బంగారం లాంటి వారం! ఏడు రోజుల్లో ఎంత తేడా!! | Gold And Silver Rates Last Week In Telugu States Brings Relief To Buyers, More Details Inside | Sakshi
Sakshi News home page

బంగారం లాంటి వారం! ఏడు రోజుల్లో ఎంత తేడా!!

Jan 4 2026 1:24 PM | Updated on Jan 4 2026 3:09 PM

Gold and Silver rates last week in Telugu states

పసిడి, వెండి ప్రియులకు గత వారం బాగా కలిసొచ్చింది. 2025 డిసెంబర్ చివరి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన అస్థిరత కారణంగా బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 28 నుంచి 2026 జనవరి 4 వరకు గడిచిన ఏడు రోజుల్లో బంగారం ధరలు భారీగా క్షీణించాయి.

బంగారం ధరలు ఎంత తగ్గాయంటే
గత డిసెంబర్ 28న రూ.1,42,420 ఉన్న 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములకు) ధర.. ఈ జనవరి 4 నాటికి రూ.1,35,820కు పడిపోయింది. అంటే వారం రోజుల్లో 6,600 తగ్గింది.

అలాగే 22 క్యారెట్ బంగారం (పది గ్రాములకు) డిసెంబర్ 28న రూ.1,30,550 ఉన్న ధర, జనవరి 4 నాటికి రూ.1,24,500కు వచ్చింది. ఇక్కడ కూడా వారంలో 6,050 తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదల మధ్యలో కొన్ని రోజులు ధరలు కొద్దిగా పెరిగినా, మొత్తంగా గత వారం చివరి నుంచి భారీ క్షీణతే కనిపించింది.

వెండి ధరల్లో క్షీణత
వెండి ధరలు కూడా ఈ వారంలో గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్‌లో ఒక కిలో వెండి ధర డిసెంబర్ 28న  రూ.2,85,000 ఉండగా, జనవరి 4  నాటికి రూ.2,57,000కు తగ్గింది. అంటే కేజీకి రూ.28,000 తగ్గింది. మధ్యలో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, మొత్తంమీద వారంలో భారీ పతనమే నమోదైంది.

ధరలు ఇంతలా తగ్గడానికి ప్రధాన కారణాలు
2025లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయులకు చేరుకున్న నేపథ్యంలో డిసెంబర్ చివరి వారంలో భారీ కరెక్షన్ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు ఇవే..

  • రికార్డు ధరల నుంచి ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకోవడంతో భారీ అమ్మకాలు జరిగాయి.

  • అమెరికాలోని కమోడిటీ ఎక్స్చేంజ్ (CME) సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై మార్జిన్ అవసరాలను పెంచడంతో చిన్న ట్రేడర్లు పొజిషన్లు మూసివేయడం లేదా లిక్విడేషన్ జరగడం.

  • డిసెంబర్ చివరి రోజుల్లో మార్కెట్ లిక్విడిటీ తక్కువగా ఉండటంతో ధరలు మరింత అస్థిరంగా మారాయి.

  • ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, ఇన్‌ఫ్లేషన్ కూలింగ్ సిగ్నల్స్ వంటివి కూడా ప్రభావం చూపాయి.

ఈ తగ్గుదల పసిడి ప్రియులకు, ముఖ్యంగా వివాహాలు, పండుగల సీజన్‌లో కొనుగోళ్లు చేయాలనుకునే వారికి ఊరట కలిగించింది. అయితే మార్కెట్ నిపుణులు ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొనుగోళ్లు చేసేవారు మార్కెట్‌ను గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement