విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం.. చివర్లో ట్విస్టు!
చెన్నై: ఇటీవల తమిళనాడులో కొలువుదీరిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం.. తన క్యాబినెట్‌ను విస్తరించడంతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులుగా చాన్స్ దక్కింది. ఫలితంగా కాంగ్రెస్ ‘సుదీర్ఘ’ ఘనతను సొంతం చేసుకుంది. ఇలా ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ భాగస్వామ్యం కావడం తమిళనాడు చరిత్రలో 59 ఏళ్ల తర్వాతి ఇదే తొలిసారి. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో అది కాస్తా తమిళనాడు రాజకీయాల్లో అరుదైన ఘటనగా చేరిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన ఎస్. రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్‌లు విజయ్ మంత్రివర్గంలో చోటు దక్కడంతో దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకర కార్యక్రమం ఈరోజు(గురువారం, మే 21 వ తేదీ) జరిగింది. అయితే మంత్రిగా ఎస్ రాజేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ నామస్మరణలు చేయడం తమిళనాడులో కొత్త చర్చకు దారి తీసింది. ‘ ప్రజానాయకుడు కామరాజర్ వర్ధిల్లాలి, రాజీవ్ గాంధీ వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ వర్ధిల్లాలి’ అని ప్రమాణ స్వీకారం చివర్లో పేర్కొన్నారు. దీనిపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం చివర్లో చోటు చేసుకున్న ఈ ట్విస్టుతో గవర్నర్ ఒక్కసారిగా తేరుకున్న గవర్నర్.. ఇది ప్రమాణ స్వీకారంలో భాగం కాదంటూ రాజేశ్‌కుమార్‌కు గుర్తు చేశారు. VIDEO | Tamil Nadu Cabinet expansion: During the swearing-in ceremony, Congress MLA Rajesh Kumar, while taking oath as minister, hailed Kamaraj, Rajiv Gandhi and Rahul Gandhi; Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar remarked, "Not part of the oath."(Full video available… pic.twitter.com/dT7TkpcxY5— Press Trust of India (@PTI_News) May 21, 2026
బాబు.. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరివి హత్యా రాజకీయాలు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలని చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. శవ రాజకీయాలు.. హత్యా రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా?. వైఎస్సార్ విషయంలో ఏం జరిగిందో అసెంబ్లీలో క్లిప్పింగ్‌లు చూడాలని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారు. ఏబీఎన్, టీవీ-5, చంద్రబాబు మాఫియా ముఠాగా మారారు. అబద్ధాలు సృష్టించి దొంగ సాక్ష్యాలు తయారు చేస్తున్నారు. ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలు.. చంద్రబాబు సమాధానం చెప్పాలి. మా కుటుంబంలో ముగ్గురు బలైపోయారు. హత్యా రాజకీయాలకు మేము బాధితులం.మా తాత, తండ్రి, బాబాయి ముగ్గురు చనిపోయారు. మాపైనే తప్పుడు రాజకీయాలు చేయిస్తున్నారు. మా తాతగారు రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాజారెడ్డి హత్య జరిగింది. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు రాజారెడ్డిగారిని చంపేశారు. వైఎస్సార్‌ను కేవలం పులివెందులకు కట్టడి చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నది ఇందులో ఉన్న రాజకీయ కోణం. రాజారెడ్డి కేసులో దోషులను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి, అధికార దుర్వినియోగం చేసి, వారిని రక్షించింది ఎవరు? మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. ఈ కేసులో నిందితులను జైలుకెళ్లకుండా కాపాడారు. ఎవరిది గొడ్డలి పారీ.. చంద్రబాబు చెప్పాలి. మా నాన్న విషయంలోనూ అదే జరిగింది. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్నారు. అవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగ్‌లు చూడాలి. తర్వాత నాలుగు రోజులకే వైఎస్సార్ ప్రమాదంలో చనిపోయారు. మేం బాధితులం. కాని, తిరిగి మాపైనే వీళ్లు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?మా చిన్నాయన వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబుగారి ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవమైతే, పైగా తానే హత్య చేశానంటూ సాక్షాత్తూ టీవీ లైవ్ షోల్లో చెలరేగిపోయి మాట్లాడిన దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కార్లలో తిరుగుతున్నాడు. పైగా చంద్రబాబుకు లాయర్ లూథ్రానే, దస్తగిరికీ లాయర్ లూథ్రానే. మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. రాజకీయ లబ్ధికోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం. వివేకానందరెడ్డి కేసులో జరుగుతున్నది ఇదే.చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు, బాలకృష్ణ గన్ పట్టుకుని టపాటపామని ఇద్దరిని కాల్చిపడేయలేదా? మరి ఎవరిది గన్ కల్చర్?. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో వాచ్‌మెన్‌ను బండరాయితో మోది చంపేశారు?. పాపం ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణగారు యాక్సిడెంట్లో చనిపోతే, పరామర్శ కోసం అని పోయి, కేటీఆర్‌తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడాడు. మరి ఎవరివి శవ రాజకీయాలు?. అంతెందుకు సొంత కూతుర్ని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆ పార్టీ గుర్తును లాక్కున్నది, ఆయన చనిపోయినట్టుగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు కాదా? మరి ఎవరివి కుట్ర రాజకీయాలు?.వేళ్లన్నీ చంద్రబాబు వైపే..వంగవీటి మోహనరంగాగారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు?. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహారదీక్ష చేస్తుంటే, అర్థరాత్రి నరికి చంపేశారు. ఈ ఘటనలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తాయి. ఈ కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ ఎమ్మెల్యే. ఎన్టీఆర్‌మీద దాడిచేసిన కేసులో “మల్లెల బాబ్జీ’’ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్‌బాడీగా మారాడు. మల్లెల బాబ్జీ జేబులో ఒక లెటర్ దొరికింది. తనకు రూ.3లక్షలు ఇస్తానని చెప్పి, చివరకు రూ.30వేలే ఇచ్చారని సారాంశం. అసలు ఎన్టీఆర్‌మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా? అది నిజమైతే ఇచ్చింది ఎవరు? అన్నదానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులోనూ వేళ్లు అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి.పింగళి దశరథ్‌రామ్ ఒక జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రికను పెట్టి, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే, హైదరాబాద్ నుంచి బస్సుదిగి, రిక్షాలో ఇంటికి వెళ్తుంటే కత్తులతో దాడిచేసి చంపేశారు. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్‌కు చెప్పేవాడని స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఒక పుస్తకంలో రాసినట్టు కూడా నాకు గుర్తు. హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో రాజకీయాలు చేసింది, చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేం.జగన్ నైజం ఇది.. జగన్ మంచివాడు కాబట్టే, మా తాతను చంపిన వాళ్లు కూడా ప్రశాంతంగా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయితే వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా? జగన్ నైజం ఎలాంటిది? మనస్తత్వం ఎలాంటిది చెప్పడానికి ఇది నిద్శనం. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలని మా నాన్న నేర్పించాడు. చంద్రబాబులా కాదు. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబూ నీకు 77 సంవత్సరాలు వచ్చాయి. బహుశా ఇది చివరి ఎన్నికలేమో. ఇంకా ఈ చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గేయడం లేదా? అని ప్రశ్నించారు.
ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!
ఒకప్పుడు నెలకు రూ.5 లక్షల జీతం తీసుకుంటూ.. పెద్ద కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోయి జీవితంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తరువాత ఎదురైన ఇబ్బందులే అతన్ని జీవితంలో సక్సెస్ సాధించేలా చేశాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.గౌరవ్ కవాత్రా అనే వ్యక్తి 2018లో ఆయన ఒక చైనా మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో నెలకు రూ.5 లక్షల జీతం ఉన్నప్పటికీ.. రూ. 2 కోట్ల హౌస్ లోన్ ఉండేది. ప్రతి నెల జీతం వస్తుండడంతో ఈఎంఐ చెల్లించడానికి ఇబ్బంది ఉండేది కాదు. ఇలాంటి సమయంలో అనుకోకుండా.. సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది.అనుకోకుండా ఉద్యోగం పోవడంతో కవాత్రాకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. జీవితంలో అత్యంత కష్టమైన రోజులు ప్రారంభమయ్యాయి. కొత్త ఉద్యోగం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ఎన్నో తిరస్కరణలకు గురయ్యారు. నిరాశ, భయం, ఆర్థిక ఒత్తిడి కవాత్రాను మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో రాత్రిళ్లు నిద్రపోయేవాడు కాదు. తీవ్ర ఆందోళనతో రోజుకు 12 నుంచి 15 సిగరెట్లు తాగేవాడు. ఆ అలవాటును మానుకోవడానికి ఆయనకు ఎనిమిదేళ్లు పట్టిందని చెప్పారు.ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడు.. తన కుమార్తె అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని కవాత్రా తన బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పొరుగువారు.. ఇంట్లో కూర్చొని ఉన్న తనను చూసినప్పుడు తాను మరింత అవమానంగా ఫీలయ్యేవాడినని చెప్పారు.అయితే.. ఈ అనుభవం అతని జీవితానికి ఒక పాఠం నేర్పింది. పెద్ద కంపెనీలో ఉద్యోగం, అధిక జీతం ఇవన్నీ శాశ్వత భద్రత కాదని కవాత్రా గ్రహించారు. నేను నా జీవితాన్ని ఒక కార్పొరేట్ లోగోకు బానిసలా మార్చుకున్నాను, అని ఆయన అన్నారు. డిగ్రీలు ఒక స్థాయి వరకు మాత్రమే ఉపయోగపడతాయని, కానీ నైపుణ్యాలు జీవితాంతం విలువనిస్తాయని ఆయన గుర్తించారు.ఈ సంక్షోభం తర్వాత.. ఆయన తనలో కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రజలను ఎలా నిర్వహించాలి, వ్యాపారాన్ని ఎలా నడపాలి వంటి విషయాలను నేర్చుకున్నారు. క్రమంగా ఆయన కన్సల్టింగ్ రంగంలో అడుగుపెట్టి తన కెరీర్‌ను తిరిగి నిర్మించుకున్నారు.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 8,000 మందిపై ప్రభావం!ప్రస్తుతం ఆయన దేశంలోని అనేక పెద్ద ప్రాజెక్టులకు సలహాదారుగా పనిచేసినట్టు చెబుతున్నారు. రూ.6,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సలహాలు ఇచ్చారని, 19 రాష్ట్రాల్లో 65 కంపెనీలతో కలిసి పనిచేశారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి, ఇప్పుడు అనేక మందికి మార్గదర్శకుడిగా మారడం.. ఆయన ప్రయాణంలో గొప్ప విజయం అనే చెప్పాలి.
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
నా వయసు 32 సంవత్సరాలు. నాకు పెళ్లై 10 సంవత్సరాలు అయ్యింది. పెళ్లైన మొదటి నుంచే నా భర్తకు నా మీద అనుమానం ఉండేది. రెండు సంవత్సరాలుగా ఎక్కువైంది. ఆయన రాత్రంతా పడుకోకుండా మెలకువగానే ఉంటారు. నేను బయటికి వెళ్లి వచ్చినా, బాత్రూమ్కి వెళ్లి వచ్చినా, ఎక్కడికి వెళ్లినా గొడవ చేస్తారు.పెద్దలు సంపాదించిన ఆస్తి ఉండటం వల్ల ఆయనకు పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు. అందుకే ఉదయం పూటంతా ఇంట్లోనే ఉంటారు. రాత్రి పూట మాత్రం పడుకోకుండా నన్ను గమనిస్తూ ఉంటారు. అలాగే మా బంధువులు, నా అన్నదమ్ములు ఎవరైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడినా కూడా అనుమానిస్తారు. ఎవరితోనూ మాట్లాడనివ్వరు. కొన్నిసార్లు ఇంటికి తాళం వేసుకుని కూడా వెళ్తారు. ఆయనను హాస్పిటల్‌కి తీసుకువెళ్లడం కూడా చాలా కష్టంగా మారింది. మా అత్తమామలు కూడా ‘సర్దుకుపోమ్మా’ అని మాత్రమే అంటున్నారు. కానీ నా వల్ల ఇక కావడంలేదు. కేవలం కౌన్సిలింగ్ ద్వారా ఆయనను మార్చవచ్చా? ఎందుకంటే ఆయన మందులు వేసుకోవడానికి ఒప్పుకోరు. ఆయనను హాస్పిటల్‌కి తీసుకువచ్చి చికిత్స చేయించడానికి ఏదైనా మంచి సలహా ఇవ్వండి.– స్వర్ణ, నల్గొండమీ భర్త ప్రవర్తన కేవలం మామూలు పొసెసివ్ నేచర్’ మాత్రమే కాదు. ఇది ఒక తీవ్రమైన మానసిక సమస్య అయ్యే అవకాశం ఉంది. ఆధారాలు లేకపోయినా భార్యపై అనుమానం ఉండడం, రాత్రుళ్లు మెలకువగా ఉండడం, హింసించడం, ఎవరితో మాట్లాడనివ్వకపోవడం, బయటకు వెళ్లనివ్వకుండా ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లడం వంటి లక్షణాలు‘అనుమానం జబ్బు’ లేదా ‘ఒథెల్లో సిండ్రోమ్’ అనే మానసిక సమస్యలో భాగంగా కనిపించవచ్చు. ఇలాంటి సమస్యలు మెదడులో వచ్చే కొన్ని రసాయన మార్పులవల్ల రావచ్చు. అలాగే చిన్నతనంలో జరిగిన ట్రామా లేదా మనుషులపై నమ్మకం కోల్పోయే అనుభవాల వల్ల కూడా ఈవిధమైన సమస్యలు పెరగవచ్చు. ఇది కేవలం కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే తగ్గిపోయే సమస్యకాదు. కొన్నిసార్లు ఇలాంటి అనుమానాలు తీవ్రమై హింస, కొట్టడం, లేదా ప్రాణహాని వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకు చికిత్స అవసరం. ‘హాస్పిటల్‌కి వెళ్దాం’ అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు. అందుకే మొదట ‘స్ట్రెస్ ఎక్కువగాఉంది’ ‘నిద్ర సరిగ్గా రావట్లేదు కాబట్టి ఒకసారి డాక్టర్‌కు చూపించుకుందాం’ అనే విధంగా తీసుకురావడానికి ప్రయత్నించండి. హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత డాక్టర్లు మాట్లాడి అవసరమైన మందులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. మందులు కొంతకాలం క్రమంగా వాడితే, తర్వాత కౌన్సిలింగ్‌కు కూడా ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మందులు లేదా కౌన్సిలింగ్‌కు పూర్తిగా నిరాకరిస్తూ, హింసాత్మకంగా ప్రవర్తిస్తే, అవసరమైతే కుటుంబ సభ్యుల సహాయంతో బలవంతంగానైనా హాస్పిటల్లో చేర్చి చికిత్స చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు నిరుత్సాహ పడకండి. మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ తరపువాళ్లు, అలాగే మీ అత్తగారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయండి. సరైన వైద్యంతో ఈ సమస్య నుంచి మీ భర్తను పూర్తిగా బయట పడేయవచ్చు. షేక్ స్పియర్ రాసిన ఒథెల్లో నాటకంలో కూడా క«థ ఇలాంటిదే. అందుకే ఈ సమస్యను ‘కాంజుగల్ పారనోయియా’ లేదా ‘ఒథెల్లో సిండ్రోమ్’ అని అంటారు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
అలా చేస్తే భూమితల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది!
మా చేతిలో పాక్ ఓటమి బాధించింది: బంగ్లాదేశ్ కోచ్
ఉద్యోగాల కోతలపై జుకర్‌బర్గ్ వివరణ
విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం.. చివర్లో ట్విస్టు!
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్కరోజే 16 చిత్రాలు స్ట్రీమింగ్..!
లోన్ ఏజెంట్ల ఆగడాలకు చెక్.. ఆర్బీఐ కొత్త డ్రాఫ్ట్ రూల్
మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీ
సీఎస్కేకు చావో రేవో.. మ్యాచ్ హైలైట్స్
విరోష్ వెడ్డింగ్.. ఆ సీక్రెట్ రివీల్..!
కొత్త పల్సర్ ఎన్160 లాంచ్: ధర ఎంతంటే?
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
అలా చేస్తే భూమితల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది!
మా చేతిలో పాక్ ఓటమి బాధించింది: బంగ్లాదేశ్ కోచ్
ఉద్యోగాల కోతలపై జుకర్‌బర్గ్ వివరణ
విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం.. చివర్లో ట్విస్టు!
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్కరోజే 16 చిత్రాలు స్ట్రీమింగ్..!
లోన్ ఏజెంట్ల ఆగడాలకు చెక్.. ఆర్బీఐ కొత్త డ్రాఫ్ట్ రూల్
మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీ
సీఎస్కేకు చావో రేవో.. మ్యాచ్ హైలైట్స్
విరోష్ వెడ్డింగ్.. ఆ సీక్రెట్ రివీల్..!
కొత్త పల్సర్ ఎన్160 లాంచ్: ధర ఎంతంటే?
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఫొటోలు
వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్ (ఫోటోలు)
వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు
చిరంజీవి 158వ మూవీ లాంచ్ (ఫోటోలు)
తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)
‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
సింప్లీ సూపర్బ్ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)
ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఆధ్యాత్మికతలో అంబానీలు.. బెంగళూరు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సెంటర్లో సందడి (ఫొటోలు)
సినిమా
'మా పాపను కూడా ఎత్తుకోలేకపోయా..': రామ్ చరణ్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. ఈ మూవీ రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రల్లో అభిమానులను మెప్పించనున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఏ క్రీడ ఆడాలన్నా పెద్దినే అనే స్పోర్ట్స్ కాన్సెప్ట్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం పెద్ది మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా రెజ్లర్లతో సీన్ల గురించి వివరించారు. ఇసుకలో, ఎండలో షూటింగ్ చాలా కష్టంగా అనిపించలేదా అని బుచ్చిబాబ.. చెర్రీని ప్రశ్నించారు. దీనికి రామ్ చరణ్ బదులిస్తూ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే ఎలాంటి అలసట రాదన్నారు. అయితే కుస్తీలో చేయి పట్టి అదురు రావడంతో మా పాపను కూడా ఎత్తుకోలేకపోయానని తెలిపారు.మీరు నిజమైన పహిల్వాన్లను పెట్టారని రామ్ చరణ్ అన్నారు. వాళ్లు నటించమంటే.. రియల్‌గా ఆడేస్తున్నారని రామ్ చరణ్ గుర్తు చేశారు. తర్వాత మళ్లీ సారీ చెబుతున్నారని తెలిపారు. ఎందుకంటే వాళ్లలో నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది వాళ్లలో ఉంటుందని చెర్రీ వివరించారు. యాక్టింగ్ చేయమంటే వారికి అది రాదని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌లో మెప్పించనుంది.
ఓటీటీలో దురంధర్.. అభిమానులకు బిగ్ సర్ప్రైజ్..!
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.ఈ నేపథ్యంలోనే ఓటీటీ స్ట్రీమింగ్పై మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ నెల 22 నుంచి ఓటీటీలో అన్‌కట్ వర్షన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. రెండు ఓటీటీల్లోనూ ఒకేరోజు ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌తో జియోహాట్‌స్టార్‌లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ అన్‌కట్ వర్షన్ దాదాపు 3 గంటల 25 నిమిషాల పాటు ఉండనుందని మేకర్స్ రివీల్ చేశారు. దీంతో ధురంధర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)
‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లోని సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే రెండు భాగాలు (దృశ్యం, దృశ్యం 2) రాగా.. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో భాగం దృశ్యం 3 ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయిగే గత రెండు భాగాలను తెలుగులో హీరో వెంకటేష్ రీమేక్ చేయగా.. పార్ట్ 3 మాత్రం మలయాళ చిత్రాన్నే తెలుగు డబ్బింగ్ చేసి నేడు(మే 21) రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. దృశ్యం 2 ముగింపు సీన్‌తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్‌కుట్టి(మోహన్‌లాల్) వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. కోర్టు ఆదేశాలతో జార్జ్ ఫ్యామిలీపై ఎలాంటి కేసు నమోదు కాకుండా బయటపడతారు. తన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటననే కాస్త మార్పులు చేసి ఓ సినిమాను నిర్మిస్తాడు జార్జ్. అది రిలీజై..బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుంది. అదే సమయంలో మానసిన సమస్యలను నుంచి బయటపడిన పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. భార్య రాణి(మీనా) కూడా కూతురికి త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది. అయితే చాలా సంబంధాలు వచ్చినప్పటికీ.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంజు గురించి నెగెటివ్‌గా చెప్పడంతో అవన్నీ తప్పిపోతాయి. కొన్నాళ్ల తర్వాత తన కూతురికి వచ్చిన పెళ్లి సంబంధాలను ఇద్దరు చెడగొడుతున్నారనే విషయం తెలుస్తుంది? అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నారు? కొడుకు(వరుణ్)ని పోగోట్టుకున్న బాధ నుంచి బయటపడేందుకు అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్, ప్రభాకర్ మళ్లీ జార్జ్ లైఫ్‌లోకి ఎందుకు వచ్చారు? సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ సహదేవన్ చేసిన కుట్ర ఏంటి? వరుణ్ హత్య కేసు నుంచి కూతురిని తప్పించేందుకు ఈ సారి జార్జ్ వేసిన ప్లాన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. అనుకోకుండా జరిగిన హత్య కేసు నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకు పెద్దగా చదువులేని మధ్యతరగతి వ్యక్తి ఏం చేశాడు? అనేది ‘దృశ్యం’ కథ. ఈ ఒక్క లైన్‌తోనే ఇప్పటికే రెండు పార్టులు తీసి హిట్ కొట్టాడు దర్శకుడు జీతూ జోసెఫ్. అందుకే పార్ట్ 3పై ముందుగానే భారీ అంచనాలు పెరిగాయి. ఈ సారి ఎలాంటి ట్విస్టులు ఉంటాయి? కేసు నుంచి తన ఫ్యామిలీని జార్జ్ ఎలా బయటపడేస్తాడు? అనే క్యూరియాసిటీతో థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులను జీతూ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. ట్విస్టులు, సస్పెన్స్ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. వాటిలో కొత్తదనం కొరవడింది. చివరి అరగంట తప్ప మిగతా కథనం అంతా రొటీన్‌గానే ఉంటుంది. ఫస్టాఫ్ కథనం స్లోగా సాగుతూ.. సహనానికి పరీక్షగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం ప్రారంభంలో కూడా కథనం నెమ్మదిగానే సాగినప్పటికీ.. ఒక్కో పాత్ర ఎంట్రీతో కథపై ఆసక్తి పెరుగుతుంది. ఇక కూతురు పెళ్లి ఆపేదెవరని జార్జ్‌కి తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. అంజు అరెస్ట్ కోసం జరిగే కుట్రలు.. వాటిని తిప్పికొట్టేందుకు జార్జ్ వేసే ప్లాన్స్ అన్నీ అదిరిపోతాయి. చివరి అరగంట అయితే మళ్లీ ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ తరహాలో కథనం సీరియస్‌గా సాగుతూ.. తర్వాత ఏం జరుగుతుందా? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగించాడు దర్శకుడు. అక్కడ వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. ఎప్పటి మాదిరే మోహన్ లాల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జార్జ్‌కుట్టి పాత్రలో జీవించేశాడు. అతని భార్య రాణిగా మీనా చక్కగా నటించింది. ఇక కూతుళ్లుగా నటించిన ఇద్దరూ తమ తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. సహదేవన్, ప్రభాకర్ పాత్ర ధారులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్ బాగుంది. తెలుగు డబ్బింగ్ అస్సలు బాగోలేదు. డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఒకే ఒక్క ఫ్లాప్.. జ్యోతిక ముఖంపైనే తలుపేసిన బాలీవుడ్
జ్యోతిక సౌత్‌లో స్టార్ హీరోయిన్ అవడానికి ముందు బాలీవుడ్లో ట్రై చేసింది. డోలి సజాకే రఖ్నా (1998) చిత్రంతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది. అక్షయ్ ఖన్నా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తొలి సినిమాయే కలిసిరాకపోవడంతో బాలీవుడ్ తనకు మరో అవకాశమివ్వకుండా తలుపులు మూసేసింది. దాంతో తమిళంలో ట్రై చేసింది. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్గా రాణించింది.ప్రేమ- పెళ్లిఅయితే కెరీర్ ప్రారంభంలోనే ప్రేమలో పడింది జ్యోతిక. 'పూవెల్లం కెట్టుప్పార్' సినిమాలో సూర్యతో కలిసి నటించగా.. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వీరు జంటగా నాలుగు సినిమాల్లో యాక్ట్ చేయగా ఆ ప్రేమబంధం మరింత బలపడింది. 2006 సెప్టెంబర్ 11న తమ ప్రేమను వైవాహిక బంధంతో పదిలపర్చుకున్నారు. ఈ జంటకు కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం.ఆదరించని బాలీవుడ్పెళ్లయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈసారి బాలీవుడ్ నుంచే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు పొమ్మన్న బాలీవుడే ఈసారి రారమ్మని ఎర్ర తివాచీ పరుస్తోంది. దీని గురించి జ్యోతిక మాట్లాడుతూ.. నా ఫస్ట్ హిందీ చిత్రం ఆడనందుకు బాలీవుడ్ నా ముఖంపైనే తలుపేసింది. తమిళంలో కూడా నా మొదటి సినిమా ఆడలేదు. కానీ ఇక్కడ నా పనితనాన్ని మెచ్చి వరుస అవకాశాలిచ్చారు. అదే అక్కడికీ, ఇక్కడికీ తేడా!అదే ప్లస్, మైనస్అయితే అప్పటికీ, ఇప్పటికీ బాలీవుడ్లో చాలా మార్పు వచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాస్తున్నారు. దక్షిణాదిలో ఇంకా ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ లెక్కన ప్రతి ఇండస్ట్రీలో ప్లస్సులు, మైనస్సులు ఉన్నాయి అంది. కాగా జ్యోతిక నటించిన సిస్టమ్ సినిమా మే 22న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.చదవండి: డ్రాగన్ గ్లింప్స్ ఆల్‌టైమ్ రికార్డ్
క్రీడలు
ఇద్దరిదీ తప్పే!.. ఏడవలేక నవ్విన హార్దిక్ పాండ్యా!
