ఢిల్లీ: బ్యాంక్ వినియోగదారులకు ఆర్‌బీఐ శుభవార్త చెప్పింది. లోన్ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెడుతూ ఆర్‌బీఐ కొత్త డ్రాఫ్ట్ బిల్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు అతిక్రమిస్తే బ్యాంకులపై ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకోనుంది.
రికవరీ ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగుల ప్రవర్తనపై కఠిన నియమాలు అమలు చేయాలని ఆర్‌బీఐ సూచించింది.
బ్యాంకులు బోర్డు ఆమోదించిన రికవరీ, కలెక్షన్ పాలసీని అమలు చేయాలి
తప్పుగా రికవరీ చేస్తే నష్టపోయిన రుణం తీసుకున్న వారికి బ్యాంకులు పరిహారం చెల్లించాలి
రికవరీ ఏజెంట్లకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ సర్టిఫికేషన్ తప్పనిసరి
బ్యాంకులు తమ వెబ్‌సైట్, యాప్‌లలో రికవరీ ఏజెన్సీల వివరాలు ప్రకటించాలి
మొదటి రికవరీ ఏజెంట్ సందర్శనకు ముందు రుణదాతలకు (లోన్ ఎవరైతే తీసుకుంటారో వారికి) సమాచారం ఇవ్వాలి
రికవరీ ఏజెన్సీ మార్పు లేదా రద్దు జరిగితే వెంటనే లోన్ తీసుకున్న వినియోగదారులకు తెలపాలి
ఫిర్యాదులు పరిష్కారం కాని పరిస్థితిలో రికవరీ కేసులు ముందుకు కొనసాగించకూడదు
రికవరీ ఏజెంట్ల కాల్స్ రికార్డు చేసి కనీసం ఆరు నెలలు భద్రపరచాలి
కఠిన రికవరీ పద్ధతులను ప్రోత్సహించే ఇన్సెంటివ్‌లు నిషేధం
రుణగ్రహిత ఆస్తి స్వాధీనం చేసుకునే ముందు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి
ఫైనాన్స్ చేసిన డివైస్‌ను ఫోన్,ల్యాప్‌ట్యాప్ ఇతర వస్తువులు 90 రోజుల బకాయి తర్వాత మాత్రమే డిసేబుల్ చేయాలి
డివైస్ యాక్సెస్ పరిమితం చేయడానికి 21 రోజుల నోటీసు, అదనంగా 7 రోజుల నోటీసు తప్పనిసరి
తప్పుగా డివైస్ బ్లాక్ చేస్తే గంటకు రూ.250 పరిహారం చెల్లించాలి.
రికవరీ ఏజెంట్లు ఐడీ కార్డు, అనుమతి డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాలి.
రికవరీ కాల్స్, లోన్ తీసుకున్న వ్యక్తులను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కలవాలి
రికవరీ ఫిర్యాదుల కోసం ప్రత్యేక గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి.
మరణం లేదా వివాహం వంటి సందర్భాల్లో రుణదాతల్ని సంప్రదించరాదు’ అని ఆర్‌బీఐ తన కొత్త డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొంది.
కాగా, ఆర్‌బీఐ తాజా డ్రాఫ్ట్ లోన్ రికవరీ నియమాలు మే 20, 2026న విడుదలయ్యాయి. ఈ డ్రాఫ్ట్‌పై ప్రజలు, బ్యాంకులు, ఇతర స్టేక్‌హోల్డర్లు తమ అభిప్రాయాలను మే 31, 2026లోపు సమర్పించాలి. తుది అమలు జూలై 1, 2026 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది


