ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.తదియ సా.6.45 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: మృగశిర ప.12.50 వరకు, తదుపరి ఆరుద్ర,వర్జ్యం: రా.8.40 నుండి 10.09 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.48 నుండి 11.33 వరకు, అమృత ఘడియలు: రా.1.55 నుండి 3.24 వరకు.సూర్యోదయం : 5.31సూర్యాస్తమయం : 6.21రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం.. ఊహించని ధనలబ్ధి. ప్రముఖుల నుంచి ముఖ్య సందర్శనం. బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.వృషభం... చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. ఒప్పందాలలో అవాంతరాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.మిథునం.... బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.కర్కాటకం... అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. అనారోగ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.సింహం.... పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకున్న విధంగా కొనసాగుతాయి.కన్య..... చిత్రమైనంఘటనలు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ధనలబ్ధి. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు.తుల.... పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఆటుపోట్లు.వృశ్చికం... ఆర్థికంగా ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. లేనిపోని వివాదాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.ధనుస్సు... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు నూతన పరిచయాలు. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. గృహయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.మకరం... దూరపు బంధువుల కలయిక. వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు.కుంభం... పనుల్లో ఆటంకాలు. మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. బంధువుల నుండి ఒత్తిడులు. ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.మీనం.. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
బులియన్ బ్యాంక్ కావాలి
న్యూఢిల్లీ: పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు, అదే సమయంలో ఆభరణాల తయారీకి అవసరమైన పసిడిని దేశీయంగానే సమకూర్చుకునేందుకు జ్యుయలరీ పరిశ్రమ ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టింది. బులియన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. తద్వారా దేశంలోపలే నిరుపయోగంగా ఉన్న పసిడిని వినియోగంలోని తీసుకురావచ్చని సూచించింది. ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) ప్రతినిధులతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఇళ్లు, సంస్థలు, పెట్టుబడి వాహకాలు కలిగి ఉన్న బంగారాన్ని సమీకరించి జ్యుయలరీ రంగానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తగిన కార్యాచరణను రూపొందించాలని ఆభరణాల పరిశ్రమ మంత్రిని కోరింది. బులియన్ బ్యాంక్ ప్రతిపాదనపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటును పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి నుంచి హామీ లభించింది. ఈ కమిటీని కనుక ఏర్పాటు చేస్తే అందులో ప్రభుత్వం, ఆభరణాల రంగం, బులియన్ మార్కెట్, ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి.బ్యాంక్ మాదిరే.. ప్రతిపాదిత బులియన్ బ్యాంక్ అన్నది కేంద్రీకృత సంస్థగా పనిచేయనుంది. ఈ బ్యాంక్ దేశీయంగా ఉన్న పసిడిని సమీకరించి, అరువు కింద పరిశ్రమకు ఇస్తుంది. ఇళ్లలోని, సంస్థల నిర్వహణలోని (గోల్డ్ ఈటీఎఫ్‌లు) బంగారాన్ని సమీకరించి.. ఆభరణాల సంస్థలు, ఎగుమతిదారులు, రిఫైనరీలు, తయారీదారులకు సరఫరా చేయనుంది. ఇళ్లు, సంస్థల వద్ద 25,000–35,000 టన్నుల పసిడి ఉంటుందని అంచనా. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) సైతం పెద్ద మొత్తంలో భౌతిక బంగారాన్ని (పెట్టుబడులకు బ్యాకెండ్‌గా) ఖజానాల్లో కలిగి ఉన్నాయని ఏఐజేజీఎఫ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈటీఎఫ్‌ల్లోకి వచ్చే ప్రతి రూపాయి తాజా పెట్టుబడికి అనుగుణంగా పసిడి దిగుమతులకు అదనపు డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొంది. కనుక బులియన్ బ్యాంక్ ద్వారా ఈటీఎఫ్‌లు తమ నిర్వహణలోని భౌతిక బంగారంలో 20–30 శాతాన్ని బాడుగ కింద ఇచ్చేందుకు అనుమతించాలని సూచించింది. దీనివల్ల ఆభరణాల వినియోగానికి సంబంధించి పసిడి దిగుమతుల డిమాండ్‌ను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది పరిశ్రమ సూచన. రూపాయి విలువను, ఫారెక్స్‌నిల్వలను కాపాడుకునేందుకు పసిడి, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం ఇటీవలే 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం తెలిసిందే. అలాగే, ఆభరణాల ఎగుమతిదారులకు అడ్వాన్స్డ్ అథరైజేషన్ స్కీమ్ కింద పసిడి దిగుమతులను కఠినతరం చేయడంతో పరిశ్రమ ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఎన్ఎస్ఈలో ఈజీఆర్‌ల ట్రేడింగ్ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్‌లు)లో లైవ్ ట్రేడింగ్ ప్రారంభించినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. నియంత్రిత స్పాట్ గోల్డ్ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు ఇది సాయపడుతుందని పేర్కొంది. అహ్మదాబాద్, ముంబైలో సేకరణ, ఖజానా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు.. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులోనూ కొత్త కేంద్రాలను సోమవారం నుంచి యాక్టివేట్ చేసినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 120 కేంద్రాలకు నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్టు తెలిపింది. సెబీ నమోదిత ఖజానాల్లో భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, ఆ రిసీట్స్‌పై స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో ట్రేడింగ్‌కు వీలుగా అందుబాటులోకి వచ్చిందే ఈజీఆర్.
ఆసియా క్రీడలకు సురేఖ, చికిత, ధీరజ్, గణేశ్
సోనీపత్ (హరియాణా): ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ప్రకటించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ వెన్నం జ్యోతి సురేఖ... తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత.. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్... పురుషుల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన తిరుమూరు గణేశ్ మణిరత్నం భారత జట్టులోకి ఎంపికయ్యారు. మూడు రోజులపాటు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్ అనంతరం భారత జట్లను ఎంపిక చేశారు. వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక కుమారి... దీపిక భర్త, భారత మాజీ నంబర్‌వన్ అతాను దాస్... వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పాల్గొనడంతోపాటు రెండు స్వర్ణాలు, మూడు రజత పతకాలు నెగ్గిన అభిషేక్ వర్మ ట్రయల్స్‌లో విఫలమై ఆసియా క్రీడలకు ఎంపిక కాలేకపోయారు. ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ 15.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా వరుసగా నాలుగో ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. ట్రయల్స్‌లో రెండో స్థానంలో నిలిచిన ప్రపంచ యూత్ చాంపియన్ చికిత, మూడో స్థానంలో నిలిచిన ప్రీతిక కూడా ఆసియా క్రీడలకు ఎంపికయ్యారు. పురుషుల కాంపౌండ్ విభాగంలో గణేశ్ 10.75 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం పొందాడు. గణేశ్‌తోపాటు సాహిల్ జాధవ్, కుశాల్ దలాల్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. సర్వీసెస్ తరఫున పోటీపడ్డ ధీరజ్ రికర్వ్ విభాగంలో 15.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు.
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలను తుంగలో తొక్కడంలో చంద్రబాబు మరోసారి తన మార్కు చూపిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఉద్దేశించిన స్త్రీ శక్తి పథకాన్ని దొంగ దెబ్బ తీస్తున్నారు. ఈ–బస్సుల ముసుగులో ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేసేందుకు ఎత్తుగడ వేశారు. ఓ వైపు ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తూ విలువైన ఆస్తులను తమ అస్మదీయులకు కట్టబెడుతున్న బాబు మరోవైపు స్త్రీశక్తి పథకాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్ర మహిళలను మోసం చేసేందుకు పావులు చకచకా కదుపుతున్నారు. ఈ–బస్సులకు వర్తించని ఉచిత బస్సు చంద్రబాబు ఎన్నికల హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. ఆయన 2024 జూన్ 12న అధికారంలోకి వచ్చినా 15 నెలల వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయనే లేదు. తద్వారా రాష్ట్ర మహిళలు నెలకు రూ.250 కోట్ల చొప్పున 15 నెలల్లో ఏకంగా రూ.3,750 కోట్ల మేర ప్రయోజనాన్ని కోల్పోయారు. 2025 ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని తూతూమంత్రంగా ప్రారంభించారు. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించలేదు.ఆర్టీసీలో 16 కేటగిరీల బస్ సర్వీసులు ఉండగా... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు రకాల సర్వీసుల్లోనే అమలు చేస్తున్నారు. ఈ–బస్సులతోపాటు వెన్నెల, డాల్పిన్ క్రూయిజర్, అమరావతి, నైట్ రైడర్, ఇంద్ర, మెట్రోలగ్జరీ, స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, నాన్‌స్టాప్, ఎస్ఏపీ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో వర్తింపజేయడం లేదు. ప్రస్తుతం ఆర్టీసీ నిర్వహిస్తున్న 100 ఈ–బస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు కాకపోవడం గమనార్హం. వందశాతం ఈ–బస్సులతో ఉచితం హుళక్కే ఈ నేపథ్యంలోనే ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. వందశాతం ఈ–బస్సులను ప్రవేశపెట్టే విధానానికి ఆమోదం తెలిపింది. అది కూడా పూర్తిగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ద్వారానే ప్రవేశపెడతామని తేల్చి చెప్పింది. ప్రైవేటుపరం చేసేందుకు పక్కా కుతంత్రంతో ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోంది. ‘ప్రధానమంత్రి ఈ–బస్ సేవా’ పథకం ద్వారా ప్రవేశపెట్టే ఈ–బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను చంద్రబాబు ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కొత్త డీజిల్ బస్సులను కొనడం లేదు.ఇటీవల ఆరు నెలల్లోనే 264 డీజిల్ బస్సులను సర్వీసుల నుంచి పూర్తిగా తొలగించారు. వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టనే లేదు. సగటున రోజుకు ఒక బస్సును సర్వీసు నుంచి తొలగిస్తోంది. తద్వారా ఆర్టీసీలో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి, ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–బస్సులను ప్రవేశపెట్టాలన్నదే తమ ఉద్దేశమని సర్కారు స్పష్టం చేస్తోంది. మొదటగా ఆర్టీసీలో 50శాతం ఈ–బస్సులు ఉండేట్టు చూడటం ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం 2029 నాటికి 100శాతం ఈ–బస్సులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ–బస్సుల్లో ఇప్పటికే ఉచిత ప్రయాణం అమలు కావడం లేదు కాబట్టి.. కొత్తగా ప్రవేశపెట్టబోయే బస్సుల్లోనూ అదే నిబంధన వర్తించనుందనేది సుస్పష్టం. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులూ ధ్రువీకరిస్తున్నారు.
మంత్రి కుటుంబం కంపెనీ కోసం.. మా గ్రామాలు నాశనం కావాలా?
కార్యాలయం కట్టుకోండి ‘తమ్ముడు’
నీట్ పేపర్ లీకేజీ కేసు.. లాతూర్‌లో కోచింగ్ సెంటర్ యజమాని అరెస్ట్
ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో సర్కారు ఇష్టారాజ్యం
అమెరికా మసీదులో కాల్పులు.. ముగ్గురు మృతి
వారికి బెయిల్ నిరాకరణ సరికాదు
మళ్లీ భానుడి భగభగలు
ఇదే మన బుల్లెట్ ట్రైన్
ఇదీ.. సత్వా రియాలిటీ
హరిత ఇంధనంలో సమష్టి కృషి
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మాను సంపంగి... మా అబ్బాయి
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
మాట మార్చిన ట్రంప్
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
‘సెలక్టర్లు చెప్పినా వినలేదు.. లేదంటే నాడే ద్రవిడ్ కెరీర్ ఖతం’
తొలిసారి ‘జిహాదీ డ్రగ్’ పట్టివేత
మంత్రి కుటుంబం కంపెనీ కోసం.. మా గ్రామాలు నాశనం కావాలా?
కార్యాలయం కట్టుకోండి ‘తమ్ముడు’
నీట్ పేపర్ లీకేజీ కేసు.. లాతూర్‌లో కోచింగ్ సెంటర్ యజమాని అరెస్ట్
ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో సర్కారు ఇష్టారాజ్యం
అమెరికా మసీదులో కాల్పులు.. ముగ్గురు మృతి
వారికి బెయిల్ నిరాకరణ సరికాదు
మళ్లీ భానుడి భగభగలు
ఇదే మన బుల్లెట్ ట్రైన్
ఇదీ.. సత్వా రియాలిటీ
హరిత ఇంధనంలో సమష్టి కృషి
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మాను సంపంగి... మా అబ్బాయి
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
మాట మార్చిన ట్రంప్
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
‘సెలక్టర్లు చెప్పినా వినలేదు.. లేదంటే నాడే ద్రవిడ్ కెరీర్ ఖతం’
తొలిసారి ‘జిహాదీ డ్రగ్’ పట్టివేత
ఫొటోలు
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
ఫ్యామిలీ ట్రిప్‌లో హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరో ఆది పినిశెట్టి దంపతులు.. (ఫొటోలు)
అనంతపురం : భారమైన వేళ.. బాధతో విక్రయం! (ఫొటోలు)
హైదరాబాద్ : మురిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
నాలుగు పదుల వయసులో మరింత బొద్దుగా ఛార్మి.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
హల్దీ పిక్స్ షేర్ చేసిన హీరోయిన్ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 17-24)
ఫ్లవర్ గర్ల్‌లా నయనతార (ఫొటోలు)
వయసు పెరిగినా వన్నె తగ్గని మాధురి అందం (ఫొటోలు)
సినిమా
భరణం? విడాకుల్లో మూడో వ్యక్తి ప్రమేయం? నటి భర్త క్లారిటీ
బాలీవుడ్ నటి మౌనీరాయ్ కొన్నిరోజుల క్రితమే విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో కలిసి అధికారికంగానే వెల్లడించింది. అయితే వీళ్లిద్దరూ విడిపోవడానికి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీనే కారణమని తెగ రూమర్స్ వస్తున్నాయి. అలానే భరణం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టిన సూరజ్.. ఇన్‌స్టా స్టోరీలో మొత్తం క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)'మా విడాకుల విషయంలో వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నా. ఎలాంటి భరణం లేదు. మా మధ్య వివాదాలు ఏం లేవు. మూడ వ్యక్తి ప్రమేయం అసలు లేదు. మేం చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. ఇది మాత్రమే నిజం. మిగతావన్నీ అవాస్తవాలు. రూమర్స్ గురించి స్పందించకపోవడం తప్పే అవుతుంది. అందుకే క్లారిటీ ఇస్తున్నా' అని సూరజ్ చెప్పుకొచ్చాడు.ప్రేమించుకుని 2022లో సూరజ్-మౌనీ రాయ్ పెళ్లి చేసుకున్నారు. సూరజ్ దుబాయికి చెందిన బిజినెస్‌మ్యాన్. మలయాళీ, బెంగాలీ సంప్రదాయల్లో వీళ్ల వివాహం జరిగింది. కానీ నాలుగేళ్లకే విడిపోయారు.(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)
స్టైల్ మార్చిన శోభిత.. చీరలో మానస
కొత్త హెయిర్ స్టైల్‌తో అక్కినేని కోడలు శోభితచీరలో కనువిందు చేస్తున్న మానస వారణాసిఒంపు సొంపులతో దివ్యభారతి అందాల విందుఫన్నీ మూమెంట్స్ షేర్ చేసిన శ్రీనిధిశెట్టిపాత హీరోయిన్ లుక్‌లో దుషారా విజయన్ View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi)
రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్
మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. లెక్క ప్రకారం మార్చిలోనే రావాలి కానీ రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెల 4న థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే పనోడు.. క్రికెట్, కుస్తీలో ఎలాంటి ప్రతిభ చూపించాడు. జీవితంలో ఇతడికి ఎదురైన సవాళ్లు ఏంటనేది కాన్సెప్ట్. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆ జోష్ని కొనసాగించేలానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి సతీ లీలావతి, సిస్టమ్, మధువిధు, మేం కాప్‌లం లాంటి తెలుగు మూవీస్, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరోవైపు థియేటర్లలో 'దృశ్యం 3' రిలీజ్ కానుంది. ఈ వీకెండ్‌కి అయితే ఇదే ఎంటర్టైన్మెంట్. అయితే సడన్ గా ఓ రెండు తెలుగు చిత్రాలు ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. రిలీజైన 12 రోజులకే)గతేడాది జనవరిలో థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'డ్రీమ్ క్యాచర్'. ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రలు చేశారు. కలలో వచ్చిన సంఘటనలు నిజజీవితంలో ఒకవేళ జరిగితే హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ కలలు రావడం అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది కాన్సెప్ట్. ఇప్పుడీ చిత్రం ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.ఇకపోతే సుమన్, మహేశ్ పెగ్గర్ల, సిరి తదితరులు నటించిన 'భీంసేరి' అనే తెలుగు సినిమా కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఇది కూడా రెంట్ విధానంలోనే అందుబాటులోకి వచ్చింది. ఓ క్రూరమైన లేడీ పోలీసాఫీసర్.. ఓ నిరుపేద కుటుంబాన్ని అన్యాయంగా నాశనం చేస్తుంది. కానీ ఆ కుటుంబంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడుతుంది. ఈమె సదరు లేడీ పోలీసాఫీసర్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)
క్రీడలు
ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది!
ఎంఎస్ ధోని.. ఈ పేరు సీఎస్కే ఫ్రాంచైజీలో చిరస్థాయిగా మిగిలిపోనుంది. సీఎస్కేకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ధోని ఈ సీజన్లో సొంత ఇలాఖాలో ఒక్క మ్యాచ్ ఆడకుండానే అభిమానులకు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన ధోని (మధ్యలో సీఎస్కేపై నిషేధంతో రెండు సీజన్లు మినహాయింపు) సోమవారం సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడేశాడు. అదేంటి ధోని తుది జట్టులో లేడు కదా అన్న అనుమానం మీకు కలగొచ్చు. అయితే సీఎస్కేకు చెపాక్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ చివరిది. ఆ తర్వాత మే 21న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.ఈ నేపథ్యంలో హోంగ్రౌండ్లో చివరి మ్యాచ్ కావడంతో ధోనికి సీఎస్కే జట్టు ఫేర్వెల్ ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడనప్పటికీ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం జట్టుతో ధోని గ్రూప్ ఫొటో దిగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన జెర్సీ నెంబర్ 7తో స్టేడియంలోకి ధోని ఎంట్రీ ఇవ్వగానే మైదానం హోరెత్తిపోయింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అణచివేసుకున్న ధోని జట్టుతో గ్రూప్ ఫొటో దిగాడు. ఆ తర్వాత ఆటగాళ్లతో కాసేపు సంభాషించాడు. అనంతరం అభిమానుల వైపు ఒక లుక్ ఇచ్చిన ధోని చేతులూపుతూ డ్రెస్సింగ్ రూమ్ వైపు భారంగా అడుగులు వేయడం కనిపించింది. ధోని పెవిలియన్ వెళుతున్న క్రమంలో సీఎస్కే ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ఈ సమయంలో చెపాక్ స్టేడియంలో కాసేపు నిశబ్దం అలుముకుంది. అభిమాన ఆటగాడైన ధోని సీఎస్కే సొంత స్టేడియంలో తన చివరి మ్యాచ్ ఆడకుండానే ఇలా సైలెంట్‌గా వీడ్కోలు పలకడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓవరాల్‌గా ధోని ఐపీఎ ల్లో 278 మ్యాచ్‌లాడి 5,439 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్థసెంచరీలు ఉన్నాయి.Thank You for all memories- Thala MS dhoni 🥲- भाऊक कर देने वाला पल है लेकिन एक ना एक दिन सबको जाना होता है !- बहुत सी अच्छी यादे , क्रिकेट में भारत का नाम आपके नाम से याद रखा जाएगा - Number 7 जो सिर्फ आपके नाम से जाना जाएगा !Updates: - धोनी को देखके ऐसा लग रहा है शायद वो… pic.twitter.com/aLbnQ8jHw4— Mahi (@M17vibes) May 18, 2026FINALLY, END OF A LEGENDARY ERA 🥺🫶❤️MS Dhoni is set to receive a farewell at M. A. Chidambaram Stadium as fans prepare to witness an emotional goodbye to one of cricket’s greatest icons. The atmosphere at Chepauk is expected to be filled with tears, chants, and unforgettable… pic.twitter.com/NS4xEsOq1F— Muffatball vikrant (@Vikrant_1589) May 18, 2026చదవండి: టెన్నిస్ దిగ్గజం పేస్ ఇంట్లో విషాదం
టెన్నిస్ దిగ్గజం పేస్ ఇంట్లో విషాదం
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పేస్ తల్లి, మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి జెన్నిఫర్ పేస్ (72) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. జెన్నిఫర్ 1972 మ్యూనిచ్ ఒలింపి క్స్‌లో భారతదేశానికి బాస్కెట్‌బాల్‌లో ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 1982లో బాస్కెట్ బాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహ రించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు.జెన్నిఫర్ పేస్ ప్రముఖ బెంగాలీ కవి మైఖేల్ మధుసూదన్ దత్‌కు స్వయానా ముని మనుమరాలు. 2025 ఆగస్టులో పేస్ తండ్రి వేస్ పేస్ మృతి చెందిన విషయం తెలిసిందే. వేస్ పేస్ భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1971 హాకీ ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులో వేస్ పేస్ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాతి ఏడాది 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టులోనూ మిడ్‌ఫీల్డర్‌గా సేవలందించాడు. ఇద్దరు దిగ్గజాల కడుపున పుట్టిన లియాండర్ పేస్ టెన్నిస్‌లో ఉన్నత శిఖరానికి చేరుకున్నాడు. 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో భారత టెన్నిస్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేస్ రికార్డులకెక్కాడు. ఇక 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో 10 మిక్స్డ్ టైటిల్స్, 8 డబుల్స్ టైటిల్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ కాంస్యం సాధించి తండ్రి తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఆటగాడిగా పేస్ ఖ్యాతిని గడించాడు.చదవండి: ధోనీ రిటైర్మెంట్పై రుతురాజ్ క్లారిటీ!
ధోనీ రిటైర్మెంట్పై రుతురాజ్ క్లారిటీ!
సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పష్టతనిచ్చాడు. ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ సోమవారం చెన్నైలోని సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో ధోనీ ఆడుతాడని అభిమానులు ఆశించారు. టాస్ సమయంలో ధోనీ ఆడుతున్నాడా లేదా అని రవిశాస్త్రి అడిగిన ప్రశ్నకు రుతురాజ్ సమాధానమిచ్చాడు. ఎంఎస్ ధోనీ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని, ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడడం లేదని తెలిపాడు. దీంతో అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. అయితే ధోనీ మ్యాచ్ ఆడకపోయినప్పటికీ జట్టుతో పాటు చెపాక్ స్టేడియానికి రావడం అభిమానులకు ఊరట కలిగించే అంశం. ఎటూ ధోనీ మ్యాచ్ ఆడడం లేదు కాబట్టి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం సైలెంట్‌గా స్టేడియంలోకి వచ్చి అభివాదం చేస్తూ సీఎస్కేకు గుడ్‌బై చెబుతాడేమోనని అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. తమ అభిమాన క్రికెటర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఇలా సైలెంట్‌గా రిటైర్ అవ్వడాన్ని తాము భరించలేమని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ధోనీ ఇవాళ తన రిటైర్మెంట్పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం మే 21 వరకు ఆగాల్సిందే. ఇక సొంత గ్రౌండ్లో చివరి మ్యాచ్ ఆడుతున్న సీఎస్కే మే 21న గుజరాత్ టైటాన్స్‌తో ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.దీంతో అహ్మదాబాద్‌లోనే ధోనీకి సీఎస్కే ఘనంగా సెండాఫ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సీఎస్కే ప్లేఆఫ్స్ చేరితే అప్పటికప్పుడు ప్రణాళికలను మార్చేందుకు సీఎస్కే యాజమాన్యం సిద్ధమవుతోంది.Ravi Shastri asked: "MS Dhoni, where is he? Is he playing?"Ruturaj Gaikwad replied and send the Chepauk Crowd into frenzy#CSKvsSRHpic.twitter.com/rM2zXo0koz— Farrago Abdullah Parody (@abdullah_0mar) May 18, 2026🚨 Toss update from Chennai 🚨@ChennaiIPL won the toss and elected to bat first against @SunrisersUpdates ▶️ https://t.co/4SxAzYKEvY#TATAIPL | #KhelBindaas | #CSKvSRH pic.twitter.com/u4gjxRo6HK— IndianPremierLeague (@IPL) May 18, 2026
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత!
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ టెస్టు కెప్టెన్ మైక్ స్మిత్ (92) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మైక్ స్మిత్ (ఎంజేకే స్మిత్) ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు వార్విక్షైర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్ మేటి బ్యాటర్‌గా గుర్తింపు పొందిన మైక్‌స్మిత్ 50 టెస్టులు ఆడాడు. ఇందులో 25 టెస్టులకు ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 1958లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మైక్ స్మిత్ 1972లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. 50 మ్యాచ్‌ల్లో 2,278 పరుగులు చేసిన మైక్ స్మిత్ మూడు సెంచరీలు సాధించాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 637 మ్యాచ్‌లాడి 40వేలకు పైగా పరుగులు సాధించిన మైక్ స్మిత్ 72 సెంచరీలు బాదాడు. అంతేకాదు 1991 నుంచి 2003 మధ్య వార్విక్షైర్ కౌంటీ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన పదవిలో ఉన్న సమయంలోనే వార్విక్షైర్ కౌంటీల్లో చాలా టైటిల్స్ సాధించింది. మైక్ స్మిత్ కుమారుడు నీల్ స్మిత్ అప్పటి జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. క్రికెటర్‌గానే గాక రగ్బీ ప్లేయర్‌గానూ మైక్ స్మిత్ గుర్తింపు పొందాడు. 1956లో వేల్స్‌తో జరిగిన రగ్బీ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున క్యాప్ అందుకున్నాడు. ఇక మైక్ స్మిత్ మరణంపై వార్విక్షైర్ నివాళి అర్పించింది. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా గ్లామోర్గాన్‌తో మ్యాచ్‌కు ముందు వార్విక్షైర్ మైక్ స్మిత్ మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించింది.చదవండి: బంగ్లా బ్యాటర్ చరిత్ర.. పాక్‌కు క్లీన్‌స్వీప్ గండం!
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
తమిళనాట ప్రతిష్టంభనలో విజయ్ ప్రమాణ స్వీకారం... మద్దతు ప్రకటించినా అధికారికంగా లేఖ ఇవ్వని వీసీకే
బిజినెస్
వర్క్ ఫ్రమ్ హోమ్ విస్తరణపై జోహో కామెంట్స్
భారతీయ ఐటీ దిగ్గజం జోహో తమ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని విస్తరించబోమని నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్వేర్ రంగంలో పరిశోధన, అభివృద్ధి బృందాల మధ్య ముఖాముఖి చర్చలు, ప్రత్యక్ష సహకారం ఉన్నప్పుడే ఆశించిన ఉత్పాదకత, వేగవంతమైన పరిష్కారాలు లభిస్తాయని అంతర్గత సమీక్షలో తేలడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని జోహో వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు సోమవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా వెల్లడించారు.ప్రత్యక్ష సహకారంతోనే మెరుగైన పరిష్కారాలుకంపెనీ అంతర్గత చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా సొంత డెవలప్మెంట్ టీమ్‌లో నేనే స్వయంగా ఈ వ్యత్యాసాన్ని గమనించాను. సమస్య పరిష్కారంలో భాగస్వాములైన వ్యక్తులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోనప్పుడు వాటి పరిష్కారానికి చాలా ఎక్కువ సమయం పడుతోంది. అదే ముఖాముఖిగా కూర్చున్నప్పుడు ఆలోచనల మార్పిడి మరింత సులువుగా సాగుతుంది. దీనివల్ల అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన సాఫ్ట్వేర్ పరిష్కారాలు లభిస్తున్నాయి. అందుకే ఆర్ అండ్ డీ విభాగంలో ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోమ్‌ను విస్తరించకూడదని నిర్ణయించాం’ అని చెప్పారు.జోహో పునసమీక్షపశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని, అనవసర ప్రయాణాలను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సమయంలో అలవాటైన వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి పద్ధతులను మళ్లీ ప్రోత్సహించాలని ప్రధాని కోరారు.ప్రధాని పిలుపునకు స్పందించిన శ్రీధర్ వెంబు.. మే 11న ఒక పోస్ట్‌లో ‘గత కొన్ని నెలలుగా మా సంస్థలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని పూర్తిగా అమలు చేస్తున్నప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని పిలుపును గౌరవిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ పునసమీక్షిస్తాం’ అని పేర్కొన్నారు. అయితే, సంస్థ ప్రయోజనాలు, సాంకేతిక ఉత్పాదకతను బేరీజు వేసుకున్న తర్వాత ఈ విస్తరణ సాధ్యం కాదని జోహో తేల్చిచెప్పింది.ఇంధన పొదుపునకు ప్రత్యామ్నాయ వ్యూహాలువర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనంత మాత్రాన పర్యావరణ స్పృహను విస్మరించబోమని వెంబు స్పష్టం చేశారు. ఇంధన వినియోగాన్ని, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి జోహో ఇతర మార్గాలను అన్వేషిస్తోందని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచడం, కంపెనీ క్యాంటీన్లలో డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వంట సామగ్రిని ప్రవేశపెట్టడం వంటివి అమలు చేయబోతున్నట్లు చెప్పింది. ఇప్పటికే జోహో సంస్థ సోలార్ (సౌరశక్తి) రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. క్యాంపస్‌ల్లో ఇప్పటికే ప్రాకృతిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
శ్రమకే అగ్రతాంబూలం!
నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో లక్షల రూపాయల ప్యాకేజీలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజినీర్ల జీతాలే అందరికీ హాట్ టాపిక్. కానీ, రోజువారీ శ్రమను నమ్ముకున్న ఒక సాధారణ ఇంటి పనిమనిషి నెలవారీ సంపాదన వివరాలు ఇప్పుడు సాఫ్ట్వేర్ నిపుణులను, విద్యావంతులను ఆలోచనలో పడేసాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన ఇంటి పనిమనిషితో జరిపిన చిన్న సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.బెంగళూరుకు చెందిన ఆదిత్య అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇటీవల తన ఇంటి పనిమనిషి పదేపదే ఆలస్యంగా రావడంపై ఆమెను ప్రశ్నించాడు. సాధారణంగా మొదలైన ఈ ప్రశ్న ఆమె ఇచ్చిన సమాధానంతో ఆదిత్య అవాకయ్యేలా చేసింది. ఆమె కేవలం ఒకరి ఇంట్లోనే కాకుండా ఒక పక్కా ప్రణాళికతో బహుళ ఆదాయ వనరులను సృష్టించుకుందని తెలిసి అతను షాక్‌కు గురయ్యాడు. ఆదిత్య తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న వివరాల ప్రకారం.. ఆమె తన దినచర్యలో భాగంగా..వేర్వేరు అపార్ట్మెంట్ల్లో నివసించే నలుగురు బ్యాచిలర్స్‌కు రోజువారీ భోజనం వండి పెడుతోంది. ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.6,000 చొప్పున తీసుకుంటోంది. దాంతో ఆమెకు రూ.24,000 లభిస్తోంది. దీనికి అదనంగా, మరో రెండు కుటుంబాలకు పూర్తిస్థాయి ఇంటి పనిమనిషిగా ఉంటూ నెలకు రూ.20,000 సంపాదిస్తోంది. మొత్తంగా ఆమె నెలవారీ ఆదాయం అక్షరాలా రూ.44,000. అంటే సంవత్సరానికి ఆమె సంపాదన రూ.5.28 లక్షలు. దేశంలో సగటు కార్పొరేట్ ఎంట్రీ-లెవల్ ఉద్యోగి జీతం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం.ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆదిత్య ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ‘ఇక్కడ వేలాది మంది చదువుకున్న యువత ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. కానీ సరైన నైపుణ్యం ఉంటే ఆదాయానికి కొరత లేదు’ అని పేర్కొన్నాడు. ఈ వ్యవహారం ద్వారా తాను ఒక గొప్ప విషయాన్ని గ్రహించానని ఆదిత్య రాసుకొచ్చాడు. ‘ఈ రోజు ఒక విషయం స్పష్టమైంది. ఏ పనీ చిన్నది కాదు. నైపుణ్యం, స్థిరత్వం, కష్టపడే తత్వం ఎప్పుడూ సరైన ఫలితాన్ని ఇస్తాయి’ అని అతను స్పష్టం చేశాడు.కెరీర్ వృద్ధి వర్సెస్ శారీరక శ్రమఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిపై నెటిజన్లు భిన్నమైన విశ్లేషణలు చేస్తున్నారు. ‘డిగ్రీలు లేకపోయినా ప్రాక్టికల్ నైపుణ్యాలతో స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చని నిరూపితమైంది’ అని కొందరంటున్నారు. ‘దేశంలో పట్టభద్రులైన యువత ఉద్యోగాల కోసం అల్లాడుతున్న వేళ ఇదొక ప్రత్యామ్నాయం’ అని కొందరు చెబుతున్నారు. డిగ్రీలు పూర్తి చేసినా అర్థవంతమైన ఉపాధి దొరకని దేశీయ ఉద్యోగ సంక్షోభాన్ని ఈ ఉదంతం ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.విజయానికి కొలమానం ఏది?ఈ వైరల్ కథనం మారుతున్న భారతదేశ శ్రామిక శక్తి వాస్తవ రూపానికి అద్దం పడుతోంది. విజయాన్ని కేవలం నెలవారీ జీతం అంకెలతోనే కొలవాలా? లేక భవిష్యత్తు వృద్ధి, ఉద్యోగ భద్రత, జీవన నాణ్యత ఆధారంగా అంచనా వేయాలా? అనే పెద్ద ప్రశ్నను ఇది సమాజం ముందుంచింది. ఏదేమైనా, విద్యావంతుల్లో పెరుగుతున్న నిరుద్యోగానికి, నైపుణ్య ఆధారిత పనులకు ఉన్న డిమాండ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
వైట్-కాలర్ ఉద్యోగాలకు ఏఐ ఎసరు
సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు కేవలం శారీరక శ్రమతో కూడిన పనులకే పరిమితమవుతుందని భావించిన ఆటోమేషన్ ఇప్పుడు ఏకంగా మేధోసంపత్తితో కూడిన వైట్-కాలర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. రాబోయే 12 నుంచి 18 నెలల్లోనే కార్పొరేట్ ప్రపంచంలో అకౌంటెంట్లు, న్యాయవాదులు, మార్కెటింగ్ నిపుణుల ఉద్యోగాలు కనుమరుగయ్యే లేదా పూర్తిగా ఆటోమేట్ అయ్యే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ డివిజన్ హెడ్ ముస్తఫా సులేమాన్ హెచ్చరిక చేశారు.మానవ మేధస్సుకు సవాల్గతంలో ఆంత్రోపిక్ అధినేత డారియో అమోడీ వంటి టెక్ దిగ్గజాలు ఊహించిన పరిణామాలనే సులేమాన్ తాజా వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. ప్రస్తుతం మానవులు మాత్రమే చేయగలరని భావిస్తున్న అత్యంత సంక్లిష్టమైన వైట్-కాలర్ విధులను 2027 సంవత్సరానికి ముందే ఏఐ చేజిక్కించుకోనుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ప్రభావితమయ్యే రంగాలు..అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగంలో లెక్కల విశ్లేషణ, ఆడిటింగ్ ప్రక్రియలు పూర్తిగా ఆటోమేట్ అవుతాయి.లీగల్ వర్క్ (న్యాయ విభాగం)లో కేసుల డాక్యుమెంటేషన్, లీగల్ రీసెర్చ్‌లను ఏఐ నిమిషాల్లో పూర్తి చేస్తుంది.మార్కెటింగ్, కంటెంట్‌పరంగా వినియోగదారుల ట్రెండ్స్ గుర్తించడం ఏఐ చేతుల్లోకి వెళ్తుంది.ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో వర్క్‌ఫ్లోల సమన్వయం, ప్రణాళికల అమలు మానవ ప్రమేయం లేకుండానే సాగుతుంది.ఇప్పటికే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తమ రోజువారీ కోడింగ్ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఏఐ అసిస్టెంట్లను విస్తృతంగా వాడుతున్నారని, త్వరలోనే కంప్యూటింగ్ సామర్థ్యం పెరిగి మెజారిటీ మానవ ప్రోగ్రామర్ల కంటే ఏఐ మోడల్స్ అత్యుత్తమ కోడింగ్ చేయగలవని ఆయన విశ్లేషించారు.సహాయకారి నుంచి ప్రత్యామ్నాయంగా!ప్రస్తుత తరుణంలో ఏఐ కేవలం మనుషుల పనిభారాన్ని తగ్గించే ఒక ఉత్పాదకత సాధనంలాగా మాత్రమే కనిపిస్తోంది. కానీ, ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. కేవలం సహాయం చేసే స్థాయి నుంచి మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేసే దిశగా సాంకేతికత పరిణామం చెందుతోందని సులేమాన్ ఆందోళన వ్యక్తం చేశారు.పరిష్కారం ఏంటి?మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ఇచ్చిన ఈ హెచ్చరిక కేవలం ఊహాజనితం కాదు, ఇది పరిశ్రమ వర్గాలకు ఒక మేల్కొలుపు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మన నైపుణ్యాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేసుకోకపోతే వైట్-కాలర్ ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
ఆరంభంలో నష్టాలు.. ముగింపులో లాభాలు!
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (మే 18) ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో కుప్పకూలిన సూచీలు ద్వితీయార్థంలో దేశీయ కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,043 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పతనమైనప్పటికీ ముగింపు సమయానికి నష్టాలన్నింటినీ పూడ్చుకుని స్వల్ప లాభాల్లోకి చేరుకున్నాయి. చివరకు నిఫ్టీ 50 సూచీ 6 పాయింట్లు పుంజుకొని 23,649 వద్ద, సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 75,315 వద్ద స్థిరపడ్డాయి.ఆరంభ పతనానికి కారణాలుఅమెరికా-ఇరాన్ మధ్య సరికొత్తగా రేగిన ఉద్రిక్తతలు, గల్ఫ్ రీజియన్‌లో డ్రోన్ దాడుల వార్తలు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించాయి. ఇది గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా బ్యారెల్‌కు 111 డాలర్ల మార్కును దాటింది. భారతదేశం తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున క్రూడాయిల్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాలను, కరెంట్ అకౌంట్ లోటు ఆందోళనలను పెంచింది.అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 4.60% దాటడంతో భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 96.2 మార్కుకు బలహీనపడింది. ఇది విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.గత శుక్రవారం అమెరికా మార్కెట్లు 1 శాతానికి పైగా నష్టపోగా నేడు ఆసియా మార్కెట్లయిన జపాన్ నిక్కీ, హ్యాంగ్ సెంగ్ సైతం నష్టాల్లో ట్రేడ్ అవ్వడం దేశీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.ముగింపులో రికవరీకి కారణాలురూపాయి బలహీనపడటం ఐటీ, ఎగుమతి ఆధారిత రంగానికి లాభసాటిగా మారడంతో ఇన్వెస్టర్లు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ షేర్ల వైపు మొగ్గు చూపారు.టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ షేరు నేడు సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను దాటేసి రూ.11.80 లక్షల కోట్లతో దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ క్యాప్ గల కంపెనీగా నిలిచింది. ఈ స్టాక్ ర్యాలీలో కీలక పాత్ర పోషించింది.దేశీయంగా మార్చి త్రైమాసికం (2026 క్యూ4) ఆర్థిక ఫలితాల సీజన్ నడుస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో 10% వృద్ధి నమోదు చేయడం, టాటా స్టీల్ నికర లాభం రెండింతలు పెరగడం వంటి అంశాలు మార్కెట్‌కు స్థిరత్వాన్ని ఇచ్చాయి.నిఫ్టీ 23,300 స్థాయికి పడిపోయిన తరుణంలో విలువ ఆధారిత కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దిగువ స్థాయిల వద్ద దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేయడంతోపాటు ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్లో షార్ట్ కవరింగ్ జరగడం వల్ల సూచీలు రికవరీ అయ్యాయి.ప్రస్తుతానికి దేశీయ ఆర్థిక మూలాధారాలు బలంగా ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల గమనం రాబోయే రోజుల్లో మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి. ఇన్వెస్టర్లు గ్లోబల్ పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
ఫ్యామిలీ
ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!
పర్యాటకం కమ్ ఉపాధిని కల్పించేలా అద్బుతమైన కేఫ్ ఇది. అయితే ఇక్కడ మొత్తం ఆడవాళ్లే ఉంటారు. నిర్వహించేది..వంట చేయడం నుంచి క్లీనింగ్ వరకు మొత్తం ఆడవాళ్ల సామ్రాజ్యమే దర్శనమిస్తుంది. అలాంటి విచిత్రమైన కేఫ్ తూర్పు సిక్కింలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాబా హర్భజన్ సింగ్ పుణ్యక్షేత్రానికి సమీపంలో, 13,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది పూర్తిగా స్థానిక మహిళలతో కూడిన బృందంతో నడిచే కేఫ్. మారుమూల ఎత్తైన ప్రాంతంలో ఉండే ఈ కేఫ్ స్థితిస్థాపకత, వ్యవస్థాపకత, స్వావలంబనను ప్రతిబింబిస్తుంది. అంతేగాదు సందర్శకులకు ఓ గొప్ప అనుభవాన్ని అందిస్తోంది. ఈ కేఫ్ భారత ఆర్మీ చొరవతో ఏర్పాటైంది. స్థానికి భాగస్వాముల సమన్వయంతో త్రిశక్తి కార్ప్స్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించి, సులభతరం చేసింది. యుద్ధ భూమిని వీక్షించే కార్యక్రమంలో భాగంగా, ఈ ప్రాంత వారసత్వాన్ని, వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రదర్శిస్తూ సరిహద్దు ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కేఫ్ రూపుదిద్దుకుంది. ఇది ఒకరకరంగా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ..మారుమూల ప్రాంతా ఆర్థిక సాధికారతనకు దోహదపడుతోంది. అంతేగాదు జీవనోపాధిని ఇలా పర్యాటకంతో అనుసంధానించటంతో ఈ కార్యక్రమం సుస్థిర అభివృద్ధికి, పుణ్యక్షేత్రానికి పర్యాటకుల రాక పెరగడానికి తోడ్పడుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ ప్రయత్నం నిజంగా సమర్థవంతమైన సైనిక-పౌర సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతేగాదు ఇది సరిహద్దు ప్రాంతాలలో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి పట్ల భారత సైన్యం నిబద్ధతను బలోపేతం చేయడంతో పాటు, భారత పౌరులతో బలమైన సంబంధాలను పెంపొందిస్తుంది.(చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)
సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..
అందరు చేసే వంటకమే కానీ దాన్ని సర్వ్ చేసే విధానం లేదా వండే విధానంలో ప్రత్యేకత ఉంటేనే కథ ఏ ఫుడ్ స్టాల్ అయినా క్లిక్ అయ్యేది. ప్రజాదరణ పెరిగేది. బహుశా దాన్నే క్యాచ్ చేశాడు ఈ టీనేజ్ యువకుడు. అలా ఇలా ఆలోచించలేదు ఈ యువకుడు. వంట చేసే విధానంలో సరికొత్తగా ఫ్యాషన్ జోడించడంతో అతడ ఫుడ్ స్టాల్ మూడు పువ్వులు ఆరు కాయల్లా దినదినాభివృద్ధితో దూసుకుపోతోంది. ఇంతకీ స్టైలిష్‌గా వంట చేయడం ఎలాగంటే..చైనాకు చెందిన ఒక యువకుడు ఒక సాధారణ ఫ్రైడ్ రైస్ దుకాణాన్ని తన క్రియేటివిటీతో కొత్త లుక్‌ని అందించడమే కాదు లాభాల బాట పట్టేలా చేశాడు. అందరిలా వండటం కంటే.. ప్రత్యేకంగా విభిన్నంగా వంట చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా అతడి వద్దకు వచ్చేవాళ్లు తినడాని కంటే..అతడు చేసే విధానం అతడి ఆహార్యం చూసి నివ్వెరపోతూ ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తిగా వస్తూ..ఇక అక్కడే తింటుండటం విశేషం. 19 ఏళ్ల లూ షాన్డాంగ్ ఈనే యువకుడు కుటుంబ దుకాణాన్ని చాలా విభన్నంగా నడిపిస్తున్నాడు. ఎవరైన వంట చేయాడానికి వచ్చే వాళ్లు కుక్ డ్రెస్ లాంటది వేసుకుంటారు. కానీ ఇక్కడ లూ ఫ్యాషన్‌గా ఉంటాడు. ఆయన ఆఫీస్‌కి వెళ్లే వ్యక్తిలా సూటు బూటు వేసుకుని కనిపించడం విశేషం. చైనాలోని ఓ సాదారణ ఫ్రైడ్ రైస్ స్టాల్ రెస్టారెంట్‌కు మించి క్రేజ్ సంపాదించుకుంది. అందుకు ప్రధాన కారణం అతడు వండే విధానమే. లీ చాలా స్టైలిష్‌గా వండుతున్న విధానం అందర్నీ ఆకర్షించి ఆ స్టాల్‌కి జనాలు క్యూకట్టేలా ప్రజాదరణ పొందింది. అంతేకాదండోయ్ ఎంతో రుచిగా క్షణాల్లో వేడివేడిగా వడ్డిస్తాడు. అతడు ఎంత బిజీలో అయినా ఫ్రైడ్ రైస్‌ని జస్ట్ మూడు నిమిషాల్లో తయారు చేస్తాడు. ఇక ఫైడ్‌రైస్ ఒక ప్లేటు రూ. 1401లు అట. అతడి ఖర్చులు పోగా నెలకు సుమారుగా రూ. 7లక్షలుపైనే ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. క్రియేటివిటీకి నైపుణ్యం తోడైతే అద్భుతాలు జరగుతాయి అంటే ఇదేగదా..!. లూ నవ్వు మామలు గ్రేట్ కాదు..సూపరో సూపర్..!. కాగా, ఈ స్టాల్ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈమేరకు లూ మాట్లాడుతూ..ఏదో సరదాగా కస్టమర్ల ముఖంలో నువ్వులు విరబూయించేందుకు ఇలా సూటు వేసుకుని వంట చేశాను. కానీ వాళ్ల నుంచి ఈ స్ధాయిలో స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదని సంతోషంగా చెబుతున్నాడు లూ. View this post on Instagram A post shared by Mothership (@mothershipsg) (చదవండి: కోడిగుడ్డంత పుచ్చకాయలు)
వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా?
గత కొన్ని రోజులుగా భారత్‌లో ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయో తెలిసిందే. ఎండలు భగభగలాడిస్తున్నాయి. ఉదయం పది దాటితేనే సూర్ర్యు సుర్రు మంటున్నాడు. కనీసం బయటకు వెళ్లాలంటేనే వణుకుపుట్టుకొస్తుంది. అంతలా ఎండలు గజగజలాడిస్తున్నాయి. ప్రతి చోట నలభై డిగ్రీలు దాటేస్తున్నాయి. మెట్రో ప్రాంతాల్లో ఇక ఆ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అంతేగాదు ఎండల ధాటికి వడదెబ్బల బారినపడుతున్న వారు ఎక్కువే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు కొందరు వడదెబ్బ బారిన పడగానే..పారాసెటమాల్ వేసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకూడదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వడదెబ్బ రెండు విధాలుగా ఉంటుందని, అందుకోసం ఎలాంటి ఆరోగ్య సంరక్షక చర్యలు తీసుకోవాలో సవివరంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా!.దేశంలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45°C దాటుతుండగా, తీర ప్రాంతాలు తీవ్రమైన తేమ, భరించలేని వేడితో సతమతమవుతున్నాయి. పైగా ఆస్పత్రులలో వడదెబ్బ, వడతాపం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే..క్షణాల్లో ప్రాణాంతకంగా మారుతుందని అంటున్నారు డాక్టర్ విశాల్. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో వడదెబ్బకు, వడఘాతానికి మధ్య ఉన్న తేడాను కూడా వివరించారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో పారాసెటమాల్ వేసుకోవడం ఎంత ప్రమాదకరం, ఎలాంటి అత్యవసర చర్యలు తీసుకుంటే మంచిది, వంటి వాటి గురించి సవివరంగా వెల్లడించారు. ప్రస్తుతం భారతదేశంలో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు దగ్గరగా ఉందని, తీరప్రాంతలైతే అంతకమించి ఉంటున్నాయి. సాధరణంగా వడదెబ్బ తగిలినప్పుడు..రోగి అలసిపోయినట్లు కనిపిస్తాడు, కానీ అతనికి చెమట పడుతూనే ఉంటుంది. ఈ సందర్భంలో, చాలా సమయం ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది అని డాక్టర్ విశాల్ చెబుతున్నారు. అదే వడఘాతం అనేది ప్రాణాంతకమైన వైద్య పరిస్థితి అని పేర్కొన్నారు. శరీరం అంతర్గత ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా విఫలమైనప్పుడు ఇది సంభవిస్తుందట. రోగి పూర్తిగా స్పృహ కోల్పోతాడు, ఆ వ్యక్తి శీతలీకరణ వ్యవస్థ పనిచేయడం ఆగిపోతుంది. పైగా చెమట కూడ పట్టదు కాబట్టి చర్మం పొడిగా, వేడిగా ఉంటుందట. దానివల్ల, మెదడు అక్షరాలా మైక్రోవేవ్‌లో పెట్టినట్లుగా ఉడికిపోతుంది. దాని కారణంగా, రోగి స్పృహ కోల్పోవచ్చు, అతనికి మూర్ఛలు రావచ్చు, కోమాలోకి వెళ్ళవచ్చు, లేదా చనిపోవచ్చు కూడా అని అన్నారు.పారాసెటమాల్ వేసుకోవచ్చా..వడదెబ్బలో పారాసెటమాల్ పనిచేయదని అంటున్నారు వైద్యులు. అనారోగ్యం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పారాసెటమాల్ మెదడు థర్మోస్టాట్‌ను రీసెట్ చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కానీ వడదెబ్బ తగిలినప్పుడు, బయటి నుండి వచ్చే అధిక వేడి శరీర వ్యవస్థను అధిగమించినప్పుడు, శరీరాన్ని చల్లబరిచే యంత్రాంగం విఫలమవుతుంది. పైగా రోగిని చల్లటి నీటితో చల్లబర్చాలి, చంకల ప్రాంతంలో చల్లటి నీటినిపోయాలి. దాంతో వారిలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే రోగికి తగినంత నీఉ, ఓఆర్ఎస్ ఇవ్వడం వంటివి చేయాలి. ఇలాంటి వాళ్లు సాధ్యమైనంతవరకు చల్లటి నీటిని తాగుతూ..ఇంటిలోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్ విశాల్.గమనిక: ఇది కేవలం అవగాహాన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యులు లేదా నిపుణులకు సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Vishal Gabale (@health.with.vg) (చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?)
పుదీనాతో చెమటకు చెక్!
పుదీనాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని డ్యామేజ్ కాకుండా రక్షించడమే కాకుండా, హైడ్రేట్ చేసి తాజాగా ఉండేలా చేస్తాయి. పుదీనాలోని విటమిన్ ‘ఏ’ చర్మంలోని జిడ్డును తగ్గించి, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పుదీనా ఆకుల పేస్ట్, గుడ్డు తెల్లసొన మిశ్రమంతో మాస్క్ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది. పుదీనాలోని శాలిసిలిక్ యాసిడ్ మొటిమలను తగ్గిస్తుంది. పుదీనా రసం, పచ్చి బొప్పాయి రసాన్ని కలిపి మచ్చలు, కీటకాలు కుట్టిన చోట లేదా చర్మ ఇన్ఫెక్షన్లపై రాస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. వేసవిలో చన్నీటిలో పుదీనా ఆకులను వేసి ముఖం కడుక్కోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో పుదీనా ఆకులు లేదా పుదీనా నూనె వేసుకుంటే అలసట తగ్గి, అధిక చెమట సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖంపై మొటిమల వల్ల ఏర్పడే మచ్చల నివారణకు కూడా పుదీనా తోడ్పడుతుంది. సమాన పరిమాణంలో ఎండిన తులసి, వేప, పుదీనా ఆకులను పొడి చేసి పెట్టుకోవాలి. ఒక చెంచా ఈ పొడికి కొంచెం పసుపు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి మచ్చలపై రాస్తే అవి క్రమంగా తగ్గుతాయి. చర్మ సంరక్షణ కోసం కానోపిఎంత ఖరీదైన ఫేస్ వాష్‌లు వాడినా, ముఖం కడుక్కోవడానికి ఉపయోగించే నీరు బాగుండకపోతే ఆ ప్రయత్నాలన్నీ వృథానే. కొళాయి నీటిలో ఉండే క్లోరిన్, ఇతర మలినాలు, హార్డ్ వాటర్ చర్మాన్ని పొడిగా మార్చడమే కాకుండా, మొటిమలు, అలర్జీలకు దారితీస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ వెల్నెస్ బ్రాండ్ కానోపీ తన సరికొత్త ఫాసెట్ ఫిల్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫిల్టర్ సాధారణ వాటర్ ఫిల్టర్ల లాగా కాకుండా, ప్రత్యేకంగా చర్మ సంరక్షణ కోసం రూపొందించినది. ఇది నీటిలోని క్లోరిన్, ఇతర మలినాలను తొలగించి, నీటిని సున్నితంగా మారుస్తుంది. దీనివల్ల చర్మంపై కలిగే మంట, అలర్జీలు తగ్గుతాయి. మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మం సహజసిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.ఈ ఫిల్టర్ కేవలం పనితీరులోనే కాకుండా, చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బాత్రూమ్ ఇంటీరియర్‌కు తగినట్లుగా ఇది లావెండర్, ఇత్తడి, మ్యాట్ బ్లాక్, బ్రష్డ్ నికెల్ వంటి అద్భుతమైన రంగులలో లభిస్తుంది. కానోపీ సంస్థ కేవలం ఫిల్టర్లకే పరిమితం కాకుండా, షవర్ హెడ్లు హ్యూమిడిఫైయర్లను కూడా సరికొత్త రీతిలో డిజైన్ చేస్తోంది. గృహోపకరణాలను బ్యూటీ టూల్స్‌గా మార్చడం ద్వారా మన ఇంట్లోనే చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?)
అంతర్జాతీయం
క్రూజ్ షిప్లో ప్రాణాంతక వైరస్.. కెనడాలో తొలి కేసు!
ఒట్టావా: అట్లాంటిక్ మహాసముద్రంలో ‘ఎంవీ హోండియస్’ క్రూజ్ షిప్లో ప్రయాణించిన వారిలో ప్రాణాంతక ‘ఆండీస్ హంటా వైరస్’ వెలుగుచూడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా ఈ నౌకలో ప్రయాణించిన ఓ కెనడా దేశస్థునికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా నిర్ధారించడంతో విమానయాన, పర్యాటక వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.కెనడాలో తొలి కేసు నమోదుఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవీ హోండియస్ క్రూజ్ షిప్లో మొత్తం నలుగురు కెనడా పౌరులు ప్రయాణించారు. వీరిలో ఒకరి నమూనాలను పరీక్షించగా, మే 16న హంటా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. విన్నిపెగ్‌లోని నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో చేసిన పరీక్షల్లో, అతడితో పాటు ప్రయాణించిన మరో కెనడియన్‌కు మాత్రం నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.మనిషి నుంచి మనిషికి వ్యాప్తిసాధారణంగా ఎలుకలు, వాటి వ్యర్థాల ద్వారా మాత్రమే ఈ హంటా వైరస్ వ్యాపిస్తుంది. కానీ, ప్రస్తుతం ఈ క్రూజ్ షిప్లో వెలుగుచూసిన ‘ఆండీస్’ రకం మాత్రం మనిషి నుంచి మనిషికి నేరుగా సోకే అత్యంత ప్రమాదకరమైన వైరస్ కావడం ఆందోళన కలిగిస్తోంది. నౌకలో ప్రయాణికుల మధ్య వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించిన ఆరోగ్య సంస్థలు తక్షణమే అప్రమత్తమై, ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ చేపట్టాయి.కోవిడ్‌లా కాదు.. ప్రజలకు ముప్పు లేదుక్రూజ్ షిప్లో కేసులు నమోదైనప్పటికీ, కెనడాలోని సామాన్య ప్రజలకు ఈ వైరస్ వల్ల ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని, కాంటాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని కోవిడ్-19 మహమ్మారితో పోల్చవద్దని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావొద్దని వైద్యాధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట!
ఇరాన్ సంచలన నిర్ణయం
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కీలకమైన వాణిజ్య మార్గం హర్ముజ్ మూసివేతతో పలు దేశాలు సంక్షోభాలతో అల్లలాడిపోతున్నాయి. ఇరాన్‌కు మరో ఆప్షన్ లేదని.. చర్చలకు దిగి రావాల్సిందేనని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్ మరో కీలక బలహీనతపై దృష్టి సారించింది.. హర్ముజ్ జలసంధి కిందుగా సాగుతున్న అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ మార్గాలు.. ఈ యుద్ధంలో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. టెహ్రాన్ వర్గాలు తాజాగా ప్రకటించిన ప్రణాళికనే ఇందుకు కారణం. దీని ప్రకారం.. హర్ముజ్ కింద నుంచి వెళ్తున్న అండర్ మైన్ సీ కేబుల్స్కుగానూ ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ బలంగా భావిస్తోందట!. ‘‘జలసంధి గూండా పలు నెట్వర్క్ కేబుల్స్ వెళ్తున్నాయి. అయితే.. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఈ మార్గాల వినియోగానికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సహకరించకపోతే డేటా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడవచ్చు’’ అని ఇరాన్ హెచ్చరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు.. కేబుళ్ల మరమ్మత్తులు, నిర్వహణ హక్కులు కూడా ఇరాన్ కంపెనీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మీడియా ఒకటి కథనం ప్రచురించింది. దీంతో ఇరాన్ మూమాలు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడం లేదన్న చర్చ జోరందుకుంది.అదే గనుక జరిగితే..ప్రపంచ ఇంటర్నెట్, డేటా ట్రాఫిక్‌లో 95% పైగా ఈ సముద్రపు మార్గాల ద్వారానే జరుగుతుంది. హర్ముజ్ జలసంధి గుండా అనేక అంతర్జాతీయ కనెక్టివిటీ మార్గాలు వెళ్తాయి. భద్రతా కారణాల వల్ల ఎక్కువ భాగం ఒమన్ వైపు ఉన్నప్పటికీ.. ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జి ఇంటర్నేషనల్ అనే రెండు ప్రధాన మార్గాలు మాత్రం ఇరాన్ జలప్రాంతాల గుండా సాగుతున్నాయి. వీటికి నష్టం కలిగితే బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు, సైనిక కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధస్సు, అంతర్జాతీయ లావాదేవీలు అన్నీ ప్రభావితమవుతాయి. ఇరాన్ అండర్ సీ మైన్ కేబుల్స్‌పై దృష్టి పెడితే.. ఇరాన్ పొరుగు దేశాలు, భారత్, తూర్పు ఆఫ్రికా, యూరప్–ఆసియా మధ్య ఆర్థిక లావాదేవీలు అన్నీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్‌ల నుంచి యూరప్ వరకు కనెక్టివిటీ దెబ్బతింటే, ఫైనాన్షియల్ ట్రేడింగ్, బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్లు, క్రాస్-బోర్డర్ పేమెంట్లు అన్నీ ఆలస్యమవుతాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్నా, పెద్ద స్థాయి అంతరాయం అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగినా మరమ్మత్తులు కూడా సవాలే. ఎందుకంటే రిపేర్ షిప్‌లు ఒకేచోట నిలిచి పని చేయాలి. ఆ సమయంలో ఇరాన్ అడ్డుకుంటే అది అసాధ్యం కాదు..నిజానికి.. యుద్ధ ప్రారంభ సమయంలోనే అండర్ సీ కేబుల్స్ అంశం తెర మీదకు వచ్చింది. వీటిని కత్తిరించడం ద్వారా ఇరాన్ ‘డిజిటల్ వార్’ జరపొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు జలసంధిలో నౌకల నుంచి మాత్రమే కాదు.. ఈ కేబుల్స్‌పైనా ఫీజులు వసూలు చేసే యోచన చేస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ చట్టంఇరాన్ మీడియా ప్రకారం, 1982లోని ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) ప్రకారం తీరరాష్ట్రాలకు తమ జలప్రాంతాల్లో కనెక్టివిటీ మార్గాలపై షరతులు విధించే హక్కు ఉంది. ఇరాన్ ఆ ఒప్పందంపై సంతకం చేసినా.. ఇంకా ఆమోదించలేదు. సుయాజ్ కాలువలో ఈజిప్ట్ వసూలు చేసే ఫీజులను ఉదాహరణగా చూపుతున్నా.. హోర్ముజ్ సహజ జలసంధి కావడం వల్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయితే.. చమురు తర్వాత ఇప్పుడు డేటా కూడా ఇరాన్ చేతిలో బందీ అవుతుందా? అనే ఆందోళన అంతర్జాతీయంగా పెరుగుతోంది. హర్ముజ్ జలసంధి కింద ఉన్న ఈ మార్గాలు కత్తిరించబడినా? లేదంటే పన్నులు విధించబడినా.. ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీకి ఇది మరో పెద్ద దెబ్బ కానుంది.
ఎనిమిదేళ్ల తర్వాత ఎయిర్‌షో.. ఢీ కొట్టి ముక్కలైన విమానాలు
అమెరికాలో ఘోరం సంభవించింది. ఎయిర్‌షోలో రెండు యుద్ధ విమానాలు ఒకదాన్నొకటి ఢీ కొట్టి పేలిపోయాయి. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఐడాహో స్టేట్ మౌంటెన్ హోమ్ ఎయిర్‌ఫోర్స్ వద్ద ఈ ఘటన జరింది. అయితే అదృష్టవశాత్తూ పైలట్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో రెండు అమెరికా EA-18G గ్రౌలర్ యుద్ధ విమానాలు మధ్య ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఢీకొన్న వెంటనే విమానాలు పేలిపోయి ముక్కలైపోయాయి. ప్రమాద స్థలంలో దట్టమైన నల్ల పొగలు ఎగసిపడగా, అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. బేస్‌ను తక్షణమే లాక్డౌన్ చేశారు. ఆదివారం మిగిలిన అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు.విమానాల్లో ఉన్న నాలుగు మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఢీకొన్న క్షణాల్లోనే వారు పారా షూట్ల సహాయంతో కిందికి దిగారు. ఈ విషయాన్ని షో నిర్వాహకులు, అమెరికా నేవీ ధృవీకరించారు.Footage of the mid air collision between a pair of Navy Super Hornets/Growlers during the Gunfighter Skies Air Show at Mountain Home Air Force Base moments ago. pic.twitter.com/yQqPavmSWk— OSINTtechnical (@Osinttechnical) May 17, 2026మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రతినిధి ప్రకారం, ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. "అత్యవసర సిబ్బంది అక్కడే ఉన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ ఎయిర్ షోకు వేలాది మంది హాజరయ్యారు. అయితే ఈ ప్రమాదం గత ఘటనలను గుర్తు చేసింది. 2018లో ఒక హ్యాంగ్ గ్లైడర్ పైలట్ రన్‌వేపై కూలి మరణించాడు. 2003లో థండర్బర్డ్స్ జెట్ కూలిపోయింది. కానీ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. తాజా ప్రమాదం మళ్లీ ఎయిర్ షో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.
అమ్మను దూరం చేసి.. పసివాడిని బలి తీసుకున్న ట్రంప్ యంత్రాంగం
ఫ్లోరిడా: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కఠినమైన వలసవిధానాలు పరోక్షంగా ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాయి. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు హోండురాస్ మూలాలున్న ఓ తల్లి, ఆమె రెండేళ్ల కుమారుడిని వేరు చేశారు. గతిలేక ఆ తల్లి తన కుమారుడిని బంధువుల ఇంట్లో వదిలేసి వెళ్లగా ఇప్పుడా అబ్బాయి విగతజీవిగా కన్పించాడు. ఈ ఉదంతంలో తల్లిదే తప్పు అంటూ అధికారుల వింతవాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోండురాస్ దేశానికి చెందిన వెండీ హెర్నాండెజ్ రెయెస్ తన రెండేళ్ల కుమారుడు ఆర్లిన్ జోసీతో కలిసి ఫ్లోరిడాలోని ఎస్కాంబియా కౌంటీలో నివసిస్తోంది. జనవరిలో లూసియానాలో ఓ రోజు నిర్మాణ పనులకు వెళ్లగా అక్కడి సిబ్బంది ఆమెను, మరికొందరిని అక్రమ వలసదారులంటూ ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. అధికారులు వెండీని నిర్బంధ కేంద్రంలో బంధించారు. రెండేళ్ల ఆర్లిన్ నిర్బంధ కేంద్రంలో ఉండటం కుదరదని అధికారులు తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఆమె తన కుమారుడిని ఫ్లోరిడాలోని ఎస్కాంబియా కౌంటీలో ఉండే బంధువుæ మల్డోనాడోకి అప్పగించింది. అధికారులు నెల రోజుల్లోనే ఆమెను హొండురస్కు బలవంతంగా పంపేశారు. బంధువుల ఇంట్లో ఉన్న తన కుమారుడు తీసుకురావాలని అధికారులను ఎంతగా వేడుకున్నా వాళ్లు కనికరం చూపలేదు. ఆర్లిన్ సంరక్షణా బాధ్యతలు తీసుకున్న మల్డోనాడో సైతం అక్రమ వలసదారుడే. గతంలో నేరాలకు పాల్పడ్డాడు. అతడి చిత్రహింసల తాళలేక ఆర్లిన్ మార్చి నెలలో ప్రాణాలు కోల్పోయాడు. శరీరమంతటా గాయాలతో నిండిపోయింది. పిల్లాడి మృతి వార్త తెలిసి స్థానిక పోలీసుఅధికారులు మల్డోనాడోను అరెస్ట్ చేశారు. అయితే చిన్నారి మరణానికి ఆమె తల్లే పరోక్షంగా కారణమని, తాము చెప్పినా వినకుండా ఆర్లిన్ను వదిలేసి వెళ్లిందని ఇమిగ్రేషన్ అధికారులు వాదిస్తున్నారు. ఈ వాదనలను తల్లి తీవ్రంగా ఖండించారు. తన వెంట కుమారుడిని తీసుకెళ్తానని ఎంత మొత్తుకున్నా అధికారులు వినిపించుకోలేదని, ఇప్పుడు తిరిగి నింద తనపై మోపుతున్నారని ఆమె ఏడుస్తూ చెప్పారు. ప్రాణంగా చూసుకుంటున్న కన్న కొడుకును రాక్షసుడి చేతుల్లో పెట్టి వదిలేసి వెళ్లిపోయేంతటి కర్కశురాలిని కాదంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
జాతీయం
స్నేహితుడి పెళ్లికి వెళుతూ ప్రమాదం.. 12 మంది మృతి
మహారాష్ట్ర: ఆ మిత్రుల బృందం స్నేహితుడి పెళ్లి వేడుకలో సరదాగా గడుపుదామని బయిలుదేరింది. అనుకున్న విధంగానే ఆడుతూపాడుతూ సాగుతున్న వారి ప్రయాణాన్ని ఒక్కసారిగా మృత్యువు కబలించింది. ముంబై- అహ్మదాబాద్ రహదారిపై జరిగిన ఘెర రోడ్డుప్రమాదంలో పెళ్లి వేడుకకు వెళుతున్న ఐషర్ ట్రక్కు- భారీ కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింతగా పెరిగా అవకాశం ఉంది.మహారాష్ట్రలోని దహను తాలూకాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ధనివారి సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళుతున్న ఐషర్ వాహనాన్ని భారీ ట్రక్క ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనం కూడా పూర్తిగా ధ్వంసమైంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే ట్రక్కులో ప్రయాణిస్తున్న మరో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ట్రక్కులో ఉన్న 30 నుంచి 35 మంది వరకు గాయపడినట్లు సమాచారం.అయితే మరికొద్ది సేపట్లో వేడుకకు చేరుకునే వారిమని అంతలోనే ఈ ప్రమాదం జరగడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Palghar - A horrific road accident occurred on the Mumbai-Ahmedabad National Highway in Palghar district when a truck carrying a baraat collided with a container truck.The accident took place in the Dhaniwari area of Palghar, As of now, 12 people have been confirmed dead. pic.twitter.com/RZNasohlC1— NextMinute News (@nextminutenews7) May 18, 2026
రూ. 51 లక్షలు, ఫార్చ్యూనర్ కారు కోసం దారుణం?
తమ బిడ్డ పెళ్లి కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. రూ. 11 లక్షల నగదు, రూ. 50 లక్షల విలువైన బంగారం, ఫర్నిచర్ , ఒక స్కోర్పియో (Scorpio) కారు లాంటి ఖరీదైన కానుకలను కట్నంగా ఇచ్చారు. కానీ ఏం లాభం, పెళ్లైన 17 నెలలకే తీరని కట్నం దాహానికి 25 ఏళ్ల కొత్త కోడలు బలైపోయింది. దీంతో అమ్మాయి తల్లి దండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అత్యంత హృదయ విదారకమైన ఈ ఘటన, గ్రేటర్ నోయిడాలోని జల్పురా ప్రాంతంలో, Ecotech-III పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడా (జల్పురా ప్రాంతం)లో 25 ఏళ్ల దీపికా నాగర్ అనే వివాహిత తన అత్తవారింటి పైకప్పు (టెర్రస్) పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరణించింది. 2024 డిసెంబరులో దీపిక వివాహం జరిగింది. ఈ వివాహం కోసం దీపిక తండ్రి సంజయ్ నగర్ దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లయిన 3-4 నెలల నుంచే అత్తవారింటి వేధింపులు మొదలయ్యాయని దీపిక తల్లిదండ్రలు ఆరోపించారు. నిందితులు అదనంగా ఒక ఫార్చ్యూనర్ కారు, రూ. 51 లక్షల నగదు కావాలని దీపికను వేధించడం ప్రారంభించారు. కట్నం కోసమే ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఎలాగైన తనబిడ్డ సంసారం నిలబడుతుందనే ఆశతో, సర్దుకుపోతుందని భావించి తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కూతురి జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించామని దీపిక తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. అంత కట్నం ఇచ్చినా నా కూతురు నాకు దక్కలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పడిపోయిందా? తోసేశారా? ఆదివారం నాడు దీపికా తన తండ్రికి ఫోన్ చేసి, భర్త మరియు అత్తవారింటి వారు తనను తీవ్రంగా కొడుతున్నారని ఏడుస్తూ చెప్పింది. దాంతో తండ్రి బంధువులు ఆ సాయంత్రం అత్తగారింటికి వెళ్లి గొడవను సర్దిచెప్పి, వారు ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే, రాత్రి 12:30 గంటల ప్రాంతంలో దీపికా మూడో అంతస్తునుంచి పైనుంచి కింద పడిందని సమాచారం అందింది.అయితే ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి చెప్పారు. ఆమెను తీవ్రంగా కొట్టి, కడుపులో స్క్రూడ్రైవర్ లేదా కత్తితో పొడిచి, ఆపై పైనుంచి కిందకు తోసేసారని ఆరోపించారు. ఆసుపత్రిలో ఆమె శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, ముక్కు, చెవులలోంచి రక్తం కారుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను కొట్టి, ఆపై అది ఒక ప్రమాదంలా కనిపించేలా చేయడానికి కిందకు విసిరేశారని దీపిక బాబాయ్ విశేష్ నాగర్ ఆరోపించారుమామ, భర్త అరెస్ట్సెంట్రల్ నోయిడా డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి పైకప్పు పైనుంచి దూకి మరణించినట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దీపిక భర్త రితిక్ తన్వర్, మామ మనోజ్ లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శవపరీక్ష (Post-mortem) నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
గజరాజుల జలకాలాటలో మహిళ జలసమాధి
యశవంతపుర: గజరాజుల జలకాలాట ఒక కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. ఏనుగులను దగ్గరగా చూడాలని ముచ్చటపడిన ఓ పర్యాటకురాలు అనూహ్యంగా ఏనుగు కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని దుబారెలో ఉన్న అటవీశాఖ ఏనుగుల శిబిరంలో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మైసూరు దసరా ఉత్సవాలలో పాల్గొనే ఏనుగులు కావేరీ నదీతీరం వెంట జలకాలాడుతున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు ఎగబడ్డారు. తమిళనాడు నుంచి వచ్చిన 33 ఏళ్ల తులసి అనే మహిళ సైతం తన కుమార్తె, భర్తతో కలిసి నది ఒడ్డున ఏనుగులను చూసేందుకు అత్యంత సమీపంగా వెళ్లారు. అదే సమయంలో కంజన్, మార్తాండ అనే ఏనుగులు స్వల్పంగా ఘర్షణపడ్డాయి. ఈ సమయంలో కోపంతో కంజన్ అనే ఏనుగు మార్తాండ అనే ఏనుగును తోసేసింది. దీంతో అది బురదతో నిండిన ఒడ్డులో పడిపోయింది. ఒరిగిపోతూ అది అక్కడే ఉన్న తులసి మీద పడింది. దీంతో ఆమె బురదలో కూరుకుపోయింది. ఇది చూసిన మావటి కంజన్ను దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది. అది కిందపడిపోయిన ఏనుగును పదేపదే నెట్టడంతో అది లేవలేక అలాగే బురదలో ఉండిపోయింది. దీంతో ఏనుగు బరువుకు దాని కింద ఇరుక్కుని మహిళ మట్టిలో కూరుకుపోయి ప్రాణాలుకోల్పోయారు. ఎట్టకేలకు దాడిచేసిన ఏనుగును మావటి దూరంగా తీసుకెళ్లాక కిందపడిన ఏనుగు పైకి లేచింది. వెంటనే తోటి పర్యాటకులు తులసిని సమీప ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు ధ్రువీకరించారు. ఏనుగుల ఘర్షణ, తులసి పడిపోవడం, ఆమెపై ఏనుగు పడటం అన్నీ సమీపంలోని పర్యాటకుల స్మార్ట్ఫోన్లలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో మహిళ భర్త, కూతురు అక్కడే ఉన్నా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. భార్యను ఎలాగైనా ఏనుగు కింద నుంచి లాగేందుకు భర్త ఎంతగానో శ్రమించడం వీడియోలో రికార్డయింది. అప్పటిదాకా ఏనుగుల ఘీంకారాలు, పర్యాటకులతో ఆనందంతో సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. భయంతో జనమంతా దూరంగా పారిపోయారు. ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. వన్యప్రాణులకు ముఖ్యంగా ఏనుగులను కనీసం 100 అడుగుల దూరం నుంచే పర్యాటకులు చూడాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె సూచించారు. ఏనుగును తాకడం, దగ్గరగా ఉండి ఫొటోలను తీసుకోవడం చేయరాదని హెచ్చరించారు. పర్యాటకులు అరటిపండ్లు, బెల్లం, చెరకు గడలు వంటివి ఏనుగులకు చేతితో అందించడంపై నిషేధం విధిస్తామని తెలిపారు. వన్యప్రాణులుండే పర్యాటక ప్రదేశాల్లో అమలుచేయాల్సిన ప్రామాణిక కార్యాచరణ ప్రణాళిక(ఎస్ఓపీ)ని అధికారులు తప్పకుండా అమలుచేయాలని ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్ వార్డెన్ల ప్రధాన కార్యదర్శికి మంత్రి ఆదేశాలు జారీచేశారు. I have always been stunned by, and have marvelled at, the raw brute force of nature manifested in elephants.[in this tragedy, a life was lost]https://t.co/OfHTUtgkwn— Sandeep Manudhane (@sandeep_PT) May 18, 2026
వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది?
ప్రముఖ యాసిడ్ దాడి బాధితురాలు, సామాజిక కార్యకర్త లక్ష్మీ అగర్వాల్ మళ్లీ వార్తల్లోనిలిచారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ఫోటో నిజమైనది కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫోటో అని నెటిజన్లు భావిస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చకు కేంద్రబిందువుగా నిలిచారు.లక్ష్మీ అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలో ఆమె ఒక ప్రభుత్వ కార్యాలయంలో కూర్చుని, ఏదో ఒక అధికారిక పత్రంపై సంతకం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్లో ‘ఢిల్లీ సర్కార్’ (Delhi Sarkar) బోర్డు, భారత జాతీయ చిహ్నం, రెండు జాతీయ జెండాలు ఉన్నాయి. అంతేకాదు ఆమె ముందున్న టేబుల్‌పై "లక్ష్మీ అగర్వాల్" అని రాసి ఉన్న నేమ్‌ప్లేట్ ఉంది. ఈ ఫోటోకు హిందీలో ఒక ఎమోషనల్ క్యాప్షన్ కూడా జోడించారు: "ఒకప్పుడు ఏ గొంతునైతే నొక్కేయాలని చూశారో.. ఇప్పుడు అదే గొంతు మార్పును లిఖిస్తుంది. నన్ను బలహీనురాలిగా భావించిన వారు ఇకపై నా పేరు గుర్తుపెట్టుకోవాలి- లక్ష్మీ అగర్వాల్." ఈ పోటోతోపాటు, ఆ క్యాప్షన్ నెటిజన్లలో గందరగోళం నెలకొంది.ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యంఈ ఫోటో చూసి చాలా మంది లక్ష్మీ అగర్వాల్‌కు ఏదో ప్రభుత్వ పదవి లేదా అధికారిక నియామకం లభించిందని భావించి పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. మరికొందరు ఆమె ప్రయాణాన్ని ప్రశంసిస్తూ, ఆ క్షణం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మరి కొందరు నెటిజన్లు ఇది పూర్తిగా AI ఫోటోని గుర్తించారు. దీనికి భిన్నంగా కొందరు లక్ష్మికి మద్దతుగా నిలిచారు. ఆమె ఆ పోస్ట్‌లో తనకు ఫలానా ప్రభుత్వ పదవి వచ్చిందని ఎక్కడా క్లెయిమ్ చేయలేదని, కేవలం ఒక ప్రతీకాత్మకమైన (Symbolic) సృజనాత్మకత కోసం మాత్రమే ఆ ఫోటోను వాడారని, నేమ్‌ప్లేట్‌పై కూడా ఎలాంటి హోదా రాయలేదని వారు వాదించారు. ఇదీ చదవండి: నలుగుర్ని కనండి : డా.శివరంజని తీవ్ర ఆందోళన వీడియో వైరల్ఒక సెలబ్రిటీ అయి ఉండి, ఇలాంటి నకిలీ ఫోటోలను వాస్తవం లాగా ఎందుకు షేర్ చేస్తున్నారని, కనీసం ఇది AI ఫోటో అని డిస్క్లైమర్ (Disclamer) ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇది చట్టపరమైన వివాదం, ప్రభుత్వ చిహ్నాల దుర్వినియోగం అనే వ్యాఖ్యలు కూడా కనిపించాయి. భారతదేశ జాతీయ చిహ్నం, జాతీయ జెండాలు, మరియు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయం లాంటి సెటప్‌ను AI ద్వారా సృష్టించి చూపించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని కొందరు వాదించారు. ఇది 'ది స్టేట్ ఎంబెల్మ్ ఆఫ్ ఇండియా (ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్) యాక్ట్, 2005' కింద చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని పలువురు న్యాయవాదులతో సహా పలువురు వినియోగదారులు హెచ్చరించారు.లక్ష్మీ అగర్వాల్‌కు ప్రభుత్వ పదవి వచ్చినట్టుగా లాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. విమర్శలు ఎన్ని వస్తున్నప్పటికీ, లక్ష్మికి అభిమానుల నుండి మద్దతు మాత్రం లభిస్తూనే ఉండటం గమనార్హం.ఎవరీ లక్ష్మీ అగర్వాల్ఈమె భారతీయ యాసిడ్ దాడి బాధితురాలు, మహిళా హక్కుల కార్యకర్త , టీవీ హోస్ట్. యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం మరియు చట్టపరమైన సంస్కరణలు భారతదేశంలో ఆమెకు ఎంతో గుర్తింపునిచ్చాయి. 2005లో, ఆమెకు 15 ఏళ్ల వయసులో, పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన ఒక వ్యక్తి ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. కోలుకున్నతరువాత బాధితుల కోసం ఒక ప్రముఖ గళంగా మారి, 'స్టాప్ యాసిడ్ ఎటాక్స్' ప్రచారంలో చేరారు. సుప్రీంకోర్టులో ఆమె వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం, భారతదేశంలో యాసిడ్ అమ్మకాలపై కఠినమైన నిబంధనలు రావడానికి దారితీసింది. యాసిడ్ దాడుల బాధితులకు పునరావాసం, మద్దతు అందించే ఛన్వ్ ఫౌండేషన్ (Chhanv Foundation) కు ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు.ఆమె చేసిన సామాజిక సేవలకు గాను 2014లో అమెరికా ప్రభుత్వ ‘ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్’ అవార్డును అందుకున్నారు. ఆమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్లో దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో ‘ఛపాక్’ (Chhapaak) అనే చిత్రం కూడా రూపొందింది. ఇదీ చదవండి: మాజీ మిస్ పూణే అనుమానాస్పద మృతి : దిగ్భ్రాంతి పర్చే లాస్ట్ మెసేజెస్