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన ముంబై.. మరో ఓటమిని చవిచూసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌తో హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన ఈ ఆల్‌రౌండర్.. కోల్‌కతాతో మ్యాచ్‌లో 26 పరుగులు చేయడంతో పాటు.. రెండు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 13 పరుగులే ఇచ్చాడు. అయితే, వికెట్ మాత్రం తీయలేకపోయాడు.నిజానికి కేకేఆర్ ఇన్నింగ్స్‌లో పదో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రెండో బంతిని రోవ్‌మన్ పావెల్ గాల్లోకి లేపాడు. అప్పుడు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రాబిన్ మింజ్, దీపక్ చహర్ అలా చూస్తూ ఉండిపోయారే తప్ప బంతిని అందుకునే ప్రయత్నం చేయలేదు.ఈ క్రమంలో చహర్ స్పందించి ముందుకు రాగా బంతి నేలమీద పడిపోయింది. దీంతో హార్దిక్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఏడవలేక నవ్వినట్లుగా చప్పట్లు కొడుతూ వ్యంగ్య రీతిలో స్పందించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య కోల్‌కతా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 147 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. మనీశ్ పాండే (45), రోవ్‌మన్ పావెల్ (40) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకోగా.. ముంబై పదమూడింట తొమ్మిదో పరాజయం నమోదు చేసింది.𝐓𝐎𝐓𝐀𝐋 𝐌𝐈𝐒𝐂𝐎𝐌𝐌𝐔𝐍𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍 😱A shocking mix-up at deep-backward square leg as Deepak Chahar & Robin Minz both pull out of the catch. #TATAIPL Race to Playoffs 2026 👉 #KKRvMI | LIVE NOW ➡️ https://t.co/kVSpVvhylO pic.twitter.com/Gcg2H1ifmu— Star Sports (@StarSportsIndia) May 20, 2026
భారత జట్టులో మార్పు.. కేకేఆర్ స్టార్‌కు లక్కీ ఛాన్స్
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్‌కు సువర్ణావకాశం వచ్చింది. భారత్-‘ఎ’ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. హర్ష్ దూబే స్థానంలో శ్రీలంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్లతో జరిగే త్రైపాక్షిక సిరీస్‌కు అనుకుల్ రాయ్ ఎంపికయ్యాడు.హర్ష్ దూబే స్థానంలో..ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం వెల్లడించింది. కాగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే ఇటీవలే టీమిండియా నుంచి పిలుపు అందుకున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు, వన్డే సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు.కారణం ఇదేకాగా హర్ష్ దూబే జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. అయితే, అఫ్గన్‌తో సిరీస్ కంటే ముందు ప్రకటించిన భారత జట్టులో హర్ష్ దూబేకు చోటిచ్చారు సెలక్టర్లు. తాజాగా అతడి స్థానంలో అనుకుల్ రాయ్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.జార్ఖండ్‌కు చెందిన 27 ఏళ్ల అనుకుల్ రాయ్ స్పిన్ ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం గల ఈ ఆటగాడు ఐపీఎల్-2026లో కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికి 13 మ్యాచ్‌లు ఆడి 43 పరుగులు చేయడంతో పాటు.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.తిలక్ వర్మ సారథ్యంలోఇదిలా ఉంటే.. శ్రీలంకలో జరిగే వన్డే ముక్కోణపు సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో పాటు భారత్-‘ఎ’, అఫ్గన్-‘ఎ’ జట్లు పాల్గొంటాయి. జూన్ 9- జూన్ 21 మధ్య ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు డంబుల్లా వేదిక. ఇక ఈ సిరీస్‌లో భారత జట్టుకు హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ముక్కోణపు వన్డే సిరీస్‌కు భారత్-‘ఎ’ జట్టు (అప్డేటెడ్)తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుశ్ బదోని, నిశాంత్ సంధు, సూయాన్ష్ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్.
BCCI: రోహిత్ శర్మకు బై.. బై!.. వరల్డ్‌కప్ జట్టులోకి అతడు?
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ భవితవ్యంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. భారత్‌కు రెండు ప్రపంచకప్ ట్రోఫీలు అందించిన ఈ మాజీ కెప్టెన్.. వన్డే వరల్డ్‌కప్-2027లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించిన వివరాలే ఇందుకు కారణం.టైటిల్ గెలిచిన తర్వాత వేటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన తర్వాత అనూహ్య రీతిలో రోహిత్ శర్మ (Rohit Sharma)ను వన్డే కెప్టెన్సీ నుంచీ తప్పించింది బీసీసీఐ. ప్రస్తుతం కేవలం యాభై ఓవర్ల ఫార్మాట్లోనే హిట్‌మ్యాన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఐసీసీ టైటిల్ గెలిచిన తర్వాత అతడిపై వేటు వేసింది యాజమాన్యం.ప్రస్తుతం కేవలం బ్యాటర్‌గా కొనసాగుతున్న 39 ఏళ్ల రోహిత్ శర్మ ఊహించని రీతిలో సన్నబడ్డాడు. దాదాపు పది కిలోలకు పైగా బరువు తగ్గి ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో సత్తా చాటాడు. స్వదేశంలోనూ మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు.ఫిట్నెస్ సమస్యలుఇదిలా ఉంటే.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ఐపీఎల్లో రోహిత్ శర్మ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్న అతడు 2026 సీజన్లో తొడ కండరాల గాయం వల్ల కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్‌నెస్‌కు లోబడి ఈ సిరీస్‌లో పాల్గొంటాడని స్పష్టం చేశారు. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ సంచలన కథనం వెలువరించింది.బాగా సన్నబడ్డాడు.. కానీ రోహిత్ భవిష్యత్ గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు గత మూడు వారాల్లో రోహిత్ ఎప్పుడూ రిపోర్టు చేయలేదు. అతడు బాగా సన్నబడ్డాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడి శరీరం యాభై ఓవర్ల ఫార్మాట్‌కు సిద్ధంగా ఉందా? లేదా? అన్న అంశంపై ఆందోళన నెలకొంది.జట్టులో ఉంటే అతడు యాభై ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్ మాదిరి వన్డే క్రికెట్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ లేదు కదా!.. నలభై ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్న తరుణంలో రోహిత్ శరీరం ఎలా స్పందిస్తుందన్నది ముఖ్యం.రోహిత్‌కు బై.. బై!.. జైసూకు లైన్ క్లియర్!నిజానికి వరల్డ్‌కప్ టోర్నీకి ముందు ఆడే వన్డేల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కాబట్టి రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. ఇషాన్ కిషన్ ఇప్పటికే వన్డే జట్టులోకి వచ్చాడు.అతడు కూడా ఓపెనింగ్ చేయగలడు. వన్డే వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ ఫిట్నెస్ కారణాల దృష్ట్యా చోటు దక్కించుకోలేకపోయినా.. శుబ్‌మన్ గిల్ లేదంటే యశస్వి జైస్వాల్ గాయపడినా మరో బ్యాకప్ ఓపెనర్‌ను కూడా సిద్ధం చేసుకుంటే బాగుంటుంది’’ అని తెలిపినట్లు సదరు కథనం పేర్కొంది. అగార్కర్ సంకేతాలుకాగా చాలా ఏళ్లుగా.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ- ప్రస్తుత సారథి శుబ్‌మన్ గిల్ భారత వన్డే జట్టు ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల స్పందించే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ కంటే ముందు ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్కే తాము ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశాడు. తద్వారా రోహిత్‌కు ఉద్వాసన పలికి.. జైసూను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేస్తామనే సంకేతాలు ఇచ్చాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: హార్దిక్ పాండ్యాను శిక్షించిన బీసీసీఐ
క్రికెట్ బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులు
ఓ అంతర్జాతీయ క్రికెట్ బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పుల కలకలం రేగింది. క్రికెట్ కెనడా అధ్యక్షుడు అర్విందర్ ఖోసా నివాసం బయట గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో దుమారం రేపుతోంది.బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలోని న్యూటన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మే 20 తెల్లవారుజామున 4:40 గంటల సమయంలో ఖోసా ఇంటి వద్ద పలుమార్లు తుపాకీ కాల్పులు జరిగినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ఇంటి తలుపులు, కిటికీలపై బుల్లెట్ గుర్తులు కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సర్రే పోలీసులు.. ఎక్స్టోర్షన్ (దందా వసూళ్ల బెదిరింపులు)కు సంబంధించిన దాడిగా భావిస్తున్నారు. ఈ ఇంటికి సంబంధం ఉన్న వ్యక్తికి గతంలో ఎక్స్టోర్షన్ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో కెనడా క్రికెట్ చుట్టూ వివాదాలు పరిపాటిగా మారాయి. భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆ జట్టుపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఓ డాక్యుమెంటరీలో బయటపడిన వివరాల ప్రకారం.. 2026 ప్రపంచకప్‌లో భాగంగా కెనడా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌పై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ జరుపుతుంది. కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడిని టోర్నీకి ముందు ఆశ్చర్యకరంగా జట్టు కెప్టెన్‌గా నియమించడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది.పరిపాలనా సమస్యలు, ఆర్దికపరమైన అవకతవలు, ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఐసీసీ ఇటీవలే క్రికెట్ కెనడాకు ఆరు నెలలపాటు ఫండింగ్‌ను ఆపింది. ఇలాంటి తరుణంలో బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
న్యూస్ పాడ్‌కాస్ట్
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
బిజినెస్
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 196.63 పాయింట్లు లేదా 0.26 శాతం నష్టంతో 75,121.76 వద్ద, నిఫ్టీ 19.10 పాయింట్లు లేదా 0.081శాతం నష్టంతో 23,639.90 వద్ద నిలిచాయి.ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండో బోరాక్స్ & కెమికల్స్ లిమిటెడ్, గో ఫ్యాషన్ (ఇండియా) లిమిటెడ్, వీవర్క్ ఇండియా మేనేజ్మెంట్ లిమిటెడ్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఈప్యాక్ డ్యూరబుల్స్ లిమిటెడ్, సోమి కన్వేయర్ బెల్టింగ్స్ లిమిటెడ్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్, డిజిడ్రైవ్ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, వండర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
థాయ్‌లాండ్‌లో హాయిగా.. ఇక కొన్ని రోజులే!!
బ్యాంకాక్: భారతదేశంతో సహా దాదాపు 90 దేశాల ప్రయాణికులకు గతంలో కల్పించిన 60 రోజుల వీసా రహిత (Visa-Free) బస సదుపాయాన్ని ఉపసంహరించుకోవాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024లో ప్రవేశపెట్టిన ఈ పొడిగించిన వీసా రహిత బస పథకాన్ని రద్దు చేయడానికి థాయ్ క్యాబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు 'న్యూస్ రిఫార్మ్' సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.నిర్ణయానికి కారణాలు» ఇటీవలి కాలంలో విదేశీ పౌరులకు సంబంధించిన వరుస నేరాలే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. » విదేశీయులు పాల్గొంటున్న మాదకద్రవ్యాల నేరాలు, లైంగిక అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) కేసులు పెరిగిపోవడం.» సరైన అనుమతులు లేకుండా హోటళ్లు, పాఠశాలలతో కూడిన వ్యాపారాలను చట్టవిరుద్ధంగా నిర్వహించడం.» కొంతమంది సందర్శకులు ఈ పొడిగించిన వీసా రహిత పద్ధతిని తమ అక్రమ కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు థాయ్ అధికారులు గుర్తించారు.భారతీయ ప్రయాణికులకు ఏం మారనుందంటే..ఈ తాజా నిర్ణయంతో భారతీయ ప్రయాణికులు 2024లో తాత్కాలిక 60 రోజుల మినహాయింపు రాకముందు ఉన్న పాత నిబంధనల్లోకి మారిపోతారు. మునుపటి ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఇకపై థాయ్‌లాండ్‌లో గరిష్టంగా 30 రోజులు మాత్రమే వీసా లేకుండా ప్రవేశించడానికి, బస చేయడానికి అనుమతి ఉంటుంది.పర్యాటక రంగం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావంథాయ్లాండ్ జీడీపీలో పర్యాటక రంగం వాటా 10% కంటే ఎక్కువ. ఇది అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చోదకశక్తిగా ఉంది. ప్రభుత్వం ఈ సంవత్సరం సుమారు 3.35 కోట్ల మంది అంతర్జాతీయ సందర్శకులను స్వాగతించాలని భావిస్తోంది. ఇది గత సంవత్సరం నమోదైన దాదాపు 3.3 కోట్ల మంది రాకపోకల కంటే స్వల్ప వృద్ధి. థాయ్‌లాండ్ పర్యాటక, క్రీడల మంత్రిత్వ శాఖ నుండి అందిన తాజా డేటా ప్రకారం, 2026 మొదటి త్రైమాసికంలో విదేశీ రాకపోకలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 2.3% నుండి 3.4% వరకు తగ్గాయి.
ఆ ఒక్క ప్రశ్నతో సీనియర్ ఉద్యోగిపై వేటు!
‘సార్, తర్వాత ఏం చేయాలో చెప్పండి?’-ఏదైనా ఆఫీసులో ఒక ఉద్యోగి తన పైఅధికారిని అడిగే అత్యంత సాధారణ ప్రశ్న ఇది. కానీ, నోయిడాకు చెందిన ఒక ప్రముఖ స్టార్టప్ సీఈవోకు మాత్రం ఈ ప్రశ్న తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎంతలా అంటే, ఆ ప్రశ్న అడిగినందుకు ఏకంగా ఒక సీనియర్ ఉద్యోగినే కొలువులోంచి తొలగించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్ఇన్ వేదికగా కార్పొరేట్ కార్యాలయ సంస్కృతి, నాయకత్వ లక్షణాలపై చర్చకు దారితీసింది. ఆస్ట్రాలజీ స్టార్టప్ ‘ఇన్‌స్టాఆస్ట్రో’ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ వర్మ స్వయంగా లింక్డ్ఇన్లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.‘నిన్ను ఉద్యోగంలో పెట్టుకుంది ఇందుకేనా?’లింక్డ్ఇన్ పోస్ట్‌లో నితిన్ వర్మ ఈ సంచలన నిర్ణయాన్ని పంచుకుంటూ, తానే స్వయంగా ఆ సీనియర్ ఉద్యోగిని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరించారు. ‘నేను ఒక ఉద్యోగిని తొలగించాను. ఎందుకంటే అతను నా దగ్గరకు వచ్చి.. సార్, తర్వాత ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు’ అని వర్మ రాసుకొచ్చారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకుంటూ.. ‘నేను వెంటనే అతని పనితీరును, ధోరణిని ప్రశ్నించాను. దానికి ఆ ఉద్యోగి సార్, నాకంటే మీకే బాగా తెలుసు కదా అని సమాధానమిచ్చాడు. అప్పుడు నేను.. అసలు నిన్ను ఈ ఉద్యోగంలోకి ఎందుకు నియమించుకున్నట్లు? అని అడిగాను’ అని వర్మ పేర్కొన్నారు.పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా..సదరు ఉద్యోగిని ఒక నిర్దిష్ట విభాగానికి పూర్తి బాధ్యుడిగా, స్వతంత్రంగా వ్యవహరించడానికి భారీ ప్యాకేజీతో నియమించుకున్నట్లు సీఈవో స్పష్టం చేశారు. కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో తాను జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఆ నియామకం జరిగిందని తెలిపారు. సదరు సీనియర్ నిపుణుడికి మొదటి రోజు నుంచే ఎలాంటి మైక్రో మేనేజ్మెంట్, అప్రూవల్ చెయిన్ లేకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. వ్యవస్థాపకులు లేదా మేనేజర్ల నుంచి నిరంతరం సూచనల కోసం వేచి చూడకుండా.. సమస్యలను ముందుగానే గుర్తించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడమే సీనియర్ ఉద్యోగుల బాధ్యత అని వర్మ వాదించారు.అది వ్యక్తిగతంగా రావాల్సింది!కార్యాలయంలో ఓనర్షిప్ (కంపెనీని తనదిగా భావించి పనిచేసే యాజమాన్య మనస్తత్వం) అనేది కాలక్రమేణా నాయకులు ఉద్యోగులకు నేర్పించే నైపుణ్యం కాదని, అది వ్యక్తిగతంగా రావాల్సిన మనస్తత్వమని వర్మ అభిప్రాయపడ్డారు. ‘మీరు యాజమాన్య బాధ్యతను ఎవరికీ బలవంతంగా ఇవ్వలేరు. ఉంటే వారే ఆ బాధ్యతతో ముందుకు పరిగెడతారు, లేదంటే వారు దానిని ఎప్పటికీ చేరుకోలేరు. యాజమాన్య బాధ్యత లేని స్వేచ్ఛ కేవలం గందరగోళానికి దారితీస్తుంది. ఏం ఆలోచించాలో కూడా నేనే చెప్పాల్సి వస్తే.. అలాంటి వ్యక్తులతో నేను సంస్థను నిర్మించలేను’ అని సీఈవో నితిన్ వర్మ స్పష్టం చేశారు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ వైరల్ కావడంతో లింక్డ్ఇన్ వినియోగదారులు, హెచ్ఆర్ నిపుణులు సీఈవో నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక సీనియర్ నిపుణుడికి కూడా కంపెనీ ప్రాధాన్యతలు, భవిష్యత్తు వ్యూహాలపై స్పష్టత అవసరమని వాదిస్తున్నారు. ఎంత సీనియర్ అయినా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు వ్యవస్థాపకుడి విస్తృత వ్యూహానికి అనుగుణంగా ఉండాలని భావిస్తారు. అందుకోసమే చర్చలు జరుపుతారు అని కొందరు చెబుతున్నారు. సీనియర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, ప్రతి చిన్న విషయానికి అనుమతులు లేదా స్పష్టత కోసం వ్యవస్థాపకుడిపై ఆధారపడకూడదని ఇంకొందరు అంటున్నారు.ఇదీ చదవండి: భారత్‌లో మరో స్టోర్‌కు సన్నాహాలు!
తొలగించిన ఆ 8 వేల మందికి మెటా ఇచ్చేది ఇదే..
టెక్ దిగ్గజం 'మెటా' (Meta) పెద్ద ఎత్తున పునర్నిర్మాణ ప్రక్రియను చేపడుతూ, దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. ఇది కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో 10 శాతానికి సమానం. ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి మెటాలో సుమారు 78,000 మంది ఉద్యోగులు ఉన్నారు. టెక్ పరిశ్రమలో ఈ లేఆఫ్‌లు తీవ్ర సంచలనం సృష్టించినప్పటికీ, తొలగించిన ఉద్యోగుల కోసం మెటా ప్రకటించిన తొలగింపు ప్యాకేజీ (Severance Package) అందరి దృష్టిని ఆకర్షించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం అమెరికా ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..బేస్ పే: 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా రెండు వారాల వేతనాన్ని సీవెరన్స్ ప్యాకేజీగా అందిస్తారు.ఆరోగ్య సంరక్షణ: ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఉచిత ఆరోగ్య సంరక్షణ కవరేజీని కొనసాగిస్తారు.అంతర్జాతీయ ఉద్యోగులు: యూఎస్ వెలుపల ఉన్న ఉద్యోగులకు వారి దేశాల నిబంధనలను బట్టి ఇలాంటి ప్రయోజనాలే అందుతాయి.ఏఐ బృందాల్లోకి పునర్వ్యవస్థీకరణఉద్యోగాల కోతతో పాటు కంపెనీ అంతర్గతంగా మరో పెద్ద మార్పు చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ-కేంద్రీకృత బృందాల్లోకి 7,000 మందికి పైగా ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ ప్రకటించారు. ఈ తొలగింపులు, అంతర్గత బదిలీల వల్ల మెటాలోని మొత్తం శ్రామిక శక్తిలో 20% మంది ప్రభావితం కానున్నారు."మేము ఇప్పుడు వేగంగా, ఎక్కువ యాజమాన్య బాధ్యతలతో దూసుకుపోగల చిన్న బృందాలతో కూడిన నిర్మాణంతో పనిచేసే దశకు చేరుకున్నాము" అని రాయిటర్స్ పరిశీలించిన ఒక మెమోలో జానెల్ గేల్ పేర్కొన్నారు.వ్యూహాత్మక మార్పులు - భారీ ఖర్చులుఅంతర్గత పని విధానం, ఉత్పత్తులు రెండింటిలోనూ 'ఏఐ ఏజెంట్లను' కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నంలో భాగంగానే మెటా ఈ వ్యూహాత్మక మార్పులు చేస్తోంది. ఇందుకోసం ఏఐ(AI)లో పెట్టుబడులను భారీగా పెంచుతోంది. కొత్త ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం, అధిక మెమరీ ధరల కారణంగా ఈ ఏడాది మెటా మూలధన వ్యయాలు ఏకంగా 145 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని కంపెనీ తెలిపింది.మరోవైపు, 2026 ద్వితీయార్థంలో మెటా మరిన్ని ఉద్యోగ కోతలను ప్రకటించే అవకాశం ఉందని అంచనా. అయితే దీని సమయం, పరిధిపై ఇంకా స్పష్టత లేదు. కాగా, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గత కొన్ని ఏళ్లుగా మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే 2022, 2023 లలో ఇప్పటికే 20,000 ఉద్యోగాలను తగ్గించారు.
ఫ్యామిలీ
లబ్... డబ్బు లయ తప్పొద్దు!
ధరల భయం అంటే... కుటుంబ నిర్వహణ భయం. కుటుంబ నిర్వహణ భయం అంటే... గృహిణి భయం. భర్త సంపాదిస్తాడు సరే... సరిపెట్టాల్సిన బాధ్యత తనదే కదా. అందుకే ఇటీవల ఆదాయం ఉన్నా, లేకున్నా మహిళలు ‘ఫైనాన్షియల్ యాంగ్జయిటీ’తో బాధపడుతున్నారు. దీనిని ఎలా ఎదుర్కొనాలి? రెండు కేస్ స్టడీస్ చూడండి.కేస్ స్టడీ1లత హౌస్‌వైఫ్. వయసు 42 ఏళ్లు. భర్త ప్రైవేట్ ఉద్యోగం. ఇద్దరు పిల్లలు ఇంటర్, డిగ్రీ. నెల జీతం అరవై వేలు. అప్పుల్లేవు, సొంత ఫ్లాట్ ఉంది. కానీ లతకి ప్రతి నెలా ఒకటవ తారీఖు వచ్చిందంటే గుండె దడ. జీతం పడిన వెంటనే లెక్కలు మొదలైపోతాయి. వెచ్చాలు, మెయింటెనెన్సు, ఇంటర్నెట్ బిల్లు, ఓటీటీ బిల్లు, పాలబిల్లు... కరెంట్... వంటగ్యాస్... పిల్లల ఫీజు... భర్తకు పెట్రోలు ఖర్చు, అత్తగారికి మావగారికి పంపాల్సినవి... ‘డబ్బులు సరిపోతాయా... రేపటికి మిగులుతాయా’... దాంతో యాంగ్జయిటీ మొదలు.సింప్టమ్స్యాంగ్జయిటీ వల్ల అదుపులేని చర్యలు మొదలవుతాయి. కూరగాయలు తగ్గించి కొనడం, కొత్త చీర కొనుక్కోకపోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతి గంటకి చెక్ చేయడం, రేపు ఆయన ఉద్యోగం పోతే అని ప్రతి రోజూ ఊహించుకుని ఏడవడం. దాంతో అసిడిటీ, తలనొప్పి, షుగర్ లెవెల్స్ పైకి కిందకి. భర్త ‘అన్నీ నేను చూసుకుంటా కదా’ అన్నా ఆవిడ భయం తగ్గలేదు. ఎందుకంటే సమస్య డబ్బు కాదు, మైండ్ మీద కంట్రోల్ లేకపోవడం. భర్త ఇది చూసి చూసి కౌన్సిలర్‌తో మాట్లాడించాడు. «ధరలు పెరగడం అందరికీ ఉన్న సమస్యే. నీ ఒక్కదానికే కాదు’ అని ఆమెకు అవగాహన కల్పించారు. కౌన్సిలర్ సలహాలతో లత మారింది.లత చేసిన మార్పులు...మనీ డేట్... అంటే నెలకు ఒకసారి భర్తతో కూర్చుని ముప్పై నిమిషాలు లెక్కలు మాట్లాడుకుంది. ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత మిగిలింది... దాచడం, దాపరికం లేదు. ఈ పారదర్శకత వల్ల భయం తగ్గింది. ‘ఎమర్జెన్సీ ఫండ్’ పేరుతో బ్యాంకులో 50 వేలు ఎఫ్.డి. వేసి దానికి ‘హాస్పిటల్/జాబ్ ప్రాబ్లమ్ ఫండ్’ అని పేరు పెట్టుకుంది. ఆ డబ్బు ముట్టుకోకూడదు. ఆ పేరు చూడగానే బుర్రకి ధైర్యం. వర్రీ టైమ్ ఫిక్స్ చేసింది. అంటే రోజంతా డబ్బు గురించి ఆలోచించడం మానేసి సాయంత్రం 6 నుంచి 6:15 వరకు మాత్రమే ‘డబ్బు కష్టాలు’ ఆలోచించేది. టైం అయిపోగానే బలవంతంగా ఆపేసేది. మెల్లగా ఈ మంత్రం పని చేసింది. లత కోలుకుంది. మనం జాగ్రత్తగా ఉంటే అంత ఆందోళన చెందాల్సింది లేదు. అందరితో పాటుగా మనం కూడా ఆర్థిక గండాలను తట్టుకుంటూ ముందుకుపోవచ్చు అని భరోసా కలిగింది.కేస్ స్టడీ 2కవిత వర్కింగ్ ఉమన్. వయసు 35 ఏళ్లు. సింగిల్ విమెన్. తల్లిదండ్రులు, తమ్ముడి చదువు అన్నీ ఆవిడ సంపాదనే. నెల జీతం 80 వేలు. పైకి ‘లేడీ బాస్’. కానీ లోపల మాత్రం వణుకు. కవిత సమస్య ఏమిటంటే ‘గోల్డెన్ హ్యాండ్‌కఫ్స్ యాంగ్జయిటీ’. అంటే జాబ్ నచ్చకపోయినా మానేయలేని పరిస్థితి. బంగారు సంకెళ్లు. ‘నేను ఉద్యోగం మానేస్తే ఇల్లు గడవదు’ అనే ప్రెజర్. బయట పరిస్థితులు బాగా లేవు అనే ఆందోళన.సింప్టమ్స్స్లీప్ రివెంజ్... అంటే నిద్ర మీద పగ. రాత్రి 2 వరకు ఫోన్ చూడటం. ‘పగలంతా నాది కాదు, రాత్రైనా నాది అవ్వాలి’ అనే ఫీలింగ్. ఇంపల్స్ షాపింగ్... అంటే స్ట్రెస్‌లో రెండు వేలు మూడు వేలకు ఆన్ లైన్ షాపింగ్ చేసి, తర్వాత గిల్టీ ఫీల్ అవ్వడం. రిజెక్షన్ సెన్సిటివిటీ:... అంటే బాస్ చిన్న మాట అన్నా ‘నన్ను తీసేస్తారేమో’ అని ఏడవడం. ఫ్యూచర్ బ్లైండ్నెస్... ‘పెళ్లి, పిల్లలు వద్దు. డబ్బు సరిపోదు’ అని జీవితాన్ని పోస్ట్‌పోన్ చేయడం.కవిత కలీగ్ ఇదంతా గమనించింది. కవితను కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లింది. ‘అంతా నార్మల్‌గా ఉన్నా అనవసర ఆందోళనతో బాధపడుతున్నావు’ అని కౌన్సిలర్ చిన్న సూచనలు చేసింది.కవిత చేసిన మార్పులు...ఒన్ పర్సెంట్ రూల్... అంటే తన జీతంలో ఒన్ పర్సెంట్ అంటే 800 తన సంతోషం కోసం అప్పుడప్పుడు ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. కాఫీ, పుస్తకం, మూవీ... ‘నేను కేవలం ఏటీఎం కాదు, మనిషిని’ అని గుర్తుచేసుకోవడానికి స్కిల్ ఇన్సూరెన్స్... అంటే వీకెండ్లో రెండు గంటలు ఫ్రీలాన్స్ కోర్స్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ‘ఈ జాబ్ పోయినా నేను బతకగలను’ అనే ధైర్యం కోసం. జాబ్ కంటే స్కిల్ మీద నమ్మకం పెంచుకుంది. నో–బడ్జెట్ డే... నెలకు ఒక రోజు బడ్జెట్, లెక్కలు, ఫోన్లో బ్యాంక్ బేలెన్స్ చూడకూడదు. ఆ రోజు బుర్రకి హాలిడే. దీనివల్ల మిగతా 29 రోజులు బుర్ర కంట్రోల్లో ఉంటుంది. ఆరు నెలల తర్వాత కవిత మొదటిసారి మూడు రోజులు గోవా వెళ్లొచ్చింది. ‘అదే సంపాదన. ఆరు నెలలు కొంచెం కొంచెం దాచాను. నా వల్ల అయ్యింది’ అని ఏడ్చేసింది ఎయిర్‌పోర్ట్‌లో. డబ్బు భయం ‘పేదవాళ్ల’ సమస్య మాత్రమే కాదు. బ్యాంక్‌లో లక్షలు ఉన్నవాళ్లకు కూడా ఫైనాన్షియల్ యాంగ్జైటీ ఉంటుంది. ఇది పర్సు సమస్య కాదు, ‘పర్సనల్ సెక్యూరిటీ’ ఫీలింగ్ సమస్య. దీన్ని మందులతో కాదు, మనసుతో గెలవాలి.కుటుంబం ఏం చేయాలి?భర్త, భార్య, పిల్లలు... ఇంట్లో అందరికీ బేసిక్ లెక్కలు తెలియాలి. భారం ఒక్కరి మీద పడితే యాంగ్జైటీ వస్తుంది. ప్రతి సమస్యను అందరూ చర్చించుకుంటే ఏవి కొనసాగించాలో ఏవి వదులుకోవాలో అందరికీ తెలుస్తుంది. ఫైనాన్షియల్ యాంగ్జయిటీతో రోజూ ఏడుపు, గుండె దడ, నిద్ర లేకపోవడం రెండు వారాలకు మించి ఉంటే – సైకాలజిస్ట్‌ని కలవండి. డబ్బు ప్లానింగ్ రాకపోతే సెబి రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలవండి. ఇందులో సిగ్గు పడాల్సింది ఏమీ లేదు.
కనిపించని కథ...గాలి బలమెంత!?
వేసవిలో వేడికి చల్లని గాలి మేనికి తగిలితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అదే గాలి ఉదృతమైతే చెట్ల కొమ్మలు ఊగడం, తలుపులు కిటికీలు టపటప కొట్టుకోవడం, తేలిక΄పాటి వస్తువులు ఎగరడం.. ఇవన్నీ చూస్తుంటాం. కానీ, ‘గాలి కంటికి కనిపించదు, ప్రపంచాన్ని మాత్రం కదిలిస్తుంది..’ అంతటి శక్తిమంతమైనది. ఇలా మన కళ్ల ముందు కనిపించే వస్తువులను చూపుతూ, కనపడని గాలిని పరిచయం చేయవచ్చు. పిల్లల వయసును బట్టి, అనేకానేక విషయాలను ఉదహరిస్తూ ‘గాలి’బలం గురించి చెప్పవచ్చు. తెలుసుకోమనవచ్చు. వారికి తెలిసింది తమ క్రియేటివిటీతో చూపమనండి. 1. కనిపించని కథ... గాలి కంటికి కనిపించదు. అయితే చెట్ల కొమ్మలు ఎందుకు ఊగుతాయి, కర్టెన్ ఎందుకు కదులుతుంది, ఉక్క΄ోస్తున్నప్పడు ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది.. ఇవన్నీ చెప్పడంతోపాటు ఒక పేపర్ తీసుకుని నోటితో ఊది కదిలించమనండి. టేబుల్ ఫ్యాన్ ముందు రిబ్బన్ కట్టి ఎలా ఊగుతుందో చూపించండి. కారులో ఏసీ లేకుండా డోర్స్ అన్నీ లాక్ చేసి, కాసేపు ఉంటే ఏమవుతుందో చెప్పమనవచ్చు. ఈ విధానం వల్ల ఊపిరిని నిలిపే ్ర΄ాణవాయువును ఎన్నో రూపాలుగా కళ్ల ముందు ఆవిష్కరింపజేయవచ్చు అనే విషయం పిల్లలకు అర్ధమవుతుంది. 2. విండ్మిల్.. గాలి పటం... గాలి బలంగా ఉంటే విండ్మిల్ ఎలా తిరుగుతుందో చూపించవచ్చు. బెలూన్‌లో గాలి నింపి, బయటకు వదలమని చెప్పవచ్చు. గాలిపటం ఎందుకు ఎగురుతుంది? గాలి లేక΄ోతే ఏమవుతుంది? పక్షులు గాలిని ఎలా ఉపయోగిస్తాయి? పిల్లలతో చిన్న గాలిపటం డ్రా చేయించండి లేదా తయారు చేయించండి. 3. శుభ్రమైన గాలి... వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ గాలిని ఎందుకు కలుషితం చేస్తుంది. చెట్ల వల్ల గాలి ఎలా శుభ్రపడుతుంది? మొక్కల పెంపకం ప్రాధాన్యత, గాలి వేగం పెరిగితే ఏమవుతుంది? తుఫాన్లు ఎలా వస్తాయి, సుడిగాలులు ఎలా ఉత్పన్నమవుతాయి... గాలిపైన ఎవరెన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయదగితే అన్నీ చేయమనండి.4. ఊహలకు రూపం... గాలికి కోపం వస్తే.. ఊహాకథలు చెప్పమనండి. పాటలు పాడమనండి. ఒక చిన్న వ్యాసం రాయమనండి. పంచభూతాలను తమ సృజనాత్మక కోణంలో ఎలా చూపుతారో ఛాయిస్ వారికే ఇవ్వండి. ఈ విధానం వల్ల కాలుష్యకార కాలను పిల్లలు గుర్తించగలుగుతారు. పర్యావరణంలో తమ పాత్రను తెలుసుకోగలుగుతారు. సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. (‘ఫైవ్ ఎలిమెంట్స్’పై పిల్లల చేత డ్రాయింగ్, కార్టూన్, నాటకం, పాట, కవిత్వం, రచన.. ఇలా వారి వయసును బట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో చేయమనండి. ఆ వి‘చిత్రాల’ను మాకు పంపించండి. ఊరు, పేరు, ఫొటోతో సహా ప్రచురిద్దాం. మెయిల్ ఐడి sakshisummerkids@gmail.com) నిర్వహణ: నిర్మలారెడ్డి(చదవండి: సైబర్ మోసంతో అకౌంట్ ఫ్రీజ్ అయితే...)
సైబర్ మోసంతో అకౌంట్ ఫ్రీజ్ అయితే...
గుర్తు తెలియని వ్యక్తులు నా బ్యాంకు ఖాతాలో 500 రూపాయలు జమ చేశారు. వాళ్లు సైబర్ నేరగాళ్ళు, ఆ నగదు ఆన్లైన్ మోసం ద్వారా వచ్చింది కాబట్టి నా బ్యాంకు ఖాతా కూడా సీజ్ చేస్తున్నాము అని పంజాబ్ సైబర్ క్రైమ్ వారు నా అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. అలా ఫ్రీజ్ చేసేవరకు ఈ 500 నా అకౌంట్లోకి వచ్చాయి అన్న విషయం కూడా నాకు తెలియదు. పంజాబ్ పోలీసులను సంప్రదించగా, వారు చెప్పిన విధంగానే అన్ని పత్రాలను, అఫిడవిట్‌ను – నా వ్యక్తిగత వివరాలతో సహా సమర్పించాను. ఇది జరిగి ఇప్పటికి పదినెలలు అవుతుంది కానీ ఇంతవరకు నా అకౌంట్‌ను రిలీజ్ చేయకపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బ్యాంకువారిని అడిగితే పంజాబ్ కోర్టులో కేసు వేసుకోవాలి అని చెప్తున్నారు. పంజాబ్‌కి వెళ్లి కేసులు వేయడం చాలా కష్టం – అంత ఖర్చు పెట్టడం కూడా ఇబ్బంది. సలహా ఇవ్వగలరు. – చీమకుర్తి సునీల్ కుమార్, విజయవాడపంజాబ్ పోలీసులు మిమ్మల్ని నిందితుడిగా చూపిస్తూ ఏదైనా ఎఫ్.ఐ.ఆర్. చేశారా అనే విషయం ముఖ్యమైనది. మీ మీద నేరుగా నింద లేకుండా, మీ పేరును ఎటువంటి ఎఫ్.ఐ.ఆర్.లో నిందారోపితుడుగా చూపించకుండా ఉంటే మీరు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అయితే మీ బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్ హైదరాబాదులో కూడా ఉండాలి. పైన తెలిపిన అంశాలు మీ కేసులో ఉండి ఉంటే, బ్యాంకు వారు చెప్పినట్టుగా పంజాబ్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. పూర్వం కోర్టు పరిధి ఏది వస్తుంది అనే విభేదం కొంత ఉన్నప్పటికీ, అనేక హైకోర్టులు ఇలాంటి బ్యాంక్ ఫ్రీజింగ్ కేసులలో వేరే రాష్ట్రాల పోలీసుల ద్వారా ఫ్రీజ్ చేసిన అకౌంట్లను విడుదల చేయాల్సిందే అని తీర్పులు ఇచ్చాయి. కాబట్టి తెలంగాణ హైకోర్టును రిట్ పిటిషన్ ద్వారా ఆశ్రయించండి. అలా వెళ్ళేముందు మీ ఎకౌంటు ఫ్రీజ్ అయిన కారణానికి గల పత్రాలను, ముఖ్యంగా ఎఫ్.ఐ.ఆర్.ను– పంజాబ్ పోలీసులు బ్యాంకు వారికి పంపిన లేఖలను క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు చెప్పినట్లుగా 500 మాత్రమే మీ అకౌంట్‌కు వచ్చి ఉంటే – అంతమొత్తాన్నే మీ అకౌంట్లో ఫ్రీజ్ /లీన్ ఉంచి మిగతా నగదును వాడుకునేలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చే ఆస్కారం ఉంది. లాయర్ గారితో ఈ విషయాలను మాట్లాడండి. ఇలాంటి గుర్తు తెలియని ట్రాన్సాక్షన్లు వచ్చిన వెంటనే బ్యాంకు వారికి లిఖితపూర్వకంగా చెప్పడం కొంతవరకు మిమ్మల్ని కాడుతుంది. - శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )చదవండి: 'థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమే..
కేన్స్‌లో నటి రుచి గుజ్జర్ రాజస్థాన్ లుక్..! దీని వెనుక ఇంత ఆంతర్యం ఉందా?
ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ‘కేన్స్’ సీజన్!. పేరుకి ఫిల్మ్ ఫెస్టివల్ కానీ ఈ ప్రపంచ వేదికపై లింగ సమానత్వం, శరీర సౌందర్యం పట్ల సానుకూల దృక్పథం నుంచి రాజకీయ సందేశాలు, సంస్కృతి వరకు చర్చలకు దారితీసేలా వెలుగులోకి వస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫ్యాషన్ అనేది ఉద్దేశ్యంతో కూడిన వ్యక్తిగ భావప్రకటనగా మారింది. ఈ ఏడాది చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ వేదికపై భారతీయతను చాటిచెప్పేలా దుస్తులను ధరించి అదర్నీ ఆకర్షించారు. తాజాగా ఆ జాబితాలోకి మరో బాలీవుడ్ నటి రుచి గుజ్జర్ కూడా చేరిపోయారు.ఈ రెడ్‌కార్పెట్‌పై ఆమె రాజస్థానీ సాంప్రదాయ దుస్తులతో మెరిసే అందర్నీ ఆశ్చర్యపరిచడం విశేషం. రుచి రాజస్థానీ మహిళలా 'ఘూంఘట్' ధరించే వచ్చింది. నిజానికి ఈ ఘూంఘట్'ని రాజస్థాన్‌లో మహిళలు తమ ముఖాన్ని లేదా తలని కప్పుకోవడానికి ఉపయోగించే ముసుగు లేదా వస్త్రాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ నటి రుచి సరికొత్త సందేశం ఇచ్చేలా ధరించడం విశేషం. ఆ స్టైలింగ్ వెనుక ఉన్న అర్థం..రాజస్థాన్ సాంస్కృతిక మూలాలకు సంబంధించిన స్టైలింగ్ వచ్చిన రుచి ఒక లోతైన సందేశాన్ని అందించేందుకు ఇలా రెడ్‌కార్పెట్‌పైకి వచ్చారట. రాజస్తాన్‌లోని అనేక గ్రామీణ ప్రాంతాలలో బలవంతపు ఘూంఘట్ పద్ధతులపై దృష్టిని ఆకర్షించడానికి ఈ ఆహార్యంలో వచ్చారామె. రుచి తన రూపం ద్వారా మనం సంప్రదాయాన్ని ఎంచుకోవడానికి, సామాజిక ఒత్తిడి కారణంగా బలవంతంగా పాటించాల్సి రావడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారామె. రుచి దుస్తులను రూపా శర్మ డిజైన్ చేశారు. ఇవి వారసత్వాన్ని, ప్రతికాత్మకతను సమతుల్యం చేశాయి. ఇక్కడ రుచి వీటిని ప్రతిఘటనకు చిహ్నంగా ధరించింది. ఒక మహిళ గౌరవం, సమానత్వం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ నుంచి రావాలే తప్ప ముఖం దాచుకోవడం నుంచి కాదని చెప్పేందుకే ఇలా ఆ వేదికపైకి వచ్చినట్లు పేర్కొందామె. ఈ కేన్స్ వేడుకలో తన ఉనికి ఒత్తిడిలో చిక్కుకున్న మహిళల గురించి ఒక్క చర్చనైనా ప్రారంభించగలిగితే, అప్పుడు ఈ నడకకు ఫ్యాషన్‌కు మించిన అర్థం ఉంటుందని అంటోందామె. తన ఘూంఘట్ లొంగిపోవడం కాదని, ఇది నిరసన అని తేల్చి చెప్పారామె. రాజస్థాన్‌కు చెందిన రుచి ఈ సమస్య తనకు వ్యక్తిగతంగా సంబంధించినదని అన్నారామె. సంస్కృతి మహిళలకు సాధికారత కల్పించాలి, వారిని తుడిచిపెట్టకూడదు. సంప్రదాయం కాలంతో పాటు పరిణామం చెందాలి. గౌరవం ఎప్పటికీ అదృశ్యం కావాలని కోరకూడదు అని అన్నారామె. కాగా రుచి గుజ్జర్ కేన్స్ ఇలా ప్రత్యేకమైన లుక్‌తో రావడం తొలిసారి కాదు. గతేడాది మెరిసే బంగారు, అద్దాలతో కూడిన లెహంగానూ, దానికి జతగా బరువైన కుందన్ ఆభరణాలతో కూడిన మోదీ చిత్రంతో ఉన్న లాకెట్లను ధరించి అందర్నీ విస్తుపోయేలా చేసిందామె. View this post on Instagram A post shared by Ruchi Gujjar (@ruchigujjarofficial) (చదవండి: 'కూతురు' అత్తారింటికి అప్పగించే వస్తువా? గాయని చిన్మయి శ్రీపాద ఫైర్)
అంతర్జాతీయం
విమానాల కూల్చివేత కేసు.. రావుల్ కాస్ట్రోకు అమెరికా షాక్
అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. 1996 నాటి అమెరికా పౌర విమానాల కూల్చివేత కేసులో క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రో (94) పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో అధికారికంగా విచారణ ప్రారంభమైంది.ఈ చార్జ్‌షీట్ విడుదలైన కొద్ది గంటల్లోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబా ప్రజలను ఉద్దేశించి ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. క్యూబాను కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న కాస్ట్రో కుటుంబ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అక్కడి ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇదే విషయంపై అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె మయామిలో మాట్లాడుతూ.. "30 ఏళ్ల కిందట హత్యకు గురైన నలుగురు అమెరికన్ల కుటుంబాలు ఇప్పటికి న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయి. వారు సాధరణ పౌరులు. వారి వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. శరణార్థులను కాపాడానికి వెళ్లిన మా పౌరులను పొట్టన పెట్టుకున్నారు. అందులో రావుల్ కాస్ట్రోది కీలక పాత్ర. అతడి అరెస్ట్ కోసం త్వరలోనే ఒక వారెంట్ జారీ చేస్తాం. కాబట్టి అతడు తనంతట తాను అమెరికాకు వస్తాడని ఆశిస్తున్నాము. లేకపోతే ఇతర మార్గాల్లో మేమే రప్పిస్తామని" ఆయన పేర్కొన్నారు.అసలు 1996లో ఏమి జరిగిదంటే?'బ్రదర్స్ టు ది రెస్క్యూ' మయామి కేంద్రంగా పనిచేసే ఒక మానవతావాద సంస్థ. అప్పటిలో క్యూబాలోని కమ్యూనిస్ట్ దారుణాలను తట్టుకోలేక చిన్న పడవల్లో సముద్రం గుండా అమెరికాకు పారిపోయే క్యూబన్ శరణార్థులను ఆకాశం నుండి గుర్తించి, వారిని రక్షించడం ఆ సంస్థ పని. ఈ సంస్థకు చెందిన మూడు చిన్న సివిలియన్ విమానాలు 1996 ఫిబ్రవరి 24న ఫ్లోరిడా జలసంధి మీదుగా ప్రయాణించాయి. అయితేఅంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తుండగా క్యూబాకు చెందిన మిగ్ యుద్ధ విమానాలు వాటిపై దాడి చేసి కూల్చివేశాయి. ఈ ఘటనలో కార్లోస్ కోస్టా, అర్మాండో అలెజాండ్రే జూనియర్, మారియో డి లా పెనా, పాబ్లో మోరల్స్ అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు అమెరికా పౌరులు ఉన్నారు. ఆ సమయంలో రావుల్ కాస్ట్రో క్యూబా రక్షణ మంత్రిగా ఉన్నారు. అతడి ఆదేశాల మేరకే అమెరికా సివిలియన్ విమానాలను కూల్చివేశారని అమెరికా న్యాయశాఖ నిర్ధారించింది. దీంతో ఇన్నాళ్ల తర్వాత కాస్ట్రోపై అభియోగాలు నమోదు చేసింది.
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌లో తనకు తనకు విశేష ప్రజాదరణ ఉందని, తన అధ్యక్ష పదవీకాలం తర్వాత అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అవకాశముందని వెల్లడించారు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై కూడా ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారునెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను ఏం చెబితే ఆయన అది చేస్తారు. ఆయన ఒక యుద్ధ కాలపు ప్రధానమంత్రి. కానీ ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నాకు మాత్రం 99 శాతం ప్రజాదరణ ఉంది. నేను అక్కడ ప్రధానమంత్రిగా పోటీ చేసినా గెలవగలను" అని ట్రంప్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాగా ఇరాన్‌తో ఒప్పందం గురించి విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఎలాంటి తొందర లేదని ట్రంప్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిపించడమే తమ లక్ష్యమని, ఇరాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
అహ్మదినెజాద్ను అధికారపీఠంపై కూర్చోబెట్టాలని చూశారు
వాషింగ్టన్: వెనుజువెలాలో మదురో దంపతుల అధికారభవనంపైకి మెరుపుదాడిచేసి వాళ్లను బంధించి అధికారపీఠం నుంచికూల దోసిన అమెరికా ప్రభుత్వం అదే తరహాలో ఇరాన్‌లోనూ అధికార మార్పిడికి యత్నించి విఫలమైందని న్యూయార్క్ టైమ్స్ తాజాగా తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను వెలువర్చింది. 2005 నుంచి2013 ఏడాదిదాకా ఇరాన్‌కు అధ్యక్షునిగా బాధ్యతలు నెరవేర్చిన మొహ్మూద్ అహ్మదినెజాద్కు తిరిగి అధికారాన్ని అప్పగించాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నించాయని నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీసహా పలువురు కీలక నేతలను వైమానిక దాడులతో అంతమొందించడం తెల్సిందే. వెనువెంటనే అహ్మదినెజాద్ ను గద్దెనెక్కించాలని అమెరికా ప్రయత్నించి నా అందుకు సానుకూలవాతావరణంలేక మిన్నకుండిపోయిందిన న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అహ్మదినెజాద్ పరిపాలనాధోర ణిని ఏమాత్రం మెచ్చని నాటి ఖమేనీ ఆ తర్వాత ఆయనను గృహనిర్బంధంచేశారు. దీంతో శత్రువుకు శత్రువు మిత్రువు అనే చందంలో ఖమేనీ అంటే మెచ్చని అహ్మది నెజాద్‌ను అమెరికా, ఇజ్రాయెల్ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ మేరకు ఆయనతో రహస్యంగా సంప్రతింపులు జరిపినట్లు తెలుస్తోంది. గృహనిర్బంధంలో ఉన్న అహ్మదినెజాద్ను విడిపించేందుకే ఫిబ్రవరి 28న ఆయనను బంధించి ఇంటి మీదా అమెరికా దాడులుచేసి ఇంటిని ధ్వంసంచేసింది. అయితే ఈ దాడిలో అహ్మదినెజాద్ గాయపడ్డారని, తర్వాత ఆయన ఎవరికీ కన్పించకుండాపోయారని వార్తలొచ్చాయి.
బక్రీద్ కానుక.. 1400 మందికి పైగా ఖైదీల విడుదల!
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈద్ అల్ అదా (బక్రీద్) పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జైళ్లులలో మగ్గుతున్న 956 మంది ఖైదీలను విడుదల చేయాలని నహ్యాన్ ఆదేశించారు.సమాజంలో క్షమాగుణాన్ని,సోదరభావం, సామాజిక సమరసతను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా వివిద కేసుల్లో శిక్ష అనుభవిస్తూ జరిమానాలు లేదా ఆర్థికపరమైన బకాయిలు చెల్లించలేక జైళ్లలోనే ఉంటున్న ఖైదీల అప్పుల మొత్తాన్ని యూఏఈ అధ్యక్షుడే స్వయంగా చెల్లించనున్నారు. దీంతో బయటకు వచ్చిన ఖైదీలు ఎలాంటి ఆర్ధిక భారం లేకుండా తమ కుటుంబాలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. మరోవైపు అజ్మాన్ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్-నుఐమి కూడా తన పరిధిలోని జైళ్ల నుండి 230 మంది ఖైదీలను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి సైతం 227 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో మొత్తం 1400కు పైగా ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. కాగా ప్రతీ ఏడాది రంజాన్, రంజాన్, బక్రీద్, జాతీయ దినోత్సవాల సమయంలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం యూఏఈలో ఒక ఆనవాయితీగా వస్తోంది.
జాతీయం
‘బిహార్’ దెబ్బ: బంగ్లా వీడి ఆశ్రమానికి ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం దరిమిలా రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‌ను కొత్త నిర్ణయం తీసుకున్నారు. పట్నాలోని విలాసవంతమైన బంగ్లాను వదిలి, ఒక ఆశ్రమానికి తన నివాసాన్ని మార్చారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.షేక్‌పురా హౌస్ ఖాళీ.. ఆశ్రమంలోనే బసదర్భంగాలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్ తాను పట్నాలోని పాత నివాసాన్ని ఖాళీ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఐఐటీ పట్నాకు సమీపంలో ఉన్న ‘బిహార్ నవనిర్మాణ ఆశ్రమం’ ఇకపై తన నివాసమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ తన ముద్ర వేసేంత వరకు, అంటే తదుపరి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తాను ఈ ఆశ్రమంలోనే ఉంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇంతకాలం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక ‘షేక్‌పురా హౌస్’ బంగ్లా నుండి కార్యకలాపాలు సాగించారు.ఘోర పరాజయం.. నితీష్‌పై తీవ్ర విమర్శలుఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ఘోర పరాభవం తర్వాత పీకే రూట్ మార్చారు. ఇదే సమయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లక్ష్యంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ కుమారుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కావడంపై మండిపడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజల వలసలను ఆపలేని ముఖ్యమంత్రి, తన కుమారుని రాజకీయ భవిష్యత్తుకు మాత్రం గట్టి పునాది వేసుకున్నారని పీకే ఎద్దేవా చేశారు.ఓటర్లకు పిలుపు.. రూ.10 వేల పథకంపై ఎటాక్కుల మతాలకు, డబ్బు ఆశలకు లొంగకుండా ప్రజలు తమ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఓటు వేయాలని ప్రశాంత్ కిశోర్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ వంటి నాయకుల మాటలకు మోసపోవద్దన్నారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ కింద సుమారు 1.5 కోట్ల మంది మహిళలకు పంపిణీ చేసిన రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని ఉద్దేశిస్తూ.. కేవలం పదివేల రూపాయల కోసం ఓట్లను అమ్ముకోవద్దని పీకే ఓటర్లను హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ‘నాన్నా.. నీ కల నిజం చేస్తా’.. రాహుల్ భావోద్వేగ ట్వీట్!
నదులపై ఆధారపడే వాళ్లకు కష్టం : సైంటిస్టుల హెచ్చరిక
శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగంతో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రతలు ఎగసి వాతావరణ మార్పులు సర్వసాధారణమవుతున్నాయి. గ్లోబల్ వారి్మంగ్ ధాటికి వర్షాలు తగ్గి పంటదిగుబడి దారుణంగా పడిపోయి ప్రజలకు ఆకలికష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి. వాతావరణ మార్పులు అనేవి ఒక్క మానవాళికే కాదు జలచరాలకూ కొత్త పెనుసమస్యగా దాపురించిందని అంతర్జాతీయ అధ్యయనం ఒకటి హెచ్చరికలు చేసింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో నదీజలాల ఉపరితల ఉష్ణోగ్రతలు హెచ్చుతున్నాయని దీంతో నదీజలాల నుంచి ఆక్సిజన్ నెమ్మదిగా అదృశ్యమవుతోందన్న ప్రమాదహెచ్చరికలను చైనాలోని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలసహితంగా వెల్లడించారు. 1985 ఏడాది నుంచిచూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 21,000 ప్రధాన నదుల్లో ఆక్సిజన్ స్థాయిలు నెమ్మదిగా తగ్గుతున్నాయని అధ్యయనంలో తేలింది. 1985 ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ముఖ్యమైన నదీజలాల్లో ఆక్సిజన్ 2.1 శాతం తగ్గిందని వెల్లడైంది. ఉష్ణోగ్రతలు ఇలాగే అత్యధిక స్థాయిల్లో కొనసాగితే నదీజలాల్లో ఆక్సిజన్ క్షీణత మరింత పెరిగే ఆస్కారముంది. ఆక్సీజన్ తగ్గిపోతే ప్రాణవాయువును పీల్చి బతికే జలచరాల మనుగడే ప్రశ్నార్థకమంగా మారే ప్రమాదముంది. ఈ పరిశోధన తాలూకు వివరాలు ‘సైన్సెస్ అడ్వాన్సెస్’జర్నల్‌లో శుక్రవారం ప్రచురితమయ్యాయి. ఆమ్లజని గాఢత తగ్గుతూ పోతే వచ్చే శతాబ్దంచివరినాటికి తూర్పు అమెరికా మొదలు భారత్ దాకా ఉష్ణమండల ప్రాంతాలు దేశాల్లో నదుల్లో చేపల వంటి జలచరాల సంఖ్య దారుణంగా పడిపోతాయి. అప్పుడు నదీజలాల్లో వెతికినా ఒక్క చేప కూడా దొరకదని అధ్యయనం ముందస్తు ప్రమాదఘంటికలు మోగించింది. సాధారణంగా భౌతిక, రసాయన శాస్త్ర భావనల ప్రకారంచూసినా వేడి నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మానవప్రేరేపిత వాతావరణ మార్పుల ప్రభావం అతిగా ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో ఆయువు పోయాల్సిన ఆమ్లజనికి మనిషే స్వయంగా ఆయువు తీస్తున్నాడని నివేదిక ఘాటు వ్యాఖ్యలుచేసింది. ప్రస్తుతమున్న క్షీణతరేటును పరిగణనలోకి తీసుకుంటే ఈ శతాబ్దంచివరినాటికి నదుల్లో ఆక్సిజన్ 5 శాతం తగ్గిపోయే అవకాశముంది. నదులపై ఆధారపడే వాళ్లకు కష్టం మత్స్యకారులకు, మత్స్యసంబంధ వృత్తులతో జీవనం సాగించే జనాభాకు ఆర్థిక కష్టాలు పెరుగుతాయని ఈ పరిశోధనలో కీలక రచయిత, నంజియాంగ్ సిటీలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఎన్విరాన్మెంటల్ విభాగ శాస్త్రవేత్త క్వీ గువాన్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘నదుల్లో ఆక్సిజన్ తగ్గిపోతే దానిని డీఆక్సిజనరేషన్గా పిలుస్తాం. ఇది చేపల సంతతిపై, వాటి మనుగడపై దుష్ట్రభావం చూపిస్తుంది. నాణ్యమైన ఆక్సిజన్ లేకపోతే జలచరాల ఉనికి ప్రమాదంలో పడుతుంది. చేపలు, రొయ్యలు, ఇతరత్రా చలజరాల దిగుబడి తగ్గిపోతే మత్స్యకారులతోపాటు మత్స్యరంగం అభివృద్ధి సైతం కుంటుబడుతుంది. ఇదీ చదవండి: సరస్వతీ మాత విగ్రహం కోహినూర్ కన్నా ముఖ్యంఇది పరోక్షంగా ఆయా దేశాల జీడీపీపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆక్సిజన్ క్షీణతరేటు విపరీతంగా పెరిగిపోతే నదీమతల్లులు చివరకు జలచరాల మృత్యుకుహరాలుగా రూపాంతరంచెందుతాయి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, చీసాపీక్ బే, లేక్ ఎరీ లాంటి ప్రాంతాల్లో చేపలు కనీసం శ్వాసించే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు మత్స్యసంపదకు ఆలవాలమైన ప్రాంతాలన్నీ డెడ్ జోన్లుగా మిగిలిపోతాయి’’అని శాస్త్రవేత్త హెచ్చరించారు. గంగానది మరింత దారుణం ‘‘పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సగటు మరింత పెరుగుతున్న ఈ రోజుల్లో గంగానదిలో ఆక్సిజన్ పాళ్లు ఏకంగా 20 రెట్లు ఎక్కువ వేగంతో క్షీణిస్తున్నాయి. తూర్పు అమెరికా, ఆర్కిటిక్, భారత్, దక్షిణ అమెరికాలోని నదుల్లో ఈ శతాబ్దం చివరినాటికి ఆక్సిజన్ దాదాపు 10 శాతం క్షీణించనుంది. బ్రెజిల్‌లోని అమెజాన్ వంటి ఉష్ణమండల నదుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 1980 నుంచి చూస్తే అమెజాన్ నదిలో ఆక్సీజన్లేని డెడ్జోన్ ప్రాంతాల్లో రోజుల సంఖ్య ప్రతి దశాబ్దానికి అదనంగా 16 రోజులు పెరుగుతూ పోతోంది’’అని శాస్త్రవేత్త క్వీ గువాన్ తెలిపారు. అందరి ఆయువును నిలబెట్టే ఆక్సీజన్‌ను నదుల్లో నిలుపుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని శాస్త్రవేత్తలు హితబోధ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఇదీ చదవండి: 60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్‌డౌన్ స్టార్ట్
‘ఎబోలా’ కలకలం: అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్
న్యూఢిల్లీ: ఆఫ్రికా ఖండంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ‘ఎబోలా’ వైరస్ విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ తరుణంలో దేశీయంగా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ రవాణా కేంద్రాల వద్ద కఠినమైన నిఘా, స్క్రీనింగ్ చర్యలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.ఎయిర్‌పోర్టుల్లో కఠిన నిఘాడైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం.. ఎబోలా ప్రభావిత దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ ల నుండి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు ముందే ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ వద్ద ఆరోగ్య పరిస్థితిని నివేదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ కారణంగా వందలాది కేసులు, 130 కి పైగా మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ, అధిక జనాభా కలిగిన నగరాల్లో వైరస్ వ్యాపించకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.21 రోజుల పర్యవేక్షణ.. ఆ లక్షణాలు ఉంటే ప్రమాదమే! ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, నీరసం, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి లేదా అకస్మాత్తుగా రక్తస్రావం కావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే స్వయంగా అధికారులకు సమాచారం అందించాలి. విమానాశ్రయంలో దిగిన తర్వాత 21 రోజుల పాటు ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించుకోవాలి. ఈ మూడు వారాల వ్యవధిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యులను సంప్రదించి, తమ అంతర్జాతీయ ప్రయాణ వివరాలను పూర్తిగా వెల్లడించడం చట్టపరంగా తప్పనిసరి.వ్యాక్సిన్లు పనిచేయవు..ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ ప్రారంభ లక్షణాలు సాధారణ ఇన్ఫ్లుఎంజా, టైఫాయిడ్, మలేరియాను పోలి ఉండటం వల్ల దీనిని గుర్తించడం వైద్యులకు సవాలుగా మారింది. అంతేకాకుండా, అందుబాటులో ఉన్న ప్రామాణిక ఎబోలా వ్యాక్సిన్లు ‘జైర్’ స్ట్రెయిన్‌ను అడ్డుకోవడానికి రూపొందించినవి కావడంతో, ప్రస్తుత కొత్త వేరియంట్‌పై ఇవి ప్రభావవంతంగా పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో, నిర్ధారణ పరీక్షల కోసం పుణెలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ని ప్రధాన కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్‌పోర్టుల్లో అనుమానిత లక్షణాలు ఉన్నవారిని నేరుగా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు.
మదరసాల్లో ‘వందేమాతరం’ నిర్బంధం
కోలకతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందుతున్న, గుర్తింపు పొందిన మదరసాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ ఉదయం జరిగే అసెంబ్లీ ప్రార్థనల్లో ‘వందేమాతరం’ ఆలపించడాన్ని తప్పనిసరి విధిగా మార్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన అధికారిక నోటీసు సరికొత్త చర్చకు తెరలేపింది. తరగతులు ప్రారంభం కావడానికి ముందే విద్యార్థులందరూ తప్పనిసరిగా జాతీయ గేయాన్ని పాడేలా చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలుజాతీయ గేయమైన ‘వందేమాతరం’నకు రూపకల్పన జరిగిన 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఆదేశాల అనుగుణంగానే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఉదయపు ప్రార్థనల సమయంలో వందేమాతరం ఆలపించేలా చూడాలని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే జాదవ్‌పూర్ విద్యాపీఠ్ వంటి పలు ప్రముఖ విద్యాసంస్థలు ఈ నిబంధనను అమలు చేయడం ప్రారంభించాయి. West Bengal: Directorate of Madrasah Education has made the singing of “Vande Mataram” mandatory during assembly prayers before classes in all government, aided, and recognised madrasahs across the state with immediate effect pic.twitter.com/6MK8h0D3YR— IANS (@ians_india) May 20, 2026రాష్ట్ర గేయంపై సందిగ్ధతగత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర పాఠశాలల్లో ‘బాంగ్లార్ మాటి బాంగ్లార్ జల్’ (రాష్ట్ర గేయం) పాడటాన్ని నిర్బంధం చేసింది. అయితే, తాజా ఉత్తరవుల్లో కేవలం వందేమాతరం గురించి మాత్రమే ప్రస్తావించడంతో, పాత నిబంధన కొనసాగుతుందా లేదా అనే అంశంపై పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్లో సందిగ్ధత నెలకొంది. విద్యాశాఖ అధికారులు సైతం కొత్త ఆదేశాలలో రాష్ట్ర గేయం గురించి ఎలాంటి ప్రస్తావన లేదని, కేవలం వందేమాతరం ప్రార్థనను చేర్చాలని మాత్రమే సూచించినట్లు స్పష్టం చేశారు.సమయాభావంపై ఉపాధ్యాయుల ఆందోళనఈ కొత్త నిబంధన వల్ల పాఠశాలల్లో సమయపాలన దెబ్బతినే అవకాశం ఉందని కొందరు పాఠశాలల అధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ జాతీయ గీతమైన ‘జనగణమన’ పాడటం తప్పనిసరి, దానికి తోడు ఇప్పుడు ‘వందేమాతరం’ చేరింది. ఒకవేళ రాష్ట్ర గేయాన్ని కూడా కొనసాగిస్తే, విద్యార్థులు వరుసగా మూడు పాటలు పాడాల్సి వస్తుందని, దీనివల్ల ఉదయపు ప్రార్థనల సమయం ఎక్కువై తరగతులు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఎన్ఆర్ఐ
ఘనంగా తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్లో కష్టం… గ్రౌండ్లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్‌గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
క్రైమ్
బతికి ఉంటే ఇబ్బంది పెడతాడని.. భర్తను చంపేసింది
హైదరాబాద్: కుటుంబ కలహాలతో వేరుగా ఉంటున్న భార్య ఇంటికి పిల్లలను చూడటానికి వచ్చిన భర్తను తమ్ముడు, అతని స్నేహితుడితో కలిసి భార్య విచక్షణారహితంగా దాడిచేసి హత్యచేశారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన మేరకు.. వికారాబాద్ జిల్లా హజీపూర్ గ్రామానికి చెందిన గురు వెంకటేశ్ (31) బీఎన్‌రెడ్డినగర్‌లో ఉంటూ హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్య, పిల్లలు వేరుగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటేశ్.. పిల్లలను చూసేందుకు రైతు బజార్ సమీపంలోని డబుల్బెడ్రూం నివాసాల్లో భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు.భర్తను చూసిన స్వప్న ఇక్కడికెందుకు వస్తున్నావు అంటూ తమ్ముడు పాండుతో కలిసి మూడో అంతస్తు నుండి కిందకు తీసుకువస్తూ దాడి చేశారు. అంతటితో ఆగకుండా పాండు తన స్నేహితుడు జగదీష్‌ను పిలిపించుకుని ముగ్గురూ కలిసి మూకుమ్మడిగా దాడిచేశారు. స్పృహ తప్పి పడిపోవడంతో..బతికి ఉంటే మళ్లీ ఇబ్బంది పెడతాడని దాడి చేసి తీవ్రంగా కొట్టి గ్రౌండ్‌ఫ్లోర్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు గమనించారు. మృతుడి సోదరుడు గురు తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతుని భార్య స్వప్న, ఆమె తమ్ముడు పాండు, అతని స్నేహితుడు జగదీష్‌లపై కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులు? నిందితులు ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలను రాబట్టేందుకు విచారిస్తున్నట్లు తెలిసింది.
అమెరికాలో బాపట్ల యువకుడి మృతి
బాపట్లటౌన్: అమెరికాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు ఇలా.. బాపట్ల పట్టణం యాదవపాలేనికి చెందిన ఆవుల పూర్ణగోపి (35) పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతని తమ్ముడు మురళి కూడా మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఆవుల శ్రీనివాసరావు, నళిని దంపతులు నెల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా విహార యాత్రకు వెళ్లి ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవ్ చేస్తున్న ఆవుల మురళి నిద్ర వస్తుండడంతో అన్న గోపిని డ్రైవ్ చేయమని కోరాడు. దీంతో అతను కారు దిగి డ్రైవర్ సీటులో కూర్చునేందుకు యత్నిస్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చి బొలెరో వాహనం వీరిని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్ణగోపి అక్కడికక్కడే మృతిచెందగా, అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నళిని, తమ్ముడు మురళికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బొలెరోతో ఢీకొట్టిన మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు పూర్ణగోపి తండ్రి శ్రీనివాసరావు ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. బాపట్ల ఏరియా ఆస్పత్రిలో 108 డ్రైవర్‌గా కూడా చాలాకాలం సేవలు అందించారు.
యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి.. దారుణ హత్య
యర్రగొండపాలెం: తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్న యువకుడిని బాలిక తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా నరికి పొలాల్లో ఉన్న బోరు బావిలో పడేసిన దారుణ ఘటన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మార్కాపురం డీవైఎస్పీ కె.నాగరాజు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెంచు కాలనీకి చెందిన దిగుడు ఆంజనేయులు (21) ఈ నెల 13వ తేదీ రాత్రి ఓ 15 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు ఊర్లోకి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూస్తే బాలికతో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆవేశంలో ఇంట్లో ఉన్న అట్లపెనం తీసుకొని యువకుడి తలపై మోదడంతో అతను మృతి చెందాడు. మరుసటి రోజు కూడా ఆ మృతదేహాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. వాసన వస్తుండటంతో నిందితులు మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ముక్కలుగా నరికి అక్కడికి సమీపంలోని ప్రైవేటు స్కూలు వెనుక వైపు పొలాల్లో ఉన్న ఒక బోరుబావిలో పడేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఆంజనేయులు కనిపించకుండా పోయాడని అతని బావ చెల్లె వెంకటరావు ఈ నెల 16న ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ కె.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆంజనేయులు సెల్ ఆధారంగా బాలిక ఇంటి వద్ద అదృశ్యమైనట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఉన్నబాలిక తల్లిదండ్రులకు పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా ఆంజనేయులును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు డీవైఎస్పీ తెలిపారు. వారి కుమార్తెను త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ కె.అజయ్‌కుమార్, ఎస్సై ఎం.దేవకుమార్‌లను ఆయన అభినందించారు. బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా డీవైఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో మృతుడు ఆంజనేయులు బంధువులు పోలీస్ స్టేషన్లో గొడవకు దిగారు. వెంటనే బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీయాలని, నిందితులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అత్తమామలను చంపిన అల్లుడికి ఉరి
వరంగల్ లీగల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడానికి అమె తల్లిదండ్రులు (అత్తమామలు) కారణమని భావించి వారిని చంపిన అల్లుడికి వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు జడ్జి జె. మైత్రేయి బుధవారం సంచలన తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజుకు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాకు చెందిన బానోతు దీపిక ప్రేమించుకున్నారు. 2023లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. అయితే పెళ్లయినప్పటి నుంచే దీపికను నాగరాజు గృహహింసకు గురిచేయడంతో భరించలేని ఆమె 2024లో పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. అందుకు దీపిక తల్లిదండ్రులే కారణమని కక్ష పెంచుకున్న నాగరాజు.. ఆ కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. 2024 జూలై 10న అర్ధరాత్రి దాటాక 16 చింతల తండాకు చేరుకొని నిద్రిస్తున్న దీపికతోపాటు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా బానోతు శ్రీను మృతి చెందాడు.
వీడియోలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!
క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం
పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం
గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..
నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు
బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి
బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి
మరో వివాదంలో సీఎం విజయ్


