స్నేహితుడి పెళ్లికి వెళుతూ ప్రమాదం.. 12 మంది మృతి | Lorry Collides with Truck12 Dead | Sakshi
Sakshi News home page

స్నేహితుడి పెళ్లికి వెళుతూ ప్రమాదం.. 12 మంది మృతి

May 18 2026 5:58 PM | Updated on May 18 2026 7:09 PM

Lorry Collides with Truck12 Dead

మహారాష్ట్ర: ఆ మిత్రుల బృందం స్నేహితుడి పెళ్లి వేడుకలో సరదాగా గడుపుదామని బయిలుదేరింది. అనుకున్న విధంగానే ఆడుతూపాడుతూ సాగుతున్న వారి ప్రయాణాన్ని ఒక్కసారిగా మృత్యువు కబలించింది. ముంబై- అహ్మదాబాద్‌ రహదారిపై జరిగిన ఘెర రోడ్డుప్రమాదంలో పెళ్లి వేడుకకు వెళుతున్న ఐషర్ ట్రక్కు- భారీ కంటైనర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింతగా పెరిగా అవకాశం ఉంది.

మహారాష్ట్రలోని దహను తాలూకాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ధనివారి సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళుతున్న ఐషర్ వాహనాన్ని భారీ ట్రక్క ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనం కూడా పూర్తిగా ధ్వంసమైంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే ట్రక్కులో ప్రయాణిస్తున్న మరో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ట్రక్కులో ఉన్న 30 నుంచి 35 మంది వరకు గాయపడినట్లు సమాచారం.

అయితే మరికొద్ది సేపట్లో వేడుకకు చేరుకునే వారిమని అంతలోనే ఈ ప్రమాదం జరగడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.  ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement