గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం,తిథి: బ.పాడ్యమి ప.2.30 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పునర్వసు సా.5.41 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: రా. 1.21, నుండి 2.55 వరకు, దుర్ముహూర్తం: సా.4.08 నుండి 4.56 వరకు, అమృత ఘడియలు: ప.3.24 నుండి 4.56 వరకు.
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.35
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం... ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలకు ప్రణాళిక తయారు చేస్తారు. వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.
వృషభం....స్నేహితులతో వివాదాలు. శారీరక రుగ్మతలు. కార్యక్రమాలు కొన్ని వాయిదా వేస్తారు. వృత్తులు, వ్యాపారాలు సామాన్యస్థితిలో కొనసాగుతాయి. దైవకార్యాలలో పాల్గొంటారు.
మిథునం...... నూతన ఉద్యోగయోగం. చర్చలు ఫలిస్తాయి. ఆహ్వానాలు రాగలవు. కార్యక్రమాలలో అనుకూల వాతావరణం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
కర్కాటకం..... బంధువులతో అకారణ వైరం. వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. వృత్తులు, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
సింహం... కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. శుభవార్తలు. ధనాదాయం మెరుగుపడుతుంది. కీలక నిర్ణయాలు. వృత్తులు, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
కన్య.... పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. విద్యావకాశాలు. వృత్తులు, వ్యాపారాలలో వివాదాలు తీరతాయి.
తుల.... ఆదాయం కొంత నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య సమస్యలు. కష్టానికి ఫలితం కనిపించదు. సన్నిహితులతో విభేదాలు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తులు, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
వృశ్చికం.... కుటుంబంలో కొన్ని సమస్యలు. వృథా ఖర్చులు. బంధువుల నుంచి పిలుపు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. మానసిక అశాంతి.
ధనుస్సు..... కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. శుభకార్యాల నిర్వహణపై చర్చలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.
మకరం.... కొత్త వ్యక్తుల నుంచి ఆహ్వానాలు. బంధువుల ద్వారా శుభవార్తలు. రాబడి సంతృప్తినిస్తుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం.... కుటుంబసభ్యులతో వివాదాలు. శారీరక రుగ్మతలు. శ్రమ పెరుగుతుంది. చేపట్టిన కార్యాలలో స్వల్ప ఆటంకాలు. దైవకార్యాలలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలలో ఒత్తిడులు.
మీనం.... కొన్ని కార్యాలు హఠాత్తుగా వాయిదా వేస్తారు. రాబడి కొంత నిరాశ పరుస్తుంది.. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. స్థిరాస్తి వివాదాలు.