ఎన్ఆర్ఐ
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్‌కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్‌ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు
న్యూయార్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న 2026న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నైతికతపై దార్శనికత మరియు బహుపాక్షికవాదానికి దాని ప్రాసంగికత’ అనే థీమ్‌తో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి,అంబాసిడర్ హరీష్ పార్వతనేని స్వాగతోపన్యాసం చేశారు. భారత పౌరులలో రాజ్యాంగ నైతికత స్ఫూర్తిని నింపడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి చాలా ముఖ్యమైందన్నారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు మధ్య ఉన్న ఉమ్మడి అంశాలను వివరించారు. రాజకీయ విభజన, నిరంతర సంఘర్షణలతో కూడిన ఈ క్లిష్ట సమయాల్లో రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాలన్న డాక్టర్ అంబేద్కర్ పిలుపు ఎంతో సందర్భోచితమైనదని, ఇది బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడానికి, ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతమైన సంస్కరణలు తీసుకురావడానికి, దాని ప్రధాన విభాగాలకు పునరుజ్జీవం పోయడానికి, ఐక్యరాజ్యసమితిని దాని ఉద్దేశ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుందని రాయబారి హరీష్ చెప్పారు.ప్రముఖ సివిల్ సర్వెంట్, ప్రముఖ అంబేద్కర్ పండితుడు అయిన డాక్టర్ రాజా శేఖర్ వుండ్రు కీలకోపన్యాసం చేశారు. రెండు ప్రపంచ యుద్ధాలను, ఐక్యరాజ్యసమితి ఏర్పాటును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, డాక్టర్ అంబేద్కర్ బహుపాక్షికవాదం ప్రాముఖ్యతను గుర్తించారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం యొక్క కేంద్ర సూత్రాలను రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్లో పొందుపరిచిన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అనే ప్రాథమిక స్ఫూర్తి భారత రాజ్యాంగంలో కూడా ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ అంబేద్కర్ నొక్కిచెప్పారని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో, బహుపాక్షికవాదం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ రాజ్యాంగ నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని రాజా శేఖర్ వుండ్రు అన్నారు.డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక నైతిక నిదర్శనమని, అందులో ఆయన కేవలం బాధ నుండి తప్పించుకోవడమే కాకుండా, దానిని రూపాంతరం చెందించి, ఆ గాయాన్ని జ్ఞానంగా మార్చారని హార్వర్డ్ డివినిటీ స్కూల్ విజిటింగ్ ప్రొఫెసర్, అతిథి వక్త డాక్టర్ సంతోష్ రౌత్, అభిప్రాయపడ్డారు. నేటి ప్రపంచంలో, ముఖ్యంగా బహుపాక్షికత (multilateralism) విషయంలో, డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆదర్శాల గాఢమైన ఔచిత్యాన్ని డాక్టర్ రౌత్ విశదీకరించారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్ వంటి లిఖితపూర్వక గ్రంథాల స్ఫూర్తిని ఆచరణలో పెట్టడానికి దోహదపడే శక్తిగా ఆయన నైతికతను అభివర్ణించారు.వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యారు.
క్రైమ్
ప్రేమోన్మాది మణితేజ మృతి
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వైష్ణవిని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన ప్రేమోన్మాది మణితేజ (29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం వైష్ణవి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులు ముగించుకుని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా నిందితుడు కత్తితో దారుణంగా మెడ, గొంతుపై విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. రక్తం మరకలతో పారిపోతున్న మణితేజను స్థానికులు పట్టుకుని కాళ్లు చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతని తలపై రాళ్లు ఎత్తివేయడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మణితేజను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. హైదరాబాద్‌లో పరిచయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మణితేజ ల్యాండ్రీ షాప్ నిర్వహించేవాడు. గతంలో వైష్ణవి ఓ హాస్టల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విద్యార్థుల దుస్తులు ఉతికి, ఇస్త్రీచేసి అప్పగించే సందర్భంగా ఆమెతో పరిచయం ఏర్పడింది. తర్వాత వైష్ణవి అక్కడ ఉద్యోగం మానేసినా ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే తాను ప్రేమిస్తున్నట్లు వైష్ణవిని వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల వైష్ణవికి వెళ్లి కుదిరిందన్న సమాచారం తెలియడంతో మణితేజ తన ప్రేమను కాదన్న వైష్ణవిని హతమార్చాలని నిర్ణయించుకుని.. జడ్చర్లకు వచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.కాగా, మణితేజ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి, తమ్ముడు ఉన్నారు. హత్య అనంతరం వైష్ణవి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మణితేజ మృతి చెందాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చారు. ఈ క్రమంలో వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు వారిపై దాడిచేస్తారన్న అనుమానంతో పోలీసులు వారిని జడ్చర్ల సమీపంలోని డీటీసీలో ఉంచి రక్షణ కల్పించారు. అప్పటి దాకా మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. జడ్చర్లలో వైష్ణవి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనరల్ ఆస్పత్రిలో మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
ఆస్తి కోసం తల్లీకూతుళ్ల దారుణ హత్య
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్‌గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.
భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య
కిర్లంపూడి: నవ వధువు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు..కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన సత్యంశెట్టి వెంకటేశులు దంపతుల మూడవ కుమార్తె వెంకటలక్ష్మి (25)కి ఏప్రిల్ 25న పిఠాపురం మండలం మర్లావకు చెందిన గాది దుర్గాకోటేశ్వరరావుతో వివాహమైంది. దుర్గాకోటేశ్వరరావు పెళ్లి జరిగిన మూడో రోజే తనకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ వీడియోలు, ఫొటోలు ఆమెకు చూపించాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి అప్పటినుంచి అన్యమనస్కంగా ఉంటోంది. ఆచారాల్లో భాగంగా మూడు సార్లు అత్తారింటికి వెళ్లి వచ్చిన ఆమె గోనేడలోని తన తల్లిదండ్రుల ఇంటివద్దే ఉంటోంది. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాల విషయాన్ని తట్టుకోలేక శనివారం రాత్రి తన గదిలోని ఫ్యానుకు చీరకట్టి ఉరి వేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు.కాగా, వెంకటలక్ష్మి తల్లిదండ్రులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు పిల్లలకు వివాహాలు కాగా, చిన్న కుమార్తె వెంకటలక్ష్మిని డిగ్రీ వరకు చదివించి గత నెలలోనే పెళ్లి చేశాడు. తమ బాధ్యతలు తీరాయని సంతోషపడేలోపే ఈ దారుణం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి సత్యంశెట్టి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త దుర్గాకోటేశ్వరరావు, అత్త నూకామణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రేమించకుంటే చంపేస్తారా?
సాక్షి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్లో తనను ప్రేమించడం లేదని ప్రేమోన్మాది తేజ.. చేతితో గాయపడి వైష్ణవి (23) మృతి చెందింది. ఈ ఘటనలో స్థానికులు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన తేజను ఆసుపత్రికి తరలించారు. ఆ యవకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ కీలక వ్యాఖ్యలు చేసింది. తన అక్క(వైష్ణవి) గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డింది.వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ స్పందించింది. ఈ సందర్బంగా అక్షయ..‘మా సోదరి మృతిపై రకరకాల కథనాలు రావడం బాధాకరం. ఏ అమ్మాయి అయినా డబ్బులు తీసుకొని మోసం చేస్తారా?. చనిపోయే సందర్భంలో నిందితుడు చేసిన ఆరోపణను ఎలా నిర్ధారిస్తారు?. అమ్మాయిలను సమాజంలో పురుగుల్లా చూస్తున్నారు. మా అక్క గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆమె గురించి మీకేం తెలుసు?. మాకు న్యాయం చేయకపోయినా సరే కానీ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. న్యాయం కోసం ముఖ్యమంత్రి వద్దకైనా వెళ్తాం.మా అక్కపై దాడి జరిగే సమయంలో అందరూ చూస్తూనే ఉన్నారు తప్ప ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్‌ను అలవరచుకోవాలి. ఎవరో చనిపోయారని తెలిస్తే అక్కడికి వెళ్ళాక మా అక్క అని గుర్తించాం. సామాజిక బాధ్యతగా వివరించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ప్రేమించకుంటే చంపేస్తారా?’ అని ప్రశ్నించింది.ఇదిలా ఉండగా.. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో యువకుడు తేజ.. యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచ్చిన 108 అంబులెన్స్‌లో యువతిని వైద్య చికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
వీడియోలు
పెద్ది సినిమా ట్రైలర్ వచ్చేసింది..
బుర్ర ఉండి మాట్లాడుతున్నావా..!
పెట్రో బాదుడుపై పోరుబాట
RCBతో ఓటమి కన్నీళ్లు పెట్టుకున్న పాంటింగ్
పెద్ది ట్రైలర్ ఈవెంట్ లో రామ్ చరణ్ అనుభవం
ఈ తల్లి ధైర్యానికి చేతులెత్తి మొక్కాల్సిందే
అప్పుడు మా అమ్మ, చిరు సార్.. ఇప్పుడు నేను & చరణ్
అమరావతిలో తేడా జరుగుతుంది అని పవన్ కి తెలుసు
లోకేష్ ని రఫ్ఫాడించిన పేర్ని కిట్టు
బయటపడ్డ బుద్ధా వెంకన్న.. అల్లుడి అరాచకాలు కన్నీళ్లు పెట్టుకున్న బాధితుడు


