మహిళలకు ఉపాధి, నైపుణ్యాలకు తగ్గ పనులు రావాల్సి ఉంది. ఉద్యోగ కల్పన కోసం ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచే సంస్కరణలపై ప్రపంచ బ్యాంకు కూడా దృష్టి పెట్టింది. అప్పట్లో మన్మోహన్ సింగ్ ముందున్న ప్రశ్న.. “భారత ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడాలి?”ఇప్పుడు జెన్‌జీ ముందున్న ప్రశ్న.. “ఈ ఆర్థిక వృద్ధిలో నా భవిష్యత్తు ఎక్కడ?”మన్మోహన్ సింగ్ జయంతి రోజున ఆయనను గుర్తు చేసుకోవడం అంటే కేవలం ఓ మాజీ ప్రధానికి, గొప్ప ఆర్థికవేత్తగా గుర్తుంచుకుని నివాళి ఇవ్వడం కాదు.. నేటి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఇక్కడికి వచ్చిందో గుర్తు చేసుకోవడం కూడా.:::వెబ్ డెస్క్ ప్రత్యేకం
ధనుష్ కొత్త సినిమా వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?
విండీస్‌తో మూడో వన్డే.. టార్గెట్ 'క్లీన్‌స్వీప్'!
H-1B వీసాలపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు!
కమల్ హాసన్ చిన్న కూతురు.. 10th మూడుసార్లు ఫెయిల్.. అయినా తగ్గలేదు..
‘చంద్రబాబు మోసాలను గడప గడపకూ వివరించాలి’
ఎస్ఆర్హెచ్ను వీడనున్న అభిషేక్ శర్మ!
పెరిగిన హారియర్ ఈవీ ధర!
ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. ఆ చిన్నారి లేకపోతే ఎంత ఘోరం జరిగేదో?
రాహుల్ గాంధీకి హరీష్ లేఖ
డిగ్రీ విద్యార్థినిని వేధిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి
జడలు విప్పనున్న ఎల్ నినో! అక్టోబర్ నుంచే..
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాలసీ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ఆఖరికి నా క్రెడిట్ కూడా చోరీ చేసేస్తున్నారు!
పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు.. ప్రభుత్వ నిర్ణయం
ఆ స్టేట్మెంట్ చూస్తేనే భయమేస్తుంది!
ఎల్‌నినో ఎఫెక్ట్ ఇంతటితో పోదు!
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
‘హ్యాట్సాఫ్ రియల్ హీరో..’ భారత పైలట్‌పై ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్..!
రూ. లక్షన్నర దిగువకు పసిడి
IND vs PAK T20I: ఫైనల్లో భారత్, పాక్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియాలోకి విధ్వంసకర వీరుడు
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా
సాక్షి కార్టూన్: 02-10-2026
వెస్టిండీస్ కెప్టెన్ ప్రపంచ రికార్డు
వన్డే చరిత్రలో తొలిసారి; ఒకే మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు శతకాలు
ఓటీటీకి టాలీవుడ్ డివోషనల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
డెబ్యూ బౌలర్‌కు పీడకలను మిగిల్చిన విండీస్ బ్యాటర్లు
ప్రకాశం జిల్లాలో ‘ఇరుముడి’ సీన్ రిపీట్!
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
క్రైమ్
ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం చివరికి..!
తమిళనాడు: మాంగాడు సమీపంలోని పట్టూరు ప్రాంతానికి చెందిన ముజైదీన్ (30). ఇతని భార్య సోఫియా (26). బుధవారం రాత్రి సోఫియా ప్రవర్తన పై అనుమానం కారణంగా, ముజైదీన్ మాంసం నరికే కత్తితో ఆమెను నరికి చంపి పారిపోయాడు. మాంగాడు బస్ స్టేషన్లో ముజైదీన్ ను పోలీసుల అరెస్టు చేసి విచారించారు. ముజైదీన్ తన వాంగ్మన్లో సంచలన సమాచారాన్ని ఇచ్చాడు.మాంగాడు సమీపంలోని పట్టూరు ప్రాంతానికి చెందిన ముజైదీన్ (30) , ఆ ప్రాంతంలోని ఒక మాంసం దుకాణంలో కూలీగా పని చేస్తున్నాడు. ఇతను 8 సంవత్సరాల క్రితం సోఫియా (26) ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ప్రస్తుతం 7 ఏళ్ల కుమార్తె ఉంది. ఈ స్థితిలో, గత కొన్ని నెలలుగా ముజైదీన్ మద్యానికి బానిసయ్యాడు. దీని కారణంగా అతను పనికి వెళ్లకుండ, రోజంతా తాగుతూ ఉన్నాడు. ఇతని భార్య సోఫియా దీనిని ఖండించింది. చికిత్స కోసం అతన్ని ఒక డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించారు. కొన్ని రోజులుగా మద్యం తాగని ముజైదీన్, ఆ తర్వాత మళ్లీ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో తన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకున్న సోఫియా, స్థానిక బట్టల దుకాణంలో పనిమనిషిగా పనిచేస్తు వచ్చింది. ఆమె రోజూ పనికి వెళ్తుండగా, ఆ ప్రాంతానికి చెందిన ఒక ఆటో డ్రైవర్‌తో ఆమెకు మంచి స్నేహం ఏర్పడిందని, చాలా కాలంగా ఫోన్లో మాట్లాడుకుంటోందని ముజైదీన్కు తెలిసింది. కుటుంబ సభ్యుల సలహాతో ఆమె కొంతకాలం పాటు ఆ ఆటో డ్రైవర్‌తో ఫోన్లో మాట్లాడలేదు. అయితే, ముజైదీన్కు తన భార్య పై అనుమానం వచ్చి ఆమెను కొట్టాడు. సోఫియా బుధవారం రాత్రి చాలా సేపు ఆమె తన స్నేహితురాలితో సెల్ ఫోన్లో మాట్లాడుతుండగా చూసి, మళ్లీ ఆటో డ్రైవర్‌తో మాట్లాడుతోందని అనుమానించిన ముజైదీన్, మద్యం మత్తులో సోఫియాను మాంసం నరికే కత్తిని తెచ్చి, తన భార్య సోఫియాను ఛాతీతో సహా పలుచోట్ల నరికి చంపాడు.ఇదీ చదవండి: కండక్టర్‌గా సీఎం విజయ్.. సర్ప్రైజ్ చేసిన అమ్మాయిలు!
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైటెన్షన్.. ప్రయాణికుడు హల్చల్!
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్టు నుంచి కడపకు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు హల్చల్ చేశాడు. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో తోటి ప్రయాణికులలో భయానక పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన విమాన సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రయాణీకులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.అలాగే, ఈ సమాచారాన్ని విమాన సిబ్బంది పోలసులకు చేరవేయగా, పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అతడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ఎందుకు ప్రయత్నించాడనే విషయం, అలాగే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: గచ్చిబౌలిలో విదేశీ యువతులతో వ్యభిచారం
గచ్చిబౌలిలో విదేశీ యువతులతో వ్యభిచారం
హైదరాబాద్: పోలీసులు అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్లో విదేశీ సెక్స్ వర్కర్లను బుక్ చేసి గచ్చిబౌలి లోని ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌కు సమాచారం అందింది. బుధవారం గచ్చిబౌలి పోలీసులతో కలిసి ఏపీహెచ్‌బీ కాలనీలోని హోటల్‌పై దాడి చేశారు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఒక యువతి, తుర్క్మెనిస్తాన్కు చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. సబ్ ఆర్గనైజర్ మారం మోహన్ రెడ్డి, విటుడు హర్షిత్ సంఘానియాలను అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన నిఖిల్ అలియాస్ సన్నీ ఆన్లైన్లో విటులను బుక్ చేసి గచ్చిబౌలిలోని ఓ హోటల్‌కు పంపుతాడు. పట్టుబడ్డ ముగ్గురు యువతులు ఆగస్టు 30న భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. 15 రోజులుగా ముగ్గురు యువతులు ఆ హోటల్లో ఉంటున్నారని పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో, ట్రక్కు ఢీ.. ఏడుగురు మృతి!
మహారాష్ట్ర: ధర్మాంగాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 21 మందికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ధర్మాంగాన్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో బొలేరోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది.అయితే, స్థానికులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు మృతుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. అయితే ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: భర్తను చంపిన ప్రేమ జంటకు పెళ్లి ముహూర్తం
వీడియోలు
వీడిన హరిణి హత్య మిస్టరీ
వచ్చే వారం తెలంగాణలో మోతమోగనున్న ఎండలు
గచ్చిబౌలిలో విదేశీ యువతులతో వ్యభిచారం
Danam Nagender: ఈసీ ఆఫీస్ సహా హైదరాబాద్ ను తగలబెడతాం.. సంచలన కామెంట్స్
OUలో గంజాయి మొక్క కలకలం
దుమారం రేపుతున్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు
వికటించిన డైట్.. వీరమాచినేనిపై పోలీసు కేసు
ఫుల్ జోష్ లో ఉండు మల్లన్న సారు
సీఎం రేవంత్ సభకు రాకపోతే రూ. 500 జరిమానా..! ఆడియో వైరల్
సూర్యాపేటలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
